*విఆర్ హై స్కూల్ పై వైఎస్సార్సీపీ విమర్శలను తిప్పికొట్టిన- డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్* * ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నాడు. * మంత్రి నారాయణ కు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నారు. * నిరుపేద పిల్లల బంగారు భవిష్యత్తుకోసం 20 కోట్ల సీఎస్ఆర్ నిధులతో వీఆర్సీ ని అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేసారు. * ఏడాది కాలంగా దాని నిర్వహణ కోసం మంత్రి కుటుంబం రెండున్నర కోట్లు ఖర్చు చేసింది. * పిల్లలకు అవసరమైన సదుపాయాలను మంత్రి కూతురు షరణి ఎప్పటికప్పుడు సమకూరుస్తున్నారు. * కార్పొరేషన్ పరిధిలోని పేద విధ్యార్థులకోసం మంత్రి కుటుంబం 10 వేల సైకిళ్ళు సిద్ధం చేస్తోంది. * ఉచితంగా పంపిణీ చేయనున్నారు. * సేవా గుణంలో ముందున్న మంత్రి నారాయణపై అసత్య ఆరోపణలు చేయటం సిగ్గు చేటు. * విద్యాసంస్థల ద్వారా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కోట్లు సంపాదించాడు. * ఆయన వొంతుగా మంత్రితో సేవలో పోటీ పడితే బాగుంటుంది. * రాజకీయాన్ని రాజకీయంగా చేయండి. * ప్లాంటేషన్ పాలిట్రిక్స్ ఇప్పటికైనా మానండి. * మొక్కే కదా అని మీరు పీకేస్తే చూస్తూ ఊరుకోవాలా. * అభివృద్ధి నిరోధకులపై కేసులు పెడితే తప్పా. * ప్లాంటేషన్ కి సంబంధించి ఏ వివరాలు కావాలన్నా పక్కాగా ఇస్తాము. * చంద్రశేఖర్ రెడ్డి నీ తీరు మార్చుకోక పోతే రాజకీయంగా తీవ్రంగా నష్టపోక తప్పదు.
*విఆర్ హై స్కూల్ పై వైఎస్సార్సీపీ విమర్శలను తిప్పికొట్టిన- డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్* * ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నాడు. * మంత్రి నారాయణ కు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నారు. * నిరుపేద పిల్లల బంగారు భవిష్యత్తుకోసం 20 కోట్ల సీఎస్ఆర్ నిధులతో వీఆర్సీ ని అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేసారు. * ఏడాది కాలంగా దాని నిర్వహణ కోసం మంత్రి కుటుంబం రెండున్నర కోట్లు ఖర్చు చేసింది. * పిల్లలకు అవసరమైన సదుపాయాలను మంత్రి కూతురు షరణి ఎప్పటికప్పుడు సమకూరుస్తున్నారు. * కార్పొరేషన్ పరిధిలోని పేద విధ్యార్థులకోసం మంత్రి కుటుంబం 10 వేల సైకిళ్ళు సిద్ధం చేస్తోంది. * ఉచితంగా పంపిణీ చేయనున్నారు. * సేవా గుణంలో ముందున్న మంత్రి నారాయణపై అసత్య ఆరోపణలు చేయటం సిగ్గు చేటు. * విద్యాసంస్థల ద్వారా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కోట్లు సంపాదించాడు. * ఆయన వొంతుగా మంత్రితో సేవలో పోటీ పడితే బాగుంటుంది. * రాజకీయాన్ని రాజకీయంగా చేయండి. * ప్లాంటేషన్ పాలిట్రిక్స్ ఇప్పటికైనా మానండి. * మొక్కే కదా అని మీరు పీకేస్తే చూస్తూ ఊరుకోవాలా. * అభివృద్ధి నిరోధకులపై కేసులు పెడితే తప్పా. * ప్లాంటేషన్ కి సంబంధించి ఏ వివరాలు కావాలన్నా పక్కాగా ఇస్తాము. * చంద్రశేఖర్ రెడ్డి నీ తీరు మార్చుకోక పోతే రాజకీయంగా తీవ్రంగా నష్టపోక తప్పదు.
- కోవూరు అన్న క్యాంటీన్ లో ఘనంగా సిఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు - ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలన్న సిఎం చంద్రబాబు నాయుడులక్ష్యం. - చంద్రన్న జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్ల పేదలు ఒక రోజు ఉచితంగా భోజనం చేసేందుకై నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. - నాయకులు అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూల మాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా ఇవ్వండి. - విడవలూరు మండలంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రారంభించిన విపిఆర్ నేత్ర బస్సు మరియు బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ సిఎం చంద్రబాబు జన్మదిన కానుకగా అందిస్తున్నాం. - కోవూరు అన్నా క్యాంటీన్‌లో సామాన్యులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా అన్న క్యాంటీన్లో భోజనం చేసే పేదల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఆయన సతీమణినారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు అన్న క్యాంటీన్ లో సిఎం చంద్రబాబు నాయుడు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేసారు. అనంతరం అన్నా క్యాంటీన్లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడమే పరమావధిగా భావించే నాయకుడు చంద్రబాబు ఆలోచనల నుంచి పుట్టిన అన్నా క్యాంటీన్లు నేడు లక్షలాది మందికి ఆకలి తీరుస్తున్నాయని కొనియాడారు. అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూలమాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా యివ్వాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నాయకులకు హితోపదేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన కానుకగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విడవలూరు మండలంలో ఈరోజు ప్రారంభించిన విపిఆర్ నేత్ర గురించి ప్రస్తావించారు. అలాగే బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో సిఎం చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ కూడా జన్మదిన కానుకగా అందివ్వనున్నట్టు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల తెలుగుదేశం ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.4
- *కడప జిల్లా :* వీరబల్లి మండలంలో ఉద్రిక్తత... సంగంవాండ్లపల్లి వద్ద వీరబల్లి-రాయచోటి రహదారి పై బైఠాయించిన సంగంవాండ్లపల్లి, పెద్దివీడు గ్రామాల ప్రజలు... నిలిచిపోయిన రాకపోకలు... ఆక్రమణకు గురైన తిమ్మారెడ్డి చెరువును కబ్జాదారుల నుంచి కాపాడాలి అంటూ నినాదాలు... కబ్జాదారులకు వీరబల్లి రెవిన్యూ అధికారులు సహకరిస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపణ...1
- Post by T. Raja simha1
- బద్వేలు:సరస్వతి శిశు మందిరంలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అంకితభావంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ఈ వేదికపై ఘనంగా సన్మానం జరిగింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానంతో పాటు, విద్యా విలువలను చాటిచెప్పే పలు కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. క్రమశిక్షణ, విద్య మరియు సంస్కృతుల కలయికగా సాగిన ఈ ఉత్సవం అందరినీ అలరించింది. ఈ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న పలువురికి సరస్వతి శిశు మందిరం కమిటీ సభ్యులు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు, అనంతరం శిశు మందిరం వార్షికోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులతో పాటు కమిటీ సభ్యులు పలువురు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు2
- చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్ర అభివృద్ధి : పతిరాజు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాదిరాజు లక్ష్మణ పతి రాజు అన్నారు సోమవారం ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను స్థానిక బస్టాండ్ నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ నందు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ మేరకు ఆయన ప్రసంగిస్తూ ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితిలో కూటమి ప్రభుత్వ రథసారథి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ అదేవిధంగా ప్రకటించనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువయ్యారన్నారు నవీన రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు అనంతరం అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హరీ రాయల్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల రామచంద్రయ్య వేలూరు సుబ్రహ్మణ్యం కార్తీక్ మురళి విద్యాసాగర్ బోయకొండ పవన్ రామకృష్ణ శివప్ప పునీత్ రాజు కుంచి నరేష్ బోయకొండ గణేష్ తదితరులు పాల్గొన్నారు3
- చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలన్నదే లక్ష్యం అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం కరివేన చెరువు పంట కాలువ వద్ద " జలధార " కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో కలిసి పంట కాలువలో పూడికతీత, సాగునీటి కాలువలను శుభ్రం చేశారు.భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చేయాలన్నదే జలధార ధ్యేయం అన్నారు.చెరువుల పునరుద్ధరణతో వర్షపునీటిని వడిసిపట్టి రైతులకు అందిస్తామన్నారు.1
- స్వల్పకాల వ్యవధిలోనే తక్కువ పెట్టుబడితో బంతిపూల సాగులో అధిక దిగుబడి సాధించవచ్చని వీపనగండ్లలో బంతిపూలు సాగు చేసిన రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర పంటలతో పోలిస్తే బంతిపూల సాగుకు ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి వస్తుందన్నారు. పంట దిగుబడిలో సరైన చర్యలు తీసుకుంటే ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు లాభాలు ఆర్జించవచ్చని పేర్కొంటున్నారు.1
- అమరావతి నిర్మాత, అభివృద్ధి ప్రదాత, విజనరీ లీడర్ ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం రామచంద్రపురం పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 40 అడుగుల భారీ కటౌట్‌కు మత్స్యకారులు పాలాభిషేకం చేశారు. డ్రోన్ సహాయంతో కటౌట్‌పై పుష్ఫాభిషేకం నిర్వహించారు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం నినాదాలతో లక్ష్మీపురం గ్రామం దద్ధరిల్లింది. చంద్రబాబు నాయుడు అంటే కేవలం పేరు కాదని, అదొక అభివృద్ధి బ్రాండ్ అని నినదించారు. ఈ సందర్భంగా ఆయన అందిస్తున్న సుపరిపాలనను కొనియాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధికి ఆటంకం కలగకుండా చంద్రబాబు నాయుడు పాలన అందిస్తున్నారని అన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేస్తూ గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్న నవ్యాంధ్ర నిర్మాతకు ప్రజలందరూ అండగా నిలవాలని వారు ఆకాంక్షించారు.4