logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*పత్రికా ప్రకటన* సత్తుపల్లిలోని జె.వి.ఆర్.ఓ.సి (JVROC) ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్.వి.ఆర్. ప్రహ్లాద్ గారి ఆధ్వర్యంలో గని కార్మికులకు వేసవి జాగ్రత్తలపై నిర్వహించిన అవగాహన సదస్సులో కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ లలిత గారు పాల్గొని, ఎండల తీవ్రత దృష్ట్యా వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ బి. రాజేశ్వరరావు, ఆపరేషన్స్ మేనేజర్ జి. కళ్యాణ్ రామ్, వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి డి. కావ్యతో పాటు ఐఎన్టీయూసీ (INTUC) అసిస్టెంట్ పిట్ సెక్రటరీ శ్రీధర్, ఏఐటీయూసీ (AITUC) పిట్ సెక్రటరీ జి. నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లలిత గారు మాట్లాడుతూ, కార్మికులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటం కోసం కంపెనీ సరఫరా చేస్తున్న ఓఆర్ఎస్ (ORS) మరియు మజ్జిగను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, నిరంతరం నీరు తాగుతూ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. - అధికార ప్రతినిధి, సత్తుపల్లి ఏరియా

2 hrs ago
user_V Ramarao
V Ramarao
సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
2 hrs ago

*పత్రికా ప్రకటన* సత్తుపల్లిలోని జె.వి.ఆర్.ఓ.సి (JVROC) ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్.వి.ఆర్. ప్రహ్లాద్ గారి ఆధ్వర్యంలో గని కార్మికులకు వేసవి జాగ్రత్తలపై నిర్వహించిన అవగాహన సదస్సులో కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ లలిత గారు పాల్గొని, ఎండల తీవ్రత దృష్ట్యా వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక సూచనలు

చేశారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ బి. రాజేశ్వరరావు, ఆపరేషన్స్ మేనేజర్ జి. కళ్యాణ్ రామ్, వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి డి. కావ్యతో పాటు ఐఎన్టీయూసీ (INTUC) అసిస్టెంట్ పిట్ సెక్రటరీ శ్రీధర్, ఏఐటీయూసీ (AITUC) పిట్ సెక్రటరీ జి. నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా

డాక్టర్ లలిత గారు మాట్లాడుతూ, కార్మికులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటం కోసం కంపెనీ సరఫరా చేస్తున్న ఓఆర్ఎస్ (ORS) మరియు మజ్జిగను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, నిరంతరం నీరు తాగుతూ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. - అధికార ప్రతినిధి, సత్తుపల్లి ఏరియా

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఈయన మా ఊరి మంత్రి చాలామందికి ఈయన ఒక ఆదర్శం గ్రేట్ సార్ మీరు
    1
    ఈయన మా ఊరి మంత్రి చాలామందికి ఈయన ఒక ఆదర్శం గ్రేట్ సార్ మీరు
    user_Gadi Lalitha
    Gadi Lalitha
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • 14 ఏప్రిల్ 2026: శివకోడు... డా.బి.ఆర్.అంభేథ్కర్ గారి135 వ జయంతి కార్యక్రమం శివకోడు జైభీమ్ నగర్ (పోస్టాఫీసు రోడ్)నందుఏర్పాటుచేసిన జయంతిఉత్సవాలలో ఉద్వేగపూరితంగామాట్లాడుతు,నేటియువతరం అంభేథ్కర్ గారి అడుగుజాడలలోనడవాలని. ఆయన ఆశయాలతోముందుకుసాగాలని ఈరోజు అంభేథ్కర్ నెలకొల్పిన రాజ్యాంగ హక్కులవలనే నేను చదువుకుంటున్నానని ఆయనేమనదళితజాతికిదేవుడని.నేటియువత అంభేథ్కర్ గారినిఅవగాహన చేసుకుని ఆయన ఆశయాలనుముందుకుతీసుకెళ్లవలసినబాద్యతనేటియువతరంఅయినమనందరిపైన ఆదారపడిఉన్నదని.అందుకుమనమందరంఐక్యతతోముందుకుసాగాలని.ప్రసంగించిన విద్యార్థిని.... కొల్లాబత్తుల రేష్మా... జైభీమ్.జయహోఅంభేథ్కర్....
    1
    14 ఏప్రిల్ 2026:
శివకోడు...
డా.బి.ఆర్.అంభేథ్కర్ గారి135 వ జయంతి కార్యక్రమం శివకోడు జైభీమ్ నగర్ (పోస్టాఫీసు రోడ్)నందుఏర్పాటుచేసిన జయంతిఉత్సవాలలో ఉద్వేగపూరితంగామాట్లాడుతు,నేటియువతరం అంభేథ్కర్ గారి అడుగుజాడలలోనడవాలని. ఆయన ఆశయాలతోముందుకుసాగాలని ఈరోజు అంభేథ్కర్ నెలకొల్పిన రాజ్యాంగ హక్కులవలనే నేను చదువుకుంటున్నానని ఆయనేమనదళితజాతికిదేవుడని.నేటియువత అంభేథ్కర్ గారినిఅవగాహన
చేసుకుని ఆయన ఆశయాలనుముందుకుతీసుకెళ్లవలసినబాద్యతనేటియువతరంఅయినమనందరిపైన
ఆదారపడిఉన్నదని.అందుకుమనమందరంఐక్యతతోముందుకుసాగాలని.ప్రసంగించిన
విద్యార్థిని.... కొల్లాబత్తుల రేష్మా...
జైభీమ్.జయహోఅంభేథ్కర్....
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై శ్రీకాంత్‌పై అత్యాచారం కేసు నమోదైంది. కరీంనగర్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఆయన, 2025లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన మహిళతో చాటింగ్ కొనసాగించాడు. ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకుని ఇటీవల వరంగల్‌కు వచ్చి లొకేషన్ తీసుకుని ఇంటికి వెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలి ఫిర్యాదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    1
    వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై శ్రీకాంత్‌పై అత్యాచారం కేసు నమోదైంది. కరీంనగర్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఆయన, 2025లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన మహిళతో చాటింగ్ కొనసాగించాడు. ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకుని ఇటీవల వరంగల్‌కు వచ్చి లొకేషన్ తీసుకుని ఇంటికి వెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలి ఫిర్యాదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • ​మునగాల, సూర్యాపేట జిల్లా: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం ఓ నిరుపేద మహిళను ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ సమక్షంలోనే బాధితురాలు పురుగుల మందు తాగడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ​అసలేం జరిగింది? ​మునగాల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఎస్పీ నరసింహ మరియు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. సభ జరుగుతుండగా, తాడ్వాయి గ్రామానికి చెందిన సునీత అనే మహిళ ఒక్కసారిగా అధికారుల ముందుకు వచ్చి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగింది. దీన్ని గమనించిన పోలీసులు, సిబ్బంది వెంటనే ఆమెను అడ్డుకుని చికిత్స నిమిత్తం హుటాహుటిన కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ​బాధితురాలి ఆవేదన: ​తాడ్వాయి గ్రామాన్ని ప్రభుత్వం 'ఇందిరమ్మ ఇళ్ల పైలెట్ ప్రాజెక్ట్' కింద ఎంపిక చేసింది. బాధిత మహిళ సునీత తెలిపిన వివరాల ప్రకారం: ​తన పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ, అధికారులు కావాలని దాన్ని వేరొకరికి కేటాయించారు. ​కాంగ్రెస్ నాయకులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, అర్హులకు అందాల్సిన సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ​పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, కలెక్టర్ ముందే తనువు చాలించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ​అధికారుల స్పందన: ​ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఇళ్ల కేటాయింపులో ఏవైనా అక్రమలు జరిగాయా అనే కోణంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ​రాజకీయ కారణాలతో అర్హులకు అన్యాయం జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
    1
    ​మునగాల, సూర్యాపేట జిల్లా:
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం ఓ నిరుపేద మహిళను ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ సమక్షంలోనే బాధితురాలు పురుగుల మందు తాగడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
​అసలేం జరిగింది?
​మునగాల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఎస్పీ నరసింహ మరియు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. సభ జరుగుతుండగా, తాడ్వాయి గ్రామానికి చెందిన సునీత అనే మహిళ ఒక్కసారిగా అధికారుల ముందుకు వచ్చి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగింది. దీన్ని గమనించిన పోలీసులు, సిబ్బంది వెంటనే ఆమెను అడ్డుకుని చికిత్స నిమిత్తం హుటాహుటిన కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
​బాధితురాలి ఆవేదన:
​తాడ్వాయి గ్రామాన్ని ప్రభుత్వం 'ఇందిరమ్మ ఇళ్ల పైలెట్ ప్రాజెక్ట్' కింద ఎంపిక చేసింది. బాధిత మహిళ సునీత తెలిపిన వివరాల ప్రకారం:
​తన పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ, అధికారులు కావాలని దాన్ని వేరొకరికి కేటాయించారు.
​కాంగ్రెస్ నాయకులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, అర్హులకు అందాల్సిన సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
​పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, కలెక్టర్ ముందే తనువు చాలించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
​అధికారుల స్పందన:
​ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఇళ్ల కేటాయింపులో ఏవైనా అక్రమలు జరిగాయా అనే కోణంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
​రాజకీయ కారణాలతో అర్హులకు అన్యాయం జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
    user_PRK
    PRK
    Local News Reporter కేతేపల్లి, నల్గొండ, తెలంగాణ•
    4 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    17 hrs ago
  • రాయవరంలో ఘనంగా 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవం ​పిఠాపురం: రైతులు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించి ప్రకృతి సిద్ధమైన పద్ధతులు పాటించినప్పుడే భూసారం పెరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి (జెడి) ఎన్. విజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పిఠాపురం మండలం రాయవరం గ్రామంలో నిర్వహించిన 'మంచి వ్యవసాయ పద్ధతులు' మరియు 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడి ఎన్. విజయ్ కుమార్ మాట్లాడుతూ పంట కోతలకు ముందే పొలంలో నవధాన్యాలు లేదా పి.ఎం.డి.ఎస్ విత్తనాలు చల్లడం వల్ల భూమికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయని తెలిపారు. రాయవరంలో ఇప్పటికే 100 ఎకరాల్లో ఈ పద్ధతిని అమలు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే, హార్వెస్టర్ల ద్వారా కోత కోసే సమయంలో బ్లోయర్ వాడటం వల్ల ధాన్యంలో తేమ తగ్గి రైతులకు మంచి ధర లభిస్తుందని సూచించారు. 14 వారాల పొలంబడి శిక్షణలో నేర్చుకున్న అనుభవాలను రైతులు ఈ సందర్భంగా వివరించారు. సహజ కషాయాల వాడకంతో ఎకరానికి రూ.10,000 పెట్టుబడి తగ్గిందని రైతు కర్నీడి జగ్గారావు తెలిపారు. జీవామృతం,పి.ఎం.డి.ఎస్ పద్ధతుల వల్ల పంట బలంగా ఉండి తుపానులకు కూడా పడిపోలేదని రైతు పెదపూడి విష్ణు చక్రం వివరించారు. ​జిల్లేడు కషాయం,మట్టి ద్రావణం వంటి పద్ధతులతో దెబ్బతిన్న పంటను మళ్ళీ ఆరోగ్యవంతంగా మార్చి మంచి దిగుబడి సాధించానని కౌలు రైతు మాదేపల్లి సీతారాములు గర్వంగా చెప్పారు. సహాయ వ్యవసాయ సంచాలకులు ఏడీఏ స్వాతి మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయానికి రాయవరం గ్రామాన్ని ఆదర్శంగా నిలపాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి ఏవో గంగాధర్ 14 వారాల పొలంబడి ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఏపీ సీ ఎన్ ఎఫ్ సిబ్బంది మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    4
    రాయవరంలో ఘనంగా 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవం
​పిఠాపురం: రైతులు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించి ప్రకృతి సిద్ధమైన పద్ధతులు పాటించినప్పుడే భూసారం పెరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి (జెడి) ఎన్. విజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పిఠాపురం మండలం రాయవరం గ్రామంలో నిర్వహించిన 'మంచి వ్యవసాయ పద్ధతులు' మరియు 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడి  ఎన్. విజయ్ కుమార్ మాట్లాడుతూ పంట కోతలకు ముందే పొలంలో నవధాన్యాలు లేదా పి.ఎం.డి.ఎస్  విత్తనాలు చల్లడం వల్ల భూమికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయని తెలిపారు. రాయవరంలో ఇప్పటికే 100 ఎకరాల్లో ఈ పద్ధతిని అమలు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే, హార్వెస్టర్ల ద్వారా కోత కోసే సమయంలో బ్లోయర్ వాడటం వల్ల ధాన్యంలో తేమ తగ్గి రైతులకు మంచి ధర లభిస్తుందని సూచించారు. 14 వారాల పొలంబడి శిక్షణలో నేర్చుకున్న అనుభవాలను రైతులు ఈ సందర్భంగా వివరించారు. సహజ కషాయాల వాడకంతో ఎకరానికి రూ.10,000 పెట్టుబడి తగ్గిందని రైతు కర్నీడి జగ్గారావు తెలిపారు.
జీవామృతం,పి.ఎం.డి.ఎస్ పద్ధతుల వల్ల పంట బలంగా ఉండి తుపానులకు కూడా పడిపోలేదని రైతు పెదపూడి విష్ణు చక్రం వివరించారు. ​జిల్లేడు కషాయం,మట్టి ద్రావణం వంటి పద్ధతులతో దెబ్బతిన్న పంటను మళ్ళీ ఆరోగ్యవంతంగా మార్చి మంచి దిగుబడి సాధించానని కౌలు రైతు మాదేపల్లి సీతారాములు గర్వంగా చెప్పారు. సహాయ వ్యవసాయ సంచాలకులు ఏడీఏ స్వాతి మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయానికి రాయవరం గ్రామాన్ని ఆదర్శంగా నిలపాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి ఏవో గంగాధర్ 14 వారాల పొలంబడి ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఏపీ సీ ఎన్ ఎఫ్ సిబ్బంది మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    21 hrs ago
  • వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పర్వతగిరి మండలం రావూరుకు చెందిన దామెర శ్రీనివాస్(34) అక్కడికక్కడే మృతి చెందాడు. కొత్తూరులోని మీసేవా కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఆయన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య స్వర్ణలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్‌కు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉండగా, ఆయన అకాల మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.
    1
    వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పర్వతగిరి మండలం రావూరుకు చెందిన దామెర శ్రీనివాస్(34) అక్కడికక్కడే మృతి చెందాడు. కొత్తూరులోని మీసేవా కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఆయన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య స్వర్ణలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్‌కు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉండగా, ఆయన అకాల మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • ​నకిరేకల్: నియోజకవర్గంలో అధికారుల ఏకపక్ష వైఖరి, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సాగుతున్న అడ్డగోలు దోపిడీపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ​రాజకీయ ఏజెంట్లతో రైతులకు ఉరితాడు ​గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐకేపీ, పీఏసీఎస్ మరియు మహిళా సంఘాల ద్వారా ఎంతో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని చిరుమర్తి లింగయ్య గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలను ఏజెంట్లుగా నియమించి, రైతుల రక్తాన్ని తాగుతోందని విమర్శించారు. వారి స్వార్థం కోసం రైతుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ​అంకెల్లో దోపిడీ.. క్వింటాకు 7 కేజీల నష్టం! ​ధాన్యం తూకాల్లో జరుగుతున్న మోసాలను ఆయన లెక్కలతో సహా వివరించారు: ​అదనపు తూకం: గతంలో బస్తాకు 40 కేజీలు ఉంటే, ఇప్పుడు బలవంతంగా 42 కేజీలు తూకం వేయిస్తూ క్వింటాకు 5 కేజీల పంటను అదనంగా లాగేసుకుంటున్నారు. ​రిజిస్టర్ల మాయాజాలం: కొన్ని చోట్ల బస్తాకు 37 కేజీలు తూకం వేసి, రికార్డుల్లో మాత్రం 35 కేజీలే రాస్తున్నారని.. ఇలా క్వింటాకు మరో కేజీ, అంటే మొత్తంగా 7 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. ​అధికారులకు హెచ్చరిక: "చట్టం తన పని తాను చేస్తుంది" ​ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులపై లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి, కాంగ్రెస్ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేయడంపై మండిపడ్డారు. "అధికారులు కాంగ్రెస్ తొత్తులుగా మారకండి, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని హెచ్చరించారు. ​పోలీసుల వేధింపులు.. కలెక్టరేట్ ముట్టడికి పిలుపు ​చిన్న చిన్న కారణాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు రాక, కరెంటు లేక రైతులు అల్లాడుతున్నారని.. తక్షణమే అదనపు తూకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. ​పాల్గొన్న నాయకులు: ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ మరియు కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, సర్పంచ్ గొర్ల వీరు, మాజీ కౌన్సిలర్లు పల్లె విజయ్ గుర్రం గణేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ​నకిరేకల్: నియోజకవర్గంలో అధికారుల ఏకపక్ష వైఖరి, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సాగుతున్న అడ్డగోలు దోపిడీపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
​రాజకీయ ఏజెంట్లతో రైతులకు ఉరితాడు
​గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐకేపీ, పీఏసీఎస్ మరియు మహిళా సంఘాల ద్వారా ఎంతో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని చిరుమర్తి లింగయ్య గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలను ఏజెంట్లుగా నియమించి, రైతుల రక్తాన్ని తాగుతోందని విమర్శించారు. వారి స్వార్థం కోసం రైతుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు.
​అంకెల్లో దోపిడీ.. క్వింటాకు 7 కేజీల నష్టం!
​ధాన్యం తూకాల్లో జరుగుతున్న మోసాలను ఆయన లెక్కలతో సహా వివరించారు:
​అదనపు తూకం: గతంలో బస్తాకు 40 కేజీలు ఉంటే, ఇప్పుడు బలవంతంగా 42 కేజీలు తూకం వేయిస్తూ క్వింటాకు 5 కేజీల పంటను అదనంగా లాగేసుకుంటున్నారు.
​రిజిస్టర్ల మాయాజాలం: కొన్ని చోట్ల బస్తాకు 37 కేజీలు తూకం వేసి, రికార్డుల్లో మాత్రం 35 కేజీలే రాస్తున్నారని.. ఇలా క్వింటాకు మరో కేజీ, అంటే మొత్తంగా 7 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు.
​అధికారులకు హెచ్చరిక: "చట్టం తన పని తాను చేస్తుంది"
​ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులపై లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి, కాంగ్రెస్ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేయడంపై మండిపడ్డారు. "అధికారులు కాంగ్రెస్ తొత్తులుగా మారకండి, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని హెచ్చరించారు.
​పోలీసుల వేధింపులు.. కలెక్టరేట్ ముట్టడికి పిలుపు
​చిన్న చిన్న కారణాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు రాక, కరెంటు లేక రైతులు అల్లాడుతున్నారని.. తక్షణమే అదనపు తూకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు.
​పాల్గొన్న నాయకులు:
ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ మరియు కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, సర్పంచ్ గొర్ల వీరు, మాజీ కౌన్సిలర్లు పల్లె విజయ్ గుర్రం గణేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_PRK
    PRK
    Local News Reporter కేతేపల్లి, నల్గొండ, తెలంగాణ•
    22 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.