జుక్కల్ ఎమ్మెల్యే పై మాజీ ఎంపీటీసీ అవార్ సురేష్ ఫైర్... సీనియర్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు,దురుసుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిక.... కామారెడ్డి జిల్లా జుక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే తోటలక్ష్మీ కాంతారావు మధ్య ఘర్షణ రోజు రోజుకు పెరుగుతుంది. ఎమ్మెల్యే సీనియర్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల మాజీ ఎంపీటీసీ అవార్ సురేష్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీనియర్ నాయకులు లేకుంటే ఎమ్మెల్యే కాంతారావు గెలిచేవాడే కాదని తెలిపారు. ఎమ్మెల్యేని 13 రోజుల్లోనే గెలిపించిన ఘనత జుక్కల్ నియోజకవర్గం సీనియర్ నాయకులదని పేర్కొన్నారు. అలాంటి సీనియర్ నాయకులను, కాంగ్రెస్ పార్టీ నాయకులను గాడిదలతో,కోతులతో సంబోధించడం సరికాదన్నారు. ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారన్న సంగతి మర్చిపోవదన్నారు. సీనియర్ నాయకులను తిట్టడంలో దృష్టి పెట్టకుండా జుక్కల్ అభివృద్ధికి దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విమల కిషోర్ బట్టాడ్, సీనియర్ నాయకులు పాషా సెట్, మాజీ ఎంపీటీసీ మొగులయ్య,పుల్లెన్ వెంకటేష్, జాఫర్, పోతుల అనిల్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- YLR 9 మన ఎల్లారెడ్డి లోకల్ న్యూస్ 16-02-20251
- బోధన్ లోని గిరిజన బాలుర వసతి గృహంలో సేవాలాల్ మహారాజు 286వ జయంతి వేడుకలు.. || GS 6 NEWS ||1
- బోధన్ ఇందూర్ హైస్కూల్ లో ఘనంగా పదవతరగతి విద్యార్ధుల పేర్వల్ వేడుకలు.1
- #new ఉపస్థితి⛳💐దిన్ కేశవ ప్రభాత్ శాఖ ద్వారకా నగర్ బస్తి, బోధన్ నగరం🕉️1
- పర్స్ పోయిందని ఫిర్యాదు చేసినందుకు మహిళను దారుణంగా కొట్టిన బోధన్ రూరల్ సీఐ1
- బోధన్ పట్టణంలో ఇందూరు హైహ్ స్కూల్ విద్యార్థులకు గ్రాండ్ ఫేర్వెల్ పార్టీ1
- 🙏మనూర్: శ్రీ బోరంచ నల్ల పోచమ్మ దివ్య దర్శనం1