Shuru
Apke Nagar Ki App…
we NRI PROJECT'S RECRUTING Marketing Associates, marketing managers, and other positions. Marketing Persons with Good team will Give first priority. for details contact on 8074496344
Journalist Madhu
we NRI PROJECT'S RECRUTING Marketing Associates, marketing managers, and other positions. Marketing Persons with Good team will Give first priority. for details contact on 8074496344
- Journalist Madhuకాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ🤝1 day ago
More news from తెలంగాణ and nearby areas
- 👉గజ్వేల్ జనవరి 10 ప్రజా తెలంగాణ న్యూస్ మేడారం జాతరకు కేసీఆర్ ను ఆహ్వానించిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ అమ్మ బాగున్నారా అని ఆత్మీయంగా పలకరించిన కేసీఆర్ టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను సమ్మక్క సారలమ్మ జాతరను ఆహ్వానించిన మంత్రులు సీతక్క కొండా సురేఖ తెలంగాణ శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేతను గజ్వేల్ ఎర్రవెల్లిలోని తననివాసానికి వచ్చిన మహిళా మంత్రులను బీఆర్ఎ ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయంగా స్వాగతించారు. తెలంగాణ మంత్రులు సీతక్క, కొండా సురేఖలు కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి మేడారం జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. జాతర ప్రసాదాన్ని అందించి, రాష్ట్ర ప్రభుత్వ తరపున జాతరకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు సాంప్రదాయ పద్ధతిలో పసుపు, కుంకుమ, చీరలు, తాంబూలాలతో మంత్రులను సత్కరించారు. తేనీటి విందు అనంతరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రులు ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నప్పుడు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్వాగతం పలికారు.1
- VBG- RAMG కొత్త చట్టం ద్వారా తెలంగాణకు ఎంతో మేలు: సంగారెడ్డి లో మీడియాతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి1
- చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర పార్బాయిల్డ్ రైస్ మిల్, వెంకటేశ్వర మోడరన్ రైస్ మిల్ ఇవి రెండు విసర్జిస్తున్న వాయు, ఘన, ద్రవ కాలుష్యాలను చిట్యాల మున్సిపల్ అధికారులు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నియంత్రించకపోవడం వల్ల చంద్రపురి కాలనీ, సాయి ద్వారకాపురి కాలనీ, ఆదర్శనగర్, ఆటోనగర్, ముత్యాలమ్మ గూడెం, సంజీవనగర్ తదితర పట్టణవాసుల జీవనానికి ఈ రైస్ మిల్లులు రెండు విసర్జించే కాలుష్యం తీవ్ర ఆటంకంగా మారిందని చంద్రపురి కాలనీ చుట్టూరా రైల్వే లైన్ ప్రక్కన చెత్త డెంపు యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల రైస్ మిల్ విసర్జిత కాలుష్యపు నీరు చెత్తలో పేరుకుపోవడంతో ప్రజలు శ్వాస పీల్చలేక, దోమలతో జీవించలేక ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని, వీటిని నివారించడంలో మున్సిపల్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వీటిని కంట్రోల్ చేయకపోతే రెండు రైస్ మిల్లులకు తాళాలు వేసి నిలిపివేస్తామని" ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి మిల్లు యాజమాన్యాలను హెచ్చరిక చేశారు.* *మూడు జిల్లాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) వెంకన్న గారితో ఫోన్లో మాట్లాడి, వారు సందర్శించి మిల్లుల నుండి వస్తున్న కాలుష్యాన్ని నివారిస్తామని హామీ ఇచ్చిన తర్వాత ధర్నాను విరమించారు.* ఈ ధర్నాలో కాలనీకి చెందిన మహిళలు, బాలబాలికలు వీరితోపాటు చేపూరి శ్రీనివాస్ నేత, మారగొని యాదగిరి గౌడ్, రుద్రారపు నరసింహ, రుద్రారపు కిష్టయ్య, ఆదిరెడ్డి, నరసింహ, రావిడి సత్తిరెడ్డి, బిల్లపాటి అలివేలు, మారగోని జ్యోతి, రుద్రారపు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.1
- మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండల కేంద్రంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గత వారం రోజులుగా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున హరి, శివ నామ సంకీర్తనతో గ్రామ పురవీధులలో భజన పాటలు ఆలకిస్తూ నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో శివదిక్షాపరులు గ్రామ ప్రజలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.1
- మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన పుల్లకండం మేఘన రాణి, కడియాల భావన చిన్ననాటి నుంచి సన్నిహిత స్నేహితులు. పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు కలిసే చదువుకున్న వీరు, ఎంఎస్ చదువుల కోసం మూడు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లారు. ఇటీవల చదువులు పూర్తిచేసుకున్న అనంతరం కాలిఫోర్నియాలో విహారయాత్రకు వెళ్లిన సమయంలో కారు అదుపుతప్పి లోయలో పడటంతో ఇద్దరూ మృతి చెందారు. 14 రోజుల తర్వాత వారి పార్ధివ దేహాలు స్వగ్రామాలకు చేరగా, ముల్కనూర్‌లో ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.1
- కరీంనగర్ జిల్లా హైదరాబాద్ ప్రధాన రహదారి అలుగునూరు బ్రిడ్జిపై మారుతి 800 కారులో మంటలు తగలబడుతున్న కారు భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కు కలిగింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది1
- *కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్...* *బస్టాండ్ లో చిరు వ్యాపారులకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామలక్ష్మణరాజు ఆధ్వర్యంలో పోలీసుల అవగాహన* *విశాలంగా మారిన బస్టాండ్ ప్రాంగణం *ట్రాఫిక్ పోలీసులతో* కలిసి స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న *కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ కమిటీల సమాఖ్య CCS ప్రతినిధులు.* ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, మధు, పోలీస్ సిబ్బంది, కాలనీ కమిటీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లిపద్మా రెడ్డి, కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్, చల్ల ప్రభాకర్, తాళ్ల ఆనంద్ గౌడ్, నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు యావపురం రవి, వెంకులు, గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.2
- సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేస్తున్న అధికారులు1
- నల్లగొండ బ్రేకింగ్: నల్గొండ జిల్లాలో ఉన్న రైల్వే ఆగిన బస్సులే టార్గెట్గా దొంగతనాలకు పాల్పడుతున్న మధ్యప్రదేశ్ కి చెందిన థార్ గ్యాంగ్ ను నల్గొండ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ శరత్చంద్ర పవర్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ఆదమరిస్తే అరనిమిషంలో గాయబ్! చేసే థార్ గ్యాంగ్! హైవేలపై బస్సులే టార్గెట్.! ధాబాల వద్ద ఆగి ఉన్న బస్సులో ప్రయాణికుల బంగారం మాయం.. గత నెల చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ బస్సు లో భారీ మొత్తం లో బంగారు ఆభరణాల చోరీ సంచలనం... కేసు ను సవాలుగా తీసుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.. 15 రోజుల హైటెన్షన్ ఖాకి సినిమా రేంజ్ లో నల్లగొండ పోలీస్ ఆపరేషన్.. మధ్యప్రదేశ్ థార్ జిల్లాకు చెందిన అంతరాష్ట్ర “థార్ గ్యాంగ్” దొంగ నల్గొండ జిల్లా పోలీసుల వలలో చిక్కాడు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సీసీఎస్ బృందాల సైలెంట్ ట్రాక్... చివరికి ఉమర్భాన్ క్రాస్ రోడ్డు వద్ద ముఠా సభ్యుడు (దొంగ) షా అల్లా రఖా పట్టివేత.. నిందితుడి వద్ద నుంచి రూ.85 లక్షల విలువైన 600 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం... ముఠాలో ఐదుగురు… ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పాత నేర చరిత్ర... హోటళ్ల వద్ద ఆగిన బస్సులే టార్గెట్.. క్షణాల్లో చేతివాటం పరారీలో ఉన్న మిగతా నేరస్తుల కోసం వేట కొనసాగింపు... ఇట్టి ముఠా సభ్యులను సిసిఎస్, ఇన్స్పెక్టర్ ఎం. జితేందర్ రెడ్డి పర్యవేక్షంలో పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన, చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు ,సి.సి.ఎస్ ఎస్ఐ శివ కుమార్, మరియు సి.సి.ఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన గిరి, పుష్పగిరి, నాగరాజు, కానిస్టేబుల్స్ వెంకటేష్, సాయికుమార్ , జూనేద్ , శివరాజు, మహేశ్, కమల్ కిశోర్. చిన్న బాబు మరియు ఇతర సిసిఎస్ సిబ్బందిని జిల్లా ఎప్.పి ప్రత్యేకంగా అభినందించి రివార్డును ప్రకటించారు.1