మన ఊరు - మన భద్రత - మన బాధ్యత : పోలీస్ కమిషనర్ వెల్లడి*. *“అరైవ్ అలైవ్ – 2026”లో రోడ్ సేఫ్టీ , సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ , డ్రగ్స్ నియంత్రణ , సీసీటీవీ కెమెరాల ఏర్పాట్ల పై కార్పొరేటర్స్ కు మరియు గ్రామ సర్పంచ్ లకు అవగాహన కార్యక్రమం నిర్వహణ* *జిల్లా లోని ప్రజలందరూ ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారు అందరూ హెల్మెట్ ధరిస్తే జిల్లా వ్యాప్తంగా అందరిని ఐపిఎల్ మ్యాచ్ ఉచితంగా చూపిస్తాము* నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాదు డివిజన్ పరిధిలో కొత్తగా ఎన్నికైనటువంటి కార్పొరేటర్స్ మరియు గ్రామ సర్పంచులు లతో *మన ఊరు - మన భద్రత - మన బాధ్యత* అనే కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాదు లోని శ్రీ రామ గార్డెన్స్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్.,* గారు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భముగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ *గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర డిజిపి* గారి ఆదేశాల మేరకు అరేవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచంలో ఒక్క యాక్సిడెంట్ జరుగకుండా ఉన్న దేశం ప్రస్తుతం ఫిన్లాండ్ దేశం అని అన్నారు. వ్యవసాయాదరులు రోడ్డు పై ధాన్యం ఆరబెట్టినప్పుడు భద్రత కోన్లు, లేదా బకెట్ పెట్టి స్టిక్కర్లు అంటించాలని , డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకం నిషేధం అని , ప్రతిఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని , డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనాల మధ్య తగినంత దూరం ఉండేటట్లు చూడాలని , యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రతీ ఒక్కరు వారిని గమనిస్తూ ఉండాలని , ఆన్లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండాలని , రోడ్డు భద్రతా నియమాలు , ట్రాఫిక్ నిబంధనలు , డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పించారు. అధిక వేగం , క్రమశిక్షణ లోపం , అలసటతో వాహనం నడపడం వంటి అంశాలు ప్రమాదాలకు దారి తీస్తాయని వివరించారు. ఆరోగ్యంపై శ్రద్ధ , ట్రాఫిక్ నియమాల కట్టుదిట్టమైన పద్ధతుల ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో అవగాహన పెరిగి, రోడ్డు ప్రమాదాల నివారణకు , డ్రగ్స్ మీద యువతకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. జిల్లా లోని ప్రజలందరూ ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారు అందరూ హెల్మెట్ ధరిస్తే జిల్లా వ్యాప్తంగా అందరిని ఐపిఎల్ మ్యాచ్ ఉచితంగా చూపిస్తాము అని అన్నారు. *నిజామాబాదు డివిజన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి యొక్క కుటుంబ సభ్యులు వచ్చి మాట్లాడటం జరిగింది*. ప్రధానంగా రోడ్డు ప్రమాదంలో మరణించిన మాక్లూరు మండలం నికి చెందినటువంటి వ్యక్తి మరణించిన సందర్భంగా అతని కుటుంబంలో చాలా నిరుపేదగా ఉండటం వలన వారి కుటుంబ సభ్యురాలు ఆయన పుష్ప గారికి అప్పుడే జమ చేసిన డబ్బులను పోలీస్ కమిషనర్ గారి చేతుల ద్వారా అందించడం జరిగింది. *ఆ తరువాత అరైవ్ అలైవ్ సంబందించిన ప్రతిజ్ఞ చేయడం జరిగింది* ఇట్టి కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీ జి. బస్వా రెడ్డి , నగర మేయర్ శ్రీమతి కూరగాయల ఉమారాణి , నిజామాబాదు ఇంచార్జి ఎసిపి శ్రీ రాజా వెంకట్ రెడ్డి , ట్రాఫిక్ ఏసిపి శ్రీ మస్తాన్ అలీ , సర్పంచ్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు శ్రీ చిన్న సాయిరెడ్డి , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీశైలం , సిఐలు , ఎస్సైలు , , యాంటీ నార్కోటిక్ ఇన్స్పెక్టర్ శ్రీ పూర్ణేశ్వర్ , సైబర్ క్రైమ్ ఆర్. ఎస్. ఐ శ్రీ రవి , గ్రామ సర్పంచ్ లు , కార్పొరేటర్స్ , ప్రజలు మరియు పోలీస్ కళా బృందం సభ్యులు పాల్గొన్నారు.
మన ఊరు - మన భద్రత - మన బాధ్యత : పోలీస్ కమిషనర్ వెల్లడి*. *“అరైవ్ అలైవ్ – 2026”లో రోడ్ సేఫ్టీ , సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ , డ్రగ్స్ నియంత్రణ , సీసీటీవీ కెమెరాల ఏర్పాట్ల పై కార్పొరేటర్స్ కు మరియు గ్రామ సర్పంచ్ లకు అవగాహన కార్యక్రమం నిర్వహణ* *జిల్లా లోని ప్రజలందరూ ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారు అందరూ హెల్మెట్ ధరిస్తే జిల్లా వ్యాప్తంగా అందరిని ఐపిఎల్ మ్యాచ్ ఉచితంగా చూపిస్తాము* నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాదు డివిజన్ పరిధిలో కొత్తగా ఎన్నికైనటువంటి కార్పొరేటర్స్ మరియు గ్రామ సర్పంచులు లతో *మన ఊరు - మన భద్రత - మన బాధ్యత* అనే కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాదు లోని శ్రీ రామ గార్డెన్స్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్.,* గారు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భముగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ *గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర డిజిపి* గారి ఆదేశాల మేరకు అరేవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా
నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచంలో ఒక్క యాక్సిడెంట్ జరుగకుండా ఉన్న దేశం ప్రస్తుతం ఫిన్లాండ్ దేశం అని అన్నారు. వ్యవసాయాదరులు రోడ్డు పై ధాన్యం ఆరబెట్టినప్పుడు భద్రత కోన్లు, లేదా బకెట్ పెట్టి స్టిక్కర్లు అంటించాలని , డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకం నిషేధం అని , ప్రతిఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని , డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనాల మధ్య తగినంత దూరం ఉండేటట్లు చూడాలని , యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రతీ ఒక్కరు వారిని గమనిస్తూ ఉండాలని , ఆన్లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండాలని , రోడ్డు భద్రతా నియమాలు , ట్రాఫిక్ నిబంధనలు , డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పించారు. అధిక వేగం , క్రమశిక్షణ లోపం , అలసటతో వాహనం నడపడం వంటి అంశాలు ప్రమాదాలకు దారి తీస్తాయని వివరించారు. ఆరోగ్యంపై శ్రద్ధ , ట్రాఫిక్ నియమాల కట్టుదిట్టమైన పద్ధతుల ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో అవగాహన పెరిగి, రోడ్డు ప్రమాదాల నివారణకు , డ్రగ్స్ మీద యువతకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. జిల్లా లోని ప్రజలందరూ ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారు అందరూ హెల్మెట్ ధరిస్తే జిల్లా వ్యాప్తంగా
అందరిని ఐపిఎల్ మ్యాచ్ ఉచితంగా చూపిస్తాము అని అన్నారు. *నిజామాబాదు డివిజన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి యొక్క కుటుంబ సభ్యులు వచ్చి మాట్లాడటం జరిగింది*. ప్రధానంగా రోడ్డు ప్రమాదంలో మరణించిన మాక్లూరు మండలం నికి చెందినటువంటి వ్యక్తి మరణించిన సందర్భంగా అతని కుటుంబంలో చాలా నిరుపేదగా ఉండటం వలన వారి కుటుంబ సభ్యురాలు ఆయన పుష్ప గారికి అప్పుడే జమ చేసిన డబ్బులను పోలీస్ కమిషనర్ గారి చేతుల ద్వారా అందించడం జరిగింది. *ఆ తరువాత అరైవ్ అలైవ్ సంబందించిన ప్రతిజ్ఞ చేయడం జరిగింది* ఇట్టి కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీ జి. బస్వా రెడ్డి , నగర మేయర్ శ్రీమతి కూరగాయల ఉమారాణి , నిజామాబాదు ఇంచార్జి ఎసిపి శ్రీ రాజా వెంకట్ రెడ్డి , ట్రాఫిక్ ఏసిపి శ్రీ మస్తాన్ అలీ , సర్పంచ్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు శ్రీ చిన్న సాయిరెడ్డి , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీశైలం , సిఐలు , ఎస్సైలు , , యాంటీ నార్కోటిక్ ఇన్స్పెక్టర్ శ్రీ పూర్ణేశ్వర్ , సైబర్ క్రైమ్ ఆర్. ఎస్. ఐ శ్రీ రవి , గ్రామ సర్పంచ్ లు , కార్పొరేటర్స్ , ప్రజలు మరియు పోలీస్ కళా బృందం సభ్యులు పాల్గొన్నారు.
- *ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు త్వరితగతిన అట్టి వ్యక్తిని కాపాడడానికి సిపిఆర్ ఎంతో ఉపయోగపడుతుంది పోలీస్ కమిషనర్ వెల్లడి* *జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాల నిర్వహణ* *ప్రతి ఒక్కరూ సిపిఆర్ పద్ధతి అవగాహన కలిగి ఉండవలెను* రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న *99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో* భాగంగా రోడ్డు ప్రమాదాలు నియంత్రించడం ప్రజలలో ట్రాఫిక్ నియమాలు పట్ల బాధ్యత భావం పెంపొందించడం లక్ష్యంగా అరైవ్ ఆలైవ్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు . ఇందులో భాగముగా నేడు ఐదవ రోజు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ యందు బ్లూ కోర్టు సిబ్బందికి మరియు ఆటో డ్రైవర్లకు సిపిఆర్ పద్ధతి పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పీ.ఎస్*., గారు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా ప్రాణరక్షణకు సంబంధించిన అత్యవసర నైపుణ్యాలపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పోలీస్ కమిషనర్ గారు పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు వంటి ప్రజలతో నిత్యం సంబంధం కలిగిన వర్గాలు తప్పనిసరిగా CPR (Cardiopulmonary Resuscitation) విధానం గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ప్రస్తుతం గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ సహాయం అందించడంలో సిపిఆర్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. అయితే సమాజంలో ఇంకా చాలామందికి ఈ పద్ధతి పై సరైన అవగాహన లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ గారు తెలిపారు. ఈ శిక్షణలో సిపిఆర్ విధానం , ప్రాథమిక ప్రథమ చికిత్స (First Aid), అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి వంటి అంశాలను నిపుణుల ద్వారా వివరించనున్నారు. ప్రతి పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ శిక్షణలో పాల్గొని అవగాహన పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సమయానికి సరైన సహాయం అందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని, అందుకు సిపిఆర్ వంటి నైపుణ్యాలు ప్రతి ఒక్కరికీ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో భద్రతా చైతన్యం పెంపొందించి, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన సామర్థ్యాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ గారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) శ్రీ జి.బస్వా రెడ్డి , నిజామాబాద్ ట్రాఫిక్ ఏ.సీ.పి శ్రీ మస్తాన్ అలీ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీశైలం , ట్రాఫిక్ సి ఐ శ్రీ ప్రసాద్ , ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ వినోద్ , డాక్టర్ శ్రీ విశాల్ (ఐ.ఎమ్.ఏ ప్రెసిడెంట్ ) , డాక్టర్ రామనేశ్వర్ ( న్యూరాలజిస్ట్ , ( ఐ.ఎమ్.ఏ ట్రెజరీ ), డాక్టర్ శ్రీశైలం (పీడియాట్రెస్ట్) , డాక్టర్ విట్టల్ ఆనస్తేషియా స్పెషలిస్ట్, మరియు ఐటీ కోర్స్ సిబ్బంది, బ్లూ కోర్ట్ సిబ్బంది , ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.3
- Post by Vishwamber Rao1
- Post by Boke saikumar Boke saikumar1
- కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభలో రెండువర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.ఓ వర్గానికి చెందిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ను అధికారులు వేదిక పై పిలిచి సర్పంచును వేదిక పై పిలవకపోవడంతో అధికారులను సర్పంచ్ ప్రథమ పౌరుని అయిన మాకు ఎందుకు పిలవలేదనీ సర్పంచ్ ధర్మతేజ అధికారులను నిలదీశాడు.అంతలోనే ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ధర్మ తేజ,మండల సర్పంచ్ లు క్రింద నేల పై కూర్చుండి నిరసన తెలిపారు.వారిని పోలీసులు సముదాయించి కుర్చీల్లో కూర్చోపెట్టారు.1
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ జెడ్పీటీసీ పిడుగు ప్రభాకర్ రెడ్డి సహా కీలక కాంగ్రెస్ నాయకులు పలువురు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు రాజీనామా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం వైఖరికి నిరసనగా రాజీనామా ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం గెలుపుకై శాయశక్తులా కృషి చేశాం కొడిమ్యాల మండలానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ ఎమ్మెల్యే నెరవేర్చలేదు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే అనుచరులు స్కాంకు పాల్పడుతున్నారు అన్ని తెలిసినా ఎమ్మెల్యే సత్యం ఆయన అనుచరులకే వంత పాడుతున్నారు పూడూర్ ఖాదీ బోర్డు ల్యాండ్ ఏమైందో ఎమ్మెల్యే సత్యం చెప్పాలి అంటూ నిలదీసిన కాంగ్రెస్ నాయకులు1
- 15 ఆర్థిక సంఘం నిధుల వ్యయంలో అక్రమాలకు పాల్పడితే చర్యలు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనలకు లోబడి గ్రామ పాలన కొనసాగాలి కలెక్టర్ ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్ గా వ్యవహరించాలి. సమ్మర్ యాక్షన్ ప్లాన్ తో గ్రామాలలో డ్రింకింగ్ వాటర్ సమస్యలను నిర్మూలించాలి ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ సమన్వయంతో గ్రామంలో సుపరిపాలన అందించాలి. 15వ ఆర్థిక సంఘం విధుల వినియోగంపై సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకు వర్క్ షాప్ నిర్వహణ గ్రామాల్లో సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలి మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనలకు లోబడి గ్రామ పాలన కొనసాగాలని.ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్ గా వ్యవహరిం. చాలని. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా గ్రామాలలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సర్పంచులు ,పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లకు 15 ఆర్ధిక సంఘం నిధుల వినియోగం పై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో 15 వ ఆర్ధిక సంఘం నిధులు సక్రమంగా వినియోగించి గ్రామా అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలన్నారు. జిల్లాలోని గ్రామపంచాయతీలు మోడల్ గా తీర్చిదిద్దాలని, గ్రామాలలో అన్ని రకాల మౌలిక వసతులపై దృష్టి సారించాలన్నారు, అంగన్వాడీ బిల్డింగ్స్, జిపి బిల్డింగ్స్ లేని గ్రామాలకు నూతన బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.. ప్రత్యేక అధికారి, పంచాయతీ సెక్రెటరీ సర్పంచ్ సమన్వయంతో గ్రామ పంచాయతీలో పనులు సవ్యంగా నడవాలన్నారు. గ్రామాల్లో సమస్యలు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని 15 ఆర్ధిక సంఘం నిధులను అన్ని గ్రామాలకు ప్రభుత్వం అందించిందని ,వాటితో గ్రామాల్లో సమస్యలు లేకుండా ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పని చేయాలన్నారు. నిధుల వినియోగం లో అక్రమాలకు తావులేదన్నారు. నిధులు సక్రమంగా వినియోగించక పోతే ,అక్రమాలు జరిగితే సర్పంచ్ , కార్యదర్శుల పై చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. గ్రామాల్లో త్రాగు నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ఈ.ఈ మిషన్ భగీరథ ఇంట్రా సంపత్ కుమార్, గ్రిడ్ డి.ఈ నాగభూషణం, డిఎల్పిఓలుసాయి బాబు, తిరుపతి రెడ్డి ,అధికారులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- జగిత్యాల : జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “Arrive Alive” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం తాటిపల్లిలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగిత్యాల కు చెందిన సీనియర్ కంటి వైద్యులు డా. ముదస్సర్ తన సిబ్బందితో కలిసి వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిటిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వాహన డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై కూడా దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా, ఎంవిఐ లు అభిలాష్, ప్రమీల, షేక్ రియాజ్, రామారావు, కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. కంటి పరీక్షల అనంతరం, డా. ముదస్సర్ ప్రస్తుత ఎండాకాలంలో వాహన డ్రైవర్లతో పాటుగా చిన్నపిల్లలు, వృద్దులు కంటి జాగ్రతల కోసం టీబీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు.1
- సి ఐటీయుచొరవ కార్మికుల ఐక్యత తో మెరుగైన వేతన ఒప్పందం.... సిఐటియు చొరవ కార్మికుల ఐక్యమత్యం ద్వారా మెరుగైన వేతన ఒప్పందం సాధ్యమైందని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం అన్నారు.మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూరు శివారులోని నియాపోలి పరిశ్రమ కార్మికుల వేతన ఒప్పందం పై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంగారెడ్డి వద్ద శుక్రవారం నాడు సంతకాలు పూర్తి అయిన సందర్భంగా ఏ.మల్లేశం మాట్లాడినారు.కార్మికుల వేతన ఒప్పందం గడువు 2026 మార్చి 31 తో పూర్తి కాగా ఏప్రిల్ నెలలో యాజమాన్యం తో ఏప్రిల్ 12 వ తేదీన వేతన ఒప్పందం పై చర్చలు జరిగినాయన్నారు.ఆ ఒప్పందం ప్రకారం కార్మికులకు నెలకు గరిష్టంగా 7080 రూపాయలు, కనిష్టంగా 6000 రూపాయల వేతనం పెంపుదల, నెలకు 30 రూపాయల సర్వీస్ వెయిటేజ్, 1982 సిరీస్ ప్రకారం వి.డి. ఏ 7 రూపాయల నుండి 8 రూపాయలకు పెంపుదల, ముగ్గురు క్యాజువల్ కార్మికులను పెర్మనెంట్ చేయడం కోసం ఒప్పందం కుదిరిందన్నారు.జిల్లా లో చాలా పరిశ్రమల్లో నెలల తరబడి చర్చలు జరిగే సాంప్రదాయం ఉండగా CITU ఒకే దఫా చర్చలు చేసి ఒప్పందం చేయడం జిల్లాలోనే రికార్డు అన్నారు.ఇది కేవలం CITU నిజాయితీ,కార్మికుల ఐక్యమత్యం తోనే సాధ్యం అయిందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల ఒక వైపు 12 గం.ల పని విధానం,ఉన్న కార్మికుల్నే కాంట్రాక్ట్ కార్మికులు గా మారుస్తుంటే ఉన్న క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ చేసే చరిత్ర CITU దే అని ఏ.మల్లేశం అన్నారు.జిల్లాలో అనేక పరిశ్రమల్లో ఎప్పుడో నిర్ణయించిన కనీస వేతనాలు అమలు చేయకపోవడం, ఇ.ఎస్. ఐ, పి.ఎఫ్, బోనస్ లాంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఏ.మల్లేశం అన్నారు.కేంద్రం ప్రభుత్వం పాత చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్స్ తీసుకురావడం ద్వారా ప్రైవేట్ యాజమాన్యాలు మరింత రెచ్చి పోయి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు.హక్కుల కోసం యూనియన్స్ ఏర్పాటు చేసుకుని పోరాడటమే అంతిమ పరిష్కారం అని అన్నారు.పోరాడే కార్మికులకు CiTU పూర్తి అండగా నిలుస్తుందని అన్నారు.వేతన ఒప్పందం పై యజమ్యం తరపున పరిశ్రమ పార్టనర్ దక్షిత్ మోర్, ప్రతినిధి ఆదర్శ్, నియాపోలి ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ యూనియన్ CITU తరపున CITU జిల్లా కార్యదర్శి ఆ యూనియన్ అధ్యక్షులు ఏ.మల్లేశం ,ప్రధాన కార్యదర్శి కె.నవీన్, ఉపాధ్యక్షులు మురళి గౌడ్,సహాయ కార్యదర్శి మహేష్, కోశాధికారి శేఖర్, కార్మిక శాఖ తరపున డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రవీందర్ రెడ్డి సంతకాలు చేశారు. ఐ.డి యాక్ట్ 12(3)ప్రకారం ఈ వేతన ఒప్పందం కాల పరిమితి 2026 ఏప్రిల్ 1 నుండి 2029 మార్చి 31 వరకు ఉంటుందన్నారు.1