logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, మంత్రి సీతక్కపై అసత్య ప్రచారాలు చేస్తే తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. ఆదివారం ములుగు డి.ఎల్.ఆర్. గార్డెన్స్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గుంటూరు సతీష్ రెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చి నెలకోసారి గిరిజన ఆడబిడ్డ సీతక్కపై బురద చల్లుతున్నాడని మండిపడ్డారు. పైడాకుల అశోక్, సతీష్ రెడ్డిని ఉద్దేశించి “12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక దందా, నాలుగు వేల కోట్ల అక్రమ సంపాదన అన్నావ్. దమ్ముంటే నిరూపించు. రేపు ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధికి రా. నువ్వు రాకపోతే మీ కేటీఆర్‌ను పంపించు. ఆధారాలతో బహిరంగ చర్చకు నేను సిద్ధం” అని సవాల్ విసిరారు. ములుగు జిల్లాలో ఇసుక రవాణా అంతా అనుమతులతోనే జరుగుతోందని, గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా ఇసుక సొసైటీలకు అనుమతులు ఇచ్చామని అశోక్ స్పష్టం చేశారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు సిల్ట్‌కు అనుమతులు ఇచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని, ప్రాజెక్టు కట్టాలంటే ముందు సిల్ట్ తీయాలన్న కనీస అవగాహన కూడా సతీష్ రెడ్డికి లేదని ఎద్దేవా చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, “బ్రతుకుదెరువు కోసం గుంటూరు నుంచి వచ్చిన నీకు లగ్జరీ కార్లు, ఇళ్లు, ప్లాట్లు ఎక్కడివి? మంత్రి సీతక్క గారు నిత్యం ప్రజా సేవలో ఉంటారు. కష్టమన్న ప్రతి ఇంటి గడప తొక్కిన వ్యక్తి. అలాంటి నాయకురాలిపై కారు కూతలు కూస్తే నాలుక చీరుతాం. ములుగు గడ్డ మీద అడుగు పెట్టకుండా తరిమికొడతాం” అని తీవ్రంగా హెచ్చరించారు. లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లొచ్చిన కల్వకుంట్ల కవిత సైతం సీతక్క గురించి మాట్లాడటం దారుణమని అశోక్ విమర్శించారు, “నీ స్థాయి ఏంటో మరిచిపోయి మాట్లాడకు” అని సూచించారు. సతీష్ రెడ్డికి ములుగు జిల్లాకు సంబంధం ఏంటని ప్రశ్నించిన అశోక్, పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జిల్లా ప్రజలకు గానీ, కార్యకర్తలకు గానీ ఏనాడూ సహాయం చేయలేదని, సమస్యలను కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ములుగు గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, స్టేట్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, జిల్లా, మండల, గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యూత్, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

4 hrs ago
user_Chunchu Ramesh
Chunchu Ramesh
Insurance Agent ములుగు, ములుగు, తెలంగాణ•
4 hrs ago
6eb2b811-67d9-4659-89cb-8e3949e10f52

ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, మంత్రి సీతక్కపై అసత్య ప్రచారాలు చేస్తే తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. ఆదివారం ములుగు డి.ఎల్.ఆర్. గార్డెన్స్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గుంటూరు సతీష్ రెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చి నెలకోసారి గిరిజన ఆడబిడ్డ సీతక్కపై బురద చల్లుతున్నాడని మండిపడ్డారు. పైడాకుల అశోక్, సతీష్ రెడ్డిని ఉద్దేశించి “12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక దందా, నాలుగు వేల కోట్ల అక్రమ సంపాదన అన్నావ్. దమ్ముంటే నిరూపించు. రేపు ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధికి రా. నువ్వు రాకపోతే మీ కేటీఆర్‌ను పంపించు. ఆధారాలతో బహిరంగ చర్చకు నేను సిద్ధం” అని సవాల్ విసిరారు. ములుగు

a9185feb-c8a9-492e-8291-4ed6b3224d57

జిల్లాలో ఇసుక రవాణా అంతా అనుమతులతోనే జరుగుతోందని, గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా ఇసుక సొసైటీలకు అనుమతులు ఇచ్చామని అశోక్ స్పష్టం చేశారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు సిల్ట్‌కు అనుమతులు ఇచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని, ప్రాజెక్టు కట్టాలంటే ముందు సిల్ట్ తీయాలన్న కనీస అవగాహన కూడా సతీష్ రెడ్డికి లేదని ఎద్దేవా చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, “బ్రతుకుదెరువు కోసం గుంటూరు నుంచి వచ్చిన నీకు లగ్జరీ కార్లు, ఇళ్లు, ప్లాట్లు ఎక్కడివి? మంత్రి సీతక్క గారు నిత్యం ప్రజా సేవలో ఉంటారు. కష్టమన్న ప్రతి ఇంటి గడప తొక్కిన వ్యక్తి. అలాంటి నాయకురాలిపై కారు కూతలు కూస్తే నాలుక చీరుతాం. ములుగు గడ్డ మీద అడుగు పెట్టకుండా తరిమికొడతాం” అని

fcdcf55b-195a-430c-a114-d499c73fdcc0

తీవ్రంగా హెచ్చరించారు. లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లొచ్చిన కల్వకుంట్ల కవిత సైతం సీతక్క గురించి మాట్లాడటం దారుణమని అశోక్ విమర్శించారు, “నీ స్థాయి ఏంటో మరిచిపోయి మాట్లాడకు” అని సూచించారు. సతీష్ రెడ్డికి ములుగు జిల్లాకు సంబంధం ఏంటని ప్రశ్నించిన అశోక్, పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జిల్లా ప్రజలకు గానీ, కార్యకర్తలకు గానీ ఏనాడూ సహాయం చేయలేదని, సమస్యలను కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ములుగు గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, స్టేట్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, జిల్లా, మండల, గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యూత్, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 29న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరుగుతాయని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టడంతో పాటు బీఎన్ఏలకు శిక్షణ కార్యక్రమాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా, పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలతో మరింత మమేకమై పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లేందుకు అవసరమైన సూచనలు కూడా ఆయన ఇవ్వనున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని మండల, క్లస్టర్ ఇన్‌చార్జులు, సమన్వయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని రాజయ్య పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
    1
    జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 29న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరుగుతాయని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు.

ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టడంతో పాటు బీఎన్ఏలకు శిక్షణ కార్యక్రమాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా, పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలతో మరింత మమేకమై పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లేందుకు అవసరమైన సూచనలు కూడా ఆయన ఇవ్వనున్నారని తెలిపారు.

నియోజకవర్గంలోని మండల, క్లస్టర్ ఇన్‌చార్జులు, సమన్వయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని రాజయ్య పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో కరీంనగర్ జిల్లాలో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వరుణ దేవుడి కరుణ కోసం జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలు సాంప్రదాయబద్ధంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, జలాభిషేకం చేయడంతో పాటు కప్పతల్లి ఆటను ఆడారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కందుగుల గ్రామంలో, గ్రామస్తులు వర్షాలు కురవాలని కోరుతూ గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. చిన్న, పెద్ద, స్త్రీ, పురుష వయోభేదం లేకుండా అందరూ ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి ఒక బిందెడు నీళ్లను డప్పుచప్పుళ్లతో ఆలయాలకు తీసుకువెళ్లి దేవతలకు జలాభిషేకం చేశారు. పసుపు కుంకుమలతో దేవత మూర్తులను అలంకరించి, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని మొక్కుకున్నారు. అదేవిధంగా, వీణవంక మండలం హిమ్మత్‌నగర్ గ్రామంలో వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి గ్రామస్తులు ఓ సంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎండల తీవ్రత పెరగడం, వర్షాలు లేకపోవడంతో పూర్వ కాలం నాటి ఆచారం ప్రకారం కప్పలకు వివాహం జరిపారు. బాజా భజంత్రీలు, మేళా తాళాల నడుమ రెండు కప్పలను తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా వివాహ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.
    1
    వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో కరీంనగర్ జిల్లాలో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వరుణ దేవుడి కరుణ కోసం జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలు సాంప్రదాయబద్ధంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, జలాభిషేకం చేయడంతో పాటు కప్పతల్లి ఆటను ఆడారు.

హుజురాబాద్ నియోజకవర్గంలోని కందుగుల గ్రామంలో, గ్రామస్తులు వర్షాలు కురవాలని కోరుతూ గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. చిన్న, పెద్ద, స్త్రీ, పురుష వయోభేదం లేకుండా అందరూ ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి ఒక బిందెడు నీళ్లను డప్పుచప్పుళ్లతో ఆలయాలకు తీసుకువెళ్లి దేవతలకు జలాభిషేకం చేశారు. పసుపు కుంకుమలతో దేవత మూర్తులను అలంకరించి, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని మొక్కుకున్నారు.

అదేవిధంగా, వీణవంక మండలం హిమ్మత్‌నగర్ గ్రామంలో వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి గ్రామస్తులు ఓ సంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎండల తీవ్రత పెరగడం, వర్షాలు లేకపోవడంతో పూర్వ కాలం నాటి ఆచారం ప్రకారం కప్పలకు వివాహం జరిపారు. బాజా భజంత్రీలు, మేళా తాళాల నడుమ రెండు కప్పలను తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా వివాహ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • కరీంనగర్‌లో నీట్-2026 పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన ఒక విద్యార్థి పరీక్షా కేంద్రానికి ఆలస్యమవుతుండటంతో, విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్ తక్షణమే స్పందించారు. విద్యార్థి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకునేలా ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రిస్తూ, అవసరమైన మార్గదర్శకత్వం అందించి సకాలంలో చేర్చారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్ చూపిన అప్రమత్తత, మానవతా దృక్పథాన్ని విద్యార్థి కుటుంబ సభ్యులు, కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలకు అవసరమైన సమయంలో సహాయం చేయడం పోలీసుల బాధ్యతలో భాగమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు తెలియజేశారు.
    1
    కరీంనగర్‌లో నీట్-2026 పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన ఒక విద్యార్థి పరీక్షా కేంద్రానికి ఆలస్యమవుతుండటంతో, విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్ తక్షణమే స్పందించారు. విద్యార్థి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకునేలా ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రిస్తూ, అవసరమైన మార్గదర్శకత్వం అందించి సకాలంలో చేర్చారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్ చూపిన అప్రమత్తత, మానవతా దృక్పథాన్ని విద్యార్థి కుటుంబ సభ్యులు, కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలకు అవసరమైన సమయంలో సహాయం చేయడం పోలీసుల బాధ్యతలో భాగమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు తెలియజేశారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
  • ఆదివారం జనగామ జిల్లాలో జరిగిన నీట్ పరీక్షకు హాజరైన అశ్విని అనే విద్యార్థిని, జనగామ పట్టణంలోని ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్‌కు పొరపాటున చేరుకుంది. అయితే, ఆమెకు కేటాయించిన అసలు పరీక్షా కేంద్రం పెంబర్తి గ్రామంలోని ఒక కళాశాలలో ఉంది. హాల్ టికెట్ పరిశీలించిన విధుల్లో ఉన్న పోలీసులు, ఆమె తప్పుడు సెంటర్‌కు వచ్చినట్లు గుర్తించి తెలియజేశారు. ఈ విషయం తెలిసి తీవ్ర కంగారుతో కన్నీటిపర్యంతమైన విద్యార్థినిని చూసి, పోలీసులు వెంటనే స్పందించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా విద్యార్థినిని వెంటనే పోలీస్ వాహనంలో అసలు సెంటర్‌కు తరలించాలని ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో, సదరు విద్యార్థినిని అధికారిక పోలీస్ వాహనంలో ఎక్కించుకొని, జనగామ పట్టణం నుండి పెంబర్తిలోని నీట్ పరీక్షా కేంద్రానికి సైరన్ మోగిస్తూ మెరుపు వేగంతో వెళ్లి, పరీక్ష ప్రారంభానికి 9 నిమిషాల ముందే చేర్చారు. పోలీసుల ఈ వేగవంతమైన, మానవతా దృక్పథంతో కూడిన చర్యకు వారు ప్రజలచే శభాష్ అనిపించుకోగా, విద్యార్థినితో పాటు పలువురు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    ఆదివారం జనగామ జిల్లాలో జరిగిన నీట్ పరీక్షకు హాజరైన అశ్విని అనే విద్యార్థిని, జనగామ పట్టణంలోని ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్‌కు పొరపాటున చేరుకుంది. అయితే, ఆమెకు కేటాయించిన అసలు పరీక్షా కేంద్రం పెంబర్తి గ్రామంలోని ఒక కళాశాలలో ఉంది. హాల్ టికెట్ పరిశీలించిన విధుల్లో ఉన్న పోలీసులు, ఆమె తప్పుడు సెంటర్‌కు వచ్చినట్లు గుర్తించి తెలియజేశారు.

ఈ విషయం తెలిసి తీవ్ర కంగారుతో కన్నీటిపర్యంతమైన విద్యార్థినిని చూసి, పోలీసులు వెంటనే స్పందించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా విద్యార్థినిని వెంటనే పోలీస్ వాహనంలో అసలు సెంటర్‌కు తరలించాలని ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో, సదరు విద్యార్థినిని అధికారిక పోలీస్ వాహనంలో ఎక్కించుకొని, జనగామ పట్టణం నుండి పెంబర్తిలోని నీట్ పరీక్షా కేంద్రానికి సైరన్ మోగిస్తూ మెరుపు వేగంతో వెళ్లి, పరీక్ష ప్రారంభానికి 9 నిమిషాల ముందే చేర్చారు. పోలీసుల ఈ వేగవంతమైన, మానవతా దృక్పథంతో కూడిన చర్యకు వారు ప్రజలచే శభాష్ అనిపించుకోగా, విద్యార్థినితో పాటు పలువురు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter Jangoan, Telangana•
    5 hrs ago
  • జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్ యోగా ప్రాధాన్యాన్ని వివరించారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని ఆయన పేర్కొన్నారు. నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని శ్రీధర్ అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా దోహదపడుతుందని, ఆరోగ్యకర జీవనానికి యోగా ఉత్తమ మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో యోగా సాధన కోసం సమయం కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు.
    4
    జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్ యోగా ప్రాధాన్యాన్ని వివరించారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని ఆయన పేర్కొన్నారు. నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని శ్రీధర్ అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా దోహదపడుతుందని, ఆరోగ్యకర జీవనానికి యోగా ఉత్తమ మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో యోగా సాధన కోసం సమయం కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    9 hrs ago
  • అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం యోగా కార్యక్రమాలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ వేడుకల్లో స్థానికులు, క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు, ప్రాణాయామాలు సాధన చేశారు. యోగా నిపుణుల సూచనల మేరకు వివిధ ఆసనాలు వేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెంచుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ ఛైర్మన్ పంతకాని సమ్మయ్య మాట్లాడుతూ క్రీడాకారుల విజయాల్లో యోగా కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వం, ఏకాగ్రత, మానసిక స్థైర్యం పెరుగుతాయని, దీనివల్ల క్రీడల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆయన తెలిపారు. పతకాలను సాధించడానికి ప్రతిభతో పాటు క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా అవసరమని సమ్మయ్య పేర్కొన్నారు. అలాగే, ఉత్సవాల కమిటీ ఛైర్మన్ కరుణాకర్ రావు యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, అది ఒక జీవన విధానమని ఉద్ఘాటించారు. నిత్యం యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందని, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, యువత, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని యోగా ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించుకున్నారు, ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన సూచించారు.
    1
    అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం యోగా కార్యక్రమాలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ వేడుకల్లో స్థానికులు, క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు, ప్రాణాయామాలు సాధన చేశారు. యోగా నిపుణుల సూచనల మేరకు వివిధ ఆసనాలు వేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెంచుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ ఛైర్మన్ పంతకాని సమ్మయ్య మాట్లాడుతూ క్రీడాకారుల విజయాల్లో యోగా కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వం, ఏకాగ్రత, మానసిక స్థైర్యం పెరుగుతాయని, దీనివల్ల క్రీడల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆయన తెలిపారు. పతకాలను సాధించడానికి ప్రతిభతో పాటు క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా అవసరమని సమ్మయ్య పేర్కొన్నారు.

అలాగే, ఉత్సవాల కమిటీ ఛైర్మన్ కరుణాకర్ రావు యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, అది ఒక జీవన విధానమని ఉద్ఘాటించారు. నిత్యం యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందని, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, యువత, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని యోగా ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించుకున్నారు, ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన సూచించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక వద్ద వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎడారిని తలపిస్తున్న మిడ్ మానేర్ జలాశయం వద్ద బీఆర్ఎస్ పార్టీ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు జలాశయం ఎండిపోయిన ప్రదేశంలో కబడ్డీ, క్రికెట్ ఆడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జలాశయంలో నీటి నిల్వలు తగ్గి, మునిగిపోయిన గ్రామాలు మళ్ళీ తేలుతుండటంతో బీఆర్ఎస్ నాయకులు పరిస్థితిని పరిశీలించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో మండే వేసవిలో సైతం నిండు కుండలా జలకళను సంతరించుకున్న మిడ్ మానేర్ ఇప్పుడు నీళ్లు లేక ఎండిపోవడం పాలకపక్షం నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యమని బీఆర్ఎస్ ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగినప్పటికీ, గత రెండున్నర ఏళ్లుగా రిపేర్లు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను ఎండిపోయేలా చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై రాజకీయ కక్షతో రైతులకు సాగునీరు అందించకుండా కుట్ర పడుతోందని కూడా ఆరోపించారు. రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఈ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వెంటనే మేడిగడ్డ వద్ద కాపర్ డ్యామ్ నిర్మించి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించి రైతులకు సాగు, త్రాగునీరు అందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో త్రాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టక తప్పదని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హెచ్చరించారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక వద్ద వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎడారిని తలపిస్తున్న మిడ్ మానేర్ జలాశయం వద్ద బీఆర్ఎస్ పార్టీ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు జలాశయం ఎండిపోయిన ప్రదేశంలో కబడ్డీ, క్రికెట్ ఆడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జలాశయంలో నీటి నిల్వలు తగ్గి, మునిగిపోయిన గ్రామాలు మళ్ళీ తేలుతుండటంతో బీఆర్ఎస్ నాయకులు పరిస్థితిని పరిశీలించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

గత బీఆర్ఎస్ పాలనలో మండే వేసవిలో సైతం నిండు కుండలా జలకళను సంతరించుకున్న మిడ్ మానేర్ ఇప్పుడు నీళ్లు లేక ఎండిపోవడం పాలకపక్షం నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యమని బీఆర్ఎస్ ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగినప్పటికీ, గత రెండున్నర ఏళ్లుగా రిపేర్లు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను ఎండిపోయేలా చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై రాజకీయ కక్షతో రైతులకు సాగునీరు అందించకుండా కుట్ర పడుతోందని కూడా ఆరోపించారు.

రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఈ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వెంటనే మేడిగడ్డ వద్ద కాపర్ డ్యామ్ నిర్మించి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించి రైతులకు సాగు, త్రాగునీరు అందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో త్రాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టక తప్పదని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • కరీంనగర్‌లోని మాణికేశ్వరి నగర్‌లో దేహ దాత బుర్ర భారతి సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. పలువురు వక్తలు, నాయకులు, ప్రజలు, డాక్టర్లు ఈ సభలో పాల్గొని బుర్ర భారతి చేసిన నేత్రదానం, దేహదానం పట్ల తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. 73 సంవత్సరాల వయసులో మరణించిన బుర్ర భారతి, తన నేత్రాలను దానం చేయడం ద్వారా ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించారు. దీనివల్ల వారి కళ్ళు సజీవంగా ఉంటాయని సదాశయ ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. అలాగే, ఆమె తన దేహాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు దానం చేయడం వల్ల ఎందరో వైద్య విద్యార్థులకు అది పాఠ్యపుస్తకంగా నిలిచిందని కవి, రచయిత డాక్టర్ నలిమెల భాస్కర్ కొనియాడారు. సదాశయ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, కుమార్ కుటుంబ సభ్యుల అంగీకారంతో తన తల్లి నేత్రదానం చేయడం గర్వించదగ్గ విషయమని అన్నారు. నేత్రదానంపై ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రజలు, యువత అపోహలను తొలగించుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 73 ఏళ్ల వయసులోనూ ఆ తల్లి ముందుచూపుతో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించేలా నేత్రదానం చేయడం గొప్ప విషయమని, ఆమె ఒక గొప్ప ధన్యజీవి అని ప్రశంసించారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మరణించిన తర్వాత కూడా దేహం పలువురికి ఉపయోగపడే విధంగా వైద్య కళాశాలకు దేహదానం చేసిన ఆ తల్లి గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. భౌతికంగా ఆమె లేకున్నా అందరి మనసులో నిలిచిపోయారని, ఆమె గర్భాన పుట్టినవారు ధన్యులని పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల నోడల్ అధికారి మాట్లాడుతూ, మనిషి మరణించిన తర్వాత దేహం కాల్చినా, పూడ్చివేసినా దానికి ఏమీ తెలియదని, అలాంటి దేహాన్ని బ్రతికి ఉండగానే మెడికల్ కళాశాలకు డొనేట్ చేయాలని బుర్ర భారతి తన కుటుంబ సభ్యులకు చెప్పడం అభినందనీయమన్నారు. ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులు నేత్రాలను, పార్థివదేహాన్ని కళాశాలకు అప్పగించడం గొప్ప విషయమని, ప్రతి ఒక్కరూ దేహదానానికి ముందుకు రావాలని అవగాహన కల్పించారు. సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర మాట్లాడుతూ, తల్లి లేనిదే మనకు జన్మ లేదని, అలాంటి తల్లి ఒక దేవత లాంటిదని కొనియాడారు. తన దేహాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు దానం చేసి గొప్ప మానవతావాదిగా నిలిచారని అన్నారు. సమాజంలో చెప్పడమే కాదు, నిబద్ధతతో నిలబడాలని సూచించిన ఆయన, తన మరణానంతరం తన పార్థివదేహాన్ని కూడా మెడికల్ కళాశాలకు అప్పగించాలని తన కుటుంబ సభ్యులకు తెలిపినట్లు వేదికపై నుండి ప్రకటించారు. డాక్టర్ రఘురామన్ మాట్లాడుతూ, 73 ఏళ్ల వయసులో ముందుచూపుతో తన పార్థివదేహాన్ని మెడికల్ కళాశాలకు అందించిన ఆ కుటుంబం ఎంతో గొప్ప మనసు కలిగి ఉందని అన్నారు. ముందు తరాలకు బాటలు వేస్తూ తాను తీసుకున్న నిర్ణయం గొప్ప విషయమని చెబుతూ, ఆ తల్లి బుర్ర భారతికి మనస్ఫూర్తిగా నివాళులర్పించారు. మనిషి మరణించిన తర్వాత పేరు మాత్రమే శాశ్వతంగా నిలుస్తుందని, అలాంటి పేరు వచ్చే పనులు ప్రతి ఒక్కరూ చేయాలని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు, కళాకారులు, కవులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బుర్ర భారతి కుమారులు సివి కుమార్, సీవీ శ్రీధర్, కూతుళ్లు వనజ, లావణ్య, విజయలక్ష్మి, పద్మ, అలాగే డాక్టర్ నలిమెల భాస్కర్, డాక్టర్ రఘురామన్, రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మెడికల్ కళాశాల సూపర్డెంట్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, అన్నవరం దేవేందర్, తైదెల అంజయ్య, బివిఎన్ స్వామి, నడిమెట్ల రామయ్య తదితరులు ఈ సంస్మరణ సభకు హాజరయ్యారు.
    2
    కరీంనగర్‌లోని మాణికేశ్వరి నగర్‌లో దేహ దాత బుర్ర భారతి సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. పలువురు వక్తలు, నాయకులు, ప్రజలు, డాక్టర్లు ఈ సభలో పాల్గొని బుర్ర భారతి చేసిన నేత్రదానం, దేహదానం పట్ల తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. 73 సంవత్సరాల వయసులో మరణించిన బుర్ర భారతి, తన నేత్రాలను దానం చేయడం ద్వారా ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించారు. దీనివల్ల వారి కళ్ళు సజీవంగా ఉంటాయని సదాశయ ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. అలాగే, ఆమె తన దేహాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు దానం చేయడం వల్ల ఎందరో వైద్య విద్యార్థులకు అది పాఠ్యపుస్తకంగా నిలిచిందని కవి, రచయిత డాక్టర్ నలిమెల భాస్కర్ కొనియాడారు.

సదాశయ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, కుమార్ కుటుంబ సభ్యుల అంగీకారంతో తన తల్లి నేత్రదానం చేయడం గర్వించదగ్గ విషయమని అన్నారు. నేత్రదానంపై ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రజలు, యువత అపోహలను తొలగించుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 73 ఏళ్ల వయసులోనూ ఆ తల్లి ముందుచూపుతో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించేలా నేత్రదానం చేయడం గొప్ప విషయమని, ఆమె ఒక గొప్ప ధన్యజీవి అని ప్రశంసించారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మరణించిన తర్వాత కూడా దేహం పలువురికి ఉపయోగపడే విధంగా వైద్య కళాశాలకు దేహదానం చేసిన ఆ తల్లి గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. భౌతికంగా ఆమె లేకున్నా అందరి మనసులో నిలిచిపోయారని, ఆమె గర్భాన పుట్టినవారు ధన్యులని పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల నోడల్ అధికారి మాట్లాడుతూ, మనిషి మరణించిన తర్వాత దేహం కాల్చినా, పూడ్చివేసినా దానికి ఏమీ తెలియదని, అలాంటి దేహాన్ని బ్రతికి ఉండగానే మెడికల్ కళాశాలకు డొనేట్ చేయాలని బుర్ర భారతి తన కుటుంబ సభ్యులకు చెప్పడం అభినందనీయమన్నారు. ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులు నేత్రాలను, పార్థివదేహాన్ని కళాశాలకు అప్పగించడం గొప్ప విషయమని, ప్రతి ఒక్కరూ దేహదానానికి ముందుకు రావాలని అవగాహన కల్పించారు.

సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర మాట్లాడుతూ, తల్లి లేనిదే మనకు జన్మ లేదని, అలాంటి తల్లి ఒక దేవత లాంటిదని కొనియాడారు. తన దేహాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు దానం చేసి గొప్ప మానవతావాదిగా నిలిచారని అన్నారు. సమాజంలో చెప్పడమే కాదు, నిబద్ధతతో నిలబడాలని సూచించిన ఆయన, తన మరణానంతరం తన పార్థివదేహాన్ని కూడా మెడికల్ కళాశాలకు అప్పగించాలని తన కుటుంబ సభ్యులకు తెలిపినట్లు వేదికపై నుండి ప్రకటించారు. డాక్టర్ రఘురామన్ మాట్లాడుతూ, 73 ఏళ్ల వయసులో ముందుచూపుతో తన పార్థివదేహాన్ని మెడికల్ కళాశాలకు అందించిన ఆ కుటుంబం ఎంతో గొప్ప మనసు కలిగి ఉందని అన్నారు. ముందు తరాలకు బాటలు వేస్తూ తాను తీసుకున్న నిర్ణయం గొప్ప విషయమని చెబుతూ, ఆ తల్లి బుర్ర భారతికి మనస్ఫూర్తిగా నివాళులర్పించారు. మనిషి మరణించిన తర్వాత పేరు మాత్రమే శాశ్వతంగా నిలుస్తుందని, అలాంటి పేరు వచ్చే పనులు ప్రతి ఒక్కరూ చేయాలని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు, కళాకారులు, కవులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బుర్ర భారతి కుమారులు సివి కుమార్, సీవీ శ్రీధర్, కూతుళ్లు వనజ, లావణ్య, విజయలక్ష్మి, పద్మ, అలాగే డాక్టర్ నలిమెల భాస్కర్, డాక్టర్ రఘురామన్, రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మెడికల్ కళాశాల సూపర్డెంట్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, అన్నవరం దేవేందర్, తైదెల అంజయ్య, బివిఎన్ స్వామి, నడిమెట్ల రామయ్య తదితరులు ఈ సంస్మరణ సభకు హాజరయ్యారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    4 hrs ago
  • కరీంనగర్‌-2 డిపోకు చెందిన ఒక ఎలక్ట్రిక్‌ ఆర్టీసీ బస్సు కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా, తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణిస్తున్న 37 మంది ప్రయాణికులను డ్రైవర్‌ అప్రమత్తంగా కిందకు దించడంతో ఎలాంటి పెను ప్రమాదం జరగకుండా తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
    1
    కరీంనగర్‌-2 డిపోకు చెందిన ఒక ఎలక్ట్రిక్‌ ఆర్టీసీ బస్సు కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా, తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణిస్తున్న 37 మంది ప్రయాణికులను డ్రైవర్‌ అప్రమత్తంగా కిందకు దించడంతో ఎలాంటి పెను ప్రమాదం జరగకుండా తప్పింది.

అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.