Shuru
Apke Nagar Ki App…
వరంగల్‌కు చెందిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ పవన్ వరియోగి అకాడమీ ఆఫ్ ఫ్యామిలీ ఫిజీషియన్స్ ఇండియా (ఏఎఫ్పిఐ) తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎన్నికయ్యారు. ప్రజలకు సమగ్ర, నిరంతర, కుటుంబ కేంద్రీత వైద్య సేవలు అందించడంలో ఫ్యామిలీ మెడిసిన్ కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ పవన్ పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ అనే నినాదంతో రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కాలేజీలో ఫ్యామిలీ మెడిసిన్ విభాగాన్ని తప్పనిసరిగా ప్రారంభించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఫ్యామిలీ మెడిసిన్ విభాగాన్ని మరింత విస్తృత పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ పవన్ అభిప్రాయపడ్డారు.
Gautham
వరంగల్‌కు చెందిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ పవన్ వరియోగి అకాడమీ ఆఫ్ ఫ్యామిలీ ఫిజీషియన్స్ ఇండియా (ఏఎఫ్పిఐ) తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎన్నికయ్యారు. ప్రజలకు సమగ్ర, నిరంతర, కుటుంబ కేంద్రీత వైద్య సేవలు అందించడంలో ఫ్యామిలీ మెడిసిన్ కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ పవన్ పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ అనే నినాదంతో రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కాలేజీలో ఫ్యామిలీ మెడిసిన్ విభాగాన్ని తప్పనిసరిగా ప్రారంభించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఫ్యామిలీ మెడిసిన్ విభాగాన్ని మరింత విస్తృత పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ పవన్ అభిప్రాయపడ్డారు.
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ శివనగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటి సంపులో పెయింటింగ్ పనులు చేస్తుండగా, కెమికల్ రియాక్షన్ కారణంగా పెయింటర్ రాము స్పృహ తప్పి పడిపోయాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇంటి యజమాని రమేష్ మరియు ఆయన కుమారుడు దినేష్ కూడా స్పృహ కోల్పోయారు. ఈ ఘటనలో రమేష్ ఊపిరాడక మృతి చెందగా, 108 సిబ్బంది రాము మరియు దినేష్‌ను సంపులో నుండి బయటకు తీశారు. వారిని వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.1
- వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామంలో అంతర్జాతీయ హరిత మిత్ర అవార్డు గ్రహీత, వన ప్రేమికుడు నల్లగొండ సమ్మయ్య ఆధ్వర్యంలో వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద చెరువు కట్టకు ఇరువైపులా ముందు తరాలకు ఉపయోగపడే విధంగా మర్రి, రావి, జువ్వి, వేప, కానుగ, వెదురు, చీమ చింత, అల్ల నేరేడు వంటి 50 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు తాడిపర్తి నాగేంద్రమ్మ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం మొక్కలు నాటి, చెట్లను పెంచుతున్న నల్లగొండ సమ్మయ్య సేవలు ముందు తరాలకు గొప్ప వరమని కొనియాడారు. ఈ వన మహోత్సవంలో మాజీ వార్డు సభ్యులు పడిగపాటి శివ, పార్వతి, లాక లక్ష్మి, కళ్లెం జయమ్మ, కొల్లూరి ఉప్పలమ్మ, నాలం భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.2
- కరీంనగర్‌లోని సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ షాపు చోరీ కేసులో పోలీసులు తాజాగా మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. దీనితో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 8కి చేరిందని సీపీ గౌస్ ఆలం ప్రకటించారు. పీఎంజే జ్యువెలరీ షాప్‌లో నేరుగా చోరీకి పాల్పడి, కాల్పులు జరిపిన ఐదుగురిలో ఇప్పటికే ఇద్దరు అరెస్టవ్వగా, ఇప్పుడు మూడో వ్యక్తి సూర్యమణి @ సనోజ్ కుమార్ (21)ను పట్టుకున్నారు. నిందితులకు కారు సమకూర్చి, తుపాకులను సరఫరా చేసిన బీహార్‌కు చెందిన ఎం.డి. ఆదిల్ ఖాన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బీహార్ జైల్లో ఉన్న ఆదిల్ ఖాన్‌ను కరీంనగర్‌కు తరలించేందుకు ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి పిస్టల్, మ్యాగజైన్, ఒక బైక్, దోపిడీ రోజు వారు ధరించిన ఐదు జతల బట్టలు, మూడు జతల బూట్లు, మూడు నకిలీ ఆర్‌సీ కార్డులు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అరెస్టయిన ఐదుగురు నిందితులు - A1 సుబోధ్ సింగ్, A2 రఘునాథ్, A3 రావిష్, A10 అమర్ సింగ్, A11 జైనుల్లాబ్దీన్‌లను కోర్టు అనుమతితో ఆరు రోజుల పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి కస్టడీ ఈ నెల 23న ముగుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. కస్టడీ విచారణలో నిందితుడు రఘునాథ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ నుంచి టీవీఎస్ అపాచీ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రామడుగు మండల శివారులోని ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్ వద్ద కీలక ఆధారాలను సేకరించారు. నేరం జరిగిన రోజు నిందితులు ధరించిన 5 జతల దుస్తులు, 3 జతల బూట్లు, మూడు నకిలీ టూ వీలర్ ఆర్‌సి కార్డులు, ఒక మొబైల్ ఫోన్, అక్కడ దాచిన ఒక పిస్టల్, ఒక మ్యాగజైన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. కాగా, ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఐదుగురిని త్వరలోనే పట్టుకుంటామని సీపీ గౌస్ ఆలం స్పష్టం చేశారు.4
- వీణవంక మండలం లస్మక్కపల్లి గ్రామంలో గతంలో మూసివేయబడిన ప్రాథమిక పాఠశాలను సోమవారం రోజు గ్రామ సర్పంచ్ గెల్లు శ్రీనివాస్ మరియు మండల విద్యాధికారి శోభారాణి పునఃప్రారంభించారు. విద్యార్థులతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో నిండిపోయింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ, తమ గ్రామానికి ఇతర చోట్లకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేదని, ఉన్న ఊరిలోనే పాఠశాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ జిల్లా విద్యాధికారిని కలిసినట్లు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రోత్సాహంతో, నియోజకవర్గ ఇన్ చార్జ్ వొడితల ప్రణవ్ చొరవతో ఈ పాఠశాలను ప్రారంభించుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, సాహెబ్ హుస్సేన్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణంపై గతంలో వెల్లువెత్తిన ప్రశ్నలు నేడు నిజమయ్యాయి, భారీ కుంభకోణం బట్టబయలైంది. ఈ కుంభకోణంలో కేవలం కొందరు వ్యక్తులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడం సరికాదని, దీని వెనుక ఉన్న మొత్తం వ్యవస్థను వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద అధికారులు, రైస్ మిల్లర్లు, సెంటర్ ఇంచార్జిల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దొరికిన దొంగలు కొంతమందేనని, ఇంకా దొరకాల్సిన 'తిమింగలాలు' చాలానే ఉన్నాయని పేర్కొన్నారు.1
- హనుమకొండ జిల్లాలోని మడికొండలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని తీవ్రంగా హెచ్చరించారు. ఎవరైనా సరే, వారు పదవీ విరమణ చేసినా లేదా ఎక్కడికి వెళ్లినా, వారిని తిరిగి తీసుకొచ్చి సమాధానం చెప్పించే బాధ్యత తనదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలే భవిష్యత్తులో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులుగా ఎదగాలని కేటీఆర్ సూచించారు. పార్టీ ఓటమి తర్వాత ఎవరు నిజమైనవారు, ఎవరు కాదో స్పష్టంగా తెలిసిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.1
- జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని సూర్యాపేట–జనగామ ప్రధాన రహదారిపై దేవరుప్పుల పోలీస్ స్టేషన్ ఎదుట సోమవారం జరిగిన కారు, బైక్ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడికి సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో, దేవరుప్పుల మండల పోలీసులు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మానవత్వంతో స్పందించారు. బాధితుడి ప్రాణం అమూల్యమని భావించి, పోలీసులు తమ వాహనంలోనే వెంటనే జనగామ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించి, అత్యవసర చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. అవసరమైన సమయంలో ప్రాణాలను కాపాడే మానవత్వం కూడా ఉంటుందని దేవరుప్పుల పోలీసులు మరోసారి నిరూపించారని, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.1