ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం! హుజురాబాద్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల గేట్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ మాట్లాడుతూ... ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వెంటనే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జూనియర్ కళాశాలల సమస్యలు పరిష్కరిస్తామని, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తామని హామీ ఇచ్చిందని... కానీ ఆ హామీలు అమలుకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉదయాన్నే బస్సుల్లో కళాశాలలకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు రాజకీయాలపై కాదు... విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి అని డిమాండ్ చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి... మధ్యాహ్న భోజన పథకం అమలుకు కృషి చేయాలని కోరారు. తక్షణమే పథకాన్ని అమలు చేయకపోతే... ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమం చేపడతామని ఎస్ఎఫ్ఐ హెచ్చరించింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం! హుజురాబాద్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల గేట్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ మాట్లాడుతూ... ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వెంటనే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జూనియర్ కళాశాలల సమస్యలు పరిష్కరిస్తామని, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తామని హామీ ఇచ్చిందని... కానీ ఆ హామీలు అమలుకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. గ్రామీణ
ప్రాంతాల నుంచి ఉదయాన్నే బస్సుల్లో కళాశాలలకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు రాజకీయాలపై కాదు... విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి అని డిమాండ్ చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి... మధ్యాహ్న భోజన పథకం అమలుకు కృషి చేయాలని కోరారు. తక్షణమే పథకాన్ని అమలు చేయకపోతే... ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమం చేపడతామని ఎస్ఎఫ్ఐ హెచ్చరించింది.
- వీర్నపల్లి మండలంలో తండావాసుల వినూత్న నిరసన... బురదమయంగా మారిన రోడ్డుపై నాట్లేసి రోడ్డు బాగు చేయాలని డిమాండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిని కేలోత్ తండా వాసులు వినోద్ నిరసన తెలిపారు. నిన్న కురిసిన వర్షానికి రోడ్డంతా బురదమయంగా మారడంతో నడవడానికి వీలు లేని రోడ్డుపై వరి నాట్లు వేసి ఆందోళన వ్యక్తం చేశారు. చినుకు పడితే రోడ్డు చిత్తడై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ కోడు ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. పాలకులకు అధికారులకు జ్ఞానోదయం కావాలని బురద రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపామని చెప్పారు. ఇప్పటికైనా రోడ్డు బాగు చేసి తమ ఇబ్బందులు తీర్చాలని కోరారు.1
- ఇంజనీర్లు పాత్ర కీలకం. ఇంజినీర్లను లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం సౌజన్యంతో సత్కరించిన రామగుండం మేయర్ మహంకాళి స్వామి రామగుండం పునర్నిర్మాణంలో ఇంజనీర్లు పోషిస్తున్న పాత్ర కీలకమని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఇంజనీర్స్ డే పురస్కరించుకొని మంగళ వారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఇంజినీర్లను లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం సౌజన్యంతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఇంజనీరింగ్ సిబ్బంది శక్తి కి మించి శ్రమిస్తూ అభివృద్దిలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారని ఆయన కొనియాడారు. ప్రస్తుత ఇంజినీర్లు చిత్త శుద్దితో సేవలందిస్తూ నాణ్యత లో ఏ మాత్రం రాజీ పడకుండా మన్నికగా సుదీర్ఘ కాలం నిలిచి ఉండేలా రోడ్లు , కాలువల నిర్మాణం చేపడుతున్నారని అభినందించారు. రామగుండం నగరాన్ని అధ్భుతoగా తీర్చి దిద్దాలనే స్థానిక ఎం ఎల్ ఎ లక్ష్యానికి అనుగుణంగా ఇదే ఒరవడి కొనసాగిస్తూ ఇంజనీర్లు పని చేసి పాలవర్గానికి మంచి పేరు తీసుకు రావాలని ఆశిస్తున్నామని అన్నారు. అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శాంతి స్వరూప్ , ఎ ఇ లు మీర్ , తేజస్విని , సౌమ్య , మనోజ్ , అన్వేష్ , నవీన్ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు నవీన్ , అశోక్ , కళ్యాణ్ , శ్రావణ్ , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ సత్కారం అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధి కజంపురం రాజేందర్ తో పాటు , నగర పాలక సంస్థ కార్పొరేటర్లు గట్ల రమేష్ , వడ్లూరి రవి , కొలని కవిత , బాలసాని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.1
- 𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏][𝐌𝐀𝐋𝐄][𝐆𝐎𝐕𝐓.𝐊𝐃𝐂-𝐁𝐀.3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑:𝐇𝐍𝐊][𝐈𝐍𝐓𝐀𝐑(𝐁𝐈𝐏𝐂-1992 𝐘𝐄𝐀𝐑][𝐇𝐈𝐍𝐃𝐇𝐔@𝐑𝐄𝐋𝐈𝐆𝐈𝐎𝐍][𝐈𝐍𝐒𝐓𝐀𝐀𝐆𝐑𝐀𝐀𝐌𝐒][[𝐓𝐇𝐎𝐔𝐓𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏;𝐅𝐀𝐂𝐄 𝐁𝐎𝐎𝐊𝐒][𝐈𝐍𝐃𝐈𝐀#𝐀𝐒𝐈𝐀#𝐖𝐎𝐑𝐋𝐃]1
- కవులు కళాకారుల ఐక్యవేదిక, జనగామ ఆధ్యర్యంలో అభినందన సభ శ్రీ బేతి వీరారెడ్డి గారికి తెలంగాణ శాసనసభ సహాయ కార్యదర్శిగా విధి నిర్వహణలో ఉంటూ, తమ ఉన్నతమైన నైపుణ్యాల అధ్యయనంలో భాగంగా విదేశాల్లో పర్యలోంచి విజయవంతంగా స్వదేశానికి విచ్చేసిన వేదిక: పెంబత్తి గ్రామం గ్రామ పంచాయతి దగ్గర శ్రీ. నెల్లుట్ల రవీందర్ రావు గారికి నిరంతర సామాజిక సేవా వికాసమే ధ్యేయం నెల్లుట్ల ఫౌండేషన్ ద్వారా కళా, సాహిత్య, సామాజక సేవారంగాల్లో తమ నిరప,మాన సేవ గానూ ఇదేవల జాతీయ స్థాయిలో ప్రతిష్టాత పురస్కారాలు అందుకున్న 3໖: 20-09-2026 ఆదివారం సమయం: ৯ :6:00 e గ్రామ సర్పంచ్ శ్రీమతి చిన్నబోయిన రేఖరాజు గారి సహకారంతో అందరు ఆహ్వానితులే... ACCవర్కింగ్ కమిటీ జి. కృష్ట (జ.వై.గిరి ఫౌండేషన్) పెట్లోజు సోమేశ్వరాచారి (కవి హ్యధయం సాహిత్య వేదిక) అయిలా సోమనర్సింహాచా (అభినందన కల్వరల్ సొసైటీ- పెఁ లగిశెట్టి సభాకర్ చిలుమోజు సాయికిరణ్ గడం మనోజ్ కుమార్ గౌ3
- టైగర్ లేకున్నా టైగర్ జోన్ అమలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు అభయారణ్యంలో టైగర్ లేకుండా టైగర్ జోన్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్రీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారం మండలానికి చెందిన బద్రి నాయక్ మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూలో పాల్గొన్నారు. జన్నారంలో అమలు చేస్తున్న ఎకో జోన్ తో ఇసుక రాక ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని వాపోయారు. అధికారులు స్పందిస్తూ ఎకో జోన్ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.1
- ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీరు : పొంగిపొర్లుతున్న చెక్ డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజి గూడెం గ్రామ వాగులో ఉన్న చెక్ డ్యామ్ పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు మంగళవారం తెలిపారు.చెక్ డ్యామ్ నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.1
- తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని కూరగాయల మార్కెట్ వద్ద సాయుధ పోరాట యోధుడు అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం వీరోచితంగా పోరాడిందన్నారు. ఈ చరిత్రను వక్రీకరించొద్దన్న చాడ... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో సాయుధ పోరాట స్మృతివనం ఏర్పాటు చేయాలని, అమరవీరుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని గ్రామపంచాయతీల్లో జాతీయ జెండాలు ఎగురవేయాలని, పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.3
- రైతులకు ఫ్రీగా వేములవాడ రాజన్న కోడెల పంపిణీ...500 కోడెలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల వేములవాడ రాజన్న సన్నిధిలో పరిమితికి మించి ఉన్న 500 రాజన్న కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిధిలోని తిప్పాపురంలో గల గోశాలలో రైతులకు రాజన్న కోడెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో పాటు ఆలయ అధికారులు పాల్గొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 250 మంది రైతులకు 500 కోడెలు ఉచితంగా అందజేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే రాజన్న కోడెలు పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదివరకు 10 విడతలుగా 2100 కోడెలు పంపిణీ చేశామని, ప్రస్తుతం మరో 500 కోడెలు రైతులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. భక్తి భావంతో భక్తులు పాలు మరువని అనారోగ్యంగా ఉన్న కోడెలను రాజరాజేశ్వర స్వామికి సమర్పిస్తున్నారని అలాంటి కోడెలు సమర్పించవద్దని కోరారు. నిజ కోడెలు సమర్పించే భక్తులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అనారోగ్యంగా పాలు మరువని, జర్సీ కోడెలను ఇచ్చి పాపం మూట కట్టుకోవద్దని సూచించారు. రాజన్న కోడెల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని భక్తులు సమర్పించే కోడెలను గ్రేడింగ్ పద్ధతిలో వేరు వేరు ప్రదేశాల్లో ఉంచేలా కృషి చేస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. పాలు మరవని కోడెలను, జెర్సీ కోడెలను తీసుకురావద్దన్నారు. రైతులకు ఇచ్చిన కోడెను రాజన్న ప్రసాదంగా భావించి, కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకోవాలన్నారు. రైతులకు ఇచ్చిన కోడెలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఒకవేళ రైతులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.2
- తెలంగాణ సాయుధ పోరాటాన్ని హైజాక్ చేయాలని చూస్తున్న బిజెపి : ఖని లో జరిగిన స్ఫూర్తి సభలో సిపిఐ నేతలు కామ్రేడ్ కలవేని శంకర్, తాండ్ర సదానందం. తెలంగాణ సాయధ పోరాట చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని,ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకర్ , జిల్లా కార్యదర్శి కామ్రేడ్ తాండ్ర సదానందం లు డిమాండ్ చేశారు. మంగళ వారం స్థానిక మెయిన్ చౌరస్తా లో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల సభ సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సభ ప్రారంభానికి ముందు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ గోషిక మోహన్ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల చిత్రపటానికి సీపీఐ కామ్రేడ్ కలవేన శంకర్, తాండ్ర సదానందం లు పూల మాలలు వేశారు.అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ నీ తెలంగాణలో మాత్రం ప్రజలు నిజాం నిరంకుశ పాలన లో మగ్గుతూ అనేక అవస్ధలు పడుతున్నారని నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు కామ్రేడ్ రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి ,మఖ్దూం మోహియొద్దిన్ లు ఇచ్చిన సాయుధ పోరాట పిలుపునందుకొని నిజాం సేనలతో దొరలు భూస్వాములతో వీరోచితంగా పోరాడి 4500 మంది కమ్యూనిస్టులు అమరులైనారని అన్నారు.తొలి అమరుడు దొడ్డి కొమురయ్య,షేక్ బందగి లాంటి ఎందరో వీరుల రక్తంతో తెలంగాణ గడ్డ ఎరుపెక్కిందని అన్నారు.మూడు వేల గ్రామాలు విముక్తి చేసి పది లక్షల ఎకరాల భూమిని పంచారని తెలిపారు.ఇంతటి చారిత్రక పోరాటాన్ని బిజెపి హైజాక్ చేయాలని చూస్తున్నదని, హిందూ ముస్లిం అంటూ మతోన్మాదాన్ని పెంచి పోసిస్తున్నదని విమర్శించారు. కమ్యూనిస్టులు రజాకా ర్లతో చెలిమి చేశారని అబద్ధపు ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నదని ఆరోపించారు. చరిత్ర తెలియని బిజెపి నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తే చరిత్రహీనులుగా మిగులుతారని వారన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం సాయుధ పోరాట వారోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కె.కనకరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ తాళ్లపల్లి మల్లయ్య , కార్పొరేటర్ మార్కాపూర్ సూర్య జిల్లా కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ మాటే టి శంకర్,శనిగరపు చంద్రశేఖర్, ఆసాల రమ , రేణుకుంట్ల ప్రీతం,ఆసాల నవీన్, పడాల కనకరాజు, బూడిద మల్లేష్, అబ్దుల్ కరీం,శనిగరపు తిరుమల,దుబాసి రేణుక , సుధీర్,గుంపుల కుమారస్వామి, కె.జగన్ ,జైపాల్ రెడ్డి,ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.1