logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*సీఎంఆర్ఎఫ్ తో పేదలకు ఆర్థిక భరోసా* _ఎల్.ఓ.సీలను అందజేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు_ *గొల్లపూడి, ఫిబ్రవరి 17, అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు నాణ్యమైన వైద్య సేవల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.ఇటీవల అనారోగ్యానికి గురైన పలువురికి మెరుగైన వైద్యసేవల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సి)లు తాజాగా 12 మందికి మొత్తం రూ.23,07,467లు మంజూరయ్యాయి.వీటిని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో లబ్దిదారుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మంగళవారం అందజేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.మైలవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.13 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నుంచి ఆర్థికసాయాన్ని పేదలకు మంజూరు చేసినట్లు వెల్లడించారు.మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) స్థానిక కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

6 hrs ago
user_వేముల నాగరాజు
వేముల నాగరాజు
ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
6 hrs ago
0e4cf284-5136-4920-af98-5f9cf8450980

*సీఎంఆర్ఎఫ్ తో పేదలకు ఆర్థిక భరోసా* _ఎల్.ఓ.సీలను అందజేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు_ *గొల్లపూడి, ఫిబ్రవరి 17, అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు నాణ్యమైన వైద్య సేవల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.ఇటీవల అనారోగ్యానికి గురైన పలువురికి మెరుగైన వైద్యసేవల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సి)లు తాజాగా 12 మందికి మొత్తం రూ.23,07,467లు మంజూరయ్యాయి.వీటిని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో లబ్దిదారుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మంగళవారం అందజేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.మైలవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.13 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నుంచి ఆర్థికసాయాన్ని పేదలకు మంజూరు చేసినట్లు వెల్లడించారు.మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) స్థానిక కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా *ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు, ఫిబ్రవరి 17,* జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి గిరీష్ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    1
    బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా
*ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు, ఫిబ్రవరి 17,*
జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి గిరీష్ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • *TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పం కొలువుదీరింది.* కేసీఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఒక అభిమాని ఈ అద్భుత శిల్పాన్ని రూపొందించారు. గులాబీ రంగులో మెరుస్తున్న ఈ కళాఖండం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ అభివృద్ధిలో ఆయన పాత్రను స్మరిస్తూ రూపొందించిన ఈ సైకత చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
    1
    *TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పం కొలువుదీరింది.*
కేసీఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఒక అభిమాని ఈ అద్భుత శిల్పాన్ని రూపొందించారు. గులాబీ రంగులో మెరుస్తున్న ఈ కళాఖండం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ అభివృద్ధిలో ఆయన పాత్రను స్మరిస్తూ రూపొందించిన ఈ సైకత చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • గుంటూరు కోదండ రామయ్య నగర్ 4వ లైన్ మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై మంగళవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా మెటల్ రోడ్డుపై తేలిన రాళ్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన చెందారు. ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్న మున్సిపల్ అధికారులు, ఇక్కడ మాత్రం బడ్జెట్ లేదంటూ కాలయాపన చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు
    1
    గుంటూరు కోదండ రామయ్య నగర్ 4వ లైన్ మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై మంగళవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా మెటల్ రోడ్డుపై తేలిన రాళ్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన చెందారు. ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్న మున్సిపల్ అధికారులు, ఇక్కడ మాత్రం బడ్జెట్ లేదంటూ కాలయాపన చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు
    user_SIVA
    SIVA
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • మచిలీపట్నం పోతేపల్లి గ్రామంలో జిల్లా కోర్టు ఉద్యోగి అర్జా లక్ష్మీ ఇంట్లో గ్యాస్ లీకేజ్‌తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.7 లక్షల నష్టం వాటిల్లగా కుటుంబం ప్రాణాలతో బయటపడింది. బాధితులకు లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ నిత్యావసర వస్తువులు, బియ్యం, బట్టలు, వంట సామాగ్రి, రూ.5,000 నగదు అందజేశారు. ప్రభుత్వం అగ్ని బాధితులకు పక్కా ఇల్లు, ఆర్థిక సాయం కల్పించాలని ఆయన కోరారు.
    1
    మచిలీపట్నం పోతేపల్లి గ్రామంలో జిల్లా కోర్టు ఉద్యోగి అర్జా లక్ష్మీ ఇంట్లో గ్యాస్ లీకేజ్‌తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.7 లక్షల నష్టం వాటిల్లగా కుటుంబం ప్రాణాలతో బయటపడింది. బాధితులకు లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ నిత్యావసర వస్తువులు, బియ్యం, బట్టలు, వంట సామాగ్రి, రూ.5,000 నగదు అందజేశారు. ప్రభుత్వం అగ్ని బాధితులకు పక్కా ఇల్లు, ఆర్థిక సాయం కల్పించాలని ఆయన కోరారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ లో నిర్వహించిన రివ్యూ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ రాముల నాయక్ తో సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసిడిసి, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.
    1
    బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ లో నిర్వహించిన రివ్యూ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ రాముల నాయక్ తో సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసిడిసి, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.
    user_Ram
    Ram
    చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం గాంధీనగర్‌కు 44 వ డివిజన్ కు చెందిన దొమ్మాటి పద్మ అనే నీరు పేద మహిళ భర్త చనిపోయి 5 సంవత్సరాలు గడుస్తున్నా వితంతు పింఛన్ రావడం లేదు సదరు మహిళకు పింఛన్ కోసం గతం లో కూడ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పాల్వంచ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వితంతు పింఛన్ మంజూరు చెయ్యాలని కోరటం జరిగినది కానీ పింఛన్ మంజూరు కాకపోవడం బాధాకరమని పొనిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతు దొమ్మాటి పద్మ గారి భర్త దొమ్మాటి మొగిలయ్య గారు 29-12-2020 తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని, ఆ వెంటనే ఆమె పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు పింఛన్ మంజూరు కాలేదని అన్నారు.ప్రస్తుతం ఆమె తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని,ఆమెకు ఒక్క కుమార్తె ఉందని ఆమె కూలి పనులు చేస్తూ తల్లిని పోషిస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మానవీయ దృక్పథంతో స్పందించి, అర్హత ఉన్న వితంతు మహిళ దొమ్మాటి పద్మ కు తక్షణమే పింఛన్ మంజూరు చేయాలని కోరారు.జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, బాధిత మహిళకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
    3
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం గాంధీనగర్‌కు 44 వ డివిజన్ కు చెందిన దొమ్మాటి పద్మ అనే నీరు పేద మహిళ భర్త చనిపోయి 5 సంవత్సరాలు గడుస్తున్నా వితంతు పింఛన్ రావడం లేదు సదరు మహిళకు పింఛన్ కోసం గతం లో కూడ బీజేపీ  పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పాల్వంచ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వితంతు పింఛన్ మంజూరు చెయ్యాలని కోరటం జరిగినది కానీ పింఛన్ మంజూరు  కాకపోవడం బాధాకరమని పొనిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతు దొమ్మాటి పద్మ గారి భర్త దొమ్మాటి మొగిలయ్య గారు 29-12-2020 తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని, ఆ వెంటనే ఆమె పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు పింఛన్ మంజూరు కాలేదని అన్నారు.ప్రస్తుతం ఆమె తీవ్రమైన అనారోగ్య  సమస్యలతో బాధపడుతుందని,ఆమెకు ఒక్క కుమార్తె ఉందని ఆమె  కూలి పనులు చేస్తూ తల్లిని పోషిస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మానవీయ దృక్పథంతో స్పందించి, అర్హత ఉన్న వితంతు మహిళ దొమ్మాటి పద్మ కు  తక్షణమే పింఛన్ మంజూరు చేయాలని కోరారు.జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, బాధిత మహిళకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    7 hrs ago
  • Post by ఉంగరాల కార్తీక్
    1
    Post by ఉంగరాల కార్తీక్
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    జర్నలిస్ట్ Rajupalem, Palnadu•
    4 hrs ago
  • *కొండపల్లి అరుణ నగర్ లో నిరసన* *ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 17,* కొండపల్లిలోని అరుణ నగర్ కాలనీ వాసులు క్వారీ, క్రషర్ లారీల రాకపోకల వల్ల ఇబ్బందులు పడుతున్నారు.లారీల వల్ల వెలువడే దుమ్ము, ధూళి కారణంగా నివాసం ఉండలేని పరిస్థితి నెలకొందని, అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం ఆందోళన చేపట్టారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని, అధికారులు వెంటనే స్పందించి కాలనీలోకి లారీల అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
    1
    *కొండపల్లి అరుణ నగర్ లో నిరసన*
*ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 17,*
కొండపల్లిలోని అరుణ నగర్ కాలనీ వాసులు క్వారీ, క్రషర్ లారీల రాకపోకల వల్ల ఇబ్బందులు పడుతున్నారు.లారీల వల్ల వెలువడే దుమ్ము, ధూళి కారణంగా నివాసం ఉండలేని పరిస్థితి నెలకొందని, అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం ఆందోళన చేపట్టారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని, అధికారులు వెంటనే స్పందించి కాలనీలోకి లారీల అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.