logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

13.500 మంది గిరిజన విద్యార్థులచే ధీంసా నృత్యం తో ప్రధాని మోడీకు స్వాగతం పలికిన గిరిజనులు సెంటర్ : విశాఖ శీర్షిక: థింసా నృత్యంతో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం • 13,500 మంది గిరిజనుల నృత్య ప్రదర్శనతో భోగాపురం మార్మోగింది యాంకర్ : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారం భోత్సవానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గిరిజన విద్యార్థినులు, మహిళలు సంప్రదాయ థింసా నృత్యంతో ఘన స్వాగతం పలికా రు. వేలాది మంది ఒకేసారి లయబద్ధంగా చేసిన థింసా నృత్యం వేడుకకు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచి అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది. దాదాపు 13,500 మంది గిరిజన విద్యార్థినులు , మహిళలు సంప్రదాయ గులాబీ రంగు చీరలు, ఆకుపచ్చ అంచులతో కూడిన వస్త్ర ధారణలో ఒకే తీరుగా అడుగులు వేస్తూ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. విమానాశ్రయ టెర్మిన ల్‌ నుంచి బహిరంగ సభా వేదిక వరకు ఉన్న మార్గమంతా గిరిజన సంస్కృతి, సంప్రదాయ కళా వైభవాన్ని ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శన సాగింది. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్ తో కలిసి ఓపెన్‌ టాప్ వాహనంలో సభా వేదికకు వెళ్తుండగా, మార్గమంతా గిరిజన మహిళలు, విద్యార్థినులు థింసా నృత్యంతో స్వాగతం పలికారు. ఆహ్లాద కరమైన ఆ దృశ్యాలను ప్రధాని మోదీ ఆసక్తిగా వీక్షిస్తూ పలుమార్లు అభివాదం చేశారు. గిరిజనుల సంప్రదాయ కళ, క్రమశిక్షణ, లయ బద్ధమైన నృత్య ప్రదర్శన వేడుకకు విశేష శోభ ను తీసుకువచ్చింది. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో థింసా నృత్యం ప్రత్యేక ఆకర్ష ణగా నిలిచి, అక్కడికి వచ్చిన అతిథులు, ప్రజల నుంచి ఘన ప్రశంసలు అందుకుంది •థింసా నృత్యంతో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం •13,500 మంది గిరిజన విద్యార్థినులు, మహిళల లయబద్ధ నృత్య ప్రదర్శన • టెర్మినల్ నుంచి సభా వేదిక వరకు గిరిజన సంస్కృతి వైభవం •థింసా నృత్యాన్ని ఆసక్తిగా తిలకించిన ప్రధాని మోదీ •భోగాపురం ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన థింసా నృత్యం

3 hrs ago
user_Syyed taher
Syyed taher
Local News Reporter Repalle, Bapatla•
3 hrs ago

13.500 మంది గిరిజన విద్యార్థులచే ధీంసా నృత్యం తో ప్రధాని మోడీకు స్వాగతం పలికిన గిరిజనులు సెంటర్ : విశాఖ శీర్షిక: థింసా నృత్యంతో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం • 13,500 మంది గిరిజనుల నృత్య ప్రదర్శనతో భోగాపురం మార్మోగింది యాంకర్ : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారం భోత్సవానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గిరిజన విద్యార్థినులు, మహిళలు సంప్రదాయ థింసా నృత్యంతో ఘన స్వాగతం పలికా రు. వేలాది మంది ఒకేసారి లయబద్ధంగా చేసిన థింసా నృత్యం వేడుకకు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచి అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది. దాదాపు 13,500 మంది గిరిజన విద్యార్థినులు , మహిళలు

సంప్రదాయ గులాబీ రంగు చీరలు, ఆకుపచ్చ అంచులతో కూడిన వస్త్ర ధారణలో ఒకే తీరుగా అడుగులు వేస్తూ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. విమానాశ్రయ టెర్మిన ల్‌ నుంచి బహిరంగ సభా వేదిక వరకు ఉన్న మార్గమంతా గిరిజన సంస్కృతి, సంప్రదాయ కళా వైభవాన్ని ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శన సాగింది. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్ తో కలిసి ఓపెన్‌ టాప్ వాహనంలో సభా వేదికకు వెళ్తుండగా, మార్గమంతా గిరిజన మహిళలు, విద్యార్థినులు థింసా నృత్యంతో స్వాగతం పలికారు. ఆహ్లాద కరమైన ఆ

దృశ్యాలను ప్రధాని మోదీ ఆసక్తిగా వీక్షిస్తూ పలుమార్లు అభివాదం చేశారు. గిరిజనుల సంప్రదాయ కళ, క్రమశిక్షణ, లయ బద్ధమైన నృత్య ప్రదర్శన వేడుకకు విశేష శోభ ను తీసుకువచ్చింది. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో థింసా నృత్యం ప్రత్యేక ఆకర్ష ణగా నిలిచి, అక్కడికి వచ్చిన అతిథులు, ప్రజల నుంచి ఘన ప్రశంసలు అందుకుంది •థింసా నృత్యంతో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం •13,500 మంది గిరిజన విద్యార్థినులు, మహిళల లయబద్ధ నృత్య ప్రదర్శన • టెర్మినల్ నుంచి సభా వేదిక వరకు గిరిజన సంస్కృతి వైభవం •థింసా నృత్యాన్ని ఆసక్తిగా తిలకించిన ప్రధాని మోదీ •భోగాపురం ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన థింసా నృత్యం

More news from తెలంగాణ and nearby areas
  • వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.
    1
    వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్......

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • బాలకృష్ణకు ఫోన్ చేసిన అభిమాని.నల్లమల రంజిత్ .VIDEO.... ఖమ్మం :ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో ఖమ్మం పట్టణానికి చెందిన అభిమాని నల్లమల రంజిత్ ఫోన్లో మాట్లాడారు. ఇటీవల జరిగిన ప్రమాద సంఘటన తనతో పాటు అభిమానులను కలచివేసిందని రంజిత్ బాలయ్యకు వివరించారు. దీనికి స్పందించిన బాలకృష్ణ ప్రస్తుతం ఆరోగ్యం మెరుగ్గా ఉందని, వైద్యుల సూచన మేరకు మరో 3 వారాలు విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పారు. త్వరగా కోలుకోవాలని దేవుడికి పూజ చేయించినట్లు రంజిత్ చెప్పగానే బాలయ్య ధన్యవాదాలు తెలిపారు.
    2
    బాలకృష్ణకు ఫోన్ చేసిన అభిమాని.నల్లమల రంజిత్ .VIDEO....
ఖమ్మం :ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో ఖమ్మం పట్టణానికి చెందిన అభిమాని నల్లమల రంజిత్ ఫోన్లో మాట్లాడారు. ఇటీవల జరిగిన ప్రమాద సంఘటన తనతో పాటు అభిమానులను కలచివేసిందని రంజిత్ బాలయ్యకు వివరించారు. దీనికి స్పందించిన బాలకృష్ణ ప్రస్తుతం ఆరోగ్యం మెరుగ్గా ఉందని, వైద్యుల సూచన మేరకు మరో 3 వారాలు విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పారు. త్వరగా కోలుకోవాలని దేవుడికి పూజ చేయించినట్లు రంజిత్ చెప్పగానే బాలయ్య ధన్యవాదాలు తెలిపారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • ముదిగొండ లో రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ లో రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముదిగొండ నుంచి జాతీయ రహదారి వరకు రోడ్డు విస్తరణ పనులను అధికారులు ప్రారంభించడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు.ఎన్నో ఏళ్లుగా తాము నివాసం ఉంటున్న ఇళ్ళ ను కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం పనులు జరుగుతున్న రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవిన్యూ అధికారులు అక్కడికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
    1
    ముదిగొండ లో రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
ఖమ్మం జిల్లా ముదిగొండ లో రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముదిగొండ నుంచి జాతీయ రహదారి వరకు రోడ్డు విస్తరణ పనులను అధికారులు ప్రారంభించడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు.ఎన్నో ఏళ్లుగా తాము నివాసం ఉంటున్న ఇళ్ళ ను కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం పనులు జరుగుతున్న రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవిన్యూ అధికారులు అక్కడికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • ​పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి, సెప్టెంబర్ 1 నాటికి నీటిని విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం: జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని నేడు పరిశీలించడం జరిగిందని, వేగంగా పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత పేర్కొన్నారు. ఈ పరిశీలనలో భాగంగా ప్రత్యేక వాహనాల్లో జంట సొరంగాల్లోకి వెళ్లి ముందుగా టన్నెల్ బోరింగ్ మిషన్ (టీ బీ ఎం ) పనులను పరిశీలించి, పురోగతి సంబంధిత వివరాలను తెలుసుకున్నారు. ​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ: ​టన్నెల్-2 లైనింగ్ పనుల్లో పురోగతి: వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్-2 లో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దాదాపు నెల రోజుల క్రితం 2,000 మీటర్లకు పైగా బ్యాలెన్స్ ఉన్నటువంటి లైనింగ్ పనిని, ప్రస్తుతం దాదాపు 460 మీటర్ల వరకు తీసుకురావడం జరిగిందని తెలియజేశారు.​15 రోజుల్లో మిగిలిన పనుల పూర్తి: మిగిలిన 460 మీటర్ల లైనింగ్ పనిని కూడా ప్రణాళికాబద్ధంగా (Plan of Action), వీలైనంత వేగంగా, ఆగష్టు 15 లోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ​పునరావాస కాలనీల (R&R) అభివృద్ధి: ముంపునకు గురవుతున్న (Submergence) 11 గ్రామాలకు సంబంధించిన పునరావాస కాలనీల్లో ప్రాథమిక సౌకర్యాలు (Basic Amenities), మౌలిక సదుపాయాలు / ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు అత్యంత వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ​నిర్వాసితుల తరలింపు ఏర్పాట్లు: సత్వరమే పనులన్నీ పూర్తి చేసి, ఇప్పటికే పరిహారం అందుకున్న నిర్వాసితులను ఆయా కాలనీలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ​సెప్టెంబర్ 1 నాటికి నీటి విడుదల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, సెప్టెంబర్ 1వ తేదీ కల్లా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పనులను పూర్తి చేసి, నీటిని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.​ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఇతర జిల్లా అధికారులు, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ​పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి, సెప్టెంబర్ 1 నాటికి నీటిని విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం: జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత
పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని నేడు పరిశీలించడం జరిగిందని, వేగంగా పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత పేర్కొన్నారు. 
ఈ పరిశీలనలో భాగంగా ప్రత్యేక వాహనాల్లో జంట సొరంగాల్లోకి వెళ్లి ముందుగా టన్నెల్ బోరింగ్ మిషన్ (టీ బీ ఎం ) పనులను పరిశీలించి, పురోగతి సంబంధిత వివరాలను తెలుసుకున్నారు.
​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ:
​టన్నెల్-2 లైనింగ్ పనుల్లో పురోగతి: వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్-2 లో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దాదాపు నెల రోజుల క్రితం 2,000 మీటర్లకు పైగా బ్యాలెన్స్ ఉన్నటువంటి లైనింగ్ పనిని, ప్రస్తుతం దాదాపు 460 మీటర్ల వరకు తీసుకురావడం జరిగిందని తెలియజేశారు.​15 రోజుల్లో మిగిలిన పనుల పూర్తి: మిగిలిన 460 మీటర్ల లైనింగ్ పనిని కూడా ప్రణాళికాబద్ధంగా (Plan of Action), వీలైనంత వేగంగా, ఆగష్టు 15 లోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ​పునరావాస కాలనీల (R&R) అభివృద్ధి: ముంపునకు గురవుతున్న (Submergence) 11 గ్రామాలకు సంబంధించిన పునరావాస కాలనీల్లో ప్రాథమిక సౌకర్యాలు (Basic Amenities), మౌలిక సదుపాయాలు / ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు అత్యంత వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
​నిర్వాసితుల తరలింపు ఏర్పాట్లు: సత్వరమే పనులన్నీ పూర్తి చేసి, ఇప్పటికే పరిహారం అందుకున్న నిర్వాసితులను ఆయా కాలనీలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
​సెప్టెంబర్ 1 నాటికి నీటి విడుదల:  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, సెప్టెంబర్ 1వ తేదీ కల్లా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పనులను పూర్తి చేసి, నీటిని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.​ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఇతర జిల్లా అధికారులు, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    16 min ago
  • జాతీయ రహదారి విస్తరణ పనుల అడ్డుకట్ట: అధికారుల హామీతో విరమణ ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రం నుండి జాతీయ రహదారి వరకు అధికారులు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ విస్తరణ వల్ల తాము ఏళ్ల తరబడి నివాసముంటున్న ఇళ్లను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, పనులు జరుగుతున్న రహదారిపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు నిరసనను విరమించారు.
    1
    జాతీయ రహదారి విస్తరణ పనుల అడ్డుకట్ట: అధికారుల హామీతో విరమణ

ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రం నుండి జాతీయ రహదారి వరకు అధికారులు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ విస్తరణ వల్ల తాము ఏళ్ల తరబడి నివాసముంటున్న ఇళ్లను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, పనులు జరుగుతున్న రహదారిపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు నిరసనను విరమించారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • పాతర్లపాడు కూలిన కల్వర్టు తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం మండలంలోని పాతర్లపాడు కూలిన కల్వర్టు తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు. దీనితో రెండు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగిపోయాయి. గ్రామస్థులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    పాతర్లపాడు  కూలిన కల్వర్టు  తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం మండలంలోని పాతర్లపాడు  కూలిన కల్వర్టు  తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు. దీనితో రెండు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగిపోయాయి. గ్రామస్థులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
  • *ప్రస్తుతం ప్రముఖ పుణ్య క్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్తితి......*
    1
    *ప్రస్తుతం ప్రముఖ పుణ్య క్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్తితి......*
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.