logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఈనెల 9 నుండి జాతీయస్థాయి పద్య నాటక,సాంఘిక నాటిక పోటీలు మిర్యాలగూడ, మార్చి 7: తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ, ఎఫ్.డి.సి. మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి పద్య నాటక, సాంఘిక నాటిక పోటీలు, నృత్యోత్సవాలను మిర్యాలగూడ పట్టణంలోని వేదిక కళాభారతి మినీ రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఈనెల 9వ తేదీ (సోమవారం) నుంచి ఈనెల 15వ తేదీ (ఆదివారం) వరకు నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షులు టి రామచంద్రరావు, అధ్యక్షులు పి రామావతారం, ప్రధాన కార్యదర్శి పి కృష్ణమూర్తి, కోశాధికారి పి వెంకటలక్ష్మి నారాయణ శర్మలు తెలిపారు. ప్రేక్షకులు వేలాది సంఖ్యలో పాల్గొని నాటక, నాటిక పోటీలు జయప్రదం చేయాలని వారు కోరారు.

on 7 March
user_Raghu
Raghu
మిర్యాలగూడ, నల్గొండ, తెలంగాణ•
on 7 March
e64db550-0fb1-40ef-bc32-91a2418854a3

ఈనెల 9 నుండి జాతీయస్థాయి పద్య నాటక,సాంఘిక నాటిక పోటీలు మిర్యాలగూడ, మార్చి 7: తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ, ఎఫ్.డి.సి. మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి పద్య నాటక, సాంఘిక నాటిక పోటీలు, నృత్యోత్సవాలను మిర్యాలగూడ పట్టణంలోని వేదిక కళాభారతి మినీ రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఈనెల 9వ తేదీ (సోమవారం) నుంచి ఈనెల 15వ తేదీ (ఆదివారం) వరకు నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షులు టి రామచంద్రరావు, అధ్యక్షులు పి రామావతారం, ప్రధాన కార్యదర్శి పి కృష్ణమూర్తి, కోశాధికారి పి వెంకటలక్ష్మి నారాయణ శర్మలు తెలిపారు. ప్రేక్షకులు వేలాది సంఖ్యలో పాల్గొని నాటక, నాటిక పోటీలు జయప్రదం చేయాలని వారు కోరారు.

More news from తెలంగాణ and nearby areas
  • ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ఘటనలో గాయపడ్డ బాలుడిని హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, బీఆర్ఎస్ నాయకురాలు బడే నాగజ్యోతి పరామర్శించారు. ఈ సందర్భంగా ఘటనకు మంత్రులు బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. బాలుడి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
    1
    ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ఘటనలో గాయపడ్డ బాలుడిని హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, బీఆర్ఎస్ నాయకురాలు బడే నాగజ్యోతి పరామర్శించారు. ఈ సందర్భంగా ఘటనకు మంత్రులు బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. బాలుడి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    6 hrs ago
  • *వరంగల్ జిల్లా ,నర్సంపేట పట్టణంలో గల ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుపేద కుటుంబాలకి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ పరీక్షలకు చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడంతో వారు జనతా ట్రస్ట్ సభ్యులకు తెలియజేయగా,ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి ,వారి కోరిక మేరకు వారికి అవసరమైన సదుపాయాలను టేబుల్స్,ఛైర్స్ మరియు వాటర్ డిస్పెన్సర్ లను అందించిన జనతా ట్రస్ట్ చైర్మన్ డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ,మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్ ,నకిరెడ్డి మహేందర్ ,ఐనవోలు శివరాం ఈ సందర్భంగా *రాణా ప్రతాప్ రెడ్డి * మాట్లాడుతూ…నర్సంపేట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎలాంటి సదుపాయాలు కావాలన్నా జనతా ట్రస్ట్ తప్పకుండా ఆ విద్యార్థులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు…
    2
    *వరంగల్ జిల్లా ,నర్సంపేట పట్టణంలో గల ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుపేద కుటుంబాలకి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ పరీక్షలకు చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడంతో వారు జనతా ట్రస్ట్ సభ్యులకు తెలియజేయగా,ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి ,వారి కోరిక మేరకు వారికి అవసరమైన సదుపాయాలను టేబుల్స్,ఛైర్స్ మరియు వాటర్ డిస్పెన్సర్ లను అందించిన జనతా ట్రస్ట్ చైర్మన్ డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ,మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్ ,నకిరెడ్డి మహేందర్ ,ఐనవోలు శివరాం 
ఈ సందర్భంగా *రాణా ప్రతాప్ రెడ్డి * మాట్లాడుతూ…నర్సంపేట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎలాంటి సదుపాయాలు కావాలన్నా జనతా ట్రస్ట్ తప్పకుండా ఆ విద్యార్థులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు…
    user_Srinivas goud Reporter
    Srinivas goud Reporter
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నర్సంపేట మండలానికి చెందిన యువ నాయకుడు, మహబూబాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన సుమారు 500 మంది అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో ఘనంగా చేరారు. ఈ కార్యక్రమం నర్సంపేట సెగ్మెంట్ పరిధిలోని ఆరు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా యువత, మహిళలు సమిష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారిని నిలబెట్టాలని ఆకాంక్షించారు. యువత ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నర్సంపేట సెగ్మెంట్‌లో ఉన్న సమస్యలపై తెలంగాణ జాగృతి ద్వారా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆరు జిల్లాల నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, అధికార ప్రతినిధి శ్రీకాంత్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి, అనిల్ నాయక్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    1
    నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నర్సంపేట మండలానికి చెందిన యువ నాయకుడు, మహబూబాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన సుమారు 500 మంది అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో ఘనంగా చేరారు. ఈ కార్యక్రమం నర్సంపేట సెగ్మెంట్ పరిధిలోని ఆరు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా యువత, మహిళలు సమిష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారిని నిలబెట్టాలని ఆకాంక్షించారు. యువత ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నర్సంపేట సెగ్మెంట్‌లో ఉన్న సమస్యలపై తెలంగాణ జాగృతి ద్వారా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆరు జిల్లాల నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, అధికార ప్రతినిధి శ్రీకాంత్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి, అనిల్ నాయక్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
  • తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా దొడ్డి కొమరయ్య చిత్రపటానికి జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని విజయలక్ష్మి, బీసీ సంఘం నాయకులు పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత మహనీయులను గౌరవించుకుంటున్నామని, అందులో భాగంగా దొడ్డి కొమరయ్య జయంతిని అధికారికంగా జరుపుకుంటున్నామని అన్నారు. అమరుల ఆశయ సాధనకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకుందామన్నారు.
    4
    తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా దొడ్డి కొమరయ్య చిత్రపటానికి జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని విజయలక్ష్మి, బీసీ సంఘం నాయకులు పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత మహనీయులను గౌరవించుకుంటున్నామని, అందులో భాగంగా దొడ్డి కొమరయ్య జయంతిని అధికారికంగా జరుపుకుంటున్నామని అన్నారు. అమరుల ఆశయ సాధనకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకుందామన్నారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    22 hrs ago
  • సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిమ్మి రెడ్డి, నెంటూరి కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఉప సర్పంచ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ పాండవుల బాలరాజ్ ముదిరాజ్, మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో చైతన్యం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, వెంకట్ ముదిరాజ్, భాస్కర్ యాదవ్, హరీష్ గౌడ్, పెద్దోళ్ళ బాలయ్య, ఏముల రాములు, పొట్ట మల్లేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దాసరి వెంకటేష్, చిత్ర ఆర్ట్స్ నర్సింలు. పొట్ట రాజు చేబర్తి వెంకటేష్ పొట్ట కరుణాకర్ పాపయ్య, తిమ్మకపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.అలాగే శ్రీగిరిపల్లి గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
    4
    సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిమ్మి రెడ్డి, నెంటూరి కుమార్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమం ఉప సర్పంచ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ పాండవుల బాలరాజ్ ముదిరాజ్, మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో చైతన్యం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, వెంకట్ ముదిరాజ్, భాస్కర్ యాదవ్, హరీష్ గౌడ్, పెద్దోళ్ళ బాలయ్య, ఏముల రాములు, పొట్ట మల్లేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దాసరి వెంకటేష్, చిత్ర ఆర్ట్స్ నర్సింలు. పొట్ట రాజు చేబర్తి వెంకటేష్ పొట్ట కరుణాకర్ పాపయ్య, తిమ్మకపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.అలాగే శ్రీగిరిపల్లి గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    19 hrs ago
  • ఈ ఎస్ఐ రాకపోతే నాలుగు ప్రాణాలు బలైపోయాయి. అప్పులపాలై ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నం చేసిన సంఘటన పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది. మాచర్ల నియోజకవర్గం దుర్గికి చెందిన అమర్నాథ్ అప్పుల పాలయ్యాడు. అప్పు ఇచ్చినవాళ్లు ఒత్తిడి తేవడంతో కుటుంబంతో సహా చనిపోవాలి అనుకున్నాడు. భార్య, కుమారుడు కుమార్తెను కారులో ఎక్కించుకోని బయలు దేరాడు. ఈ విషయం భార్య తన పుట్టిండి వారికి మెసేజ్ పంపించింది. వారు పోలీసులను ఆశ్రయించగా రూరల్ ఎస్సై కిషోర్ చాకచక్యంగా పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. చూశారుగా అప్పు ఎంత ముప్పుకు దారితీస్తుందో. తస్మాత్ జాగ్రత్త..
    1
    ఈ ఎస్ఐ రాకపోతే నాలుగు ప్రాణాలు బలైపోయాయి. అప్పులపాలై ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నం చేసిన సంఘటన పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది. మాచర్ల నియోజకవర్గం దుర్గికి చెందిన అమర్నాథ్ అప్పుల పాలయ్యాడు. అప్పు ఇచ్చినవాళ్లు ఒత్తిడి తేవడంతో కుటుంబంతో సహా చనిపోవాలి అనుకున్నాడు. భార్య, కుమారుడు కుమార్తెను కారులో ఎక్కించుకోని బయలు దేరాడు. ఈ విషయం భార్య తన పుట్టిండి వారికి మెసేజ్ పంపించింది. వారు పోలీసులను ఆశ్రయించగా రూరల్ ఎస్సై కిషోర్ చాకచక్యంగా పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. చూశారుగా అప్పు ఎంత ముప్పుకు దారితీస్తుందో. తస్మాత్ జాగ్రత్త..
    user_Narasimha Rao Senior Journalist Damala
    Narasimha Rao Senior Journalist Damala
    నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    53 min ago
  • జనగాం జిల్లా: జనగామ మండలం మరిగడిలో TG-BNRKS జిల్లా 2వ మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. సంఘం నాయకులు తాండ్ర రామన్న, గణిపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈనెల 7న జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మికులందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలపై సభలో విస్తృతంగా చర్చించనున్నట్లు వెల్లడించారు.
    1
    జనగాం జిల్లా: జనగామ మండలం మరిగడిలో TG-BNRKS జిల్లా 2వ మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. సంఘం నాయకులు తాండ్ర రామన్న, గణిపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈనెల 7న జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మికులందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలపై సభలో విస్తృతంగా చర్చించనున్నట్లు వెల్లడించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.