logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జమ్మికుంట మున్సిపాలిటీలో వైకుంఠ రథం పేరుతో జరుగుతున్న వసూళ్లపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒక కుటుంబంలో మరణం సంభవించి తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో, అంతిమయాత్ర కోసం ఉపయోగించే వైకుంఠ రథానికి రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వసూళ్లు అధికారిక రసీదులతో జరుగుతున్నాయా, మున్సిపాలిటీ ఖాతాల్లో జమ అవుతున్నాయా, లేక ప్రజల దుఃఖాన్ని అవకాశంగా మార్చుకొని కొందరు వ్యక్తులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజల పన్నుల డబ్బుతో కొనుగోలు చేసిన లేదా ప్రజా సేవ కోసం ఏర్పాటు చేసిన వైకుంఠ రథాలు సేవ కోసమా, ఆదాయం కోసమా అని ప్రజలు నిలదీస్తున్నారు. మనిషి చనిపోతే "శివైక్యం పొందాడు" అని గౌరవించే సంస్కృతిలో, అదే శవాన్ని ఆధారంగా చేసుకొని డబ్బులు వసూలు చేయడం మానవత్వానికే మచ్చ అని, బాధలో ఉన్న కుటుంబాల కన్నీళ్లపై సంపాదించే ప్రతి రూపాయి సమాజానికి సిగ్గుచేటు అని తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతోంది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు, విజిలెన్స్ శాఖ, అవినీతి నిరోధక శాఖ వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల నుండి ఒక్క రూపాయి వసూలు చేసినా, దానికి సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని, అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరణం వ్యాపారం కాదని, అంతిమయాత్ర ఆదాయ మార్గం కాదని, మానవత్వం ముందు డబ్బు చిన్నదని పేర్కొంటూ, శవాలపై వసూళ్లు ఆపి ప్రజా సేవలను ప్రజలకే అందించాలని జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ గారు ఉద్ఘాటించారు.

5 hrs ago
user_PUDHARI RENUKA GOUD
PUDHARI RENUKA GOUD
జమ్మికుంట, కరీంనగర్, తెలంగాణ•
5 hrs ago

జమ్మికుంట మున్సిపాలిటీలో వైకుంఠ రథం పేరుతో జరుగుతున్న వసూళ్లపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒక కుటుంబంలో మరణం సంభవించి తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో, అంతిమయాత్ర కోసం ఉపయోగించే వైకుంఠ రథానికి రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వసూళ్లు అధికారిక రసీదులతో జరుగుతున్నాయా, మున్సిపాలిటీ ఖాతాల్లో జమ అవుతున్నాయా, లేక ప్రజల దుఃఖాన్ని అవకాశంగా మార్చుకొని కొందరు వ్యక్తులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజల పన్నుల డబ్బుతో కొనుగోలు చేసిన లేదా ప్రజా సేవ కోసం ఏర్పాటు చేసిన వైకుంఠ రథాలు సేవ కోసమా, ఆదాయం కోసమా అని ప్రజలు నిలదీస్తున్నారు. మనిషి చనిపోతే "శివైక్యం పొందాడు" అని గౌరవించే సంస్కృతిలో, అదే శవాన్ని ఆధారంగా చేసుకొని డబ్బులు వసూలు చేయడం మానవత్వానికే మచ్చ అని, బాధలో ఉన్న కుటుంబాల కన్నీళ్లపై సంపాదించే ప్రతి రూపాయి సమాజానికి సిగ్గుచేటు అని తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతోంది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు, విజిలెన్స్ శాఖ, అవినీతి నిరోధక శాఖ వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల నుండి ఒక్క రూపాయి వసూలు చేసినా, దానికి సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని, అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరణం వ్యాపారం కాదని, అంతిమయాత్ర ఆదాయ మార్గం కాదని, మానవత్వం ముందు డబ్బు చిన్నదని పేర్కొంటూ, శవాలపై వసూళ్లు ఆపి ప్రజా సేవలను ప్రజలకే అందించాలని జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ గారు ఉద్ఘాటించారు.

More news from తెలంగాణ and nearby areas
  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కరీంనగర్ లో జనసేన కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు దిగారు. తెలంగాణ చౌక్ లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చిత్రపటాలను ప్రదర్శించి, చెప్పులతో కొట్టి, అనంతరం దహనం చేశారు. నాగేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే అరెస్ట్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు మానుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని జనసేన పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు.
    4
    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కరీంనగర్ లో జనసేన కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు దిగారు. తెలంగాణ చౌక్ లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చిత్రపటాలను ప్రదర్శించి, చెప్పులతో కొట్టి, అనంతరం దహనం చేశారు.

నాగేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే అరెస్ట్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు మానుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని జనసేన పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • ఒత్తిడి, ఆందోళనల కారణంగా తొమ్మిదేళ్ల అనుభవంతో కూడిన ఐటీ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసిన ఓ మహిళ, ప్రస్తుతం ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. లేడీ ఎంట్రప్రెన్యూయర్ మిథ్లాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న వివరాల ప్రకారం, ఆమె తన కెరీర్ మార్చుకోవడంపై ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె నెలకు రూ.60 వేల వరకు సంపాదిస్తూ, మానసిక ప్రశాంతతతో సాఫీగా జీవిస్తున్నట్లు తెలిపారు. పని ఒత్తిడి కంటే సంతోషమే ముఖ్యమని ఆమె నిరూపించారు.
    1
    ఒత్తిడి, ఆందోళనల కారణంగా తొమ్మిదేళ్ల అనుభవంతో కూడిన ఐటీ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసిన ఓ మహిళ, ప్రస్తుతం ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. లేడీ ఎంట్రప్రెన్యూయర్ మిథ్లాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న వివరాల ప్రకారం, ఆమె తన కెరీర్ మార్చుకోవడంపై ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె నెలకు రూ.60 వేల వరకు సంపాదిస్తూ, మానసిక ప్రశాంతతతో సాఫీగా జీవిస్తున్నట్లు తెలిపారు. పని ఒత్తిడి కంటే సంతోషమే ముఖ్యమని ఆమె నిరూపించారు.
    user_Reporter Gaddam Kiran
    Reporter Gaddam Kiran
    ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
    5 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి విద్యార్థులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ అయింది. సంబంధిత విద్యార్థులందరూ ఈ అలర్ట్‌ను ఒక్కసారి తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని సూచించారు.
    1
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి విద్యార్థులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ అయింది. సంబంధిత విద్యార్థులందరూ ఈ అలర్ట్‌ను ఒక్కసారి తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని సూచించారు.
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Warangal, Telangana•
    17 hrs ago
  • శనివారం మధ్యాహ్నం రాజస్థాన్ రాష్ట్రంలో భారీ ఇసుక తుఫాను (బవండర్) తీవ్ర బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా చురూ, బికనేర్, శ్రీగంగానగర్ జిల్లాలపై దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆకాశమంతటా దాదాపు కిలోమీటరు ఎత్తున దట్టమైన నలుపు, పసుపు రంగు ఇసుక మేఘాలు కమ్ముకోవడంతో, పగటిపూటే దట్టమైన చీకటి అలుముకుంది. సుమారు అరగంట పాటు వీధులన్నింటినీ చుట్టుముట్టేసిన ఈ తుఫాను జీరో విజిబిలిటీకి దారితీయగా, రహదారులపై వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనదారులు హెడ్‌లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన ఈదురు గాలుల వల్ల పలు ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు, రేకులు కొట్టుకుపోగా, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో రవాణా, విద్యుత్ వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తీవ్రమైన ఎండలు, హీట్‌వేవ్‌లతో అల్లాడుతున్న ప్రజలకు ఈ తుఫాను భయాందోళనలు కలిగించినప్పటికీ, దీని అనంతరం కురిసిన వర్షం కారణంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గాయి. ధోల్‌పూర్ పరిధిలోని బారిలో గరిష్టంగా 58 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. పశ్చిమ విక్షోభం (Western Disturbance) ప్రభావం వల్ల రాబోయే మరికొద్ది రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని జైపూర్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాజస్థాన్‌లోని జైపూర్, అజ్మీర్, కోట, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్ డివిజన్లలో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు, వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు స్పష్టం చేశారు.
    1
    శనివారం మధ్యాహ్నం రాజస్థాన్ రాష్ట్రంలో భారీ ఇసుక తుఫాను (బవండర్) తీవ్ర బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా చురూ, బికనేర్, శ్రీగంగానగర్ జిల్లాలపై దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆకాశమంతటా దాదాపు కిలోమీటరు ఎత్తున దట్టమైన నలుపు, పసుపు రంగు ఇసుక మేఘాలు కమ్ముకోవడంతో, పగటిపూటే దట్టమైన చీకటి అలుముకుంది. సుమారు అరగంట పాటు వీధులన్నింటినీ చుట్టుముట్టేసిన ఈ తుఫాను జీరో విజిబిలిటీకి దారితీయగా, రహదారులపై వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనదారులు హెడ్‌లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది.

గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన ఈదురు గాలుల వల్ల పలు ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు, రేకులు కొట్టుకుపోగా, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో రవాణా, విద్యుత్ వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తీవ్రమైన ఎండలు, హీట్‌వేవ్‌లతో అల్లాడుతున్న ప్రజలకు ఈ తుఫాను భయాందోళనలు కలిగించినప్పటికీ, దీని అనంతరం కురిసిన వర్షం కారణంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గాయి. ధోల్‌పూర్ పరిధిలోని బారిలో గరిష్టంగా 58 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.

పశ్చిమ విక్షోభం (Western Disturbance) ప్రభావం వల్ల రాబోయే మరికొద్ది రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని జైపూర్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాజస్థాన్‌లోని జైపూర్, అజ్మీర్, కోట, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్ డివిజన్లలో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు, వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు స్పష్టం చేశారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    19 hrs ago
  • ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్సీబీ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో కొందరు యువకులు బైక్ ర్యాలీలతో పెద్ద హంగామా సృష్టించారు. నగరంలోని ప్రధాన బస్టాండ్ మార్గంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ట్రాఫిక్‌లో ఆగి ఉన్న ఒక లారీపైకి ఎక్కి, ఏకంగా దాని అద్దంపై నిలబడి విన్యాసాలు చేయడం స్థానికులను తీవ్ర విస్మయానికి గురిచేసింది. ఈ నిర్లక్ష్యపు సంబరాలపై వాహనదారులు, స్థానికులు స్పందిస్తూ, గెలుపు సంబరాలు ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలుకుతున్నారు.
    1
    ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్సీబీ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో కొందరు యువకులు బైక్ ర్యాలీలతో పెద్ద హంగామా సృష్టించారు. నగరంలోని ప్రధాన బస్టాండ్ మార్గంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ట్రాఫిక్‌లో ఆగి ఉన్న ఒక లారీపైకి ఎక్కి, ఏకంగా దాని అద్దంపై నిలబడి విన్యాసాలు చేయడం స్థానికులను తీవ్ర విస్మయానికి గురిచేసింది. ఈ నిర్లక్ష్యపు సంబరాలపై వాహనదారులు, స్థానికులు స్పందిస్తూ, గెలుపు సంబరాలు ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలుకుతున్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    5 hrs ago
  • ఆదివారం సెలవు దినం మరియు గిరి ప్రదక్షిణ పురస్కరించుకుని కొండగట్టులోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు క్షేత్రపాలకుడైన శ్రీ బేతలస్వామి వారిని కూడా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుమారు 25 వేల మంది భక్తులు ఆలయానికి విచ్చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈఓ ఎస్. అంజనారెడ్డి భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమాల్లో ఏఈఓ హరిహర్నాథ్, సూపరింటెండెంట్లు చంద్రశేఖర్, సునీల్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు అశోక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
    1
    ఆదివారం సెలవు దినం మరియు గిరి ప్రదక్షిణ పురస్కరించుకుని కొండగట్టులోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు క్షేత్రపాలకుడైన శ్రీ బేతలస్వామి వారిని కూడా దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా సుమారు 25 వేల మంది భక్తులు ఆలయానికి విచ్చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈఓ ఎస్. అంజనారెడ్డి భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమాల్లో ఏఈఓ హరిహర్నాథ్, సూపరింటెండెంట్లు చంద్రశేఖర్, సునీల్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు అశోక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    11 hrs ago
  • కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రతి ఇంటి నుండి బోనం ఎత్తుకొని, డప్పు చప్పుళ్ల మధ్య, శివశక్తుల పూనకాలతో, బైండ్ల పూజారులతో కలిసి పోచమ్మ దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ భక్తులు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వరాల మల్లేశం మాట్లాడుతూ, వర్షాలు సమృద్ధిగా కురవాలని, అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ వేడుకలో మున్నూరు కాపు సంఘం సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు.
    1
    కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రతి ఇంటి నుండి బోనం ఎత్తుకొని, డప్పు చప్పుళ్ల మధ్య, శివశక్తుల పూనకాలతో, బైండ్ల పూజారులతో కలిసి పోచమ్మ దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ భక్తులు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వరాల మల్లేశం మాట్లాడుతూ, వర్షాలు సమృద్ధిగా కురవాలని, అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ వేడుకలో మున్నూరు కాపు సంఘం సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    15 hrs ago
  • కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో 41వ గిరిప్రదక్షిణ కన్నుల పండువలా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 45 వేల మంది భక్తులు పాల్గొని అపారమైన భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. గిరిప్రదక్షిణ, స్వామివారి దర్శనం కోసం తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయి, కొండగట్టు కిటకిటలాడింది. ఈ సందర్భంగా విడుదలైన భక్తి గీతం భక్తులలో మరింత ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. గిరిప్రదక్షిణకు నాయకత్వం వహిస్తున్న సురేష్ ఆత్మరాం మహారాజ్ మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా హిందూ ధర్మం మరియు భక్తి భావనలను పెంపొందించే లక్ష్యంతో ఈ గిరిప్రదక్షిణను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, రాబోయే పౌర్ణమి జూన్ 29న ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భక్తులు మట్టితో చిన్న ముద్దలను తయారు చేసి, వాటిలో వివిధ రకాల పండ్ల విత్తనాలు ఉంచి "స్వీట్ బాక్స్" రూపంలో సిద్ధం చేయాలని సూచించారు. వీటిని కొండగట్టు అటవీ ప్రాంతాలకు వెళ్లే దారిలో విత్తన బంతులుగా విసరాలని కోరారు. ఈ విత్తన బంతుల వల్ల భవిష్యత్తులో చెట్లు మొలకెత్తి పండ్లను కాస్తాయని, అవి హనుమంతుని వానర స్వరూపంగా భావించే కోతులకు ఆహారంగా ఉపయోగపడతాయని సురేష్ ఆత్మరాం మహారాజ్ వివరించారు. భక్తి, పర్యావరణ పరిరక్షణ, జీవజాల సంరక్షణ అనే మూడు లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కొండగట్టు గిరిప్రదక్షిణకు విశేష స్పందన లభించగా, వచ్చే పౌర్ణమి రోజున సీడ్ బాల్స్ వేయాలని నిర్ణయం తీసుకున్నారు.
    4
    కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో 41వ గిరిప్రదక్షిణ కన్నుల పండువలా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 45 వేల మంది భక్తులు పాల్గొని అపారమైన భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. గిరిప్రదక్షిణ, స్వామివారి దర్శనం కోసం తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయి, కొండగట్టు కిటకిటలాడింది.

ఈ సందర్భంగా విడుదలైన భక్తి గీతం భక్తులలో మరింత ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. గిరిప్రదక్షిణకు నాయకత్వం వహిస్తున్న సురేష్ ఆత్మరాం మహారాజ్ మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా హిందూ ధర్మం మరియు భక్తి భావనలను పెంపొందించే లక్ష్యంతో ఈ గిరిప్రదక్షిణను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా, రాబోయే పౌర్ణమి జూన్ 29న ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భక్తులు మట్టితో చిన్న ముద్దలను తయారు చేసి, వాటిలో వివిధ రకాల పండ్ల విత్తనాలు ఉంచి "స్వీట్ బాక్స్" రూపంలో సిద్ధం చేయాలని సూచించారు. వీటిని కొండగట్టు అటవీ ప్రాంతాలకు వెళ్లే దారిలో విత్తన బంతులుగా విసరాలని కోరారు.

ఈ విత్తన బంతుల వల్ల భవిష్యత్తులో చెట్లు మొలకెత్తి పండ్లను కాస్తాయని, అవి హనుమంతుని వానర స్వరూపంగా భావించే కోతులకు ఆహారంగా ఉపయోగపడతాయని సురేష్ ఆత్మరాం మహారాజ్ వివరించారు. భక్తి, పర్యావరణ పరిరక్షణ, జీవజాల సంరక్షణ అనే మూడు లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కొండగట్టు గిరిప్రదక్షిణకు విశేష స్పందన లభించగా, వచ్చే పౌర్ణమి రోజున సీడ్ బాల్స్ వేయాలని నిర్ణయం తీసుకున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.