పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ C.C లు రిసోర్స్ పర్సన్స్ & సచివాలయ సిబ్బందికి శిక్షణ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మరియు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ గవర్నెనెన్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పాలకొండ మునిసిపాలిటీ పరిధిలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (MEPMA) రిసోర్స్ పర్సన్స్, పర్యావరణ కార్యదర్శులు, ప్రజారోగ్య కార్యదర్శులు, మేస్త్రీలు మరియు వివిధ విభాగాలకు చెందిన సచివాలయ సిబ్బందికి పాలకొండ పురపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో ఒక్కరోజు పూర్తిస్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మల్లీశ్వరి గారు, మున్సిపల్ కమిషనర్ శ్రీ రత్న రాజు గారు, మెప్మ డి పి కృష్ణా రావు గారు మరియు పాలకొండ మునిపాలిటీ శానిటేషన్, వెల్ఫేర్, యమినిటీస్ కార్యదర్శులు మరియు మెప్మా, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.ఈ శిక్షణా కార్యక్రమంలో ఘన వ్యర్థాల నిర్వహణ, మూలంలోనే వ్యర్థాల వేర్పాటు (Source Segregation), డోర్-టు-డోర్ వ్యర్థాల సేకరణ, ప్లాస్టిక్ నిర్మూలన, ప్రజల భాగస్వామ్యం, శుభ్రత ప్రమాణాలు మరియు ముఖ్యంగా Swachh Survekshanలో పాలకొండ నగర ర్యాంకింగ్ మెరుగుపరచడం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాలకొండ మునిసిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మల్లీశ్వరి గారు మాట్లాడుతూ, Swachh Survekshan కేవలం ర్యాంకుల పోటీ మాత్రమే కాకుండా,పట్టణ పరిశుభ్రత, ప్రజారోగ్యం మరియు పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచే సమగ్ర కార్యక్రమమని తెలిపారు. ప్రతి కార్యదర్శి, రిసోర్స్ పర్సన్ తమ పరిధిలో చేపట్టే ప్రతి కార్యాచరణ Swachh Survekshan స్కోరింగ్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. వ్యర్థాల వేర్పాటు, డోర్-టు-డోర్ సేకరణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, ఫీల్డ్ స్థాయి అమలు, సరైన డాక్యుమెంటేషన్ మరియు ప్రజల చైతన్యం వంటి అంశాలను ప్రాధాన్యతతో అమలు చేయాలని సూచించారు. సమష్టి కృషితో Swachh Survekshan లో ఉత్తమ ర్యాంకింగ్ సాధించాల్సిన బాధ్యత అందరిదేనని కమిషనర్ గారు తెలిపారు.ఈ శిక్షణా తరగతులకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నాలెడ్జ్ పార్టనర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ నుండి శిక్షకులుగా వెంకటేశ్వర్ రావు మరియు తిరుపతి రావు గారు శిక్షణను ప్రారంభించిన ప్రతి ఉద్యోగి తమ సామర్థ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ, ఉత్తమ ఆచరణలను (Best Practices) అనుసరించి విధుల్లో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు Swachh Bharat లక్ష్యాల సాధనకు, అలాగే Swachh Survekshan లో మెరుగైన ర్యాంకింగ్ సాధించేందుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ బి. గణపతిమ్మ గారు, AIILSG విజయవాడ టీం అజారుద్దీన్, సుధీర్ మరియు నవీన్ పాల్గొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని విజయవాడ నుండి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి, ఆర్డిఎంఏ, సిడియమ్యె అధికారులు యూట్యూబ్ లైవ్ ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ చేసి, Swachh Bharat – Swachh Andhra – Swachh పాలకొండ లక్ష్య సాధనకు అవసరమైన దిశా నిర్దేశం చేశారు

- Post by APPARAO KONCHADA1
- చక్ర తీర్థ స్నానాలకు నాలుగంచెల భద్రత ఎల్.ఎన్.పేట మండలం మిరియపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో బుధవారం జరగనున్న శ్రీముఖలింగేశ్వర స్వామి వారి చక్ర తీర్థ స్నానాలకు నాలుగెంచల భద్రతను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్.ఎన్.పేట మండలం వైపు నుండి వాహనాలలో వచ్చే భక్తులకు మిరియప్పల్లి, వాడవలస గ్రామాల సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం నుండి చక్ర తీర్థ స్నానమాచరించేందుకు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరనున్నారు.1
- సంతబొమ్మాళి ఫిబ్రవరి 17, జాతీయ నులిపురుగులు నివారణ దినోత్సవం సందర్భంగా నౌపడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యులు ఓ పరిమళ నిర్వహణలో నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహంతి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో 250 విద్యార్థులకు, గ్రామంలో ఉన్న నాలుగు అంగన్వాడీ కేంద్రాల్లో 108 మంది చిన్నారులకు, నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల శ్రీ సత్య సాయి విద్యానికేతన్ చిన్నారులకు వారిని మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితర బృందం పాల్గొన్నారు.4
- పేదరికం ఉన్నత చదువులకు అడ్డు రాకూడదని బిజెపి నాయకులు పోకతోట సింహాచలం అన్నారు. శ్రీకాకుళంలోని మంగు తోట దరిలో నివాసముంటున్న సరంతి జయలక్ష్మి వైద్య విద్యకు వారి ఇంటికి వెళ్లి మంగళవారం ఆయన ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయలక్ష్మి బాగా చదువుతుందని రాబోయే కాలంలో కూడా తను వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.1
- కూనవరం మండలం వెంకటయపాలెం గ్రామ సచివాలయం ఎదుట ఓ మహిళ మంగళవారం నిరసన చేపట్టారు. అక్కడే పని చేస్తున్నా సచివాలయం ఉద్యోగి నరేష్ తనను ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. గత 5 ఏళ్లుగా ప్రేమ కోసాగిందని, ఇప్పుడు పెళ్లి మాట ఎత్తితే ముఖం చాటిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు.1
- జీకే వీధి మండలం కడుగుల గ్రామానికి చెందిన గర్భిణీ కళ్యాణి కడుపులోనే శిశువు మృతి చెందింది. చింతపల్లి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు ఆరోపించారు. చివరి నిమిషం వరకు ఉంచుకుని నర్సీపట్నం రిఫర్ చేశారని, అప్పటికే ఉమ్మనీరు పోయి బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం గ్రామంలో నిరసన చేపట్టారు.1
- అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలు మండలం ఎం.ఆర్.పురం గ్రామానికి చెందిన ఆదివాసులు తమకు గతంలో ఇచ్చిన భూమి పట్టాలపై రీ–సర్వే నిర్వహించాలని అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం భూసరిహద్దులు స్పష్టంగా లేకపోవడం, రికార్డుల్లో తేడాలు ఉండటం వల్ల సాగు చేసుకునే భూములపై అనిశ్చితి నెలకొన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీ–సర్వే ద్వారా అసలు హక్కుదారులకు న్యాయం జరిగి, భూముల పరిమాణం మరియు సరిహద్దులు ఖచ్చితంగా నిర్ణయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు ఐటిడిఎ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదివాసులు విజ్ఞప్తి చేశారు.1
- Post by APPARAO KONCHADA1