logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జనగామను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం........... జిల్లా కేంద్రమైన జనగామను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు సంబంధిత మున్సిపల్ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం వారు మాట్లాడుతూ మౌలిక సదుపాయాల అభివృద్ధి,ఆదాయ వనరుల పెంపు,మెరుగైన పౌర సేవలపై దృష్టిసారించి నగరాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పెరుగుతున్న జనాభా,భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జనగామను ఆదర్శ పట్టణంగా అభివృద్ధి చేయడానికి మున్సిపాలిటీ కట్టుబడి ఉందని రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా,పారిశుధ్యంపై ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.వివిధ వార్డుల్లో యు ఎస్ టి నిధులతో దాదాపు 20 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని,ముఖ్యంగా సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.నగరంలో తరచూ ఎదురవుతున్న వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు 7 కోట్ల రూపాయల వ్యయంతో బాక్స్ డ్రెయిన్ నిర్మాణం జరుగుతోందని,మున్సిపాలిటీలో పారిశుధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడం,ఆక్రమణలను నియంత్రించడం,వీధి దీపాల నిర్వహణను మెరుగుపరచడం, పచ్చదనాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. నగర వ్యాప్తంగా వీధి కుక్కలు,కోతుల సమస్యలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజా మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని,పెండింగ్‌లో ఉన్న పన్నులు,మున్సిపల్ షాపుల అద్దెల బకాయిల వసూలు పై ప్రత్యేక దృష్టి సారించి మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. పారదర్శక పాలన,ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించే విధంగా వివిధ రకాల చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

12 hrs ago
user_Devender Pasunoori
Devender Pasunoori
Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
12 hrs ago
86318574-12f5-4afc-a791-7257fbe7918a

జనగామను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం........... జిల్లా కేంద్రమైన జనగామను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు సంబంధిత మున్సిపల్ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం వారు మాట్లాడుతూ మౌలిక సదుపాయాల అభివృద్ధి,ఆదాయ వనరుల పెంపు,మెరుగైన పౌర సేవలపై దృష్టిసారించి నగరాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పెరుగుతున్న జనాభా,భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జనగామను ఆదర్శ పట్టణంగా అభివృద్ధి చేయడానికి మున్సిపాలిటీ కట్టుబడి ఉందని రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా,పారిశుధ్యంపై ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.వివిధ వార్డుల్లో యు ఎస్ టి నిధులతో దాదాపు 20 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని,ముఖ్యంగా సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.నగరంలో తరచూ ఎదురవుతున్న వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు 7 కోట్ల రూపాయల వ్యయంతో బాక్స్ డ్రెయిన్ నిర్మాణం జరుగుతోందని,మున్సిపాలిటీలో పారిశుధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడం,ఆక్రమణలను నియంత్రించడం,వీధి దీపాల నిర్వహణను మెరుగుపరచడం, పచ్చదనాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. నగర వ్యాప్తంగా వీధి కుక్కలు,కోతుల సమస్యలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజా మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని,పెండింగ్‌లో ఉన్న పన్నులు,మున్సిపల్ షాపుల అద్దెల బకాయిల వసూలు పై ప్రత్యేక దృష్టి సారించి మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. పారదర్శక పాలన,ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించే విధంగా వివిధ రకాల చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సోమవారం ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నిత్య ఖజానాకు సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. సోమవారం సుమారు 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 1140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే VIP దర్శనాలు రూ.2.68 లక్షలు, ప్రసాదలతో రూ.9.11 లక్షలు, కార్ పార్కింగ్ రూ.3.50 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.1.13 లక్షలు, తదితరులు భాగాల నుంచి మొత్తం కలిపి రూ.21,30,621 ఆదాయం వచ్చింది.
    1
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సోమవారం ఆదాయ వివరాలు 
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నిత్య ఖజానాకు సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. సోమవారం సుమారు 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 1140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే VIP దర్శనాలు రూ.2.68 లక్షలు, ప్రసాదలతో రూ.9.11 లక్షలు, కార్ పార్కింగ్ రూ.3.50 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.1.13 లక్షలు, తదితరులు భాగాల నుంచి మొత్తం కలిపి రూ.21,30,621 ఆదాయం వచ్చింది.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    23 hrs ago
  • ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీళ్లు రావడంతో పొంగిపొర్లుతున్న చెక్డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజిగూడెం గ్రామంలోని వాగులో ఉన్న చెక్‌డ్యాం పొంగి పొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. చెక్‌డ్యాం నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని,రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.
    1
    ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీళ్లు రావడంతో పొంగిపొర్లుతున్న చెక్డ్యామ్ 
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజిగూడెం గ్రామంలోని వాగులో ఉన్న చెక్‌డ్యాం పొంగి పొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. చెక్‌డ్యాం నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని,రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    9 hrs ago
  • ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. అర్చకులు ఊరుగొండ మణిదీప్ నేతృత్వంలో ఘనంగా ప్రత్యేక పూజలు.. తరలివచ్చిన భక్తులు వరంగల్, సెప్టెంబర్ 14: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో కొలువుదీరిన విఘ్నేశ్వరునికి సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ​ఈ పూజా కార్యక్రమాలను అర్చకులు ఊరుగొండ మణిదీప్ శాస్త్రోక్తంగా, విశేష క్రతువులతో నిర్వహించారు. గణనాథునికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు జరిపించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ​గత సంవత్సరం నుండి ఈ ఉత్సవాలను ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తోంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవా సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పూజలతో మండప పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
    2
    ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. అర్చకులు ఊరుగొండ మణిదీప్ నేతృత్వంలో ఘనంగా ప్రత్యేక పూజలు.. తరలివచ్చిన భక్తులు


వరంగల్, సెప్టెంబర్ 14:
గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో కొలువుదీరిన విఘ్నేశ్వరునికి సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి.
​ఈ పూజా కార్యక్రమాలను అర్చకులు ఊరుగొండ మణిదీప్ శాస్త్రోక్తంగా, విశేష క్రతువులతో నిర్వహించారు. గణనాథునికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు జరిపించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
​గత సంవత్సరం నుండి ఈ ఉత్సవాలను ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తోంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవా సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పూజలతో మండప పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
    user_ఆడెపు రాంకిషన్
    ఆడెపు రాంకిషన్
    Content Creator (YouTuber) వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    23 hrs ago
  • వీర్నపల్లి మండలంలో తండావాసుల వినూత్న నిరసన... బురదమయంగా మారిన రోడ్డుపై నాట్లేసి రోడ్డు బాగు చేయాలని డిమాండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిని కేలోత్ తండా వాసులు వినోద్ నిరసన తెలిపారు. నిన్న కురిసిన వర్షానికి రోడ్డంతా బురదమయంగా మారడంతో నడవడానికి వీలు లేని రోడ్డుపై వరి నాట్లు వేసి ఆందోళన వ్యక్తం చేశారు. చినుకు పడితే రోడ్డు చిత్తడై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ కోడు ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. పాలకులకు అధికారులకు జ్ఞానోదయం కావాలని బురద రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపామని చెప్పారు. ఇప్పటికైనా రోడ్డు బాగు చేసి తమ ఇబ్బందులు తీర్చాలని కోరారు.
    1
    వీర్నపల్లి మండలంలో తండావాసుల వినూత్న నిరసన... బురదమయంగా మారిన రోడ్డుపై నాట్లేసి రోడ్డు బాగు చేయాలని డిమాండ్
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిని కేలోత్ తండా వాసులు వినోద్ నిరసన తెలిపారు. నిన్న కురిసిన వర్షానికి రోడ్డంతా బురదమయంగా మారడంతో నడవడానికి వీలు లేని రోడ్డుపై వరి నాట్లు వేసి ఆందోళన వ్యక్తం చేశారు. చినుకు పడితే రోడ్డు చిత్తడై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ కోడు ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. పాలకులకు అధికారులకు జ్ఞానోదయం కావాలని బురద రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపామని చెప్పారు. ఇప్పటికైనా రోడ్డు బాగు చేసి తమ ఇబ్బందులు తీర్చాలని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • 𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏][𝐌𝐀𝐋𝐄][𝐆𝐎𝐕𝐓.𝐊𝐃𝐂-𝐁𝐀.3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑:𝐇𝐍𝐊][𝐈𝐍𝐓𝐀𝐑(𝐁𝐈𝐏𝐂-1992 𝐘𝐄𝐀𝐑][𝐇𝐈𝐍𝐃𝐇𝐔@𝐑𝐄𝐋𝐈𝐆𝐈𝐎𝐍][𝐈𝐍𝐒𝐓𝐀𝐀𝐆𝐑𝐀𝐀𝐌𝐒][[𝐓𝐇𝐎𝐔𝐓𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏;𝐅𝐀𝐂𝐄 𝐁𝐎𝐎𝐊𝐒][𝐈𝐍𝐃𝐈𝐀#𝐀𝐒𝐈𝐀#𝐖𝐎𝐑𝐋𝐃]
    1
    𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏][𝐌𝐀𝐋𝐄][𝐆𝐎𝐕𝐓.𝐊𝐃𝐂-𝐁𝐀.3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑:𝐇𝐍𝐊][𝐈𝐍𝐓𝐀𝐑(𝐁𝐈𝐏𝐂-1992 𝐘𝐄𝐀𝐑][𝐇𝐈𝐍𝐃𝐇𝐔@𝐑𝐄𝐋𝐈𝐆𝐈𝐎𝐍][𝐈𝐍𝐒𝐓𝐀𝐀𝐆𝐑𝐀𝐀𝐌𝐒][[𝐓𝐇𝐎𝐔𝐓𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏;𝐅𝐀𝐂𝐄 𝐁𝐎𝐎𝐊𝐒][𝐈𝐍𝐃𝐈𝐀#𝐀𝐒𝐈𝐀#𝐖𝐎𝐑𝐋𝐃]
    user_𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏 𝐓𝐇𝐎𝐔𝐀𝐌]
    𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏 𝐓𝐇𝐎𝐔𝐀𝐌]
    Tour operator Hanamkonda, Hanumakonda•
    17 hrs ago
  • మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో గణేష్ ఉత్సవాలకు భారీ బందోబస్తు గణేష్ ఉత్సవాలు, నిమజ్జనాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది “గణేష్ సురక్ష సంకల్ప్–2026” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు. “మన గణేష్ – మన భద్రత” అనే నినాదంతో భక్తులు, గణేష్ మండపాల నిర్వాహకులు బాధ్యతగా, క్రమశిక్షణతో ఉత్సవాలను నిర్వహించాలని సిపి పిలుపునిచ్చారు. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 15 వేలకుపైగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు కానున్నట్లు అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు 10 శాతం పెరుగుదల ఉండే అవకాశం ఉందని తెలిపారు. గణేష్ మండపాల ఏర్పాటు కోసం నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో సమాచారం నమోదు చేయాలని సూచించగా, ఇప్పటివరకు సుమారు 6,500 ఆన్‌లైన్ దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. ఉత్సవాల బందోబస్తు కోసం అన్ని స్థాయిలకు చెందిన 5,749 మందికిపైగా పోలీస్ సిబ్బందిని విధుల్లో నియమించనున్నట్లు తెలిపారు. అదనంగా ఇతర జిల్లాలు, ప్రత్యేక విభాగాల నుంచి కూడా సిబ్బందిని రప్పిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు సుమారు 1,200 మంది ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉంటారని, కీలక జంక్షన్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
    1
    మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో గణేష్ ఉత్సవాలకు భారీ బందోబస్తు
గణేష్ ఉత్సవాలు, నిమజ్జనాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది “గణేష్ సురక్ష సంకల్ప్–2026” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్  సుమతి తెలిపారు.
“మన గణేష్ – మన భద్రత” అనే నినాదంతో భక్తులు, గణేష్ మండపాల నిర్వాహకులు బాధ్యతగా, క్రమశిక్షణతో ఉత్సవాలను నిర్వహించాలని సిపి పిలుపునిచ్చారు.
కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 15 వేలకుపైగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు కానున్నట్లు అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు 10 శాతం పెరుగుదల ఉండే అవకాశం ఉందని తెలిపారు. గణేష్ మండపాల ఏర్పాటు కోసం నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో సమాచారం నమోదు చేయాలని సూచించగా, ఇప్పటివరకు సుమారు 6,500 ఆన్‌లైన్ దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు.
ఉత్సవాల బందోబస్తు కోసం అన్ని స్థాయిలకు చెందిన 5,749 మందికిపైగా పోలీస్ సిబ్బందిని విధుల్లో నియమించనున్నట్లు తెలిపారు. అదనంగా ఇతర జిల్లాలు, ప్రత్యేక విభాగాల నుంచి కూడా సిబ్బందిని రప్పిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు సుమారు 1,200 మంది ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉంటారని, కీలక జంక్షన్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    4 hrs ago
  • రైతులకు ఫ్రీగా వేములవాడ రాజన్న కోడెల పంపిణీ...500 కోడెలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల వేములవాడ రాజన్న సన్నిధిలో పరిమితికి మించి ఉన్న 500 రాజన్న కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిధిలోని తిప్పాపురంలో గల గోశాలలో రైతులకు రాజన్న కోడెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో పాటు ఆలయ అధికారులు పాల్గొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 250 మంది రైతులకు 500 కోడెలు ఉచితంగా అందజేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే రాజన్న కోడెలు పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదివరకు 10 విడతలుగా 2100 కోడెలు పంపిణీ చేశామని, ప్రస్తుతం మరో 500 కోడెలు రైతులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. భక్తి భావంతో భక్తులు పాలు మరువని అనారోగ్యంగా ఉన్న కోడెలను రాజరాజేశ్వర స్వామికి సమర్పిస్తున్నారని అలాంటి కోడెలు సమర్పించవద్దని కోరారు. నిజ కోడెలు సమర్పించే భక్తులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అనారోగ్యంగా పాలు మరువని, జర్సీ కోడెలను ఇచ్చి పాపం మూట కట్టుకోవద్దని సూచించారు. రాజన్న కోడెల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని భక్తులు సమర్పించే కోడెలను గ్రేడింగ్ పద్ధతిలో వేరు వేరు ప్రదేశాల్లో ఉంచేలా కృషి చేస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. పాలు మరవని కోడెలను, జెర్సీ కోడెలను తీసుకురావద్దన్నారు. రైతులకు ఇచ్చిన కోడెను రాజన్న ప్రసాదంగా భావించి, కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకోవాలన్నారు. రైతులకు ఇచ్చిన కోడెలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఒకవేళ రైతులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    2
    రైతులకు ఫ్రీగా వేములవాడ రాజన్న కోడెల పంపిణీ...500 కోడెలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి
కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల వేములవాడ రాజన్న సన్నిధిలో పరిమితికి మించి ఉన్న 500 రాజన్న కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిధిలోని తిప్పాపురంలో గల గోశాలలో రైతులకు రాజన్న కోడెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో పాటు ఆలయ అధికారులు పాల్గొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 250 మంది రైతులకు 500 కోడెలు ఉచితంగా అందజేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే రాజన్న కోడెలు పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదివరకు 10 విడతలుగా 2100 కోడెలు పంపిణీ చేశామని, ప్రస్తుతం మరో 500 కోడెలు రైతులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. భక్తి భావంతో భక్తులు పాలు మరువని అనారోగ్యంగా ఉన్న కోడెలను రాజరాజేశ్వర స్వామికి సమర్పిస్తున్నారని అలాంటి కోడెలు సమర్పించవద్దని కోరారు. నిజ కోడెలు సమర్పించే భక్తులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అనారోగ్యంగా పాలు మరువని, జర్సీ కోడెలను ఇచ్చి పాపం మూట కట్టుకోవద్దని సూచించారు. రాజన్న కోడెల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని భక్తులు సమర్పించే కోడెలను గ్రేడింగ్ పద్ధతిలో వేరు వేరు ప్రదేశాల్లో ఉంచేలా కృషి చేస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. 
పాలు మరవని కోడెలను, జెర్సీ కోడెలను తీసుకురావద్దన్నారు. రైతులకు ఇచ్చిన కోడెను రాజన్న ప్రసాదంగా భావించి, కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకోవాలన్నారు. రైతులకు ఇచ్చిన కోడెలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఒకవేళ రైతులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • తెలంగాణలో MEOల కొరతపై కవిత ఆందోళన ప్రతి మండలానికి ఎంఈఓ ఉండాలి తెలంగాణలో సుమారు 620 మండలాలు ఉండగా, ప్రతి మండలానికి ఒక మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (MEO) ఉండాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్ పార్టీ చీఫ్ కవిత అన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా కేవలం 8 మండలాల్లో మాత్రమే పర్మనెంట్ MEOలు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. విద్యాశాఖలో కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సిన MEO పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యా పరిపాలనపై ప్రభావం పడుతోందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి మండలానికి శాశ్వత MEOను నియమించి విద్యాశాఖను బలోపేతం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    1
    తెలంగాణలో MEOల కొరతపై కవిత ఆందోళన ప్రతి మండలానికి ఎంఈఓ ఉండాలి
తెలంగాణలో సుమారు 620 మండలాలు ఉండగా, ప్రతి మండలానికి ఒక మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (MEO) ఉండాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్ పార్టీ చీఫ్ కవిత అన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా కేవలం 8 మండలాల్లో మాత్రమే పర్మనెంట్ MEOలు ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
విద్యాశాఖలో కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సిన MEO పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యా పరిపాలనపై ప్రభావం పడుతోందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి మండలానికి శాశ్వత MEOను నియమించి విద్యాశాఖను బలోపేతం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    5 hrs ago
  • తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని కూరగాయల మార్కెట్ వద్ద సాయుధ పోరాట యోధుడు అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం వీరోచితంగా పోరాడిందన్నారు. ఈ చరిత్రను వక్రీకరించొద్దన్న చాడ... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో సాయుధ పోరాట స్మృతివనం ఏర్పాటు చేయాలని, అమరవీరుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని గ్రామపంచాయతీల్లో జాతీయ జెండాలు ఎగురవేయాలని, పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    3
    తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
కరీంనగర్‌లోని కూరగాయల మార్కెట్ వద్ద సాయుధ పోరాట యోధుడు అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం వీరోచితంగా పోరాడిందన్నారు.
ఈ చరిత్రను వక్రీకరించొద్దన్న చాడ... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో సాయుధ పోరాట స్మృతివనం ఏర్పాటు చేయాలని, అమరవీరుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు.
అన్ని గ్రామపంచాయతీల్లో జాతీయ జెండాలు ఎగురవేయాలని, పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    39 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.