Shuru
Apke Nagar Ki App…
ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరల్లో బియ్యం విక్రయాలు రేపటికి వాయిదా రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి తక్కువ ధరల్లో బియ్యం విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళే ఆరంభించాల్సి ఉన్నప్పటికీ భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో ఒక రోజు వాయిదా వేశారు. 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో కేజీ రూ.62 విలువ గల BPT సూపర్ ఫైన్ బియ్యం రూ.52కు, రూ.58 ధర పలికే గ్రేడ్-1 రా రైస్ రూ.50కి అందుబాటులో ఉంటాయి.
Duppada Anandarao
ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరల్లో బియ్యం విక్రయాలు రేపటికి వాయిదా రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి తక్కువ ధరల్లో బియ్యం విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళే ఆరంభించాల్సి ఉన్నప్పటికీ భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో ఒక రోజు వాయిదా వేశారు. 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో కేజీ రూ.62 విలువ గల BPT సూపర్ ఫైన్ బియ్యం రూ.52కు, రూ.58 ధర పలికే గ్రేడ్-1 రా రైస్ రూ.50కి అందుబాటులో ఉంటాయి.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అరకు: ధింసా నృత్యంతో రికార్డ్ సృష్టించడానికి సిద్దమవుతున్న విద్యార్ధినులు విద్యార్ధినిల ధింసా ప్రాక్టీస్ లతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ వేదిక కలకలలాడుతుంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆగష్ట్ 1న భోగాపురం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడి కి ధింసా నృత్యంతో స్వాగతం పలకడానికి 14 వేల మంది విద్యార్ధినిలు సిద్దమవుతున్నారు. ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్ధినిల వృత్తాకార కదలికలు, లయబద్ధ అడుగులు, సాంప్రదాయ వాయిద్యా శబ్దాలతో వేదిక ప్రాంతం అలరారుతోంది.1
- ఆషాడ మాసం సందర్భంగా శాకంబరీ దేవిగా అలంకరణలో దర్శనమిస్తున్న నూకాలమ్మ ఆషాడ మాసం పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం నాడు ఎస్ అన్నవరం నుకాలమ్మ ఆలయంలో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం గ్రామంలో శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి ని పలు రకాల కూరగాయలు పళ్ళు తో శాకంబరీ దేవిగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి వేద పండితులు ఆధ్వర్యంలో శాస్త్రాకంగా పూజలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతిని ఇచ్చారు. నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.1
- కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్‌ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్‌హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.1
- డీఎస్సీపై లోకేష్ విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారు – ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి వ్యాఖ్యలు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మీడియా సమావేశంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. డీఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణ, విద్యా రంగానికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడిన ఆయన, ప్రభుత్వ చర్యలను వివరించారు. అలాగే ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తూ పలు రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ మీడియా సమావేశం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించబడగా, అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేశారు.1
- ఆగస్టు 2న మూలారెడ్డి వర్ధంతి కార్యక్రమాలు :ఎమ్మెల్యే నల్లమిల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆగస్టు 2న బలభద్రపురంలో స్మారక పురస్కారాల సభ, ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరవుతారని, సత్యవాణి, డాక్టర్ రామచంద్రరెడ్డిలకు పురస్కారాలు అందజేస్తామన్నారు.పసలపూడిలో మూలారెడ్డి విగ్రహావిష్కరణ జరుగుతుందని,కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.1
- అమ్మఒడి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మదన్ కుమార్ ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా పాఠశాలను నడుపుతున్న అమ్మఒడి టెక్కలి : శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. టెక్కలి మండల పరిధిలో ఉన్న అమ్మ ఒడి ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆదేశాలను వదిలేసి ఇష్టం రాజ్యాంగా శుక్రవారం పాఠశాలను నిర్వహించారు. పాఠశాల నడుస్తుందని తెలుసుకున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు అక్కడికి చేరుకొని స్థానిక విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎంఈఓ లు దశరధి, చిన్నారావులు అక్కడికి చేరుకొని పాఠశాల యాజమాన్యంకి షో కాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మదన్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా పాఠశాల నడుపుతున్న అమ్మఒడి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఆయన విద్యాశాఖ అధికారులకు డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ తీవ్ర ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శ్యామ్, సంతోష్ కుమార్, ప్రశాంత్, పాల్గొన్నారు.1
- కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్‌ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్‌హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.1
- పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు, ఆయన స్వగ్రామం నల్లబెల్లికి చేరుకున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు, ఆయన స్వగ్రామం నల్లబెల్లికి చేరుకున్నాం.1
- *బస్సు ఢీకొని జింక మృతి.. రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్* మధురవాడ: మధురవాడ జూ పార్క్ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఓ జింక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు, కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో తగిన రక్షణ కంచెలు లేకపోవడం, అడవుల విస్తీర్ణం తగ్గడం, నీటి కొరత వంటి కారణాలతో వన్యప్రాణులు తరచూ ఆహారం, నీటి కోసం జాతీయ రహదారిపైకి వస్తున్నాయని తెలిపారు. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నాయని పేర్కొన్నారు. ప్రతి నెలా రెండు నుంచి మూడు జింకలు ఇలాంటి ప్రమాదాల్లో మృతి చెందుతున్నప్పటికీ అటవీ శాఖ, జూ పార్క్ అధికారులు తగిన నివారణ చర్యలు చేపట్టడం లేదని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం రహదారి వెంట రక్షణ కంచెలు ఏర్పాటు చేయడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు.1