Shuru
Apke Nagar Ki App…
మేడే వారోత్సవాలను జయప్రదం చేయండి: చిన్నపాక లక్ష్మీనారాయణ NLG: 140వ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకుని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేసేవరకు పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు చిన్నపాక లక్ష్మీనారాయణ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. బుధవారం నిడమనూరు మండల కేంద్రంలో జరిగిన సీఐటీయూ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మే 1 నుంచి 7 వరకు మేడే వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్మికులు తమ హక్కుల కోసం పోరాడి సాధించుకున్న స్ఫూర్తికి మేడే ప్రతీక అని తెలిపారు.
జిల్లపల్లి ఇంద్ర
మేడే వారోత్సవాలను జయప్రదం చేయండి: చిన్నపాక లక్ష్మీనారాయణ NLG: 140వ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకుని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేసేవరకు పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు చిన్నపాక లక్ష్మీనారాయణ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. బుధవారం నిడమనూరు మండల కేంద్రంలో జరిగిన సీఐటీయూ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మే 1 నుంచి 7 వరకు మేడే వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్మికులు తమ హక్కుల కోసం పోరాడి సాధించుకున్న స్ఫూర్తికి మేడే ప్రతీక అని తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో మక్కల రాక భారీగా పెరగడంతో యార్డ్ పూర్తిగా నిండిపోయింది. కల్లెడ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రంలో కాంటాలు నెమ్మదిగా జరగడం, లారీల రాక ఆలస్యం కావడం వల్ల కొత్తగా వచ్చే ధాన్యానికి స్థలం లేకపోయింది. దీంతో వారం రోజుల పాటు రైతులు మొక్కజొన్నలను తీసుకురాకూడదని అధికారులు సూచించారు.1
- మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ప్రత్యేకంగా యంబ నరసింహులు గారు తన కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు తీసుకుని, సర్వలోక క్షేమం కోరుతూ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొని భక్తి భావంతో సేవలు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.4
- కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.1
- Post by నీరటి మహేందర్1
- నాచారం కు చెందిన చెల్లా లక్ష్మీనారాయణ(72) రిటైర్డ్ ఉద్యోగి ఈరోజు ఉదయం హబ్సిగూడలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి వచ్చి డిపాజిట్ స్లిప్ నింపుతుండగా స్ట్రోక్ రావడంతో కిందపపడిపోయిన లక్ష్మీనారాయణ. వెంటనే బ్యాంక్ సిబ్బంది 108 కు సమాచారం ఇవ్వడంతో..108 సిబ్బంది వచ్చి సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఓయూ పోలీసులు.1
- మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాపూర్ మల్లన్న గుట్ట వద్ద ఉన్న క్వారీలో మంగళవారం ఈతకు వెళ్లి గల్లంతైన బీకాం రెండో సంవత్సరం విద్యార్థి సూరజ్ (22) మృతదేహాన్ని డీఆర్ఎఫ్ బృందం వెలికితీసింది. మహారాష్ట్రకు చెందిన సూరజ్, తన నలుగురు స్నేహితులతో కలిసి క్వారీలో ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.1
- ఉపాధి హామీ కూలీల హాజరు నమోదులో మల్దకల్ గ్రామ పంచాయతీ రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. కొత్తగా వచ్చిన ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, 620 మంది కూలీల డేటాను నమోదు చేయడం ద్వారా నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. 9 మంది వర్కింగ్ మెట్ల కృషితో తెల్లవారుజామునే లక్ష్యాన్ని చేరుకోవడం గమనార్హం. కార్యదర్శి చొరవను జిల్లా అధికారులు అభినందించారు. సాంకేతిక వినియోగంలో మల్దకల్ ఆదర్శనీయమని ప్రశంసించారు. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడంలో ఈ పంచాయతీ ప్రత్యేక గుర్తింపు పొందింది.1
- హనంకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని సీఐ నవీన్ సూచించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక, ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఎంజేపీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ప్రాధాన్యత, ట్రాఫిక్ నియమాలపై వివరించి, విద్యార్థులతో మానవహారం ఏర్పాటుచేసి ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతపై తల్లిదండ్రులకు లేఖలు రాయించడంతో కార్యక్రమం ప్రత్యేకంగా నిలిచింది.1