logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పాలకుల పర్యటనతోనైనా సమస్యలకు మోక్షం కలిగేనా? బత్తలపల్లిలో దర్శనమిస్తున్న అపరిశుభ్రత మంత్రి ఆదేశాలతోనైనా మారుతుందా అధికారుల తీరు బత్తలపల్లి ఏప్రిల్ 15 :- రాజకీయ నాయకులు పర్యటనకు వస్తేనే కానీ అధికారుల కాళ్లలో కదలిక రాదా? మంత్రి స్థాయి వ్యక్తి నేరుగా వీధుల్లోకి దిగితేనే కానీ సమస్యలు కనిపించవా? అంటే బత్తలపల్లి కాలనీలలో నెలకొన్న పరిస్థితులు అవును అనే సమాధానం ఇస్తున్నాయి. మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటనతో ఒక్కసారిగా బత్తలపల్లి మండల యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. అయితే, ఈ హడావుడి కేవలం పర్యటనలకే పరిమితమవుతుందా లేక ఏళ్ల తరబడి నెలకొన్న మురుగు, వీధి దీపాలు, నీరు తదితర సమస్యలకు, శాశ్వత పరిష్కారం దొరుకుతుందా అని ప్రజలు గుసగుసలాడుతున్నారు. కాలనీలోని వీధులు మురుగునీటితో చెరువులను తలపిస్తున్నాయి. కాలువలు పూడిక తీయక, వ్యర్థాలు పేరుకుపోయి ఉండటం, మురుగు కాలవలేక సిమెంట్ రోడ్డు మీద మురుగునీరు ప్రవహించడం వల్ల అనేక సమస్యలతో సహజీవనం చేస్తూ ఉండిపోవాల్సి వస్తోంది. మా ఊరు - మన జెండా కార్యక్రమంలో భాగంగా మంత్రి మండల కేంద్రంలో పర్యటించినప్పుడు కాలనీవాసులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వీధి దీపాలు వెలగక చీకటి సామ్రాజ్యం, తాగడానికి చుక్క నీరు లేక ఇబ్బందులు ఇలా మౌలిక వసతుల లేమిని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన బుధవారం మంత్రి నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు, బత్తలపల్లి మండల అధికారులతో కలిసి ఇందిరమ్మ కాలనీ, ఎస్సీ కాలనీలను ప్రత్యక్షంగా సందర్శించారు. కాలనీలో తక్షణమే వీధి దీపాలను ఏర్పాటు చేయాలని, తాగునీటి సమస్యలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను హరీష్ బాబు సూచించారు. అదేవిధంగా ఈ నెల 20వ తేదీలోపు సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువల నిర్మాణానికి సంబంధించిన అంచనాలను సిద్ధం చేసి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వెంటనే స్పందించి పరిష్కార దిశగా చర్యలు చేపట్టడం మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజాహిత దృక్పథాన్ని ప్రతిబింబిస్తోందని హరీష్ బాబు కొనియాడారు. కాలనీలో మౌలిక వసతులకు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మంత్రి కట్టుబడి ఉన్నారని హరీష్ బాబు తెలిపారు. గతంలోనూ అనేకమంది నేతలు, అధికారులు పర్యటించారని, పనులు చేస్తామని హామీలు ఇచ్చారని, కానీ పరిస్థితి మళ్లీ మొదటికే వస్తోందని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతోనైనా బత్తలపల్లి కాలనీలకు పట్టిన సమస్యల పీడ వదులుతుందా? ఈ నెల 20వ తేదీలోపు పనులు పట్టాలెక్కుతాయా? లేక అధికారులది మళ్ళీ మామూలేనా అనేది వేచి చూడాలి. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, సీనియర్ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

6 hrs ago
user_Mathagi Ramanja
Mathagi Ramanja
Local News Reporter బాతలపల్లె, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
6 hrs ago
b08f202d-3457-4fa0-94db-19e8c3d207bf

పాలకుల పర్యటనతోనైనా సమస్యలకు మోక్షం కలిగేనా? బత్తలపల్లిలో దర్శనమిస్తున్న అపరిశుభ్రత మంత్రి ఆదేశాలతోనైనా మారుతుందా అధికారుల తీరు బత్తలపల్లి ఏప్రిల్ 15 :- రాజకీయ నాయకులు పర్యటనకు వస్తేనే కానీ అధికారుల కాళ్లలో కదలిక రాదా? మంత్రి స్థాయి వ్యక్తి నేరుగా వీధుల్లోకి దిగితేనే కానీ సమస్యలు కనిపించవా? అంటే బత్తలపల్లి కాలనీలలో నెలకొన్న పరిస్థితులు అవును అనే సమాధానం ఇస్తున్నాయి. మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటనతో ఒక్కసారిగా బత్తలపల్లి మండల యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. అయితే, ఈ హడావుడి కేవలం పర్యటనలకే పరిమితమవుతుందా లేక ఏళ్ల తరబడి నెలకొన్న మురుగు, వీధి

ce1c6786-29ad-40a5-9f66-9996d71f4ef0

దీపాలు, నీరు తదితర సమస్యలకు, శాశ్వత పరిష్కారం దొరుకుతుందా అని ప్రజలు గుసగుసలాడుతున్నారు. కాలనీలోని వీధులు మురుగునీటితో చెరువులను తలపిస్తున్నాయి. కాలువలు పూడిక తీయక, వ్యర్థాలు పేరుకుపోయి ఉండటం, మురుగు కాలవలేక సిమెంట్ రోడ్డు మీద మురుగునీరు ప్రవహించడం వల్ల అనేక సమస్యలతో సహజీవనం చేస్తూ ఉండిపోవాల్సి వస్తోంది. మా ఊరు - మన జెండా కార్యక్రమంలో భాగంగా మంత్రి మండల కేంద్రంలో పర్యటించినప్పుడు కాలనీవాసులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వీధి దీపాలు వెలగక చీకటి సామ్రాజ్యం, తాగడానికి చుక్క నీరు లేక ఇబ్బందులు ఇలా మౌలిక వసతుల లేమిని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన

c9d1b82a-5572-4bb7-8957-9b373f4cf867

ఆయన బుధవారం మంత్రి నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు, బత్తలపల్లి మండల అధికారులతో కలిసి ఇందిరమ్మ కాలనీ, ఎస్సీ కాలనీలను ప్రత్యక్షంగా సందర్శించారు. కాలనీలో తక్షణమే వీధి దీపాలను ఏర్పాటు చేయాలని, తాగునీటి సమస్యలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను హరీష్ బాబు సూచించారు. అదేవిధంగా ఈ నెల 20వ తేదీలోపు సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువల నిర్మాణానికి సంబంధించిన అంచనాలను సిద్ధం చేసి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వెంటనే స్పందించి పరిష్కార దిశగా చర్యలు చేపట్టడం మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజాహిత దృక్పథాన్ని

d60b1f77-c1dc-47db-a79c-c88bfdbdd386

ప్రతిబింబిస్తోందని హరీష్ బాబు కొనియాడారు. కాలనీలో మౌలిక వసతులకు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మంత్రి కట్టుబడి ఉన్నారని హరీష్ బాబు తెలిపారు. గతంలోనూ అనేకమంది నేతలు, అధికారులు పర్యటించారని, పనులు చేస్తామని హామీలు ఇచ్చారని, కానీ పరిస్థితి మళ్లీ మొదటికే వస్తోందని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతోనైనా బత్తలపల్లి కాలనీలకు పట్టిన సమస్యల పీడ వదులుతుందా? ఈ నెల 20వ తేదీలోపు పనులు పట్టాలెక్కుతాయా? లేక అధికారులది మళ్ళీ మామూలేనా అనేది వేచి చూడాలి. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, సీనియర్ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఆపరేషన్ నైట్ సేఫ్టీ.. అనంతపురంలో అనవసరంగా బయటికి వస్తె అంతే సంగతులు
    1
    ఆపరేషన్ నైట్ సేఫ్టీ.. అనంతపురంలో అనవసరంగా బయటికి వస్తె అంతే సంగతులు
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • వైయస్‌ఆర్‌సీపీ మీడియా వ్యవహారాలు చూస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారి అరె*స్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి ప్రభుత్వం దుర్మా*ర్గంగా వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఈ అ*రెస్ట్ సాక్ష్యం రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు లేదా? -వరుదు కళ్యాణి గారు, వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ.....
    1
    వైయస్‌ఆర్‌సీపీ మీడియా వ్యవహారాలు చూస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారి అరె*స్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం 
కూటమి ప్రభుత్వం దుర్మా*ర్గంగా వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఈ అ*రెస్ట్ సాక్ష్యం 
రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు లేదా? 
-వరుదు కళ్యాణి గారు, వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ.....
    user_Palakattu nagendra
    Palakattu nagendra
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • ✒️- ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో తండ్రి చేత తిట్లు తినడంతో, 9వ తరగతి బాలుడు రాత్రికి రాత్రే నంద్యాలకు 100 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించిన ఘటనను ఈ చిత్రం తెలియజేస్తుంది. ఆ అబ్బాయి చివరకు నంద్యాల నుంచి రాయచూర్‌కు రైలు ఎక్కాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతడిని గుర్తించి రక్షించారు. ఈ సంఘటన యువతరం సున్నితత్వంపై ఆందోళనను రేకెత్తించింది••£
    1
    ✒️- ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో తండ్రి చేత తిట్లు తినడంతో, 9వ తరగతి బాలుడు రాత్రికి రాత్రే నంద్యాలకు 100 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించిన ఘటనను ఈ చిత్రం తెలియజేస్తుంది.
ఆ అబ్బాయి చివరకు నంద్యాల నుంచి రాయచూర్‌కు రైలు ఎక్కాడు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతడిని గుర్తించి రక్షించారు.
ఈ సంఘటన యువతరం సున్నితత్వంపై ఆందోళనను రేకెత్తించింది••£
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Court reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    12 hrs ago
  • జలధార జల హారతి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ నిశాంత్ కుమార్ మండలంలో జరుగుతున్న జలధార జలహారతి పనులను వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జలధర జలహారతి కార్యక్రమం లో భాగంగా చేపట్టిన వందరోజుల పనుల ప్రగతిపై మండల అధికారులతో సమీక్షించారు అనంతరం మండలంలోని దిగువపల్లి కాకతి పంచాయతీలలో చెరువులను సప్లై చానల్స్ లను పర్యవేక్షించారు అదేవిధంగా మండలంలో భూ సమస్యల పరిష్కారం పై చెరువుల వద్ద రైతులతో ఆయన మాట్లాడారు చెరువుకు అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న కట్టను తొలగించాలని రైతుల అభ్యర్థనపై స్పందిస్తూ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పార్వతి ఎంపీడీవో లీలా మాధవి పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ మండలంలోని అధికారులు పాల్గొన్నారు
    4
    జలధార జల హారతి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ నిశాంత్ కుమార్
మండలంలో జరుగుతున్న జలధార జలహారతి పనులను వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జలధర జలహారతి కార్యక్రమం లో భాగంగా చేపట్టిన వందరోజుల పనుల ప్రగతిపై మండల అధికారులతో సమీక్షించారు అనంతరం మండలంలోని దిగువపల్లి కాకతి పంచాయతీలలో చెరువులను సప్లై చానల్స్ లను పర్యవేక్షించారు అదేవిధంగా మండలంలో భూ సమస్యల పరిష్కారం పై  చెరువుల వద్ద రైతులతో ఆయన మాట్లాడారు చెరువుకు అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న కట్టను తొలగించాలని రైతుల అభ్యర్థనపై స్పందిస్తూ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పార్వతి ఎంపీడీవో లీలా మాధవి పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ మండలంలోని అధికారులు పాల్గొన్నారు
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    9 hrs ago
  • బండిఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మరియు గుండా పుల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ బ్లాక్ అవ్వడం వల్ల రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, తక్షణమే కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    బండిఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో  మరియు గుండా పుల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ బ్లాక్ అవ్వడం వల్ల రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, తక్షణమే కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • బుట్టా ఫౌండేషన్ నుంచి తాగునీటి సహాయం – సోగునూరు, టీఎస్ కూలూరు గ్రామాలకు ట్యాంకర్ పంపిణీ
    1
    బుట్టా ఫౌండేషన్ నుంచి తాగునీటి సహాయం – సోగునూరు, టీఎస్ కూలూరు గ్రామాలకు ట్యాంకర్ పంపిణీ
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
    1
    చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది.
ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • అనంవసరంగా అనంతపురంలో రాత్రి పూట తిరుగుతున్నారా? జాగ్రత్త .. తిప్పలు తప్పవు
    1
    అనంవసరంగా అనంతపురంలో రాత్రి పూట తిరుగుతున్నారా? జాగ్రత్త .. తిప్పలు తప్పవు
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.