logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కారేపల్లి గ్రామం లో శివసాయి మల్టీస్పెషలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచితవైద్యశిబిరం *శివసాయి మల్టీ స్పెషలిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం* -ఉచిత శిబిరంలో సుమారు 350 మందికి పరీక్షలు, మందులు పంపిణీ, * ఉచిత మెగా హెల్త్ క్యాంపు కు విశేష స్పందన గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న వైద్య శిభిరాలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని గ్రామ సర్పంచ్ బాదావత్ మోతిలాల్ అన్నారు. ఆదివారం భీమ్‌గల్‌ శ్రీ శివ సాయి మల్టీ స్పెషాలిటీ అలాగే పిల్లల హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ సాయికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కారేపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ పాలకవర్గం గ్రామస్తుల కోరిక మేరకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. శివ సాయి ఆసుపత్రి ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 27వ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను కారేపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది.ఈ మెగా క్యాంప్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరపాలని జరపడానికి తన వంతు కృషి కూడా చేస్తానని అన్నారు.ఈ సందర్భంగా ఆసుపత్రి మేనేజ్మెంట్ డైరెక్టర్ సాయికుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఆసుపత్రి ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 27వ హెల్త్ మెగా క్యాంపును కారేపల్లి గ్రామంలో గ్రామస్తుల కోరిక మేరకు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. గ్రామస్తులు ఆర్మూర్, నిజామాబాద్ వెళ్లకుండా మా ఆస్పత్రికి వస్తున్న గ్రామ గ్రామస్తులకు అన్ని విధాలుగా పరీక్షలు చేయడంతో నమ్మకంతో వైద్య పరీక్షలు చేయించుకుంటారని అన్నారు. ఉచిత మెగా హెల్త్ క్యాంపులో సుమారు 200, మంది పెద్దవారికి 150,మంది పిల్లలకు వైద్య పరీక్షలు అలాగే ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.భీమ్‌గల్‌ మండలంలోని ప్రతి గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలుగుతుంధన్నారు, ఇలాంటి క్యాంప్ ద్వారా చిన్నచిన్న సమస్యలను పరిష్కరించ వచ్చు పెద్ద సమస్య ఎదురైతే దానికి తగ్గట్టుగా పెద్ద లెవెల్లో కూడా హెల్ప్ చేయడానికి వీలవుతుందని అన్నారు. ఆర్థిక సహాయం ఎంత చేసినా కలగని ఆనందం పదిమంది ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. అలాగే డాక్టర్ లు ప్రజాసేవ చేయాలనే ఆలోచన కలగడం ఆనందంగా ఉందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లు జి. సూర్యనారాయణ ఎండి. ఎంఎస్. జర్నల్ సర్జరి& ఫిజీషియన్, డాక్టర్ వి.జైపాల్ ఎంబిబిఎస్ డిఎన్బి చిన్నపిల్లల, కే.హైందవి, ఎం ఎస్. ఓబిజి గర్భిణీ స్త్రీ లకు సేవలందిస్తున్న వైద్యురాలు, ఉప సర్పంచ్ ధరావత్ రాజేష్ నాయక్, మాజీ ఎంపీటీసీ గోవింద్ నాయక్, మాజీ సర్పంచ్ వాసు, గ్రామ శాఖ అధ్యక్షులు గంగాధర్, రమేష్, ఆసుపత్రి సిబ్బంది షాబుద్దీన్, ప్రకాష్, రాజు, అలం, అదనాన్, రమ్య,నందిని, మౌనిక, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆలయ, గ్రామ, కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

1 day ago
user_Bachagoni Shivani
Bachagoni Shivani
భీమ్‌గల్, నిజామాబాద్, తెలంగాణ•
1 day ago

కారేపల్లి గ్రామం లో శివసాయి మల్టీస్పెషలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచితవైద్యశిబిరం *శివసాయి మల్టీ స్పెషలిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం* -ఉచిత శిబిరంలో సుమారు 350 మందికి పరీక్షలు, మందులు పంపిణీ, * ఉచిత మెగా హెల్త్ క్యాంపు కు విశేష స్పందన గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న వైద్య శిభిరాలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని గ్రామ సర్పంచ్ బాదావత్ మోతిలాల్ అన్నారు. ఆదివారం భీమ్‌గల్‌ శ్రీ శివ సాయి మల్టీ స్పెషాలిటీ అలాగే పిల్లల హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ సాయికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కారేపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ పాలకవర్గం గ్రామస్తుల కోరిక మేరకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. శివ సాయి ఆసుపత్రి ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 27వ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను కారేపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది.ఈ మెగా క్యాంప్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎస్టీ సెల్

మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరపాలని జరపడానికి తన వంతు కృషి కూడా చేస్తానని అన్నారు.ఈ సందర్భంగా ఆసుపత్రి మేనేజ్మెంట్ డైరెక్టర్ సాయికుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఆసుపత్రి ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 27వ హెల్త్ మెగా క్యాంపును కారేపల్లి గ్రామంలో గ్రామస్తుల కోరిక మేరకు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. గ్రామస్తులు ఆర్మూర్, నిజామాబాద్ వెళ్లకుండా మా ఆస్పత్రికి వస్తున్న గ్రామ గ్రామస్తులకు అన్ని విధాలుగా పరీక్షలు చేయడంతో నమ్మకంతో వైద్య పరీక్షలు చేయించుకుంటారని అన్నారు. ఉచిత మెగా హెల్త్ క్యాంపులో సుమారు 200, మంది పెద్దవారికి 150,మంది పిల్లలకు వైద్య పరీక్షలు అలాగే ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.భీమ్‌గల్‌ మండలంలోని ప్రతి గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలుగుతుంధన్నారు, ఇలాంటి క్యాంప్ ద్వారా చిన్నచిన్న సమస్యలను పరిష్కరించ వచ్చు

పెద్ద సమస్య ఎదురైతే దానికి తగ్గట్టుగా పెద్ద లెవెల్లో కూడా హెల్ప్ చేయడానికి వీలవుతుందని అన్నారు. ఆర్థిక సహాయం ఎంత చేసినా కలగని ఆనందం పదిమంది ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. అలాగే డాక్టర్ లు ప్రజాసేవ చేయాలనే ఆలోచన కలగడం ఆనందంగా ఉందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లు జి. సూర్యనారాయణ ఎండి. ఎంఎస్. జర్నల్ సర్జరి& ఫిజీషియన్, డాక్టర్ వి.జైపాల్ ఎంబిబిఎస్ డిఎన్బి చిన్నపిల్లల, కే.హైందవి, ఎం ఎస్. ఓబిజి గర్భిణీ స్త్రీ లకు సేవలందిస్తున్న వైద్యురాలు, ఉప సర్పంచ్ ధరావత్ రాజేష్ నాయక్, మాజీ ఎంపీటీసీ గోవింద్ నాయక్, మాజీ సర్పంచ్ వాసు, గ్రామ శాఖ అధ్యక్షులు గంగాధర్, రమేష్, ఆసుపత్రి సిబ్బంది షాబుద్దీన్, ప్రకాష్, రాజు, అలం, అదనాన్, రమ్య,నందిని, మౌనిక, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆలయ, గ్రామ, కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • గత కొంతకాలంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వ్యాపారవేత్తలను చంపుతానని బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న విత్తనాల నాగరాజు అను రౌడీ షీటర్ ని , జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారి ఆదేశాల మేరకు, మెట్టుపల్లి డి.ఎస్.పి ఏ రాములు గారి ఆధ్వర్యంలో, ఈరోజు కోరుట్ల పట్టణంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది గతంలో కూడా విత్తనాలు నాగరాజు పై రెండు మర్డర్ కేసులు మరియు ఎక్స్ట్రాక్షన్ కేసులు నమోదు కాబడినవి అలాగే ఇతనిపై గతంలో PD Act కూడా నమోదు చేసి జైలుకు పంపించనైనది. అలాగే ఈరోజు అరెస్టు చేసిన కేసులో విత్తనాల నాగరాజు తో పాటు మరొక నిందితుడు కూడా ఉన్నట్లు ఆ దర్యాప్తులో తెలిసినది ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు తొందర్లోనే అతని పట్టుకుని అరెస్టు చేస్తాం వీరిద్దరే కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే కూడా వారిని కూడా రిమాండ్ చేస్తాం ఈ కేసుని చాలా మైనేట్గా దర్యాప్తు చేస్తున్నాం, అదేవిధంగా విత్తనాల నాగరాజు అనే రౌడీషీటర్ తో కానీ ఇతని సహచరులతో కానీ ఎవరైనా సంబంధాలు కలిగి ఉండి వారితో తిరిగిన ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిగా పెట్టి వారి పైన కూడా కఠిన చర్యలు తీసుకోబడును, అలాగే ఎవరైనా ఎవరినైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడి బలవంతపు వసూలు చేస్తే వారిపై చట్టపరంగా చాలా కఠిన చర్యలు తీసుకోబడును. ముఖ్యంగా కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ పోలీస్ తరఫున విన్నపం ఏమనగా ఎవరు కూడా ఇలాంటి భయాలకు ఆందోళనలకు గురికావాల్సిన పనిలేదు మిమ్మల్ని ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసిన బెదిరించిన నిర్భయంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వవచ్చు అదేవిధంగా మీ వివరాలు చాలా రహస్యంగా ఉంచబడతాయి.
    1
    గత కొంతకాలంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వ్యాపారవేత్తలను చంపుతానని బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న విత్తనాల నాగరాజు అను రౌడీ షీటర్ ని , జగిత్యాల జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  గారి ఆదేశాల మేరకు, మెట్టుపల్లి డి.ఎస్.పి ఏ రాములు గారి ఆధ్వర్యంలో, ఈరోజు కోరుట్ల పట్టణంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది గతంలో కూడా విత్తనాలు నాగరాజు పై రెండు మర్డర్ కేసులు మరియు ఎక్స్ట్రాక్షన్ కేసులు నమోదు కాబడినవి అలాగే ఇతనిపై గతంలో PD Act కూడా నమోదు చేసి జైలుకు పంపించనైనది. 
అలాగే ఈరోజు అరెస్టు చేసిన కేసులో విత్తనాల నాగరాజు తో పాటు మరొక నిందితుడు కూడా ఉన్నట్లు ఆ దర్యాప్తులో తెలిసినది ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు తొందర్లోనే అతని పట్టుకుని అరెస్టు చేస్తాం వీరిద్దరే కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే కూడా వారిని కూడా రిమాండ్ చేస్తాం ఈ కేసుని చాలా మైనేట్గా దర్యాప్తు చేస్తున్నాం, అదేవిధంగా విత్తనాల నాగరాజు అనే రౌడీషీటర్ తో కానీ ఇతని సహచరులతో కానీ ఎవరైనా సంబంధాలు కలిగి ఉండి వారితో తిరిగిన ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిగా పెట్టి వారి పైన కూడా కఠిన చర్యలు తీసుకోబడును, అలాగే ఎవరైనా ఎవరినైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడి బలవంతపు వసూలు చేస్తే వారిపై చట్టపరంగా చాలా కఠిన చర్యలు తీసుకోబడును. ముఖ్యంగా కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ పోలీస్ తరఫున విన్నపం ఏమనగా ఎవరు కూడా ఇలాంటి భయాలకు ఆందోళనలకు గురికావాల్సిన పనిలేదు మిమ్మల్ని ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసిన బెదిరించిన నిర్భయంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వవచ్చు అదేవిధంగా మీ వివరాలు చాలా రహస్యంగా ఉంచబడతాయి.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • జగిత్యాల : జగిత్యాల నుండే కెసిఆర్ జైత్ర యాత్ర మొదలుకానుంది, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బీఆర్ఎస్ అధికారంలోకి రావడమొక్కటే మార్గం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి పోవాలి.. కెసిఆర్ రావాలి.. కెసిఆర్ పాలనే బాగుండే అనే భావన ప్రజల్లోనుండి వచ్చిందనీ, కేసీఆర్ తో ప్రయాణం కొత్త అనుభూతి అన్నారు.  జగిత్యాల పట్టణంలోని జెడ్పీ మాజీ  వైస్ ఛైర్మన్ హరిచరన్ రావు స్వగృహం విద్యానగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  మాజీ మంత్రి జీవన్ రెడ్డి...మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావా వసంత, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ శ్రీమతి విజయలక్ష్మి, రాయికల్ మున్సిపల్ చైర్మన్ కే. రవీందర్, స్థానిక నాయకులు వి. పురుషోతం రావు, వెంకట రావు, ధర్మాజిపేట్ వెంకటేశ్వర్  రావు, పట్టణ బి ఆర్ ఎస్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు తదితర బీ ఆర్ ఎస్ నాయకులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీ ఆర్ ఎస్ పార్టీ లోకి రావడం అదృష్టమనీ,  మనస్పూర్తిగా పార్టీలోకి స్వాగతిస్తున్నామన్నారు. నిస్వార్ధంగా సేవ చేసే నాయకులు, నిబద్ధతగల నాయకులు జీవన్ రెడ్డి కి అందరం సహకరిస్తాంమనీ,..పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఆయనకు తోడుంటామన్నారు.. జీవన్ రెడ్డి రాకతో బీ ఆర్ ఎస్ కు కొండంత అండగా దొరికింది. ప్రజల పక్షాన నిలబడే నాయకుడు జీవన్ రెడ్డి అని అన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్ తో ప్రయాణం రాజకీయంగా నూతన అధ్యాయం అనీ..అభిమానులు, నాయకులు, కార్యకర్తలందరి  సహకారంతో ముందుకు సాగుదాం అన్నారు.  కేసీఆర్ తో అనుబంధం ఈనాటిది కాదు.. తెలంగాణ ఉద్యమ సారధిగా పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం కెసిఆర్ దశాబ్దకాలం కృషిచేశారు. రైతు బిడ్డగా రైతు సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టారు. గోదావరి నదీ జలాలను సద్వినియోగం చేసుకోవాలని దిగువన మేడిగడ్డ వద్ద 300 టీ ఎం సి ల నీటి లభ్యత ఉంటుందని బ్యారేజీల నిర్మాణం చేపట్టారు.నీటి వనరులతో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల్లో పంజాబ్, హర్యానాతో పోటీ పడుతున్నాం. ఎస్ ఎల్ బి సి నిర్మాణ దశలో కుంగి పోయి కార్మికులు మృతి చెందినా, వారిశవాలుసైతం వెలికి తీయకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారు....కానీ, మేడిగడ్డ పునర్నిర్మాణం చేపట్టకుండా కేసీఆర్ ను దోషిగా చూపే ప్రయత్నంలో భాగంగా బ్యారేజ్ ల మరమతులు చేపట్ట లేదని విమర్శించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరవడం సంతోషం.. కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలనేది ప్రజల్లో వచ్చిన ఆలోచన.. కెసిఆర్ ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మీ 50 వేల నుండి లక్షకు పెంచారు. కేసీఆర్ 10 వేలు పెట్టుబడి సాయం ఇచ్చారు. కాంగ్రెస్ 15 వేలు అని చెప్పి అసలుకే మోసం వచ్చింది. కరువు వస్తె రేవంత్ రెడ్డి బాధ్యులు అవుతారు. బోర్నపల్లి వంతెన కు కేసీఆర్ 70 కోట్లు మంజూరు చేశారు.కేసీఆర్ కు రుణపడి ఉంటా..
    2
    జగిత్యాల :
జగిత్యాల నుండే కెసిఆర్ జైత్ర యాత్ర మొదలుకానుంది, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బీఆర్ఎస్ అధికారంలోకి రావడమొక్కటే మార్గం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
రేవంత్ రెడ్డి పోవాలి.. కెసిఆర్ రావాలి..
కెసిఆర్ పాలనే బాగుండే అనే భావన ప్రజల్లోనుండి వచ్చిందనీ, కేసీఆర్ తో ప్రయాణం కొత్త అనుభూతి అన్నారు. 
జగిత్యాల పట్టణంలోని జెడ్పీ మాజీ  వైస్ ఛైర్మన్ హరిచరన్ రావు స్వగృహం విద్యానగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  మాజీ మంత్రి జీవన్ రెడ్డి...మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావా వసంత, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ శ్రీమతి విజయలక్ష్మి, రాయికల్ మున్సిపల్ చైర్మన్ కే. రవీందర్, స్థానిక నాయకులు వి. పురుషోతం రావు, వెంకట రావు, ధర్మాజిపేట్ వెంకటేశ్వర్  రావు, పట్టణ బి ఆర్ ఎస్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు తదితర బీ ఆర్ ఎస్ నాయకులతో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీ ఆర్ ఎస్ పార్టీ లోకి రావడం అదృష్టమనీ,  మనస్పూర్తిగా పార్టీలోకి స్వాగతిస్తున్నామన్నారు.
నిస్వార్ధంగా సేవ చేసే నాయకులు, నిబద్ధతగల నాయకులు జీవన్ రెడ్డి కి అందరం సహకరిస్తాంమనీ,..పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఆయనకు తోడుంటామన్నారు..
జీవన్ రెడ్డి రాకతో బీ ఆర్ ఎస్ కు కొండంత అండగా దొరికింది.
ప్రజల పక్షాన నిలబడే నాయకుడు జీవన్ రెడ్డి అని అన్నారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్ తో ప్రయాణం రాజకీయంగా నూతన అధ్యాయం అనీ..అభిమానులు, నాయకులు, కార్యకర్తలందరి  సహకారంతో ముందుకు సాగుదాం అన్నారు. 
కేసీఆర్ తో అనుబంధం ఈనాటిది కాదు..
తెలంగాణ ఉద్యమ సారధిగా పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం కెసిఆర్ దశాబ్దకాలం కృషిచేశారు.
రైతు బిడ్డగా రైతు సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టారు.
గోదావరి నదీ జలాలను సద్వినియోగం చేసుకోవాలని దిగువన మేడిగడ్డ వద్ద 300 టీ ఎం సి ల నీటి లభ్యత ఉంటుందని బ్యారేజీల నిర్మాణం చేపట్టారు.నీటి వనరులతో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల్లో పంజాబ్, హర్యానాతో పోటీ పడుతున్నాం.
ఎస్ ఎల్ బి సి నిర్మాణ దశలో కుంగి పోయి కార్మికులు మృతి చెందినా, వారిశవాలుసైతం వెలికి తీయకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారు....కానీ, మేడిగడ్డ పునర్నిర్మాణం చేపట్టకుండా కేసీఆర్ ను దోషిగా చూపే ప్రయత్నంలో భాగంగా బ్యారేజ్ ల మరమతులు చేపట్ట లేదని విమర్శించారు.
ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరవడం సంతోషం..
కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలనేది ప్రజల్లో వచ్చిన ఆలోచన..
కెసిఆర్ ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మీ 50 వేల నుండి లక్షకు పెంచారు.
కేసీఆర్ 10 వేలు పెట్టుబడి సాయం ఇచ్చారు.
కాంగ్రెస్ 15 వేలు అని చెప్పి అసలుకే మోసం వచ్చింది.
కరువు వస్తె రేవంత్ రెడ్డి బాధ్యులు అవుతారు.
బోర్నపల్లి వంతెన కు కేసీఆర్ 70 కోట్లు మంజూరు చేశారు.కేసీఆర్ కు రుణపడి ఉంటా..
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    30 min ago
  • పత్రిక ప్రకటన తేది :14.04.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర లు పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం డీజీపీ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
    1
    పత్రిక ప్రకటన 
తేది :14.04.2026
కామారెడ్డి జిల్లా 
మంగళవారం 
తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర లు పూల మొక్క అందించి స్వాగతం పలికారు. 
అనంతరం డీజీపీ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    54 min ago
  • గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లి గ్రామంలో 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుని సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుపతి, నాయకులు దొనకొండ తిరుపతి, దొనకొండ మహేష్, అంబేద్కర్ సంఘ నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
    1
    గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లి గ్రామంలో 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుని సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుపతి, నాయకులు దొనకొండ తిరుపతి, దొనకొండ మహేష్, అంబేద్కర్ సంఘ నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
    user_ATUKULA PREM KUMAR
    ATUKULA PREM KUMAR
    జగిత్యాల రూరల్, జగిత్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో బిజెపి జిల్లా శాఖ అధ్యక్షుడు రెడ్డి పైన గోపి మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలను సమర్పించి నివాళులను అర్పించారు.
    1
    భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో బిజెపి జిల్లా శాఖ అధ్యక్షుడు రెడ్డి పైన గోపి మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలను సమర్పించి నివాళులను అర్పించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • నెరడిగొండ మండల కేంద్రంలో రాజ్యాంగ రహిత డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ 135వ జయంతి సందర్భంగా నెరడిగొండ మండల కేంద్రంలో జరిగిన అంబెడ్కర్ జయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బోరును ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ తోనే ఈరోజు ఎమ్మెల్యే అయ్యాయని అన్నారు. ఎన్నో పుస్తకాలు చదివిన అంబెడ్కర్ సమాజాన్ని అంతకంటే లోతుగా చదివి రాజ్యాంగాన్ని రాశారని గుర్తుచేశారు. ఆనాడు బాబా సాహెబ్ రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించకపోయి ఉంటే భారత సమాజం ఏమయ్యేదో ఆలోచించాలన్నారు. భారత పౌరులకు తమ నాయకున్ని తామే ఎన్నుకునే అవకాశం కల్పించిన గొప్ప మహనీయులు అంబెడ్కర్ గారని అన్నారు.
    1
    నెరడిగొండ మండల కేంద్రంలో రాజ్యాంగ రహిత డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ 135వ జయంతి సందర్భంగా నెరడిగొండ మండల కేంద్రంలో జరిగిన అంబెడ్కర్ జయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బోరును ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ తోనే ఈరోజు ఎమ్మెల్యే అయ్యాయని అన్నారు. ఎన్నో పుస్తకాలు చదివిన అంబెడ్కర్ సమాజాన్ని అంతకంటే లోతుగా చదివి రాజ్యాంగాన్ని రాశారని గుర్తుచేశారు. ఆనాడు బాబా సాహెబ్ రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించకపోయి ఉంటే భారత సమాజం ఏమయ్యేదో ఆలోచించాలన్నారు. భారత పౌరులకు తమ నాయకున్ని తామే ఎన్నుకునే అవకాశం కల్పించిన గొప్ప మహనీయులు అంబెడ్కర్ గారని అన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter నేరడిగొండ, ఆదిలాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • గన్నేరువరం: ఈనెల 23వ తేదీన గన్నేరువరంలో జరుగు హిందూ సమ్మేళన సభలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో జై హనుమాన్ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో తిమ్మాపూర్ ఖండ గన్నేరువరం ఉప మండలంలో జరుగు హిందూ సమ్మేళనానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి గన్నేరువరం సర్పంచ్ రంగన్న వేణి లచ్చినరుసు ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందువులు కులాలకతీతంగా సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ఈనెల 23వ తేదీన గన్నేరువరం లో జరుగు హిందూ సమ్మేళనంలో ప్రతి ఒక్క హిందువు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ముత్యాల జగన్ రెడ్డి, తిప్పర్తి నికేష్, విలాసాగరం రామచంద్రం, కాంతాల అంజిరెడ్డి సర్పంచ్ రంగన్న వేణి లచ్చినరుసు ఉప సర్పంచ్ రామంచ స్వామి అధిక సంఖ్యలో హిందూ సమ్మేళన సమితి సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.
    1
    గన్నేరువరం: ఈనెల 23వ తేదీన గన్నేరువరంలో జరుగు హిందూ సమ్మేళన సభలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో జై హనుమాన్ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో తిమ్మాపూర్ ఖండ గన్నేరువరం ఉప మండలంలో జరుగు హిందూ సమ్మేళనానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి గన్నేరువరం సర్పంచ్ రంగన్న వేణి లచ్చినరుసు ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందువులు కులాలకతీతంగా సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ఈనెల 23వ తేదీన గన్నేరువరం లో జరుగు హిందూ సమ్మేళనంలో ప్రతి ఒక్క హిందువు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ముత్యాల జగన్ రెడ్డి, తిప్పర్తి నికేష్, విలాసాగరం రామచంద్రం, కాంతాల అంజిరెడ్డి సర్పంచ్ రంగన్న వేణి లచ్చినరుసు ఉప సర్పంచ్ రామంచ స్వామి అధిక సంఖ్యలో హిందూ సమ్మేళన సమితి సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • జగిత్యాల జిల్లా… జగిత్యాల పట్టణంలోని నిజామాబాద్ హైవేపై మంచినీళ్ల బావి వద్ద వంతెన నిర్మాణ పనులు జరుగుతున ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలను నివారించేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తెలిపారు.  ఈ క్రమంలో జిల్లా ఎస్పీ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ప్రత్యక్షంగా సందర్శించరు. పనుల సమయంలో వాహన రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తో పాటు , ట్రాఫిక్ సజావుగా నడిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వంతెన నిర్మాణం జరుగుతున్న ప్రాంతం ముఖ్య రహదారిపై ఉండటంతో రోజువారీ వాహన రాకపోకలు అధికంగా ఉంటాయి కావున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ వారు తెలిపిన ప్రత్యామ్నాయ మార్గాలను ప్రజలు, వాహన దారులు అనుసరించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో తాత్కాలిక మార్పులు ఉండటంతో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వంతెన నిర్మాణ పనులు జరుగుతున ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు, రాత్రి సమయంలో రిఫ్లెక్టివ్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
    1
    జగిత్యాల జిల్లా…
జగిత్యాల పట్టణంలోని నిజామాబాద్ హైవేపై మంచినీళ్ల బావి వద్ద వంతెన నిర్మాణ పనులు జరుగుతున ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలను నివారించేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తెలిపారు. 
ఈ క్రమంలో జిల్లా ఎస్పీ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ప్రత్యక్షంగా సందర్శించరు. పనుల సమయంలో వాహన రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తో పాటు , ట్రాఫిక్ సజావుగా నడిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వంతెన నిర్మాణం జరుగుతున్న ప్రాంతం ముఖ్య రహదారిపై ఉండటంతో రోజువారీ వాహన రాకపోకలు అధికంగా ఉంటాయి కావున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ వారు తెలిపిన ప్రత్యామ్నాయ మార్గాలను ప్రజలు, వాహన దారులు అనుసరించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో తాత్కాలిక మార్పులు ఉండటంతో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వంతెన నిర్మాణ పనులు జరుగుతున ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు, రాత్రి సమయంలో రిఫ్లెక్టివ్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    39 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.