షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎన్సీఆర్ నగర్ కల్వర్టు పనులు శరవేగం కోట మండలంలోని ఎన్సీఆర్ నగర్ ఎదురుగా ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న కల్వర్టు పనులు టీడీపీ నాయకుడు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇటీవల భూమి పూజతో ప్రారంభమైన ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రస్తుతం వేగంగా ముందుకు సాగుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల సమయంలో ప్రజలు,వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ పనులను కొనసాగిస్తున్నారు.రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన రహదారిపై కూడా పనులు వేగంగా సాగుతుండటంతో నిర్మాణ సంస్థకు షేక్ జలీల్ అహ్మద్ నిరంతరం సూచనలు చేస్తున్నట్లు తెలిసింది.ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ, అభివృద్ధి పనులు ప్రారంభించడం మాత్రమే కాదు నిర్ణీత సమయంలో నాణ్యతతో పూర్తి చేయడమే మా లక్ష్యం.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, త్వరితగతిన కల్వర్టును అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాం అని తెలిపారు. అలాగే పోలీసు శాఖ సహకారంతో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పనులు జరుగుతున్నాయి.ప్రజల సహకారం కూడా ఎంతో అవసరం.పూర్తయిన తర్వాత ఈ కల్వర్టు ఎన్సీఆర్ నగర్ అభివృద్ధికి చిరునామాగా నిలుస్తుంది అని పేర్కొన్నారు. వర్షాకాలంలో నీటి ప్రవాహం వల్ల ఎదురయ్యే సమస్యలకు ఈ కల్వర్టు శాశ్వత పరిష్కారంగా మారనుందని,ప్రజల భద్రత, రాకపోకల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యంత నాణ్యతతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.స్థానికులు మాట్లాడుతూ ప్రారంభించిన వెంటనే పనులు వేగంగా కొనసాగించడం అభినందనీయం. ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుని చిత్తశుద్ధితో పనిచేస్తున్న షేక్ జలీల్ అహ్మద్‌కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. పనులు పూర్తయిన తర్వాత ఎన్సీఆర్ నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు, వాహనదారులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ నిర్మాణ పనులలో టీడీపీ కోట మండల ప్రధాన కార్యదర్శి తిరుమశెట్టి కోటేశ్వరరావు ఎంపిటిసి శంసుద్దీన్,టిడిపి నాయకులు షేక్ నౌషాద్, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పాల్గొన్నారు.

- తిరుపతిలో బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్ సీజ్ బైరాగిపట్టేడలో బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు.బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్ సీజ్ చేసిన కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్.ట్రేడ్ లైసెన్స్ లేదు, ఫుడ్ సేఫ్టీ మేజర్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నారన్న డాక్టర్ అన్వేష్ తిరుపతిలో బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్ సీజ్ బైరాగిపట్టేడలో బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు.బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్ సీజ్ చేసిన కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్.ట్రేడ్ లైసెన్స్ లేదు, ఫుడ్ సేఫ్టీ మేజర్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నారన్న డాక్టర్ అన్వేష్1
- అక్రమ మద్యం. ఇసుక అక్రమాలను అరికట్టాలి.. ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి. ముఖేష్ కుమార్ మీనా అక్రమ మద్యం, ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి: ముఖేష్ కుమార్ మీనా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎక్సైజ్), పరిశ్రమలు & వాణిజ్యం (గనులు) శాఖల ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మద్యం తయారీ, రవాణా, బహిరంగ మద్యపానాన్ని కట్టడి చేసి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇసుక సరఫరా సజావుగా ఉండేలా, ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మైనింగ్ లీజులు, ఖనిజ ఆదాయం, నాన్-వర్కింగ్ లీజులపై సమీక్ష నిర్వహించి పారదర్శకంగా పనులు చేపట్టాలని సూచించారు. వడ్డెర సహకార సంఘాలకు క్వారీ లీజుల కోసం గుర్తించిన భూములకు అవసరమైన అనుమతులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.1
- 🔴 చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల భారీ నిరసన...! 🔴 చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల భారీ నిరసన...!1
- భవిష్యవాణి పేరుతో మా ఊరి ప్రజలను మోసం చేస్తున్నారు: గ్రామస్తులు భవిష్య వాణి పేరుతో తమ గ్రామంలో ఓ వ్యక్తి ప్రజల నుంచి రూ 5 నుంచి 10 వేల వరకు వసూలు చేస్తున్నాడని యాదమరి మండలం, జంగాలపల్లి గ్రామస్తులు శుక్రవారం ఆరోపించారు. 'దేవుడి పేరుతో మాయ మాటలు చెప్పి నగదు తీసుకుంటున్నాడు. ప్రజలు ఇలాంటి మాయమాటలకు మోసపోకూడదని సదరు వ్యక్తిని ప్రశ్నిస్తే నా వద్ద లక్ష మంది ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు, మీపైనే నెగిటివ్ ప్రచారం చేస్తా అని బెదిరించినట్లు తమ దృష్టికి వచ్చింది' అని స్థానికులు తెలియజేశారు.1
- పుంగనూరు లో దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు ర్యాలీ.. అన్నమయ్య జిల్లా. పుంగనూరు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 వ తేదీ నుండీ ఈ రోజు అంగ 31 వ తేదీ వరకు దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు అందరూ పెన్ డౌన్ కార్యక్రమాలు చేస్తున్నాము. చివరి రోజు అయిన ఈ రోజు పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12.30. లకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండీ గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నా ము. కనుక మీరు ఈ కార్యక్రమములో పాల్గొని మాకు సహకరించగలరు. నమస్కారములతో.... పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం. పుంగనూరు......2
- ముర్రుపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష ప్రసవించిన అరగంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని పీలేరు మండలం తలుపుల పీహెచ్‌సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష అన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే పూర్తి పౌష్టికాహారమని తెలిపారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి తల్లికి ముర్రుపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ముర్రుపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష ప్రసవించిన అరగంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని పీలేరు మండలం తలుపుల పీహెచ్‌సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష అన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే పూర్తి పౌష్టికాహారమని తెలిపారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి తల్లికి ముర్రుపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు.1
- అన్నమయ్య జిల్లా, పుంగనూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన నిరసన శుక్రవారం 11వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్లు మాట్లాడుతూ కొత్త విధానంతో తమ ఉపాధితో పాటు ప్రజలకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తిరిగి ఆలోచించాలని, సేవా కేంద్రాల ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ముందుకు కదిలారు.1
- సెల్ ఫోన్ లో రీల్స్ చూస్తూ బస్సును నిర్లక్ష్యముగా నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్. అన్నమయ్య జిల్లా: మదనపల్లి నుండి చిత్తూరు వెళుతున్న బస్సులో సెల్ ఫోన్లో నిమగ్నమైన డ్రైవర్ ఒక చేతితో ఫోన్ చూస్తూ, మరొక్క చేతితో బస్సును నడుపుతున్నాడు. ఈ నిర్లక్ష్యము వలన ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు భాద్యులు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి భాద్యత లేని డ్రైవర్ల వల్ల ఏదైనా ప్రమాదం జరగక మునుపే సంబందిత అధికారులు స్పందిచి మరలా ఇలాంటి నిర్లక్ష్యపు పనులు చేయకుండా వారిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు. సెల్ ఫోన్ చూస్తూ బస్సు నడుపుతున్న డ్రైవర్ ను ప్రయాణికుడు తన ఫోన్ లో చిత్రీకరించడంతో వెలుగులోకి వచ్చింది. ఆ బస్సు పలమనేరు డిపోకు చెందిన బస్సు గా గుర్తింపు.1