రహదారి భద్రతలో భాగంగా పరిమితికి మించి అధిక లోడుతో ప్రయాణిస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ✅ *రహదారి భద్రత మరియు ప్రజల భద్రతలో భాగంగా పరిమితికి మించి గడ్డి, చెరుకు, ఊక, ఇసుక, గ్రావెల్, సిమెంట్ మరియు ఇతర సరకు రవాణా లోడుతో ప్రయాణిస్తున్న వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదుచేస్తామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ✅ *డ్రైవర్లు కూడా తమ ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఓవర్ లోడుతో వాహనాలు నడపకూడదని, ఒకవేళ యజమాని ఒత్తిడి తెస్తే సమీప పోలీస్ స్టేషన్ లేదా ట్రాఫిక్ అధికారులకు సమాచారం ఇవ్వాలని లేని పక్షంలో డ్రైవర్ లైసెన్స్ సస్పెండ్ లేదా రద్దు జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు జిల్లాలో రోడ్డు భద్రత మరియు ప్రజల భద్రతను కాపాడుటలో భాగంగా ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించే విధంగా లారీలు, ట్రాక్టర్లు, ట్రక్కులు, ఆటోలు వంటి వాహనాలు, గడ్డి, చెరుకు, గ్రావెల్, సిమెంట్ మరియు ఇతర సరకు రవాణా లోడుతో ప్రయాణిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు చేపడతామని, కేసులు నమోదుచేసి వాహనాలను సీజ్ చేస్తామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఫిబ్రవరి 17న హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ – ప్రజల భద్రత దృష్ట్యా రహదారి భద్రతా నియమాలను కఠినంగా అమలు చేస్తామని, ఇటీవల జిల్లాలో వాణిజ్య వాహనాలు, ముఖ్యంగా గడ్డి, చెరుకు, ఊక, ఇసుక, గ్రావెల్, సిమెంట్ మరియు ఇతర సరకు రవాణా వాహనాలు నిబంధనలకు మించి సరుకు మోసుకుంటూ రోడ్లపై ప్రయాణిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని అన్నారు. వీటి వలన ప్రజల ప్రాణాలకు, రహదారుల మౌలిక వసతులకు మరియు ట్రాఫిక్ క్రమశిక్షణకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ తరఫున, వాహనాల ఓవర్ లోడింగ్‌ను పూర్తిగా నియంత్రించేందుకు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. వాహనం పరిమితికి మించి లోడుతో ప్రయాణిస్తున్నప్పుడు వెనుక వచ్చే వాహనాలు కనపడవని, వాహనం యొక్క బ్రేకింగ్ సిస్టమ్, టైర్లు, యాక్సిల్ మరియు సస్పెన్షన్ వ్యవస్థలపై అధిక ఒత్తిడి వలన బ్రేకులు సరిగ్గా పనిచేయకపోవడం, టైర్లు పేలిపోవడం, వాహనం నియంత్రణ కోల్పోయి రోడ్డు ప్రమాదాలకు కారణం అయి ఇతర వాహనదారులు మరియు పాదచారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది జిల్లా ఎస్పీ తెలిపారు. అదేవిధంగా రహదారులు దెబ్బతిని గుంతలు ఏర్పడి మరిన్ని ప్రమాదాలకు కూడా కారనమవుతాయని తెలిపారు. ప్రత్యేకించి హైవేలపై అధిక వేగంతో ప్రయాణించే ఓవర్ లోడ్ వాహనాలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయని, చిన్న తప్పిదం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని, ఇటీవల దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న అనేక రోడ్డు ప్రమాదాల్లో ఓవర్ లోడింగ్ కూడా ఒక ప్రధాన కారణం అని తెలిపారు. వాణిజ్య వాహన యజమానులు లాభాపేక్షతో అధిక లోడ్ మోపించడం ద్వారా తాత్కాలికంగా లాభం పొండుతుతున్నారు గాని, ఏదైనా ప్రమాదం జరిగితే డ్రైవర్ల ప్రాణనష్టం, వాహనాల నష్టం, చట్టపరమైన ఇబ్బందులు, బీమా క్లెయిమ్ తిరస్కరణ వంటి వాటి గురించి ఒకసారి ఆలోచించాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజలు పోలీసు వారికి సహకరించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని, ఓవర్ లోడ్ వాహనాలు మీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లయితే స్థానిక పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రజల సేవలోనే ఉంటుందని, రోడ్డు ప్రమాదాలు లేని సురక్షిత సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, పిలుపునిచ్చారు.

- Post by APPARAO KONCHADA1
- కూనవరం మండలం వెంకటయపాలెం గ్రామ సచివాలయం ఎదుట ఓ మహిళ మంగళవారం నిరసన చేపట్టారు. అక్కడే పని చేస్తున్నా సచివాలయం ఉద్యోగి నరేష్ తనను ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. గత 5 ఏళ్లుగా ప్రేమ కోసాగిందని, ఇప్పుడు పెళ్లి మాట ఎత్తితే ముఖం చాటిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు.1
- జీకే వీధి మండలం కడుగుల గ్రామానికి చెందిన గర్భిణీ కళ్యాణి కడుపులోనే శిశువు మృతి చెందింది. చింతపల్లి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు ఆరోపించారు. చివరి నిమిషం వరకు ఉంచుకుని నర్సీపట్నం రిఫర్ చేశారని, అప్పటికే ఉమ్మనీరు పోయి బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం గ్రామంలో నిరసన చేపట్టారు.1
- అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలు మండలం ఎం.ఆర్.పురం గ్రామానికి చెందిన ఆదివాసులు తమకు గతంలో ఇచ్చిన భూమి పట్టాలపై రీ–సర్వే నిర్వహించాలని అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం భూసరిహద్దులు స్పష్టంగా లేకపోవడం, రికార్డుల్లో తేడాలు ఉండటం వల్ల సాగు చేసుకునే భూములపై అనిశ్చితి నెలకొన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీ–సర్వే ద్వారా అసలు హక్కుదారులకు న్యాయం జరిగి, భూముల పరిమాణం మరియు సరిహద్దులు ఖచ్చితంగా నిర్ణయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు ఐటిడిఎ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదివాసులు విజ్ఞప్తి చేశారు.1
- సంతబొమ్మాళి ఫిబ్రవరి 17, జాతీయ నులిపురుగులు నివారణ దినోత్సవం సందర్భంగా నౌపడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యులు ఓ పరిమళ నిర్వహణలో నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహంతి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో 250 విద్యార్థులకు, గ్రామంలో ఉన్న నాలుగు అంగన్వాడీ కేంద్రాల్లో 108 మంది చిన్నారులకు, నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల శ్రీ సత్య సాయి విద్యానికేతన్ చిన్నారులకు వారిని మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితర బృందం పాల్గొన్నారు.4
- పేదరికం ఉన్నత చదువులకు అడ్డు రాకూడదని బిజెపి నాయకులు పోకతోట సింహాచలం అన్నారు. శ్రీకాకుళంలోని మంగు తోట దరిలో నివాసముంటున్న సరంతి జయలక్ష్మి వైద్య విద్యకు వారి ఇంటికి వెళ్లి మంగళవారం ఆయన ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయలక్ష్మి బాగా చదువుతుందని రాబోయే కాలంలో కూడా తను వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.1
- చక్ర తీర్థ స్నానాలకు నాలుగంచెల భద్రత ఎల్.ఎన్.పేట మండలం మిరియపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో బుధవారం జరగనున్న శ్రీముఖలింగేశ్వర స్వామి వారి చక్ర తీర్థ స్నానాలకు నాలుగెంచల భద్రతను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్.ఎన్.పేట మండలం వైపు నుండి వాహనాలలో వచ్చే భక్తులకు మిరియప్పల్లి, వాడవలస గ్రామాల సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం నుండి చక్ర తీర్థ స్నానమాచరించేందుకు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరనున్నారు.1
- Post by APPARAO KONCHADA1