షాద్‌నగర్‌లో ఆహార భద్రత ప్రశ్నార్థకం.. పర్యవేక్షణ ఏదీ? షాద్‌నగర్ నియోజకవర్గంలో రోడ్ల వెంట పుట్టగొడుగుల్లా టిఫిన్ సెంటర్లు వెలుస్తున్నా.. వాటి నిర్వహణ, ఆహార నాణ్యతపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 120కిపైగా టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్లు కొనసాగుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన ఆహారం అందించాల్సిన నిర్వాహకులు కొందరు కేవలం లాభసాటికే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒకే నూనెతో పదేపదే వంటలు.. చాలా టిఫిన్ సెంటర్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే వంట నూనెను పదేపదే వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వేడి చేసిన నూనెను పలుమార్లు ఉపయోగించడం వల్ల ఆహార నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంట నూనెతో పాటు ఇతర ముడి పదార్థాల నాణ్యతను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రతపై కూడా ప్రశ్నలు కొన్ని టిఫిన్ సెంటర్లు రోడ్ల పక్కనే ఏర్పాటు కావడంతో దుమ్ము, వాహనాల కాలుష్యం ఆహార పదార్థాలపై పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. వంట చేసే ప్రదేశాలు, పాత్రలు, నీటి వినియోగం, ఆహార పదార్థాల నిల్వ, సిబ్బంది పరిశుభ్రత వంటి అంశాలపై నిరంతరం తనిఖీలు జరగాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. లాభమే లక్ష్యమా? కొంతమంది నిర్వాహకులు ప్రజల ఆరోగ్యం కంటే వ్యాపార లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘లాభం వస్తే చాలు.. ప్రజల ఆరోగ్యం ఏమైపోతే మాకెందుకు’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. నాణ్యమైన పదార్థాలు, పరిశుభ్రమైన వంట విధానాలను పాటించాల్సిన బాధ్యతను నిర్వాహకులు గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడే హడావుడి? ఆహార భద్రత అధికారులు ఏడాదిలో కనీసం ఒక్కసారైనా అన్ని టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్లను తనిఖీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. కల్తీ లేదా నాణ్యతలేని ఆహారం కారణంగా సమస్య తలెత్తినప్పుడు మాత్రమే నామమాత్రపు తనిఖీలు నిర్వహించి, ఆ తర్వాత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ముందస్తు పర్యవేక్షణ లేకపోవడం వల్లే కొందరు నిర్వాహకుల్లో నిబంధనల పట్ల భయం లేకుండా పోతోందని ప్రజలు అంటున్నారు. అధికారుల పర్యవేక్షణ తక్షణ అవసరం ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన ఆహార భద్రత అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. షాద్‌నగర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, టిఫిన్ సెంటర్లలో ఉపయోగిస్తున్న నూనె, ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, అనుమతులు తదితర అంశాలను పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడతారా? వ్యాపారులపై కొరడా ఝుళిపిస్తారా? లేక ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతే స్పందిస్తారా? అనేది వేచి చూడాల్సిందే...!
షాద్‌నగర్‌లో ఆహార భద్రత ప్రశ్నార్థకం.. పర్యవేక్షణ ఏదీ? షాద్‌నగర్ నియోజకవర్గంలో రోడ్ల వెంట పుట్టగొడుగుల్లా టిఫిన్ సెంటర్లు వెలుస్తున్నా.. వాటి నిర్వహణ, ఆహార నాణ్యతపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 120కిపైగా టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్లు కొనసాగుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన ఆహారం అందించాల్సిన నిర్వాహకులు కొందరు కేవలం లాభసాటికే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒకే నూనెతో పదేపదే వంటలు.. చాలా టిఫిన్ సెంటర్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే వంట నూనెను పదేపదే వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వేడి చేసిన నూనెను పలుమార్లు ఉపయోగించడం వల్ల ఆహార నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంట నూనెతో పాటు ఇతర ముడి పదార్థాల నాణ్యతను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రతపై కూడా ప్రశ్నలు కొన్ని టిఫిన్ సెంటర్లు రోడ్ల పక్కనే ఏర్పాటు కావడంతో దుమ్ము, వాహనాల కాలుష్యం ఆహార పదార్థాలపై పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. వంట చేసే ప్రదేశాలు, పాత్రలు, నీటి వినియోగం, ఆహార పదార్థాల నిల్వ, సిబ్బంది పరిశుభ్రత వంటి అంశాలపై నిరంతరం తనిఖీలు జరగాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. లాభమే లక్ష్యమా? కొంతమంది నిర్వాహకులు ప్రజల ఆరోగ్యం కంటే వ్యాపార లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘లాభం
వస్తే చాలు.. ప్రజల ఆరోగ్యం ఏమైపోతే మాకెందుకు’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. నాణ్యమైన పదార్థాలు, పరిశుభ్రమైన వంట విధానాలను పాటించాల్సిన బాధ్యతను నిర్వాహకులు గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడే హడావుడి? ఆహార భద్రత అధికారులు ఏడాదిలో కనీసం ఒక్కసారైనా అన్ని టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్లను తనిఖీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. కల్తీ లేదా నాణ్యతలేని ఆహారం కారణంగా సమస్య తలెత్తినప్పుడు మాత్రమే నామమాత్రపు తనిఖీలు నిర్వహించి, ఆ తర్వాత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ముందస్తు పర్యవేక్షణ లేకపోవడం వల్లే కొందరు నిర్వాహకుల్లో నిబంధనల పట్ల భయం లేకుండా పోతోందని ప్రజలు అంటున్నారు. అధికారుల పర్యవేక్షణ తక్షణ అవసరం ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన ఆహార భద్రత అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. షాద్‌నగర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, టిఫిన్ సెంటర్లలో ఉపయోగిస్తున్న నూనె, ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, అనుమతులు తదితర అంశాలను పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడతారా? వ్యాపారులపై కొరడా ఝుళిపిస్తారా? లేక ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతే స్పందిస్తారా? అనేది వేచి చూడాల్సిందే...!
- కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.1
- తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ భారతరత్న మదర్ థెరిస్సా 116వ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆమె మార్గంలో నడిచి సేవాకార్యక్రమాలలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ ముదిరాజ్, రేమండ్ హార్ ఉడ్, నరేష్, డెంజిల్, ప్రభు, ఆంథోనీ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.1
- ANS Comfort Mattresses Manufacturers in Hyderabad Call Now: 9912524242 Orthopedic Mattresses Mattresses Manufacturers company #Hyderabad sleep mattress manufacturers1
- కొండా సుష్మిత అదెవతి... దానికెందుకు ఇస్తాం మేము టికెట్.. మా పార్టీకే సంబంధం లేదు.. మా పార్టీలో సభ్యత్వం లేదు.. కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం. కొండా సుష్మిత అదెవతి... దానికెందుకు ఇస్తాం మేము టికెట్.. మా పార్టీకే సంబంధం లేదు.. మా పార్టీలో సభ్యత్వం లేదు.. కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం.1
- ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- మల్కాజ్‌గిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, స్వామివారి దర్శనానికి స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు.1
- హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.1
- *సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం* హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు.. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బస్సులో ప్రయాణికులు ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేసినట్లు సమాచారం. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు.. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బస్సులో ప్రయాణికులు ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేసినట్లు సమాచారం.1