పవన్ కళ్యాణ్ మార్క్ అభివృద్ధి: పిఠాపురంలో రూ.33 లక్షల పీఎం- అజయ్ చెక్కులు పంపిణీ పిఠాపురం: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. సేవే లక్ష్యం- ప్రజలే బలం అనే సిద్ధాంతంతో సామాజిక న్యాయమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గ రూపురేఖలను మారుస్తున్నారని ఆయన తెలిపారు. లబ్ధిదారులకు రూ. 33 లక్షల ఆర్థిక సాయం మంగళవారం ఉదయం పిఠాపురం పాడా కార్యాలయంలో సెర్ప్, డి ఆర్ డి ఎ ఆధ్వర్యంలో పీఎం- అజయ్ పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మరియు ఒదురి కిషోర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు, మొబైల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఠాపురం,గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి మండలాలకు చెందిన 27 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు మొత్తం సాయం రూ. 33 లక్షలు లబ్ధి పొందారని, ప్రభుత్వం తరఫున 50% రాయితీతో ఈ రుణాలను అందజేయడం జరిగిందని, సామాజికంగా వెనుకబడిన వర్గాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడం స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడమే పవన్ కళ్యాణ్ గారి ప్రధాన లక్ష్యం అని అన్నారు. ప్రతి ప్రభుత్వ పథకం అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా కట్టుబడి ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాడా పీడీ శివప్రసాద్,ఏపీడీ వసంత మాధవి,ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్ బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్య ప్రకాష్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకె జగదీష్,గొల్లప్రోలు పట్టణ అధ్యక్షులు సూరిబాబు, మండల అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్, చెల్లిబోయిన సతీష్, బి.ఎన్. రాజు, బాలిపల్లి రాంబాబు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఉమ్మడి ఆమలేశ్వరి, కమిశెట్టి నాగమణి, కేతినిడి గౌరీ, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ నక్క నారాయణ మూర్తి తదితర కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
పవన్ కళ్యాణ్ మార్క్ అభివృద్ధి: పిఠాపురంలో రూ.33 లక్షల పీఎం- అజయ్ చెక్కులు పంపిణీ పిఠాపురం: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. సేవే లక్ష్యం- ప్రజలే బలం అనే సిద్ధాంతంతో సామాజిక న్యాయమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గ రూపురేఖలను మారుస్తున్నారని ఆయన తెలిపారు. లబ్ధిదారులకు రూ. 33 లక్షల ఆర్థిక సాయం మంగళవారం ఉదయం పిఠాపురం పాడా కార్యాలయంలో సెర్ప్, డి ఆర్ డి ఎ ఆధ్వర్యంలో పీఎం- అజయ్ పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మరియు ఒదురి కిషోర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు, మొబైల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఠాపురం,గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి మండలాలకు చెందిన
27 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు మొత్తం సాయం రూ. 33 లక్షలు లబ్ధి పొందారని, ప్రభుత్వం తరఫున 50% రాయితీతో ఈ రుణాలను అందజేయడం జరిగిందని, సామాజికంగా వెనుకబడిన వర్గాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడం స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడమే పవన్ కళ్యాణ్ గారి ప్రధాన లక్ష్యం అని అన్నారు. ప్రతి ప్రభుత్వ పథకం అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా కట్టుబడి ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాడా పీడీ శివప్రసాద్,ఏపీడీ వసంత మాధవి,ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్ బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్య ప్రకాష్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకె జగదీష్,గొల్లప్రోలు పట్టణ అధ్యక్షులు సూరిబాబు, మండల అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్, చెల్లిబోయిన సతీష్, బి.ఎన్. రాజు, బాలిపల్లి రాంబాబు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఉమ్మడి ఆమలేశ్వరి, కమిశెట్టి నాగమణి, కేతినిడి గౌరీ, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ నక్క నారాయణ మూర్తి తదితర కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
- పిఠాపురం: స్థానిక పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయం మరోసారి రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారింది. ఎన్యుమరేటర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో తలెత్తిన ప్రోటోకాల్ వివాదం కూటమిలోని రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం మరియు జనసేన నేతల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. పాడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడాన్ని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా అభ్యంతరపెట్టారు. ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం ఫోటో ఎక్కడ? అని అధికారులను బహిరంగంగా నిలదీశారు. కనీస ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం వహించడంపై అధికారులపై మండిపడ్డారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న జనసేన నేత పెండెం దొరబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులను నిలదీసే క్రమంలో ఇరువురు నేతల మధ్య మాటలు పెరగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇద్దరు నేతల అనుచరులు, టీడీపీ - జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ మీదకు దూసుకెళ్లడంతో ఇరువర్గాల మధ్య భారీ తోపులాట జరిగింది. కార్యాలయం లోపల, బయట కార్యకర్తల మోహరింపుతో పాడా ఆఫీసు రణరంగాన్ని తలపించింది. ప్రభుత్వ నిబంధనలు మీకు వర్తించవా? అంటూ అధికారులను నిలదీస్తూనే, ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం ఘర్షణకు దిగారు. పరిస్థితి చేదాటిపోతుండటంతో పోలీసులు భారీ సంఖ్యలో రంగంలోకి దిగారు. ఘర్షణ పడుతున్న ఇరువర్గాలను చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. నాయకులను సర్దిచెప్పి అక్కడి నుండి పంపించివేయడంతో ఉద్రిక్తత కాస్త సద్దుమణిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇరు పార్టీల మధ్య గొడవ జరిగిందని, ఇది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోందని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. తరచూ పాడా కార్యాలయంలో ఇటువంటి ప్రోటోకాల్ వివాదాలు తలెత్తడంపై స్థానికంగా చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీల మధ్యే ఇలా బహిరంగంగా తోపులాట జరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మరియు పార్టీ అధిష్టానాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.1
- 🙏😭1
- పిఠాపురంలో కూటమి నేతల ఫ్లెక్సీ రగడ పిచ్చిపిచ్చి వేషాలొద్దు అంటూ వర్మపైకి దూసుకెళ్లిన జనసేన నేత దొరబాబు మాజీ ఎమ్మెల్యే లు ఎస్వీఎస్ఎన్ వర్మ..పెండెం దొరబాబు మధ్య రగడ. టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య తోపులాట.. ఒకరినొకరు నెట్టుకున్న నాయకులు పాడ కార్యాలయంలో జరిగిన pmajay కార్యక్రమంలో ఘర్షణ ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంపై అధికారులపై వర్మ ఆగ్రహం వర్మతో వాగ్వాదానికి దిగిన జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మలబాబు దీంతో దొరబాబు కలుగజేసుకుని వర్మ పై దూసుకెళ్ళిన వైనం1
- Post by Sageni gangadhar1
- Post by Rai Narendra1
- అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండల కేంద్రంలో మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా పరిస్థితి దారుణంగా మారింది. రోడ్లన్నీ పూర్తిగా నీటితో నిండిపోవడంతో పట్టణం మొత్తం జలమయంగా కనిపించింది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి, రోడ్లపై వరదలా ప్రవహించింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు రాకపోకలు చేయడం కష్టంగా మారింది. స్థానికులు పలుమార్లు అధికారులకు డ్రైనేజీ సమస్యపై ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డ్రైనేజీ కాలువలు నిర్మించి, శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*2
- 🙏😭1