కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హనుమాన్ వెల్డింగ్ వర్క్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని వర్క్స్ యజమాని పోలె శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ హనుమాన్ వెల్డింగ్ వర్క్స్‌లో గేట్లు, కిటికీలు, రైలింగ్‌లు, మెట్లు, షెడ్లు, షట్టర్లు, స్టీల్ ఫ్యాబ్రికేషన్ పనులతో పాటు గృహాలపై రేకుల ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నాణ్యమైన సేవలతో ఈ సంస్థ మంచి పేరు సంపాదించాలని అతిథులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలె శేఖర్, దయ్యాల కొమురయ్య, ఏనుగుల ప్రశాంత్ కుమార్, పొత్తూరి రాజు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హనుమాన్ వెల్డింగ్ వర్క్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని వర్క్స్ యజమాని పోలె శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ హనుమాన్ వెల్డింగ్ వర్క్స్‌లో గేట్లు, కిటికీలు, రైలింగ్‌లు, మెట్లు, షెడ్లు, షట్టర్లు, స్టీల్ ఫ్యాబ్రికేషన్ పనులతో పాటు గృహాలపై రేకుల ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నాణ్యమైన సేవలతో ఈ సంస్థ మంచి పేరు సంపాదించాలని అతిథులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలె శేఖర్, దయ్యాల కొమురయ్య, ఏనుగుల ప్రశాంత్ కుమార్, పొత్తూరి రాజు తదితరులు పాల్గొన్నారు.
- తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైపోయాయని ఆటో యూనియన్ ప్రతినిధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధి పూర్తిగా దెబ్బతిందని, కుటుంబాలను పోషించలేక డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళ్లు తెరిపించేందుకు ఆగస్టు నెలలో పెద్ద ఎత్తున ఆటోలు బంద్ చేసి, సమ్మెకు దిగాలని వారు తీర్మానించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రాష్ట్రంలోని 33 జిల్లాల ఆటో డ్రైవర్ల అధ్యక్ష, కార్యదర్శులతో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం యూనియన్ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఆటో డ్రైవర్ల సమస్యలపై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి ఆటో డ్రైవర్‌కు 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని మరియు ఆటో డ్రైవర్ల కోసం ఒక ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు, ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని స్పష్టం చేశారు. అలాగే ఆర్టీవో ఆఫీసులో వాహనాల ఫిట్నెస్ పైన రేడియం వేస్తూ చేస్తున్న కాంట్రాక్టును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఆగస్టు నెలలో ఆటో డ్రైవర్లందరూ ఏకమై సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.1
- కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని చర్ల బూత్కూరు గ్రామంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఓటరు ప్రక్రియకు సంబంధించిన సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ పిలుపు మేరకు బూత్ ఇన్‌ఛార్జులు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, సుంకిశాల సంపత్ రావు ఈ కేంద్రాన్ని ప్రారంభించి, పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు హక్కు నమోదు ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ సహాయ కేంద్రంలో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మధుకర్, మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, వార్డ్ మెంబర్ తప్పెట్ల నరేష్‌తో పాటు బీఎల్ఏలు, బీఎల్ఓలు పాల్గొన్నారు.1
- వడ్లను లారీల కొద్దీ యథేచ్ఛగా అక్రమంగా అమ్ముకుంటున్నా అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ధాన్యపు కొనుగోలు కేంద్రాలు ముగిసి నెల రోజులు గడుస్తున్నా, వరి ధాన్యం ఎక్కడికి తరలిపోతుందనే అంశంపై ఎటువంటి నిఘా లేకపోవడంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చెక్ పోస్టులలో కనీస తనిఖీలు కూడా నిర్వహించకపోవడం అధికారుల అండదండలతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయనడానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. ఈ వరి ధాన్యం కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రైస్ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, రైస్ మిల్లర్లు, అధికారులు, బడా నేతలు కుమ్మక్కై ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. లారీల కొద్దీ వడ్లను అక్రమంగా అమ్ముకుంటుంటే అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నారా అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.1
- సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు కలవడం వల్ల చేప పిల్లలు మృతి చెందుతున్నాయని బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి, మత్స్యకారుల జీవనాధారానికి ఎంతో కీలకమైన తోటపల్లి రిజర్వాయర్ను కాలుష్యానికి గురిచేయడం సరికాదని ఆయన శనివారం అన్నారు. కలుషితమైన ఈ నీటిని పంటలకు ఉపయోగించడం వల్ల భూముల సారవంతం తగ్గే ప్రమాదం ఉందని, అలాగే పశువుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, రిజర్వాయర్లోకి వ్యర్థ జలాలు చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులైన రైతులు, మత్స్యకారులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలన్నారు. ప్రజా సమస్యలపై నిరసనగా బెజ్జంకి తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్, నాయకులు లింగాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ దుమాల మహేష్, వంగల నరేష్, వార్డు సభ్యులు తిప్పరపు మహేష్, పొట్లపెల్లి శివ, రామంచ పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.1
- కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో ప్రాజెక్టులను ఎండబెడుతుందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా విమర్శించారు. ఎల్ఎండీ, ఎల్లంపల్లి, మిడ్ మానేరు వంటి జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరాయని కరీంనగర్ లో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కన్నెపల్లి లక్ష్మీ పంప్‌హౌస్ వద్ద లక్ష క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రం పాలవుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కు పేరు రాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పంపులను ఆన్ చేయడం లేదని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కన్నెపల్లి పంపులను ఆన్ చేయకపోతే, రైతులు పంప్‌హౌస్‌లను ముట్టడించడం తప్పదని ఆయన స్పష్టం చేస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.1
- సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామ అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఉపసర్పంచ్ ధూమాల మహేష్ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు గ్రామ సర్పంచ్‌పై ఎలాంటి ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ నాయకుల ఆరోపణలకు తగిన ఆధారాలు ఉంటే, వాటిని ప్రజల ముందు ఉంచాలని ఆయన సవాల్ విసిరారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీకి తగదని ఆయన హితవు పలికారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధికి సహకరించాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా ధూమాల మహేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ వైస్ చైర్మన్ బండి వేణు, లింగాల వెంకటేష్, దొంతరవేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.1
- జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తాను చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల మోతే రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం జరగనున్న కేంద్రీయ విద్యాలయం భూమి పూజ కార్యక్రమం గురించి ఆయన ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తామే పోరాటం చేశామని కొందరు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి స్థానిక ఎంపీ కృషి చేయాలని, అలాగే విద్యార్థులకు రెగ్యులర్ సిబ్బందితో బోధన సాగేలా చొరవ చూపాలని ఆయన కోరారు. అభివృద్ధి పనుల విషయంలో తనకు ఎలాంటి భేషజాలు లేవని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడమే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీతో కలిసి పనిచేస్తూ జగిత్యాల అభివృద్ధికి శ్రమిస్తానని, రేపటి భూమి పూజ కార్యక్రమం గురించి ఇప్పటికే వారితో మాట్లాడడం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వివరించారు.1
- కరీంనగర్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన నిర్వహించబోయే శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని మాజీమంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్‌ను కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఎమ్మెల్యే గంగుల నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆయన చేతుల మీదుగా ఈ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట నగర బిఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరి శంకర్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్, వైద్యులు రాజ భాస్కర్ రెడ్డి, ఎస్ ఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బుర్ర మధుసూదన్ రెడ్డి, రమేష్ రెడ్డి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.2