కులమతాలకు అతీతంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు. మానవత్వం, మతసామరస్యం, సోదరభావమే మహమ్మద్ ప్రవక్త బోధనాలు. బద్వేలు,ఆగస్టు 26: మానవత్వం, మతసామరస్యం, సోదరభావమే మహమ్మద్ ప్రవక్త బోధనలని వక్తలు పేర్కొన్నారు. బద్వేలు విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో బుధవారం ఆవాజ్ సంఘం, అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అబ్దుల్ సత్తార్ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు సమీర్ బాషా, సలీం హాఫిజ్, గురుమూర్తి, విశ్రాంత ఉపాధ్యాయులు జబ్బార్, పట్టణ అభివృద్ధి సంఘ ఉపాధ్యక్షులు కె.వి. సుబ్బారావు, కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, రత్నం విద్యా సంస్థ ప్రతినిధి రత్నం తదితరులు మాట్లాడుతూ ప్రవక్త జీవితం మానవత్వానికి ఆదర్శమని, పేదలు, అనాథల పట్ల చూపిన దయ సమాజానికి సందేశమని అన్నారు. మతాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని, అందరూ కలిసి జీవించాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలో ఆవాజ్ రాష్ట్ర సంఘ సభ్యులు అన్వర్ బాషా, జిల్లా అధ్యక్షులు చాంద్ బాషా, అధ్యాపకులు యూసుఫ్, ఖాజా గౌస్, దర్గా సలీం, కె.వి. రసూల్, ఉపాధ్యాయులు లక్ష్మీరెడ్డి, కరిముల్లా, సృజన్ పాఠశాల నిర్వాహకులు నూరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

- రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి1
- ప్రియ దైవ స్నేహితులారా ఏసుక్రీస్తు నామము మీ అందరికీ శుభాభివందనం1
- *మధ్యప్రదేశ్:**4 కాళ్లు, 4 చేతులతో జన్మించిన* *మగ శిశువు...* లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.ఓ మహిళకు 4 కాళ్లు, 4 చేతులతో మగశిశువు జన్మించాడు.అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం శిశువును ఎయిర్ అంబులెన్స్‌లో జబల్‌పూర్‌కు తరలించారు...1
- ఏం చైర్మన్ బెజవాడ వంశికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనయుడు ఘనంగా యువ నాయకుడు అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు విడవలూరు మండలం లో ఊటుకూరు గ్రామంలో కోవూరు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కోవూరు ఏఎంసి చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ మాకు ఎప్పుడు అండగా ఉండి యువతకు గాని మేము ఎప్పుడు యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని అన్నారు అలాగే యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు3
- ବିଜେପି କେତେ ନୀଳଜା ଅଛି1
- హైవే భద్రతా లోపాలే ప్రమాదాలకు కారణం: జేసీ ప్రభాకర్ రెడ్డి కోదాడ వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రమాదానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తప్పిదమే కారణమని చెప్పడం సరికాదని అన్నారు.జాతీయ రహదారి నిర్వహణ లోపాలు, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆరోపించారు.హైవేపై ఆగిపోయిన వాహనాలకు సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత జాతీయ రహదారి నిర్వహణ సంస్థలదేనని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఆగి ఉన్న వాహనాల చుట్టూ సరౌండింగ్ లైట్లు, హెచ్చరిక సంకేతాలు ఏర్పాటు చేయాలని సూచించారు.జాతీయ రహదారి కాంట్రాక్టర్లు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.హైవేపై కనీస భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.జాతీయ రహదారి అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.ప్రతి ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ బస్సు యజమానులనే తప్పుబట్టడం సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారి నిర్వహణ లోపాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా హైవే భద్రతపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారులపై సరైన భద్రతా సదుపాయాలు, ప్రమాణాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.1
- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కొరకు భూమి పూజ బండి ఆత్మకూరు మండలం జి. సీ. పాలెం గ్రామం నందు శ్రీవాణి ట్రస్ట్ ధ్వరా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కి దేవాలయం పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ దేవాలయం నిర్మాణానికి రూ. 40 లక్షలు, అనుమతులు మంజూరు చేయించినటువంటి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి గ్రామం తరపున ధన్యవాదములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమములో కంచెర్ల లింగారెడ్డి, సుబ్బయ్య, మోహనరావు, గోపాల్, వై రమణ, ప్రసాద్, వై శ్రీను, శివుడు, లక్ష్మీ రెడ్డి, సుబ్బారెడ్డి మరియు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అందరు పాల్గొని పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.1
- *బస్సు-కంటైనర్ - "ఢీ"* *6గురు మృతి* *20 మందికి తీవ్ర గాయాలు* *దొరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం* రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు సహా ఆరుగురు మృతి *ఏలూరు వెళ్తున్న* బస్సుకు ఘోర ప్రమాదం..దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.2