Shuru
Apke Nagar Ki App…
బకాయిల కోసం ఎదురుచూపులు.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ఆవేదన ఉద్యోగ విరమణ చేసి నాలుగేళ్లు గడిచినా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక ఓ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పెరుగుతున్న వైద్య ఖర్చులతో జీవితం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎండీ నజీరుద్దీన్ తనకు రావాల్సిన రూ.19 లక్షల బకాయిలను వెంటనే విడుదల చేసి, తాను బతికుండగానే న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యాన్ని వేడుకుంటున్నారు.
Tharun
బకాయిల కోసం ఎదురుచూపులు.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ఆవేదన ఉద్యోగ విరమణ చేసి నాలుగేళ్లు గడిచినా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక ఓ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పెరుగుతున్న వైద్య ఖర్చులతో జీవితం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎండీ నజీరుద్దీన్ తనకు రావాల్సిన రూ.19 లక్షల బకాయిలను వెంటనే విడుదల చేసి, తాను బతికుండగానే న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యాన్ని వేడుకుంటున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- హైదరాబాద్‌లో భారీగా మసాలా పదార్థాల ఆహార కల్తీ గుట్టురట్టు హెచ్-ఫాస్ట్ (H-FAST), జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు 13 సంస్థల్లో తనిఖీలు నిర్వహించి 25 వేల కిలోల మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. మసాలా దినుసుల్లో సింథటిక్ రంగులు, ఇండస్ట్రియల్ డైలు, టాల్కమ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ కలిపి రంగు, మెరుపు, బరువు పెంచినట్లు అధికారులు గుర్తించారు. ఇవి క్యాన్సర్‌తో పాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గత 140 రోజుల్లో హెచ్-ఫాస్ట్ 659 తనిఖీలు నిర్వహించి 202 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. దాదాపు 2.46 లక్షల కిలోల అనుమానిత కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో మసాలా దినుసులు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, మాంసం, పనీర్, పాల ఉత్పత్తులు, పండ్లు, ఊరగాయలు, టీ పొడి, తాగునీరు ఉన్నాయి.1
- పాఠశాల సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమం చేస్తామని పీడీఎస్‌యూ హెచ్చరిక తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించడం లేదని ఆరోపిస్తూ పీడీఎస్‌యూ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం, పాఠశాల సమస్యల పరిష్కారం కోరుతూ మండల విద్యాశాఖ అధికారి రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేపడతామని పీడీఎస్‌యూ హెచ్చరించింది4
- పుట్టుకతోనే పూర్తిగా అంధులైన వారికి దృష్టి. వైద్యరంగంలో మరో సంచలనానికి ఎలన్ మస్క్ సిద్ధం.. పుట్టుకతోనే పూర్తిగా అంధులైన వారికి దృష్టి అనుభూతిని అందించే Vision Deviceను వచ్చే 6–12 నెలల్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎలన్ మస్క్ తెలిపారు. ఈ సాంకేతికత విజయవంతమైతే వైద్యరంగంలో చారిత్రాత్మక ముందడుగుగా నిలిచే అవకాశం ఉంది. .1
- పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్ర పటానికి పూలుచల్లి నివాళులర్పించిన బిఆర్ఎస్ నేతలు.. తెలంగాణ భవన్‌లో ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన BRS పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సమావేశమై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ప్రజా సేవలను, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను,పార్టీ కోసం చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. ఆయన మృతి పార్టీకి, తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు.1
- .....భద్రాచలం వద్ద గోదావరి నది రెండో బ్రిడ్జి పనులు పరిశీలించిన మంత్రి తుమ్మల ........భద్రాచలం రామాలయం దర్శనానికి వచ్చే భక్తులు సౌకర్యం కోసం రెండో బ్రిడ్జి నిర్మాణం .....2015 లో గోదావరి పుష్కరాల సందర్భంగా వచ్చిన లక్షలాది మంది భక్తులకు ఒకే బ్రిడ్జి వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు .....అమరావతి టూ జగధల్ పూర్ జాతీయ రహదారి భద్రాచలం మీదుగా ప్లాన్ చేసి రెండో బ్రిడ్జి నిర్మాణం .....బ్రిడ్జి అప్రోచ్ వరద కోతకు గుర్వకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం ....ఈ నెలలో గోదావరి రెండో బ్రిడ్జి పై రాకపోకలు .....వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అందుబాటులోకి రెండో బ్రిడ్జి .....గత ప్రభుత్వంలో బ్రిడ్జి నిర్మాణం పనులు నత్త నడకన సాగాయి .....ఏపీ చత్తీస్ గడ్ ఒడిషా వయా భద్రాచలం వెళ్ళే ప్రయాణీకులకు రెండో బ్రిడ్జి ఎంతో సౌకర్యంగా మారుతుంది.1