logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గోదావరిలో చిక్కుకున్న 60 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన అధికారులు చర్ల: మండలంలోని వీరాపురం వద్ద గోదావరిలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడంతో చిక్కుకున్న 60 మందిని అధికారులు జేసీబీల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు తరలించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ శ్రీనివాస్‌, సీఐ రాజువర్మ, ఎస్‌ఐ నర్సిరెడ్డి, ఎంపీడీవో ఇదయ్య సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ రాజువర్మ, ఎస్‌ఐ నర్సిరెడ్డి తెప్పలతో గోదావరి దాటి వెళ్లి బాధితులను ఒడ్డుకు చేర్చారు.

14 hrs ago
user_JAI TEJ
JAI TEJ
బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
14 hrs ago

గోదావరిలో చిక్కుకున్న 60 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన అధికారులు చర్ల: మండలంలోని వీరాపురం వద్ద గోదావరిలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడంతో చిక్కుకున్న 60 మందిని అధికారులు జేసీబీల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు తరలించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ శ్రీనివాస్‌, సీఐ రాజువర్మ, ఎస్‌ఐ నర్సిరెడ్డి, ఎంపీడీవో ఇదయ్య సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ రాజువర్మ, ఎస్‌ఐ నర్సిరెడ్డి తెప్పలతో గోదావరి దాటి వెళ్లి బాధితులను ఒడ్డుకు చేర్చారు.

More news from తెలంగాణ and nearby areas
  • భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికల థింసా నృత్యం గిన్నిస్ రికార్డు నెలకొల్పింది ఆ సంస్థ ప్రతినిధుల నుంచి గిన్నిస్ అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అందుకుని థింసా నృత్యంలో పాల్గొన్నారు...
    1
    భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికల థింసా నృత్యం గిన్నిస్ రికార్డు నెలకొల్పింది
ఆ సంస్థ ప్రతినిధుల నుంచి గిన్నిస్ అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అందుకుని థింసా నృత్యంలో పాల్గొన్నారు...
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    20 min ago
  • పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు, ఆయన స్వగ్రామం నల్లబెల్లికి చేరుకున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు, ఆయన స్వగ్రామం నల్లబెల్లికి చేరుకున్నాం.
    1
    పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు, 
ఆయన స్వగ్రామం నల్లబెల్లికి చేరుకున్నాం.
పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు, 
ఆయన స్వగ్రామం నల్లబెల్లికి చేరుకున్నాం.
    user_Degala samson
    Degala samson
    Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    11 hrs ago
  • వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.
    1
    వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్......

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • కల్లూరు ప్రజాదర్బార్ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సత్తుపల్లి ప్రజాదర్బార్‌లో 3,500కి పైగా, అలాగే పాలేరు నియోజకవర్గంలో 25,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజల నుంచి ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే అభ్యర్థనలు వస్తున్నాయని, పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇళ్లు మంజూరు చేయడం వల్ల నిర్మాణ వ్యయం అదుపులో ఉంటుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంపై 8 లక్షల 21 వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మోపిందని పొంగులేటి ఆరోపించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, నిషేధిత జాబితా (22A) భూముల కేటాయింపులపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన 'సిట్' సమగ్ర విచారణ జరుపుతోందని తెలిపారు. త్వరలోనే ధరణి అక్రమాల గుట్టు రట్టు చేసి నివేదికను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. ​ రాష్ట్రవ్యాప్తంగా దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ సర్వే వేగవంతం చేశామని మంత్రి తెలిపారు. పింక్ కలర్ షర్టు వేసుకున్న పేదవాడైనా సరే... కుల, మత, రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించి, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
    1
    కల్లూరు ప్రజాదర్బార్ కార్యక్రమంలో  బిఆర్ఎస్ నాయకులపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సత్తుపల్లి ప్రజాదర్బార్‌లో 3,500కి పైగా, అలాగే పాలేరు నియోజకవర్గంలో 25,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజల నుంచి ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే అభ్యర్థనలు వస్తున్నాయని, పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇళ్లు మంజూరు చేయడం వల్ల నిర్మాణ వ్యయం అదుపులో ఉంటుందన్నారు.
గత ప్రభుత్వం రాష్ట్రంపై 8 లక్షల 21 వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మోపిందని పొంగులేటి ఆరోపించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, నిషేధిత జాబితా (22A) భూముల కేటాయింపులపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన 'సిట్' సమగ్ర విచారణ జరుపుతోందని తెలిపారు. త్వరలోనే ధరణి అక్రమాల గుట్టు రట్టు చేసి నివేదికను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు.
​
రాష్ట్రవ్యాప్తంగా దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ సర్వే వేగవంతం చేశామని మంత్రి తెలిపారు. పింక్ కలర్ షర్టు వేసుకున్న పేదవాడైనా సరే... కుల, మత, రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించి, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    20 hrs ago
  • *వరంగల్ - నల్గొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్స్* గడ్డ తీన్మార్ మల్లన్న అడ్డరా బై💯 *వరంగల్ - నల్గొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్స్* గడ్డ తీన్మార్ మల్లన్న అడ్డరా బై💯 మూడు ప్రధాన పార్టీలకు మూడు షేర్ల నీళ్ళు తాగించింది అప్పుడే మర్చిపోయారా..??? ఒకవేళ మర్చిపోయి ఉంటే...ఈ సారి మూడు చెరువుల నీళ్ళు తాగడానికి సిద్ధంగా ఉండండి🌊🌊🌊 WGL- NLG-KMM గ్రాడ్యుయేట్స్ ఎన్నికల వార్ వన్ సైడ్...అది తీన్మార్ మల్లన్న సైడ్🔥
    1
    *వరంగల్ - నల్గొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్స్* గడ్డ తీన్మార్ మల్లన్న అడ్డరా బై💯
*వరంగల్ - నల్గొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్స్* గడ్డ తీన్మార్ మల్లన్న అడ్డరా బై💯
మూడు ప్రధాన పార్టీలకు మూడు షేర్ల నీళ్ళు తాగించింది అప్పుడే మర్చిపోయారా..???
ఒకవేళ మర్చిపోయి ఉంటే...ఈ సారి మూడు చెరువుల నీళ్ళు తాగడానికి సిద్ధంగా ఉండండి🌊🌊🌊
WGL- NLG-KMM గ్రాడ్యుయేట్స్ ఎన్నికల వార్ వన్ సైడ్...అది తీన్మార్ మల్లన్న సైడ్🔥
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • శ్రీ సీతారామచంద్రస్వామి అన్నదాన సత్రం సమీపానికి గోదావరి బ్యాక్‌వాటర్‌ శ్రీ సీతారామచంద్రస్వామి అన్నదాన సత్రం సమీపానికి గోదావరి బ్యాక్‌వాటర్‌ భద్రాచలం: గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో వరద బ్యాక్‌వాటర్‌ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం సమీపంలోని అన్నదాన సత్రం వద్దకు చేరింది. శుక్రవారం మధ్యాహ్నం 3.48 గంటలకు గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరగా 11,44,645 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
    1
    శ్రీ సీతారామచంద్రస్వామి అన్నదాన సత్రం సమీపానికి గోదావరి బ్యాక్‌వాటర్‌
శ్రీ సీతారామచంద్రస్వామి అన్నదాన సత్రం సమీపానికి గోదావరి బ్యాక్‌వాటర్‌
భద్రాచలం: గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో వరద బ్యాక్‌వాటర్‌ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం సమీపంలోని అన్నదాన సత్రం వద్దకు చేరింది. శుక్రవారం మధ్యాహ్నం 3.48 గంటలకు గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరగా 11,44,645 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
    user_JAI TEJ
    JAI TEJ
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.