Shuru
Apke Nagar Ki App…
35 రోజుల తలుపులమ్మ హుండీ ఆదాయం లెక్కింపు 27.16 లక్షల ఆదాయం కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం హుండీ లెక్కింపు సోమవారం నాడు జరిగింది. 35 రోజులు గాను 27 లక్షల 16 వేలు 159 రూపాయలు నగదు అదే విధంగా భక్తులు సమర్పించిన బంగారం 11.100 గ్రాములు 672 గ్రాములు వెండి వచ్చిందని దేవస్థానం పెనుమత్స విశ్వనాథరాజు వెల్లడించారు. ఈ ఉండి లెక్కింపు సహాయ కమిషనర్ సురేష్ నాయుడు పరిమిక్షించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
Mee news Reporter
35 రోజుల తలుపులమ్మ హుండీ ఆదాయం లెక్కింపు 27.16 లక్షల ఆదాయం కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం హుండీ లెక్కింపు సోమవారం నాడు జరిగింది. 35 రోజులు గాను 27 లక్షల 16 వేలు 159 రూపాయలు నగదు అదే విధంగా భక్తులు సమర్పించిన బంగారం 11.100 గ్రాములు 672 గ్రాములు వెండి వచ్చిందని దేవస్థానం పెనుమత్స విశ్వనాథరాజు వెల్లడించారు. ఈ ఉండి లెక్కింపు సహాయ కమిషనర్ సురేష్ నాయుడు పరిమిక్షించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Shyam1
- గిరిజనులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందళం అశోక్ వెంటనే రాజీనామా చేయాలని ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అసభ్య పదజాలం ఉపయోగించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. గిరిజనులకు క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.1
- *వంగలపూడి అనిత, ఇంచార్జి మంత్రి కామెంట్స్* లా అండ్ ఆర్డర్ విషయంలో పటిష్టంగా పని చేస్తున్నాం. ఈవిటీజింగ్ జరగకుండా శక్తి టీమ్స్ పని చేస్తున్నాయి. మూలపేట పోర్టు 70 శాతం కంప్లీట్ చేసింది కూటమి ప్రభుత్వం. ప్రతీ విషయంలో క్రెడిట్ చోరీ కొట్టాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మాది పని చేస్తున్న ప్రభుత్వం. వాటాలు అడగని ప్రభుత్వం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులను ఎత్తేసిన పరిస్థితి. వైసీపీ వాళ్ళు వాటాలు, పార్టనర్శిప్లు అడిగారు కాబట్టి చాలా ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళిపోయాయి. అమరావతి రాజధానిపై మండలిలో కూడా తీర్మానం చేయాలని చెప్తున్నారు. అసలు ఇంతకీ వైసీపీ నేతలు అమరావతి రాజధానిగా ఒప్పుకుంటున్నారా లేదా....సమాధానం చెప్పాలి. ఒకవేళ స్వాగతిస్తే ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? ప్రాజెక్టులకు ఏ రైతు కన్నీరు కారుస్తూ భూమి ఇవ్వకూడదు. అది మా పాలసీ. అభివృద్ధి,సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అహర్నిశలు కష్టపడుతున్నారు..1
- *విశాఖలో నాగరిక సమాజం తలదించుకునే ఘాతుకం: *పెళ్లి చేసుకోమన్నందుకే కిరాతకం.. నిన్న రాత్రి లొంగిపోయిన నిందితుడు.. గజవాకలో కలకలం* గాజువాక... విశాఖ నగరంలో మరో 'శ్రద్ధా వాకర్' తరహా ఉదంతం వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కోపంతో ఒక నేవీ ఉద్యోగి తన ప్రియురాలిని అత్యంత పాశవికంగా హత్య చేసి, ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిపెట్టిన భయంకర ఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గాజువాక సమీపంలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘోరం నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. నిందితుడు చింతాడ రవీంద్ర (35) ఇండియన్ నేవీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా విజయనగరం జిల్లాకు చెందిన మౌనిక (29) అనే మహిళతో అతనికి పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, గత కొన్ని రోజులుగా తనను పెళ్లి చేసుకోవాలని లేదా తనకు భారీగా డబ్బు సెటిల్ చేయాలని మౌనిక రవీంద్రపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్ళిన సమయాన్ని ఆసరాగా చేసుకుని, గత వారం మౌనికను తన నివాసమైన ఎల్.వి. నగర్‌కు పిలిపించుకున్నాడు. అక్కడ ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో రవీంద్ర ఆమెను గొంతు పిసికి చంపేశాడు. అనంతరం నేరం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ కవర్లలో చుట్టి తన ఇంట్లోని డబుల్ డోర్ ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. శరీరం నుంచి వచ్చే దుర్వాసన బయటకు రాకుండా గదిలో సెెంట్ స్ప్రేలు చల్లుతూ ఐదు రోజుల పాటు ఏమీ తెలియనట్లుగా అక్కడే గడిపాడు. మృతదేహాన్ని పూర్తిగా మాయం చేయడం సాధ్యం కాదని గ్రహించిన రవీంద్ర, తన పాపం పండుతుందన్న భయంతో నిన్న (ఆదివారం) రాత్రి నేరుగా మల్కాపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. తాను తన ప్రియురాలిని చంపి ఫ్రిజ్‌లో పెట్టానని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే అతని ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా, ఫ్రిజ్‌లో కుళ్ళిన స్థితిలో ఉన్న శరీర భాగాలు లభ్యమయ్యాయి. మౌనిక తల మరియు చేతులను నిందితుడు నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతాల్లో పారవేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఈరోజు ఉదయం నుంచి పోలీసులు నిందితుడిని వెంటబెట్టుకుని ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి శరీర భాగాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై నేవీ ఉన్నతాధికారులు కూడా ఆరా తీస్తున్నారు. వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు ఎలా చిన్నాభిన్నం అవుతున్నాయి, ప్రాణాలు ఎలా పోతున్నాయనే దానికి ఈ ఘటన ఒక పరాకాష్టగా నిలిచింది. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.3
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న P4 కార్యక్రమంలో మూడు కుటుంబాలను దత్తత తీసుకొని వారికి సహాయ సహకారులు అందించి మండల స్థాgయిలో ఉత్తమ మార్గదర్శిగా నిలిచిన శ్రీ కొండదాడి రాజేష్ ని గౌరవ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయ కృష్ణ, సబ్ కలెక్టర్ ఐఏఎస్ స్వప్నిల్ పవర్. సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజేష్ ని ఆదర్శంగా తీసుకొని మరి కొంతమంది కొన్ని కుటుంబాలను దత్తత తీసుకొని ఆ కుటుంబ అభివృద్ధికి పాటుపడాలని వాళ్లు ఈ సందర్భంగా కోరారు.1
- సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిస్కారం కోరుతూ వర్కర్స్ యూనియన్ చేపట్టిన సింగరేణి హెడ్డాఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కోల్ బెల్ట్ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది కార్మికులు, యూనియన్ కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు, హెడ్డాఫీసు చేరుకొని ప్రధాన ద్వారం ఎదుట బైటాయించి ధర్నా చేశారు. పొర్లు దండాలతో విన్నూత రీతీలో నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటలపాటు ధర్నా చేపట్టడంతో పోలీసులు అడ్డుకోవడంతో నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకోవడంతో హెడ్డాఫీసు ఏరియా ఉద్రిక్తంగా మారింది. సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాతోపాటు యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ తదితరులను పోలీసులు నిర్బంధించి 1 టౌన్ పోలీస్ స్టేషన్'కు తరలించారు.2
- . సోషల్ మీడియా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు, మహిళలు, కుటుంబాలపై దాడులు, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చట్టం అవసరం, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించి మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాం. మట్టా రాగమయి దయానంద్ ఎమ్మెల్యే, సత్తుపల్లి.1
- డా. తనూజ రాణి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, పరుగుల రాణి పీటీ ఉషను మర్యాదపూర్వకంగా కలిశారు. అరకు ప్రాంతానికి చెందిన గిరిజన చిన్నారి కొర్ర జీవనతన్య ప్రతిభను వివరించారు. కేరళలోని ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్‌లో ప్రవేశం కల్పించి ప్రొఫెషనల్ శిక్షణ ఇవ్వాలని కోరారు. సరైన శిక్షణ, పోషకాహారం అందితే జీవనతన్య మంచి అథ్లెట్‌గా ఎదుగుతుందని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు.1