అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ.. మానవ అక్రమ రవాణా నిరోధానికి ప్రతిజ్ఞ ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మం ఐడీఓసీ ప్రగతి మీటింగ్ హాల్‌తో పాటు మహిళా ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఇంద్రానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మంచుకొండ జెడ్పీ హైస్కూల్‌లలో విద్యార్థులు, ప్రజలకు మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించారు. ఉద్యోగాలు, విదేశీ అవకాశాలు, వివాహాలు, విద్య పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. "Trapped Behind the Scam" థీమ్‌కు అనుగుణంగా ఆన్‌లైన్ మోసాలు, నకిలీ ఉద్యోగ ప్రకటనలు, సోషల్ మీడియా మోసాలను నమ్మవద్దని హెచ్చరించారు. మహిళా హెల్ప్‌లైన్ 181, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, అత్యవసర సేవలు 112, సఖి సేవల గురించి వివరించి, అవసరమైన సమయంలో వాటిని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి, మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు అప్రమత్తంగా ఉంటామని అధికారులు, విద్యార్థులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు, చైల్డ్‌లైన్, సఖి, భరోసా కేంద్రం, షీ టీమ్స్, ప్రజ్వలా ఎన్జీఓ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ.. మానవ అక్రమ రవాణా నిరోధానికి ప్రతిజ్ఞ ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మం ఐడీఓసీ ప్రగతి మీటింగ్ హాల్‌తో పాటు మహిళా ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఇంద్రానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మంచుకొండ జెడ్పీ హైస్కూల్‌లలో
విద్యార్థులు, ప్రజలకు మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించారు. ఉద్యోగాలు, విదేశీ అవకాశాలు, వివాహాలు, విద్య పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. "Trapped Behind the Scam" థీమ్‌కు అనుగుణంగా ఆన్‌లైన్ మోసాలు, నకిలీ ఉద్యోగ ప్రకటనలు, సోషల్ మీడియా మోసాలను నమ్మవద్దని హెచ్చరించారు. మహిళా హెల్ప్‌లైన్ 181, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, అత్యవసర సేవలు 112,
సఖి సేవల గురించి వివరించి, అవసరమైన సమయంలో వాటిని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి, మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు అప్రమత్తంగా ఉంటామని అధికారులు, విద్యార్థులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు, చైల్డ్‌లైన్, సఖి, భరోసా కేంద్రం, షీ టీమ్స్, ప్రజ్వలా ఎన్జీఓ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- జాతీయ రహదారి విస్తరణ పనుల అడ్డుకట్ట: అధికారుల హామీతో విరమణ ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రం నుండి జాతీయ రహదారి వరకు అధికారులు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ విస్తరణ వల్ల తాము ఏళ్ల తరబడి నివాసముంటున్న ఇళ్లను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, పనులు జరుగుతున్న రహదారిపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు నిరసనను విరమించారు.1
- పాతర్లపాడు కూలిన కల్వర్టు తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం మండలంలోని పాతర్లపాడు కూలిన కల్వర్టు తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు. దీనితో రెండు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగిపోయాయి. గ్రామస్థులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.1
- అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి *వీందో డ్రామా... వాందో డ్రామా😤* అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥* దొంగ ర్యాంకుల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది చేతకాని రేవంత్ రెడ్డి కాదు,దోపిడిదారి కేసీఆర్ కాదు.....దమ్మున్న తీన్మార్ మల్లన్న....ఒక్కొకడికి ఇక తీన్మారే ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది....1
- పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు... పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన .. ఇల్లందు పట్టణంలో గత ఐదు దశాబ్దాలుగా వినియోగించుకున్న పాత కూరగాయల మార్కెట్ ప్రాంగణంలోని కొన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో కూల్చివేతలను ప్రారంభించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం పట్ల కొందరు చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయగా వారికి పలురాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలుపార్టీల నాయకులు మాట్లాడుతూ ఆక్రమణలు ఏమైనా ఉంటే వ్యాపారులకు నోటీసులు అందజేసి తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని కానీ ఇల్లందు పట్టణంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ కేవలం కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపార నిర్మాణాలను తొలగించడం సరికాదన్నారు. కూల్చివేతలను నిరసిస్తూ రోడ్డుపై బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలతో కలసి కార్యాచరణ రూపొందిస్తామని వెంటనే ఆక్రమణల పేరుతో చిరువ్యాపారులను ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేశారు.. కూరగాయల వ్యాపారుల రాజకీయ నాయకుల నిరసనలతో కూల్చివేత పనులను మున్సిపల్ సిబ్బంది నిలిపివేశారు1
- మహబూబాబాద్ లోని 22వ వార్డ్ లో రోడ్లు వేయాలని సిపిఐ వినూత్న నిరసన.. మహబూబాబాద్‌లోని 22వ వార్డులో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో కాలనీలో వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని సీపీఐ శ్రేణులు కోరారు.1
- జనసంద్రంగా మారిన నల్లబెల్లి పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు జనసంద్రంగా మారిన నల్లబెల్లి పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.1
- కే సముద్రం కల్వల గ్రామ శివారు గాంధీ నగర్ లో విషాదం. బావిలో పడి మహిళా అనుమానాస్పద మృతి మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా కేసముద్రము మండలం కల్వల గ్రామ శివారు గాంధీనగర్ లో విషాదం . ఉదయాన్నే పత్తిచేను కలుపు తీసిన మహిళ బానోత్ వెన్నెల (22)బావిలో పడి అనుమానస్పద మృతి . కాలుజారి బావిలో పడింద లేదా ఎవరైనా కావాలనే హత్య చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్న పోలిసులు ..... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....3