logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి, పేర్కబండ, పోతారం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించారు. ఇందులో దేవక్కపల్లి, పేర్కబండ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, పోతారం గ్రామంలో డ్రైనేజీ నిర్మాణ పనులు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. రహదారుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ కోసం భూమిని అందించిన దేవక్కపల్లి గ్రామ దాతలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఇందిరమ్మ ఇండ్ల తొలి విడతలో ఇళ్లు నిర్మించని 76 మంది స్థానంలో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఎంపికైన వారికి సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధ్రువపత్రాలు అందజేయనున్నట్లు పేర్కొంటూ, వారు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

15 hrs ago
user_ప్రభాకర్
ప్రభాకర్
Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
15 hrs ago

మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి, పేర్కబండ, పోతారం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించారు. ఇందులో దేవక్కపల్లి, పేర్కబండ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, పోతారం గ్రామంలో

డ్రైనేజీ నిర్మాణ పనులు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. రహదారుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. రోడ్డు

2a631e21-28f8-4730-a00f-9eabe08c0fcd

విస్తరణ కోసం భూమిని అందించిన దేవక్కపల్లి గ్రామ దాతలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఇందిరమ్మ ఇండ్ల తొలి విడతలో ఇళ్లు నిర్మించని 76 మంది స్థానంలో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే

a6d60633-9b3d-47d0-9e76-d2d20ff07252

వెల్లడించారు. ఎంపికైన వారికి సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధ్రువపత్రాలు అందజేయనున్నట్లు పేర్కొంటూ, వారు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ షీట్‌లను సృష్టించి సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఆరుగురు నిందితులను సిరిసిల్ల పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఈ మేరకు ఆయన పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ మోసం మూడు ప్రధాన పద్ధతులలో జరిగింది. సిరిసిల్ల పట్టణంలోని పెద్దూర్ అపరెల్ పార్క్ గోదాంలో మేనేజర్‌గా పనిచేస్తున్న కరీంనగర్ నివాసి ఉత్కం విజయ్, అతని సహచరుడు వేములవాడ రూరల్, అచ్చనపల్లి గ్రామానికి చెందిన వాసాల గణేష్‌తో కలిసి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లుగా నకిలీ ట్రక్ షీట్లను తయారు చేశారు. రుద్రంగి ఐకేపీ కేంద్రం ఇన్‌చార్జ్ గడ్డం స్వామి రెండు లారీలకు నకిలీ ట్రక్ షీట్లు జారీ చేయగా, వాటిని ఉత్కం విజయ్ సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. అనంతరం, నిందితులు నిధులను పంచుకున్నారు. అదేవిధంగా, డీఎంఓ కార్యాలయంలో మండల స్థాయి కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న కమ్మరి రాజశేఖర్, బద్దెనపల్లి పీఏసీఎస్ కేంద్రం ఇన్‌చార్జ్ గాజుల నవీన్‌తో కలిసి ఒక లారీ ధాన్యానికి నకిలీ ట్రక్ షీట్ రూపొందించి ఉత్కం విజయ్‌కు అందించారు. దీనిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత, రాజశేఖర్ ఆమోదం తెలపగా విడుదలైన నిధులను ముగ్గురు పంచుకున్నారు. ఇంకా, వివిధ ఐకేపీ కేంద్రాల నుంచి అపరెల్ పార్క్ గోదాముకు వచ్చిన 10 లారీల ధాన్యాన్ని గోదాంలో దించకుండా, ఆన్‌లైన్‌లో దించినట్లు నమోదు చేశారు. ఆ ధాన్యాన్ని వేములవాడకు చెందిన చెపూరి మధుకర్‌కు అప్పగించగా, అతను సిద్ధిపేటకు చెందిన కమిషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్ ద్వారా వివిధ రైస్ మిల్లులకు విక్రయించి, వచ్చిన మొత్తాన్ని పరస్పరం పంచుకున్నారు. ఈ మోసాలను గుర్తించిన జిల్లా సివిల్ సప్లై మేనేజర్ ఎస్. నరసింహ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ టీమ్ దర్యాప్తు చేపట్టగా, సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులు అక్రమంగా మళ్లించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితులు ఉత్కం విజయ్, కమ్మరి రాజశేఖర్, చెపూరి మధుకర్, వాసాల గణేష్, గాజుల నవీన్, గడ్డం స్వామిలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, సంబంధిత పత్రాలు, ₹14,16,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. అదనంగా, ₹46,21,358 మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో సీజ్ చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ స్పష్టం చేశారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ షీట్‌లను సృష్టించి సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఆరుగురు నిందితులను సిరిసిల్ల పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఈ మేరకు ఆయన పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఈ మోసం మూడు ప్రధాన పద్ధతులలో జరిగింది. సిరిసిల్ల పట్టణంలోని పెద్దూర్ అపరెల్ పార్క్ గోదాంలో మేనేజర్‌గా పనిచేస్తున్న కరీంనగర్ నివాసి ఉత్కం విజయ్, అతని సహచరుడు వేములవాడ రూరల్, అచ్చనపల్లి గ్రామానికి చెందిన వాసాల గణేష్‌తో కలిసి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లుగా నకిలీ ట్రక్ షీట్లను తయారు చేశారు. రుద్రంగి ఐకేపీ కేంద్రం ఇన్‌చార్జ్ గడ్డం స్వామి రెండు లారీలకు నకిలీ ట్రక్ షీట్లు జారీ చేయగా, వాటిని ఉత్కం విజయ్ సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. అనంతరం, నిందితులు నిధులను పంచుకున్నారు. అదేవిధంగా, డీఎంఓ కార్యాలయంలో మండల స్థాయి కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న కమ్మరి రాజశేఖర్, బద్దెనపల్లి పీఏసీఎస్ కేంద్రం ఇన్‌చార్జ్ గాజుల నవీన్‌తో కలిసి ఒక లారీ ధాన్యానికి నకిలీ ట్రక్ షీట్ రూపొందించి ఉత్కం విజయ్‌కు అందించారు. దీనిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత, రాజశేఖర్ ఆమోదం తెలపగా విడుదలైన నిధులను ముగ్గురు పంచుకున్నారు.

ఇంకా, వివిధ ఐకేపీ కేంద్రాల నుంచి అపరెల్ పార్క్ గోదాముకు వచ్చిన 10 లారీల ధాన్యాన్ని గోదాంలో దించకుండా, ఆన్‌లైన్‌లో దించినట్లు నమోదు చేశారు. ఆ ధాన్యాన్ని వేములవాడకు చెందిన చెపూరి మధుకర్‌కు అప్పగించగా, అతను సిద్ధిపేటకు చెందిన కమిషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్ ద్వారా వివిధ రైస్ మిల్లులకు విక్రయించి, వచ్చిన మొత్తాన్ని పరస్పరం పంచుకున్నారు.

ఈ మోసాలను గుర్తించిన జిల్లా సివిల్ సప్లై మేనేజర్ ఎస్. నరసింహ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ టీమ్ దర్యాప్తు చేపట్టగా, సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులు అక్రమంగా మళ్లించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితులు ఉత్కం విజయ్, కమ్మరి రాజశేఖర్, చెపూరి మధుకర్, వాసాల గణేష్, గాజుల నవీన్, గడ్డం స్వామిలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, సంబంధిత పత్రాలు, ₹14,16,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. అదనంగా, ₹46,21,358 మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో సీజ్ చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ స్పష్టం చేశారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    9 hrs ago
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అధికారులతో కలిసి కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. ఈ ఏడాది విజయ దశమి నాటికి ఈ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు ఆయనకు వివరించారు. కరీంనగర్-వరంగల్ హైవే విస్తరణ పనులు పూర్తయిన వెంటనే కరీంనగర్-జగిత్యాల హైవే విస్తరణ పనులను ప్రారంభిస్తామని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని మంత్రి తెలిపారు. ఈరోజు సాయంత్రం జమ్మికుంట నుండి తిరిగి వస్తూ కందుగుల చౌరస్తా వద్ద మంత్రి ఈ జాతీయ రహదారి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, ఇతర స్థానిక బీజేపీ నేతలు కేంద్ర మంత్రి వెంట ఉన్నారు. మంత్రి పనుల పరిశీలనకు వస్తున్నారని సమాచారం అందడంతో ఎన్ హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్, ఇతర ఉన్నతాధికారులు కందుగులకు వచ్చి మంత్రిని కలిశారు. కొత్తగట్టు, బొమ్మకల్, గట్టు దుద్దెనపల్లి వంటి కొన్ని ప్రాంతాలలో పనులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, మొత్తం మీద 90 శాతం పనులు పూర్తయ్యాయని, మరో మూడు నెలల్లో మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తామని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్, మోదీ ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు గ్రామీణ, మండల, జిల్లా స్థాయిలో రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. రోడ్లు బాగుంటేనే రవాణా సౌకర్యాలు మెరుగుపడి గ్రామాలు, పట్టణాలు, మండలాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా, రోడ్ల నిర్మాణానికి మోదీ ప్రభుత్వం ఏటా రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయని, అక్కడక్కడా తలెత్తిన కొన్ని న్యాయపరమైన సమస్యలను అధిగమించి పనులు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. ఈ హైవే పనులు పూర్తయిన వెంటనే కరీంనగర్-జగిత్యాల రోడ్డు విస్తరణ పనులను ప్రారంభిస్తామని మరోసారి స్పష్టం చేశారు. మోదీ పాలనలో రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
    1
    కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అధికారులతో కలిసి కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. ఈ ఏడాది విజయ దశమి నాటికి ఈ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు ఆయనకు వివరించారు. కరీంనగర్-వరంగల్ హైవే విస్తరణ పనులు పూర్తయిన వెంటనే కరీంనగర్-జగిత్యాల హైవే విస్తరణ పనులను ప్రారంభిస్తామని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని మంత్రి తెలిపారు.

ఈరోజు సాయంత్రం జమ్మికుంట నుండి తిరిగి వస్తూ కందుగుల చౌరస్తా వద్ద మంత్రి ఈ జాతీయ రహదారి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, ఇతర స్థానిక బీజేపీ నేతలు కేంద్ర మంత్రి వెంట ఉన్నారు. మంత్రి పనుల పరిశీలనకు వస్తున్నారని సమాచారం అందడంతో ఎన్ హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్, ఇతర ఉన్నతాధికారులు కందుగులకు వచ్చి మంత్రిని కలిశారు. కొత్తగట్టు, బొమ్మకల్, గట్టు దుద్దెనపల్లి వంటి కొన్ని ప్రాంతాలలో పనులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, మొత్తం మీద 90 శాతం పనులు పూర్తయ్యాయని, మరో మూడు నెలల్లో మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తామని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్, మోదీ ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు గ్రామీణ, మండల, జిల్లా స్థాయిలో రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. రోడ్లు బాగుంటేనే రవాణా సౌకర్యాలు మెరుగుపడి గ్రామాలు, పట్టణాలు, మండలాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా, రోడ్ల నిర్మాణానికి మోదీ ప్రభుత్వం ఏటా రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయని, అక్కడక్కడా తలెత్తిన కొన్ని న్యాయపరమైన సమస్యలను అధిగమించి పనులు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. ఈ హైవే పనులు పూర్తయిన వెంటనే కరీంనగర్-జగిత్యాల రోడ్డు విస్తరణ పనులను ప్రారంభిస్తామని మరోసారి స్పష్టం చేశారు. మోదీ పాలనలో రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    10 hrs ago
  • కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో మాజీ జెడ్పిటిసి బిల్ల వెంకట్‌రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారంతా బిల్ల వెంకట్‌రెడ్డితో కేక్ కట్ చేయించి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వెంకట్‌రెడ్డి ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, గ్రామస్తులు కూడా పాల్గొని సందడి చేశారు.
    1
    కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో మాజీ జెడ్పిటిసి బిల్ల వెంకట్‌రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారంతా బిల్ల వెంకట్‌రెడ్డితో కేక్ కట్ చేయించి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వెంకట్‌రెడ్డి ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, గ్రామస్తులు కూడా పాల్గొని సందడి చేశారు.
    user_Dokidi Thirupathi
    Dokidi Thirupathi
    Farmer వి. సైదాపూర్, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గర్జనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు కులేరి ప్రేమ్ సాగర్, విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంలో బోధనోపకరణలు ఎంతో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం లో భాగంగా, అభ్యసన ప్రక్రియలో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారికి సులభరీతిలో బోధించడానికి వీలుగా, విద్యార్థులతో కలిసి బోధనోపకరణలను తయారు చేసినట్టు ఆయన తెలిపారు. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యాయుల బోధనోపకరణల వర్క్ షాప్‌లో భాగంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంజుల, శ్రీనివాస్, కవిత, కార్తీక్ లు పాల్గొన్నారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గర్జనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు కులేరి ప్రేమ్ సాగర్, విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంలో బోధనోపకరణలు ఎంతో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు.

లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం లో భాగంగా, అభ్యసన ప్రక్రియలో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారికి సులభరీతిలో బోధించడానికి వీలుగా, విద్యార్థులతో కలిసి బోధనోపకరణలను తయారు చేసినట్టు ఆయన తెలిపారు. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యాయుల బోధనోపకరణల వర్క్ షాప్‌లో భాగంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంజుల, శ్రీనివాస్, కవిత, కార్తీక్ లు పాల్గొన్నారు.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    10 hrs ago
  • కామారెడ్డి జిల్లా భిక్కనూరులోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో శనివారం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ రేఖ చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రేఖ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవాలని పిలుపునిచ్చారు. సర్కారు బడుల్లో ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పిస్తోందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా భిక్కనూరులోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో శనివారం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ రేఖ చిన్నారులతో అక్షరాలు దిద్దించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రేఖ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవాలని పిలుపునిచ్చారు. సర్కారు బడుల్లో ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పిస్తోందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
  • కరీంనగర్‌లో ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీ, పుస్తకాల భారంపై ఏఐఎస్‌ఎఫ్ కార్యకర్తలు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) కార్యాలయం ముందు ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి నోట్ల కట్టలతో పుస్తకాలను తూకం వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. విద్యాశాఖ అండదండలతోనే ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని, అక్షరాలతో లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నాయని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ఆరోపించారు. ఫీజుల దోపిడీ, పుస్తకాల భారంకు పాల్పడుతున్న పాఠశాలల యాజమాన్యాలపై తక్షణమే ఏసీబీ, ఐటీ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఏఐఎస్‌ఎఫ్ హెచ్చరించింది.
    2
    కరీంనగర్‌లో ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీ, పుస్తకాల భారంపై ఏఐఎస్‌ఎఫ్ కార్యకర్తలు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) కార్యాలయం ముందు ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి నోట్ల కట్టలతో పుస్తకాలను తూకం వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

విద్యాశాఖ అండదండలతోనే ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని, అక్షరాలతో లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నాయని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ఆరోపించారు. ఫీజుల దోపిడీ, పుస్తకాల భారంకు పాల్పడుతున్న పాఠశాలల యాజమాన్యాలపై తక్షణమే ఏసీబీ, ఐటీ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఏఐఎస్‌ఎఫ్ హెచ్చరించింది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    13 hrs ago
  • శనివారం రోజున గంభిరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని "మా" అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సందర్శించారు. ఈ పర్యటనలో ఆయన వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితులు మరియు అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, వారికి పండ్లు, బియ్యం, కిరాణా సరుకులు, మరియు ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, ఎస్పీ గితే సమాజంలోని ప్రతి ఒక్కరూ వృద్ధులు, నిరాశ్రయులు, మరియు అనాథల సంక్షేమం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వృద్ధులకు సేవ చేయడం గొప్ప మానవతా ధర్మమని, వారికి అండగా నిలబడటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. అవసరమైన వారికి సేవలు అందించడంలో జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ వెంకటేష్, ఎస్.ఐ శ్రీకాంత్ మరియు వృద్ధాశ్రమ సభ్యులు పాల్గొన్నారు. పోలీసు శాఖ మానవతా సేవలో ముందుండటాన్ని ఈ పర్యటన చాటి చెప్పింది.
    4
    శనివారం రోజున గంభిరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని "మా" అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సందర్శించారు. ఈ పర్యటనలో ఆయన వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితులు మరియు అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, వారికి పండ్లు, బియ్యం, కిరాణా సరుకులు, మరియు ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా, ఎస్పీ గితే సమాజంలోని ప్రతి ఒక్కరూ వృద్ధులు, నిరాశ్రయులు, మరియు అనాథల సంక్షేమం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వృద్ధులకు సేవ చేయడం గొప్ప మానవతా ధర్మమని, వారికి అండగా నిలబడటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. అవసరమైన వారికి సేవలు అందించడంలో జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ వెంకటేష్, ఎస్.ఐ శ్రీకాంత్ మరియు వృద్ధాశ్రమ సభ్యులు పాల్గొన్నారు. పోలీసు శాఖ మానవతా సేవలో ముందుండటాన్ని ఈ పర్యటన చాటి చెప్పింది.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    16 hrs ago
  • మహారాష్ట్రలోని పర్బానీ జిల్లాలో ఒక ఘోర ప్రమాదం సంభవించింది. యశ్వాడిలో ఉన్న హనుమాన్ ఆలయ మండపం కుప్పకూలడంతో, సుమారు 30 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
    2
    మహారాష్ట్రలోని పర్బానీ జిల్లాలో ఒక ఘోర ప్రమాదం సంభవించింది. యశ్వాడిలో ఉన్న హనుమాన్ ఆలయ మండపం కుప్పకూలడంతో, సుమారు 30 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.