గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మేగా వైద్య శిబిరం. పెద్దపంజాణి ఆగస్టు 2( ప్రజా ప్రతిభ) పెద్దపంజాణి మండలం శివాడి గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు రామ్మూర్తి, ధనంజయ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో గ్రామ సేవా సమితి ఏర్పాటు చేసి ఇప్పటికే 32 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా కుప్పం పి ఈ ఎస్ ఆసుపత్రి వారి సహకారంతో పెద్దపంజాణి మండలం శంకర్ రాయలపేట గ్రామంలో సంత గేటు ఆవరణ నందు చుట్టుపక్కల గ్రామస్తులకు వైద్య సదుపాయాలు కల్పించాలని ఉద్దేశ్యముతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాల వ్యాధిగ్రస్తులు పేదలు, నిరుపేదలు డబ్బు ఖర్చుపెట్టలేక సతమతమవుతున్న విషయాన్ని గమనించి అటువంటి వారికి మా గ్రామ సేవా సమితి తరపున వైద్యం అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో మా సంస్థ తరఫున అనేకమైన సేవా కార్యక్రమాలు ప్రజలకు అందించమని గుర్తు చేశారు. ఈ మధ్యకాలంలో గుట్టూరు గ్రామంలో భూమి విషయంపై తగాదాలు పడి కోర్టులో కేసు జరుగుతున్న కేసు పరిష్కారం కాకపోవడంతో మా సంస్థ దృష్టికి రావడంతో తమ బృందం అన్నదమ్ములకు అవగాహన కల్పించి రాజీ కుదిరించి పరిష్కరించామన్నారు. అదేవిధంగా శివాడి గ్రామములో 300 అడుగులు తాగునీటి పైపులైన్ కోసం తమ సంస్థ నిధులతో ఖర్చు చేసి ప్రజలకు తాగునీరు అందించడం జరిగింది అన్నారు. పి .ఇ .ఎస్ డాక్టర్లు చంద్ర, వెంకటేష్ మాట్లాడుతూ గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరానికి వస్తున్న రోగులకు బీపీ, షుగరు ,బోదకాలు, దీర్ఘకాలిక వ్యాధులు క్యాన్సర్ ,రక్తహీనత , తదితర వాటికి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇక్కడ పరిశీలించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం పి ఈ ఎస్ ఆసుపత్రికి రాకపోకల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి అనేకమంది ముందుకు వస్తున్నారని, ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేపడతామని గ్రామ సేవ సమితి నిర్వాహకులు రామ్మూర్తి, ధనంజయ తెలిపారు.

- మోసం చేసి భూమి లాగేశాడు లబోదిబోమంటున్న బాధితుడు. పలమనేరు డిసెంబర్ 18( ప్రజా ప్రతిభ) అప్పు ఇస్తానని నమ్మించి మోసంతో భూమి లాగేశాడని విషయం తెలుసుకున్న బాధితుడు శంకరప్ప లబోదిబోమంటున్న కన్నీటి గాథ గురువారం వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ జె. కొత్తూరు గ్రామం వాల్మీకి మొగిలప్ప కుమారుడు శంకరప్పకు సర్వే నెంబర్ 756/1సి/1 లో 2.12 సెంట్లు భూమి ఉందని తెలిపాడు. సదరు భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి డబ్బు అవసరమైందని పలమనేర్ టౌన్ బసవన్న కట్ట వీధిలో ఉన్న రామ స్వామి కుమారుడు శ్రీనివాసులు శెట్టిని అప్పు అడిగానని వివరించాడు. తనకు మద్యం అలవాటు ఉందని దాని ఆసరాగా తీసుకొని శ్రీనివాసులు శెట్టి తనను మద్యం మత్తు లోకి దించి డబ్బులు ఇస్తానని పలమనేరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కాగితాల్లో సంతకం పెట్టమని నమ్మించారన్నారు. ఈ భూమిపై గంగవరం సొసైటీ బ్యాంకులో 2021లో రూ 66,000 లోను తీసుకున్నానని ఇంతవరకు చెల్లించి లేదన్నారు. అప్పు ఇస్తానని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి సంతకాలు తీసుకున్న పేపర్లు ద్వారా దొడ్డిదారుల్లో మా కుటుంబ సభ్యులు అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలిసిందన్నారు. ఇప్పటి వరకు భూమిని తానే సాగు చేసుకుంటున్నానని, ప్రభుత్వం మంజూరు చేసే రైతు భరోసా, కిసాన్ డబ్బులు తన అకౌంట్లోకే పడుతున్నాయన్నారు. మోసం చేసిన విషయాన్ని తెలుసుకొని శ్రీనివాసులు శెట్టి వద్దకు వెళ్లి అడగగా ఎప్పుడో నాకు అమ్మేశావని, భూమి కావాలంటే 9 లక్షలు రూపాయలు చెల్లిస్తే తిరిగి రాసిస్తానని లేకుంటే ఇతరులకు అమ్మేస్తానని బెదిరి స్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఆ భూమి తప్ప వేరే మార్గం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, తహసిల్దారు స్పందించి పరిశీలించి నాకు మద్యం తాపించి భూమి కొట్టేయాలని ఉద్దేశంతో డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి పై చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పేద వాడికి న్యాయం చేయాలని కోరాడు.1
- Post by Omnamashivaya S1
- విజయవాడలో అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు1
- Post by KLakshmi Devi1
- Post by Nagesh Thalari3
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1