Shuru
Apke Nagar Ki App…
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మర్రి శశిధర్ రెడ్డి ఆషాఢ బోనాల జాతర సందర్భంగా మాజీ మంత్రి, ఎన్ డి ఎం ఏ మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ జాతీయ మండలి సభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, శాంతి భద్రతలు నెలకొనాలని, తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు దయానంద రావు, ఆకుల రమేష్, వంశీకృష్ణ, వి. సత్యనారాయణ, చంద్రపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బోనాల వేడుకల సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు.
Sravan Ss
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మర్రి శశిధర్ రెడ్డి ఆషాఢ బోనాల జాతర సందర్భంగా మాజీ మంత్రి, ఎన్ డి ఎం ఏ మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ జాతీయ మండలి సభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, శాంతి భద్రతలు నెలకొనాలని, తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు దయానంద రావు, ఆకుల రమేష్, వంశీకృష్ణ, వి. సత్యనారాయణ, చంద్రపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బోనాల వేడుకల సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు.
More news from తెలంగాణ and nearby areas
- ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక తనిఖీ.. పారిశుధ్యంపై అధికారుల ఆదేశాలు చిన్నశంకరంపేట మండల కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుధ్య పరిస్థితులను ప్రత్యేక అధికారి డాక్టర్ వెంకటయ్య శనివారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీలో ఆసుపత్రి పరిసరాల్లో శుభ్రత ప్రమాణాలు మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రి ఆవరణను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ రోగులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని సిబ్బందికి సూచించారు. లోపాలపై సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామని తెలిపారు. ఈ తనిఖీలో ఎంపీడీవో దామోదర్ పాల్గొన్నారు.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షణలో హరినామ సంకీర్తన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండ చుట్టూ శనివారం ఉదయం గిరిప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. భజన బృందాలు, స్థానికులు, భక్తులు, ఆలయ సిబ్బంది, అధికారులు హరినామ సంకీర్తనలతో స్వామివారి గిరిప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దగాని శ్రీనివాస్ గురుస్వామి, భువనగిరి అంజయ్య, కిరణ్, సత్తిరెడ్డి, సాయిబాబా, మహిళా భక్తులు, భజన బృందాలు పాల్గొన్నారు.1
- తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.2
- ఆలేరు రెవెన్యూ డివిజన్‌పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం 👉 ఆలేరు రెవెన్యూ డివిజన్‌పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం 👉 ఆలేరు రెవెన్యూ డివిజన్ ఖాయం... ప్రభుత్వం కట్టుబడి ఉంది!" – బీర్ల అయిలయ్య 👉 ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. 📡 T20HD Telugu news channel subscribe like share1
- జిల్లా బాలల ఉన్నత పాఠశాలకు వంట గ్యాస్ పొయ్యిలు అందజేసిన దాతలు పెద్దశంకరంపేట మండలంలోని జిల్లా బాలల ఉన్నత పాఠశాలకు సామాజిక సేవాభావాన్ని చాటుతూ గడ్డం వెంకన్న, మల్లన్న వంట గ్యాస్ పొయ్యిలను విరాళంగా అందజేశారు. వర్షాకాలంలో మధ్యాహ్న భోజనాల తయారీలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సహాయం చేసినట్లు వారు తెలిపారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ శిరీష సమక్షంలో గ్యాస్ పొయ్యిలను పాఠశాలకు అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శిరీష మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడంలో ఈ విరాళం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటూ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల సిబ్బంది కూడా వారి సేవాభావాన్ని అభినందించారు.1
- ఒకే ఊరికి 100 ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మేస్త్రీలు ఇసుక డైమండ్ పెరుగుతుంది: మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకేసారి ఒకే గ్రామంలో 100 ఇందిర ఇండ్లు ఇస్తే, మేస్త్రీలు, ఇసుక డిమాండ్ పెరుగుతుంది అందుకే దశలవారీగా ఇండ్లు మంజూరు చేస్తున్నాం -కలూరులో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.1
- కూలిపోయిందని దుష్ప్రచారం చేసిన కాలేశ్వరం ప్రాజెక్టు తోనే రైతులకు సాగునీరు కూలిపోయిందని దుష్ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రైతులకు సాగునీరు కాళేశ్వరం రివర్స్ పంపింగ్‌ను వృథా అంటూ దుష్ప్రచారం చేసి.. నేడు అదే రివర్స్ పంపింగ్ పద్ధతిలో SRSP వరద కాలువలోని రాంపూర్ పంప్‌హౌస్ మోటార్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తున్న ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌస్‌ల ద్వారా గోదావరి జలాలను SRSP వరద కాలువకు ఎదురెక్కిస్తుండడంతో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు అందుతున్న సాగునీరు1