గోవాడ షుగర్స్ బకాయిలు వెంటనే చెల్లించాలి వ్యవసాయ సంక్షోభంలో కరువు సహాయక చర్యలు చేపట్టాలి: వ్యకాస గోవాడ షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతులు, కార్మికులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.38 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించి, సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. గోవాడ షుగర్స్‌పై చోడవరం, మాడుగుల, నర్సీపట్నం నియోజకవర్గాలకు చెందిన సుమారు 2.5 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ఫ్యాక్టరీ మూతపడటంతో ఈ ప్రాంత రైతులు చెరుకు సాగుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ఏడాది చెరుకు పంటను ఫ్యాక్టరీకి తరలించినా ఇప్పటికీ బకాయిలు అందక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిల చెల్లింపుల కోసం సంక్రాంతి సందర్భంగా రైతులు 23 రోజులపాటు అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారని గుర్తుచేశారు. అప్పట్లో ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ప్రస్తుత వ్యవసాయ సంక్షోభం దృష్ట్యా అనకాపల్లి జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టి రైతులు, వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని వెంకన్న కోరారు.

- సంస్కృత భాషా వికాసానికి బాలలే వారధులు - మాకవరపాలెంలో ఘనంగా సంస్కృత వారోత్సవాలు - శోభాయాత్ర, వివిధ పోటీలతో విద్యార్థుల్లో భాషపై ఆసక్తి మాకవరపాలెం: సంస్కృత భాషా వ్యాప్తికి సంస్కృత భారతి చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. సంస్కృత భాషపై చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతోపాటు, సంస్కృతంలో మాట్లాడేలా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. సంస్కృత భాషను దేశ విదేశాల్లో విస్తృతంగా పరిచయం చేసేందుకు సంస్కృత భారతి స్వచ్ఛంద సంస్థ గత 45 సంవత్సరాలుగా నిరంతరంగా కృషి చేస్తోంది. సంస్థ కార్యకర్తలు స్వచ్ఛందంగా సేవలందిస్తూ భాషా వికాసానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృత భారతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంస్కృత బాల కేంద్రాలు నిర్వహిస్తూ చిన్నారులకు సంస్కృత భాషపై ప్రాథమిక అవగాహనతోపాటు మాట్లాడే నైపుణ్యాన్ని నేర్పిస్తున్నారు. ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించే సంస్కృత వారోత్సవాల్లో భాగంగా మాకవరపాలెం మండలంలోని కన్నూరుపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న రెండు సంస్కృత బాల కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా మాకవరపాలెం హైస్కూల్లో విద్యార్థులతో శోభాయాత్ర నిర్వహించడంతోపాటు వివిధ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమంలో గాయత్రి సంస్కృత శిక్షణా కేంద్రం నిర్వాహకురాలు గాయత్రి దేవి, సుధీర్ కుమార్, మాకవరపాలెం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీను మాస్టారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు1
- *మారికవలస గురుకులాన్ని తీసేయమని సాక్షాత్తు గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి గారే ఆదేశించారంట??* *పాడేరు ఐటిడిఏ ఆదిత్య శర్మ గారు అమలు చేశారట...!* ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉంటుందా..? ⁉️ *సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తే....గిరిజన పిల్లలు చదువుకుంటున్న స్కూల్ ని తీసేయండి" అని చెబితే,ఇక ఈ కూటమి ప్రభుత్వానికి గిరిజనుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది..?*🤦🏻♂️ *యోగా గిన్నిస్ రికార్డులకు గిరిజన బిడ్డలు కావాలి..!* *భోగాపురం ఎయిర్‌పోర్ట్ రెడ్ కార్పెట్ కోసం గిరిజన బిడ్డలు కావాలి..!* *కానీ అదే గిరిజన బిడ్డలు చదువుకునే స్కూల్ ని మాత్రం తీసేయమని గిరిజన మంత్రే చెబుతారా...?* *ఇది #గిరిజనశాఖ కాదు.. #గిరిజనవంచన శాఖ..!* *480 మంది పేద గిరిజన బిడ్డలను అర్ధరాత్రి రోడ్డు మీద నిలబెట్టిన ఘనత ఈ మంత్రి గారిదేనా...?* గిరిజన బిడ్డల కన్నీళ్లకు కారణమైన మంత్రి వెంటనే సమాధానం చెప్పాలి..! #ITDA_Paderu #Araku #Marikavalasa1
- *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II1
- కన్నుల పండువగ శ్రీ పరదేశమ్మ తల్లి తీర్థం, అమ్మవారి నామస్మరణతో మారు మోగుతున్న గ్రామం. కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో గురువారం నాడు గ్రామ దేవత శ్రీ పరదేశమ్మ తల్లి అమ్మవారి తీర్థం కన్నుల పండువగ జరిగింది. పురోహితులు ఆధ్వర్యంలో వేకువ జామున అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించారు. భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు తీర్చుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నిర్వహించే ఈ పండుగ కోసం గ్రామ ప్రజలే కాకుండా, పరిసర ప్రాంతాల్లో ప్రజలు, ఇతర జిల్లాల్లో ప్రజలు, కూడా అమ్మవారిని దర్శించుకున్నటుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని నిర్వాహకులు తెలియజేశారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలియజేశారు.ఆలయంలో గాజులు వితరణ, మజ్జిగ, మంచినీళ్లు పంపిణీ కార్యక్రమాలు గ్రామ యువత ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.3
- నెల్లిమర్ల మండలం వల్లూరు మర్డర్ కేసు లో ఇద్దరు అరెస్టు నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామంలో కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో సిరిగుడి అప్పలనారాయణ, అతని కుమారుడు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.6 వేల ట్రాక్టర్ కిరాయి డబ్బుల విషయమై వివాదం జరగగా, శ్రీను కర్రతో రామారావు తలపై దాడి చేయడంతో మృతి చెందినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదైన 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు.1
- విజయనగరం: అయ్యన్నపేట రత్నన్న మదర్ తెరిసా సేవా సంఘం, బ్లడ్ డోనర్స్ క్లబ్ వార్షికోత్సవం.. విజయనగరం స్థానిక అయ్యన్నపేట వద్ద నున్న మదర్ థెరిసా సేవా సంఘం & బ్లడ్ డోనర్స్ క్లబ్ వార్షికోత్సవo & మథర్ తే్రీసా జయంతి ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ కుప్పిలి కీర్తి పట్నాయక్ హాజరయ్యారు.మా కార్యక్రమంనికి మదర్ తే్రీసా ఆదర్శం అన్నారు ఎన్నో సేవ కార్యక్రమలు చేస్తూన్న, మని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమలు చేయాలి అని పిలుపునిచ్చారు.తదుపరి నిరుపేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.పత్రిక సోదరులను సన్మానించారు.1
- శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ సందర్భంగా వెలిగిపోతున్న నెల్లిమర్ల నగరం నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి సెగిడి వీధి లో శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ 26-28వ తేదీ వరకు మూడు రోజులు నిర్వహించనున్నామని కనకదుర్గమ్మ ఆలయ కమిటీ బుధవారం తెలిపారు. నగరంలో ప్రధాన రహదారి, సెగిడివీధీలో లైటింగ్ తో నగరం మెరిసిపోతుంది. మొదటిరోజు మొయిద జంక్షన్లో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం,బంధువులు, స్నేహితులకు స్థానికులు విందు ఏర్పాట్లు చేశారు. గురువారం అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వనున్నామని చెప్పారు.1
- శ్రీ శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి పండగ పాట 2026 II గాజువాక II విశాఖపట్నం శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి పండగ పాట 2026 గాజువాక II విశాఖపట్నం1