శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో వైభవంగా శ్రావణ మాసం పూజలు గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. బచ్చు శశిధర్–స్వప్న దంపతులు, చెప్యాలమల్లేశం–లీలావతి దంపతులు, వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు, గురుస్వామి బొగ్గుల సురేష్ మాట్లాడుతూ.. గజ్వేల్ శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రావణ మాసం నెల రోజుల పాటు ప్రతిరోజూ దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్, అయ్యప్ప ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు జగ్గయ్యగారి శేఖర్, ప్రధాన కార్యదర్శి అయిత సత్యనారాయణ, కోశాధికారి నారాయణరెడ్డి, కార్యదర్శి గోపి, నాయకులు గందె యాదగిరి, మర్యాల శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, కూరగాయల రాంబాబు, గంగిశెట్టి ఉమేష్, కైలాస ప్రశాంత్, దేవానంద్, డెంటల్ శ్రీనివాస్, విక్రాంత్, దీపక్, గందె సంతోష్‌తో పాటు అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు.
శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో వైభవంగా శ్రావణ మాసం పూజలు గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. బచ్చు శశిధర్–స్వప్న దంపతులు, చెప్యాలమల్లేశం–లీలావతి దంపతులు, వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు
నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు, గురుస్వామి బొగ్గుల సురేష్ మాట్లాడుతూ.. గజ్వేల్ శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రావణ మాసం నెల రోజుల పాటు ప్రతిరోజూ దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు
నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్, అయ్యప్ప ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు జగ్గయ్యగారి శేఖర్, ప్రధాన కార్యదర్శి అయిత సత్యనారాయణ, కోశాధికారి నారాయణరెడ్డి, కార్యదర్శి గోపి, నాయకులు గందె యాదగిరి, మర్యాల శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, కూరగాయల రాంబాబు, గంగిశెట్టి ఉమేష్, కైలాస ప్రశాంత్, దేవానంద్, డెంటల్ శ్రీనివాస్, విక్రాంత్, దీపక్, గందె సంతోష్‌తో పాటు అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు.
- రాంకీ–కార్మికుల వివాదంతో ఉప్పల్‌లో పారిశుధ్య సంక్షోభం రోడ్లపైనే చెత్త.. అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో చెత్త సేకరణ బాధ్యతల విషయంలో రాంకీ సంస్థకు, గతంలో చెత్త సేకరణలో పనిచేసిన రిక్షా కార్మికులకు మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చెత్త సేకరణ బాధ్యతలను రాంకీ వంటి పెద్ద సంస్థకు అప్పగించడం వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని రిక్షా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ప్రభావం ఉప్పల్ సర్కిల్ పారిశుధ్యంపై పడినట్లు కనిపిస్తోంది. చెత్త తరలించే ఆటో కార్మికులు చెత్తను రహదారుల పక్కనే వదిలివెళుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితి అధ్వాన్నంగా మారుతోంది. ఉప్పల్ దేవేంద్రనగర్ ప్రధాన రహదారి మీదుగా వెళుతున్న స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను గమనించి విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిపై తీవ్రంగా నిలదీశారు1
- జిన్నారం మున్సిపల్ కేంద్రంలో పోచమ్మ తల్లి విగ్రహ ఊరేగింపు జిన్నారం, ఆగస్టు 27: పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. భక్తులతో కలిసి ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జిన్నారం ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆగస్టు 30న జరిగే ప్రతిష్ఠా మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.1
- తునికి శివారులో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్‌లో అధికారుల ఆకస్మిక తనిఖీ నర్సాపూర్–మెదక్ ప్రధాన రహదారి పక్కన తునికి శివారులో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్‌ను మండల ప్రత్యేక అధికారి, డీఎల్పీవో సురేష్‌బాబు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారుల బృందంతో కలిసి హాస్టల్‌లోని వసతులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. తరగతి గదులు, వంటశాలను సందర్శించిన ఆయన విద్యార్థులకు తయారు చేస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు చదువులో రాణించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సురేష్‌బాబు తెలిపారు.1
- అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రతి ఒక్కరి ఓటు పరిరక్షణే SIR-2 లక్ష్యం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బోనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో SIR-2 వార్డు సభ నిర్వహించారు. ప్రజలకు మరింత చేరువగా ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ప్రజలతో కలిసి నేలపై కూర్చొని సభ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై SIR-2 కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి అర్హుడి ఓటు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని, ఒక్క అర్హుడి ఓటు కూడా పోకుండా కాపాడుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.. ఏవైనా లోపాలు ఉన్నట్లయితే సంబంధిత బీఎల్ఓలను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు. ప్రతి ఓటు విలువైనదని, ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని పేర్కొంటూ, ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భువనగిరి సర్ కోఆర్డినేటర్ ఇ.వి. శ్రీనివాస్ రావు మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ , వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు జిల్లా గ్రంధాలయ చైర్మన్ అవెస్ చిస్తి PACS చైర్మన్ కొండల్ రెడ్డి ,RDO కృష్ణారెడ్డి గ, MRO జగన్ , పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ , కౌన్సిలర్స్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు BLA లు పాల్గొన్నారు... ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకమైన ఓటరు జాబితా – ప్రజాస్వామ్య పరిరక్షణే మనందరి లక్ష్యం అని నాయకులు పేర్కొన్నారు.4
- బీబీనగర్ ఎయిమ్స్ కు వెళ్లే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు... బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలోని వివిధ విభాగాలకు వెళ్లే రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం ఎయిమ్స్ అధికారులు జాతీయ రహదారిపై గల బస్ స్టాప్ నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణంలోని పలు విభాగాలకు వెళ్లే వారికి రవాణా ఇబ్బందులు తగ్గనున్నాయి. ఎయిమ్స్ అధికారుల చర్యల పట్ల ఆసుపత్రికి వచ్చేవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.1
- అక్క కోసం 10అడుగుల రాఖీ చిత్రించి అంకితం ఇచ్చిన తమ్ముడు రామకోటి రామరాజు అక్క ప్రేమకు ప్రతిరూపంగా బిస్కెట్లతో భారీ రాఖీ అక్క పైన ఉన్న అపారమైన ప్రేమకు గుర్తుగా, అక్క మధుర జ్ఞాపకాలను రాఖీ రూపంలో నిలిపి, తన ప్రేమకు ప్రతీకగా వివిధ రకాల బిస్కెట్లతో 10 అడుగుల భారీ రాఖీ చిత్రాన్ని రూపొందించారు. మూడు రోజులపాటు శ్రమించి ప్రేమతో రూపొందించిన రాఖీ చిత్రాన్ని గురువారం ఆవిష్కరించి తన అక్కకు అంకితం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. అమ్మ తర్వాత అమ్మలా ఆప్యాయతను పంచిన నా అక్క ప్రతి సంవత్సరం నా చేతికి రాఖీ కట్టేదని ఆమె కట్టిన రాఖీ నాకు కేవలం దారం కాదు, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేదన్నారు. అక్క కట్టిన రాఖీతో బలం పొందిన ఈ చేతితోనే నేడు లక్షలాది మంది భక్తులచే శ్రీరామ నామాన్ని లిఖింపజేస్తున్నాను. అదే చేతితో ఎన్నో దేవతా చిత్రాలను రూపొందించి ప్రజల అభిమానంతో పాటు అనేక అవార్డులను అందుకున్నానన్నారు. నా కళకు, నా సేవకు అక్క ప్రేమే ఒక స్ఫూర్తి అని తెలిపారు. గతంలోనూ అక్క జ్ఞాపకాలను సజీవంగా ఉంచేందుకు పలు రాఖీ చిత్రాలను రూపొందించినట్లు చెప్పారు. అక్క తమ్ముడి మధ్య చెరగని ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలిచిన ఈ రాఖీ చిత్రాన్ని తిలకించిన ప్రజలు, ప్రముఖులు రామకోటి రామరాజును అభినందించారు.3
- 22ఏ భూ సమస్యలపై బీజేపీ ఆందోళన ఉధృతం చేస్తాం: ఎంపీ ఈటల రాజేందర్ మల్కాజ్‌గిరి: 22ఏ కింద నమోదు చేసిన భూ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. 22ఏ భూ సమస్యల కారణంగా అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే బాధితులకు అండగా బీజేపీ పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపడుతుందని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.1
- శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- వెంకట్రావుపేటలో అధిక లోడుతో లారీలు రాకపోకలు సాగిస్తుండటంపై గ్రామస్థులు ఆందోళన కౌడిపల్లి మండలం వెంకట్రావుపేటలో అధిక లోడుతో లారీలు రాకపోకలు సాగిస్తుండటంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తునికి శివారులోని ఎస్ఈడబ్ల్యూసీ గోదాముకు ప్రతిరోజూ దాదాపు 100 లారీలు గ్రామం మీదుగా వెళ్తున్నాయని తెలిపారు. భారీ వాహనాల రాకపోకలతో రహదారులు దెబ్బతినడంతో పాటు పైపులైన్లు ధ్వంసమవుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా పాఠశాలల సమీపంలో లారీలు అధిక వేగంతో తిరుగుతుండటంతో విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. లారీల రాకపోకలను నియంత్రించి, అధిక లోడుతో వెళ్లే వాహనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ధర్నా నిర్వహించారు.1