గద్వాల ప్రజలను ఆకట్టుకున్న పాండురంగ స్వామి ఆలయంలో వినాయకుడి వైభవ అలంకరణ గద్వాల: పట్టణంలోని పాండురంగ స్వామి ఆలయం స్వకులసాలె సమాజ్ ఆధ్వర్యంలో కొలువుదీరిన వినాయకుడికి ప్రతి సంవత్సరం వినూత్నంగా అలంకరణలు చేస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నారు. ఈ ఏడాది అమృత భాండం కోసం దేవతలు–దానవులు క్షీరసాగరాన్ని మథించిన ఘట్టాన్ని అద్భుతంగా అలంకరణ రూపంలో తీర్చిదిద్దారు. స్వకులసాలె సమాజ్ అధ్యక్షులు రావుత్ ఆనందరావు యువజన సంఘం అధ్యక్షులు కామ్లే శ్రీనివాస్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ క్షీరసాగర మథనం అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది సముద్ర మథనం, దేవతలు–దానవులు, అమృత కలశంతో ధన్వంతరి ప్రత్యక్షం వంటి పురాణ ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు సనాతన ధర్మంలోని పురాణ గాథలను నేటి తరానికి, ముఖ్యంగా చిన్నారులకు సులభంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ అలంకరణను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ధన్వంతరి అమృత కలశంతో ప్రత్యక్షమైన అనంతరం అమృతం కోసం దేవతలు–దానవుల మధ్య ఏర్పడిన పరిస్థితుల్లో, శ్రీమహావిష్ణువు మోహినీ రూపాన్ని ధరించి అమృతాన్ని దేవతలకు పంచిన ఘట్టం భాగవత పురాణంలో ప్రసిద్ధి చెందిందని వివరించారు. పురాణ గాథను కళారూపంలో చూసే అవకాశం కల్పించడంతో చిన్నారులు, భక్తులు ఆసక్తిగా తిలకిస్తూ ఓహో ఆహా అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ అలంకరణ ద్వారా భక్తి, సంస్కృతి, సనాతన ధర్మంలోని పురాణ వైభవం ప్రజలకు చేరువవుతోంది. ఈ కార్యక్రమంలో స్వకులసాలె సమాజ్ కమిటీ సభ్యులు, యువజన సంఘం నాయకులు సాక్రే శ్రీనివాసులు, దేవుజి రాఘవేందర్ , దోత్రే రఘు, కామ్లే సురేందర్, దోత్రే మనోజ్, గణప నరేందర్, కే. ప్రవీణ్ , వీరన్న, మహిళ సంఘం ప్రతినిధులు, కులబంధువులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- గణపతిని తెస్తుండగా జరిగిన దుర్ఘటన పటాస్ లకు దూరంగా ఉండండి డీజే మరియు త్రా గుడ కు ప్రమాదకర మైన వాటికి దూరంగా ఉండండి విషయం పటాస్ ల దాటికి సౌండ్ దాటికి లైటింగ్ దాటికి డ్రైవర్ కి కనబడక ఈ విషాదం జరిగింది అందరూ అన్నిటికీ దూరంగా ఉండి జాగ్రత్త వహించాలని కో రడ మై నది4
- భారత్ మాల రోడ్డు నుండి రాజోలి మండల కేంద్రానికి వెళ్లేందుకు కనెక్టివిటీ రోడ్డు నిర్మించాలి. రాజోలి మీదుగా వెళ్తున్న భారత్‌మాల రోడ్డు నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని అయితే మండల కేంద్రమైన రాజోలికి కనెక్టివిటీ రోడ్డు లేకుండా నిర్మాణం జరుగుతోందని మండల కేంద్రానికి తప్పనిసరిగా కనెక్టివిటీ రోడ్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజోలి గ్రామస్తులు భారత్‌మాల రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ నిరంతరాయంగా మండల కేంద్రానికి ప్రజలు రాత్రి పగలు అని తేడా లేకుండా రాకపోకలు సాగిస్తుంటారు కాబట్టి మండల కేంద్రానికి కనెక్టివ్ రోడ్డు ను నిర్మించాలని డిమాండ్ చేశారు.1
- లక్ష్మి నరసింహ , ఈరన్న స్వామి వర్ల దేవస్థానం ఉరుకుంద హుండీ లెక్కింపు శ్రీ లక్ష్మి నరసింహ , ఈరన్న స్వామి వర్ల దేవస్థానం ఉరుకుంద హుండీ లెక్కింపు 14 రోజుల అమౌంట్ Rs.1,20,72,793/- అన్నదానం హుండీ Rs.10,76,772/- మొత్తం ,31,49,565/- సెంట్రల్ బ్యాంకు అఫ్ శ్రీలంక 50 రూపాయలు బంగారం : 31గ్రామ్స్ 770mg,వెండి : 14కేజీల 500గ్రామ్స్ * 2026 శ్రావణమాసం ఉత్సవాల సంబంధించి శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం దేవస్థానం డిప్యూటీ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె.వాణి ఆధ్వర్యంలో మరియు పాలకమండలి సభ్యులు ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణ అధికారి శ్రీ బి.సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ కమీషనర్ కర్నూల్, దేవస్థాన పర్యవేక్షకులు మరియు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఉరుకుంద సిబ్బంది మరియు శ్రీ భ్రమరాంభ సేవాసమితి ఆదోని వారు పాల్గొనియున్నారు.2
- తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధాన నిబంధనలకు విరుద్ధంగా వేల సంఖ్యలో సింగిల్ టీచర్ స్కూల్స్ కొనసాగుతున్నాయన్నారు. కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు, ఉపాధ్యాయుల ప్రమోషన్లు నిలిచిపోవడంతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందన్నారు.1
- డప్పుల మోతలు.. నృత్యాలతో మారుమోగిన దైవందిన్నె.. ఆకట్టుకున్న వినాయక చవితి వేడుకలు దైవందిన్నెలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు1
- మంగనూర్ గ్రామంలో గణపతి వేడుకలు..మారుమోగిన ఆధ్యాత్మిక సంకీర్తనలు బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో శ్రీ చైతన్య గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన భజన మండలి కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు, లంబోదరుని పాటలు విజ్ఞప్తితో కూడిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో వంక మల్లయ్య, బూదూరు శ్రీనివాస్ రెడ్డి, కుమ్మరి కురుమయ్య, సేవకుల వెంకటయ్య తదితర గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొని శ్రుతి కలిపారు.1
- మంగంపేటలో సీసీ రోడ్డుకు ఎంపీ నిధులు సేవాలాల్ మహారాజ్ ఆలయానికి మెరుగైన రహదారి సౌకర్యం మహమ్మదాబాద్: మండలంలోని మారుమూల ప్రాంతమైన మంగంపేట తండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయానికి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేటాయించిన నిధులతో ఈ రహదారి నిర్మాణాన్ని చేపడుతున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా రహదారి సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న తండా ప్రజలకు ఊరట లభించింది.మండల బీజేపీ అధ్యక్షుడు మూస నరసింహ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కృష్ణ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఆలయానికి వచ్చే భక్తులు, స్థానిక గిరిజన ప్రజలు రాకపోకలు సాగించేందుకు రహదారి సౌకర్యం మెరుగుపడనుంది. వర్షాకాలంలో మట్టి రోడ్డు కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు కూడా తొలగనున్నాయని స్థానికులు పేర్కొన్నారు.సేవాలాల్ మహారాజ్ ఆలయానికి సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు చేయడంపై మంగంపేట తండా గిరిజన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి, రహదారి నిర్మాణానికి కృషి చేసిన బీజేపీ నాయకులకు గ్రామస్థులు, మహిళలు, యువకులు కృతజ్ఞతలు తెలిపారు. మారుమూల తండాల అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు మరింత కొనసాగించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన గిరిజనులు, మహిళలు, యువకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- మీడియా పై దౌర్జన్యాన్ని పరిశీలించండి ప్రతి ఒక సమస్య తెలిపేది మీడియా అలాంటి మీడియాని అనగా తొ క్కాల ని చూస్తే మీడియా మిత్రులకు పాత్రికేయులకు అని అర్థం పోతుంది విషయం ఎంత ప్రమాదం ఉన్న కవరేజ్ కి వెళ్లే వాళ్ళం ఆ విషయాలు తెలియజేసే వాళ్ళం మాపై దౌర్జన్యానికి వస్తే ఇంకెవరు తెలియజేస్తారు అందుకని మాకు రక్షణ కల్పించండి ప్రభుత్వాలని కోరేది మీడియా మిత్రులు1