Shuru
Apke Nagar Ki App…
బీర్కూర్ మండలం : అన్నారం గ్రామంలో తాగునీటి సమస్య, పంట పొలాల్లోకి వెళ్లి నీరు తెచ్చుకుంటున్న ప్రజలు కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం వేసవి కాలం ప్రారంభం కాకముందే పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి మొదలైంది. శనివారం బీర్కూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన పలువురు పంట పొలాల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. 2 రోజులుగా నీరు సరఫరా కాకపోవడంతో పొలాల నుంచి నీటిని తీసుకెళ్తున్నామని ప్రజలు తెలిపారు. ఈ విషయమై గ్రామ సర్పంచ్ కవిత, ఉప సర్పంచ్ సాయిలు మాట్లాడుతూ.. బోరు మోటర్లు కాలిపోయాయని, వెంటనే సమస్యను పరిష్కరిస్తామన్నారు.
Narmala Swapna
బీర్కూర్ మండలం : అన్నారం గ్రామంలో తాగునీటి సమస్య, పంట పొలాల్లోకి వెళ్లి నీరు తెచ్చుకుంటున్న ప్రజలు కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం వేసవి కాలం ప్రారంభం కాకముందే పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి మొదలైంది. శనివారం బీర్కూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన పలువురు పంట పొలాల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. 2 రోజులుగా నీరు సరఫరా కాకపోవడంతో పొలాల నుంచి నీటిని తీసుకెళ్తున్నామని ప్రజలు తెలిపారు. ఈ విషయమై గ్రామ సర్పంచ్ కవిత, ఉప సర్పంచ్ సాయిలు మాట్లాడుతూ.. బోరు మోటర్లు కాలిపోయాయని, వెంటనే సమస్యను పరిష్కరిస్తామన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం వజ్జపల్లి గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి శనివారం సర్పంచ్ రాధాబాయి శ్యామ్ రావు శంకుస్థాపన చేశారు. గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీబాయి APM ప్రసాద్ సీసీ భూమయ్య, ఉప సర్పంచ్ నర్సింలు తదితరులు ఉన్నారు.1
- లోక రక్షకుడు యేసుక్రీస్తు పునరుత్థాన సందేశాన్ని చాటి చెబుతూ మెదక్ లో 'రన్ ఫర్ జీసస్' 2026 ర్యాలీ ని సిఎస్ఐ సంఘం ఆద్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ప్రార్థన చేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ చర్చ్ నుంచి పట్టణ పుర వీధుల గుండా సాగింది. ర్యాలీ లో యువతి, యువకులు, చిన్నారులు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం నినాదాలు చేస్తూ యేసు క్రీస్తు పాటలకు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య మాట్లాడుతూ ఈస్టర్ పండుగకు ముందు వచ్చే మహా శనివారం రోజు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం రన్ ఫర్ జీసస్ ర్యాలీ జరుపుతారని అన్నారు. ఈ ర్యాలీ ప్రతి సంవత్సరం సీఎస్ఐ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న, పెద్ద తేడా లేకుండా లోక రక్షకుడి తిరిగి రాకడ కోసం చేసుకోనున్న ర్యాలీ గా చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంట సంపత్, చర్చ్ కమిటీ సభ్యులు, గురువులు పాల్గొన్నారు.1
- *పేకాట స్థావరంపై CCS టీం మెరుపుదాడి – నలుగురు అరెస్ట్* నేడు *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS.,* గారి ఆదేశాల మేరకు CCS ఏసీపీ మస్తాన్ అలీ గారి ఆధ్వర్యంలో CCS సిబ్బంది పేకాట స్థావరంపై మెరుపుదాడి నిర్వహించారు. జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కలిగొట్ గ్రామ శివారులో నడుస్తున్న పేకాట స్థావరంపై నేడు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నాలుగు వాహనాలు, మూడు సెల్‌ఫోన్లు మరియు రూ.10,940 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ SHO గారికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు1
- కౌడిపల్లి నివాసిస్తుడు రెడ్డి నర్సింహులు అయినా పూరి గుడిసె నిప్పు అంటుకొని మొత్తం గుడిసె దగ్ధం అయిపోయింది. అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన వచ్చి మంటలు చిల్లరేగకుండా ఆపివేయడం జరిగింది. అయినప్పటికీ పూరి గుడిసె మొత్తం దగ్ధమైపోయింది.2
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిమ్మి రెడ్డి, నెంటూరి కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఉప సర్పంచ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ పాండవుల బాలరాజ్ ముదిరాజ్, మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో చైతన్యం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, వెంకట్ ముదిరాజ్, భాస్కర్ యాదవ్, హరీష్ గౌడ్, పెద్దోళ్ళ బాలయ్య, ఏముల రాములు, పొట్ట మల్లేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దాసరి వెంకటేష్, చిత్ర ఆర్ట్స్ నర్సింలు. పొట్ట రాజు చేబర్తి వెంకటేష్ పొట్ట కరుణాకర్ పాపయ్య, తిమ్మకపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.అలాగే శ్రీగిరిపల్లి గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు4
- ఈనెల 20 నుండి సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు1
- కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. రవీందర్ గౌడ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వైద్య శిబిరం తాలూకు రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించారు. ఎంతమందిని మెరుగైన వైద్యానికి సిఫార్సు చేశారో M.O డా.ఆదర్శ్ న్ను అడిగి ఆరా తీశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆయనతో పాటు సిబ్బంది వేణు గోపాల్ ఉన్నారు.1