Shuru
Apke Nagar Ki App…
డీఎస్సీలో జరిగిన అవకతవకలపై మేము ప్రశ్నలు సంధిస్తున్నా.. చంద్రబాబు, నారా లోకేష్ కనీసం స్పందించడం లేదు. వాళ్లు తప్పు చేశారు. కాబట్టే బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఉండిపోతున్నారు. ఒకవేళ ఈ స్కాం పూర్తిగా బయటికి వస్తే అధికారుల్ని బలి చేసేందుకు కూడా ఈ తండ్రీకొడుకులు వెనుకాడరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి డీఎస్సీలో జరిగిన అవకతవకలపై మేము ప్రశ్నలు సంధిస్తున్నా.. చంద్రబాబు, నారా లోకేష్ కనీసం స్పందించడం లేదు. వాళ్లు తప్పు చేశారు. కాబట్టే బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఉండిపోతున్నారు. ఒకవేళ ఈ స్కాం పూర్తిగా బయటికి వస్తే అధికారుల్ని బలి చేసేందుకు కూడా ఈ తండ్రీకొడుకులు వెనుకాడరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
Stv9 Press
డీఎస్సీలో జరిగిన అవకతవకలపై మేము ప్రశ్నలు సంధిస్తున్నా.. చంద్రబాబు, నారా లోకేష్ కనీసం స్పందించడం లేదు. వాళ్లు తప్పు చేశారు. కాబట్టే బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఉండిపోతున్నారు. ఒకవేళ ఈ స్కాం పూర్తిగా బయటికి వస్తే అధికారుల్ని బలి చేసేందుకు కూడా ఈ తండ్రీకొడుకులు వెనుకాడరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి డీఎస్సీలో జరిగిన అవకతవకలపై మేము ప్రశ్నలు సంధిస్తున్నా.. చంద్రబాబు, నారా లోకేష్ కనీసం స్పందించడం లేదు. వాళ్లు తప్పు చేశారు. కాబట్టే బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఉండిపోతున్నారు. ఒకవేళ ఈ స్కాం పూర్తిగా బయటికి వస్తే అధికారుల్ని బలి చేసేందుకు కూడా ఈ తండ్రీకొడుకులు వెనుకాడరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పలమనేరులో ఘనంగా మండల ,జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుల వీడ్కోలు సమావేశం చిత్తూరు జిల్లా పలమనేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జెడ్పిటిసి సభ్యుల వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగినది.. 2021 సంవత్సరంలో ఎన్నుకోబడి 2026 సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన ఎంపీటీసీ జడ్పిటిసిల పదవీకాలం ముగియుండడంతో మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ జడ్పిటిసి సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ జి శ్రీనివాసులు @ వాసన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్ హయాంలో 2021లో ఎంపీటీసీ, జడ్పిటిసిలుగా ఎన్నుకోబడి ప్రజలందరికీ అన్ని రంగాలలో సేవలు అందించిన జడ్పిటిసిలు ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీటీసీలు జడ్పీటీసీల పదవీకాలం ముగిసిన తర్వాత నెమ్మదిగా ఉండగా అనునిత్యం ప్రజలతో మమేకమై సేవ చేయాలని మళ్లీ వచ్చే ఎన్నికలలో దీటుగా నిలబడి గెలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మల్లికా రంగనాథం, ఎంపీపీ రోజా, వైస్ఎంపీపీ వన్ జయశ్రీ బాలాజీ, వైస్ ఎంపీపీ టు గజేంద్ర ఇతర ఎంపీటీసీలు, వైసిపి నాయకులు రంగనాథం, బాలాజీ, విశ్వనాథరెడ్డి, రాజారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.1
- రాయల చెరువు కబ్జాకు చెక్: అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న జనసేన, బీజేపీ శ్రేణులు భూగర్భ జలాల ఉనికికి ప్రాణవాయువుగా, వేలాది మంది ప్రజల తాగునీటి, సాగునీటి అవసరాలు తీరుస్తున్న అమూల్యమైన ప్రకృతి సంపద పురాతన రాయల చెరువు. భావి తరాలకు జీవనాధారమైన ఇంతటి మహత్తర జలవనరును స్వార్థపరులు కబ్జా చేసి బహిరంగంగా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే, కళ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్న అధికారుల నిర్లక్ష్య వైఖరి తీవ్ర విస్మయాన్ని కలిగిస్తోంది. చెరువు అస్తిత్వాన్ని నాశనం చేస్తూ సాగుతున్న ఈ దుశ్చర్యపై సమాచారం అందుకున్న జనసేన టౌన్ ప్రెసిడెంట్ గాజుల నరేష్ రాయల్, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ జగదీష్ రాజు తమ బృందంతో కలిసి తక్షణమే క్షేత్రస్థాయికి దూసుకెళ్లి నిర్మాణ పనులను అక్కడికక్కడే నిలిపివేయించారు. కబ్జాదారుల ఎత్తులను నిర్భయంగా తిప్పికొట్టిన నేతలు, ప్రజా సంపదను కాపాడాల్సిన సంబంధిత యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూడటంపై నిప్పులు చెరిగారు. జలవనరులను కబళిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని, అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా,చెరువు పరిరక్షణకు ఎంతటి ప్రజా పోరాటానికైనా సిద్ధమని నేతలు స్పష్టం చేస్తూ, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు.3
- వినాయక చవితి వేళ పుంగనూరులో వర్షం పుంగనూరు మండలం, అన్నమయ్య జిల్లా: వినాయక చవితి పర్వదినం సందర్భంగా పుంగనూరులో వర్షం కురవడంతో ప్రజల్లో ఆనందం నెలకొంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా, సాయంత్రం వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. వినాయకుడి పండుగ వేళ వర్షం కురవడం శుభసూచకంగా భావిస్తూ భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. వర్షంతో పుంగనూరు పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. వినాయక చవితి వేళ పుంగనూరులో వర్షం పుంగనూరు మండలం, అన్నమయ్య జిల్లా: వినాయక చవితి పర్వదినం సందర్భంగా పుంగనూరులో వర్షం కురవడంతో ప్రజల్లో ఆనందం నెలకొంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా, సాయంత్రం వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. వినాయకుడి పండుగ వేళ వర్షం కురవడం శుభసూచకంగా భావిస్తూ భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. వర్షంతో పుంగనూరు పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.1
- పుంగనూరులో ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పుంగనూరు, అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో ఈరోజు ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు, గుండె పరీక్షలు, కంటి పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ప్రజల ఆరోగ్యమే మా ట్రస్ట్ లక్ష్యమని, ఇలాంటి ఉచిత శిబిరాలను ప్రతి నెలా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధు ల్యాబ్ టెక్నీషియన్ ఝాన్సీ రాణి, ఫార్మాసిస్ట్ స్రవంతి, బాల గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేసి, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.3
- బద్వేలులో వైభవంగా 9వ వార్షిక వినాయక చవితి వేడుకలు. స్వామివారి సన్నిధిలో గొప్ప అన్నదాన కార్యక్రమం. బద్వేలు,సెప్టెంబర్ 15: బద్వేలు పట్టణంలోని 16వ వార్డు సుమిత్రానగర్ నందు శ్రీ వరసిద్ధి వినాయక చవితి 9వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ ఉత్సవాలకు విచ్చేయుచున్న భక్తులందరికీ ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. ఉత్సవాలకు సహకరించిన దాతలు: వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. -విగ్రహ దాత మరియు దేవుని పూజా సామాగ్రి దాత: కీ.శే. గాండ్ల వెంకటరమణ బాబు - శ్రీమతి కుమారి -అన్నదాన దాతలు: కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ, శ్రీ కోడూరు మల్లిఖార్జున రెడ్డి - శ్రీమతి అపర్ణ -లడ్డు దాత: శ్రీ వెలిగండ్ల నాగరాజు - శ్రీమతి ఉమాదేవి -పూలదండ దాత: శ్రీ నిమ్మకాయల గురివిరెడ్డి - శ్రీమతి రాజమ్మ -పటాకుల దాతలు: శ్రీ కోడూరు చంద్రశేఖర్ రెడ్డి - శ్రీమతి ప్రశాంతి, శ్రీ కీ.శే. సంసాని ఏరికలయ్య - శ్రీమతి ఆదిలక్షుమ్మ ఆర్థిక సహాయం అందించిన దాతలు: శ్రీ నాగినేని వెంకటసుబ్బయ్య - 6000/-, శ్రీ నిమ్మకాయల శేఖర్ రెడ్డి - 5000/-, శ్రీ ఇమామ్ ఖాసీమ్ - 4000/-, శ్రీ లకిడి విజయ్ భాస్కర్ - 2116/-, శ్రీ కోన రవిశంకర్ - 2016/-, శ్రీ చెరుకూరి సిద్ధయ్య (టైలర్) - 2000/-, శ్రీ కనిశెట్టి సతీష్ (టీచర్) - 2000/-, శ్రీ పిట్టా జయసింహ - 2000/-, శ్రీ ఓబుల్ రెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి - 2000/-, శ్రీ మోరేపల్లె రామయ్య - 2000/-, శ్రీమతి కోటపాటి సావిత్రమ్మ - 2000/-, శ్రీ కీ.శే. పుల్లయ్య - 2000/-, శ్రీ రెడ్డిపల్లె శ్రీనివాసుల యాదవ్ - 2000/- ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలుగా సుమిత్రానగర్ లో వినాయక చవితి వేడుకలను ఐక్యమత్యంతో నిర్వహిస్తున్నామని, దాతల సహకారంతోనే ఈ వేడుకలు విజయవంతం అవుతున్నాయని తెలిపారు. భక్తులందరూ వచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అనంతరం మధ్యాహ్నం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ, కోడూరు మల్లిఖార్జున రెడ్డి - అపర్ణ, కొండూరు చంద్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సాయంత్రం చెక్కభజన కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేశారు.2
- వెలుగోడు నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలుగు గంగ SR1, SR2 లను నింపాలి - రైతు సేవా సమితి డిమాండ్ కడప జిల్లాలో నీరు లేకుండా అడుగంటిపోయిన తెలుగు గంగ SR1, SR2 ప్రాజెక్టులకు వెలుగోడు నుండి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, కడప జిల్లా ప్రజలకు, రైతులకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని రైతు సేవా సమితి కడప జిల్లా సమితి డిమాండ్ చేసింది. రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి కడప జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న "రైతు గ్రామబాట" కార్యక్రమం ఈరోజు 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఈరోజు మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేసి, ఎమ్మార్వో గారు లేకపోవడంతో డిప్యూటీ ఎమ్మార్వో నరసింహ గారికి వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఏలినో ప్రభావంతో జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేలు సహాయం అందించాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజోలి, జొలదరాశి, తెలుగు గంగ తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడి శెట్టి సహదేవుడు, మైదుకూరు పట్టణ, మండల నాయకులు, రైతులు దాశ రెడ్డి గారి సుబ్బరాయుడు, రాజా, మూలే రామచంద్రారెడ్డి, కోటయ్య గారి గుర్రప్ప, రాజాల రామచంద్రుడు, పసల పుల్లయ్య, అంకిరెడ్డిపల్లి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.1
- ప్రజల దాహార్తి కూడా తీర్చలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. విశాఖలో నీటి మాఫియా నడుస్తోందని ఎల్లో పత్రికలే రాస్తున్నాయి. పంచభూతాల్లో ఆకాశాన్ని తప్ప అన్నిటినీ దోచుకుంటున్నారు కూటమి నాయకులు. ప్రజల తాగునీటి అవసరాల కోసం ఉన్న నీటి నిల్వలను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న కొన్ని పరిశ్రమలకు తరలించేయడం నిజం కాదా? -కేకే రాజు గారు, విశాఖ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు ప్రజల దాహార్తి కూడా తీర్చలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. విశాఖలో నీటి మాఫియా నడుస్తోందని ఎల్లో పత్రికలే రాస్తున్నాయి. పంచభూతాల్లో ఆకాశాన్ని తప్ప అన్నిటినీ దోచుకుంటున్నారు కూటమి నాయకులు. ప్రజల తాగునీటి అవసరాల కోసం ఉన్న నీటి నిల్వలను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న కొన్ని పరిశ్రమలకు తరలించేయడం నిజం కాదా? -కేకే రాజు గారు, విశాఖ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు1
- నల్ల చెరువు పల్లి లో వినాయక లడ్డును వేలం పాటలో 27, 500వేల రూపాయలుకు దక్కించుకున్న మెరుగు శివ శంకర్ ఓడి చెఱువు సెప్టెంబర్ 15: మండలంలోని నల్లచెరువు పల్లి గ్రామంలోగ్రామస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ,వచ్చిన భక్తులకు తీర్థప్రసాదలు అంద జేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట లో శ్రీ వినాయక లడ్డు ను మెరుగు శివ శంకర్ 27,500 రూపాయలు కు దక్కించుకున్నారు.1
- కుప్పంలో మున్సిపాలిటీ లోని కొత్తపేట పరిధిలోని పెద్దపల్లి గంగమ్మ దేవస్థానాo దగ్గర గుర్తుతెలియని వృద్ధ సన్యాసి మృతి కుప్పంలో గుర్తుతెలియని వృద్ధ సన్యాసి మృతి.. - కుప్పం మున్సిపాలిటీ కొత్తపేట పరిధిలోని పెద్దపల్లి గంగమ్మ దేవస్థానానికి సంబంధించిన మైదానంలోని స్టేజ్ పైన గుర్తు తెలియని వృద్ధ సన్యాసి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కొత్తపేట 11వ క్లస్టర్ ఇంచార్జ్ కన్నన్ ఘటన స్థలానికి చేరుకుని కుప్పం పోలీస్ వారికి మున్సిపాలిటీ కమిషనర్ గారికి సమాచారం అందించడం జరిగింది.. విషయం తెలుసుకున్న కుప్పం పోలీసులు మున్సిపాలిటీ వారు మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకులు మాజీ ఎంపిటిసి కృష్ణన్ హరినాథ్ గౌడ్ మదన్ దిలీప్ ఘటన స్థలానికి చేరుకున్నారు . పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా తన వద్ద ఉన్న ఒక కాగితంలో తాను చెన్నై శ్రీ పెరంబురుకి చెందిన సోమ సుందరంగా తన కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు తన చిరునామా రాసి ఉన్నట్టు తెలిసింది. పోలీసుల మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..2