ధర్మారెడ్డిలో ముసాయిదా ఓటర్ల జాబితాపై గ్రామసభ – అర్హులైన ఓటర్ల వివరాల పరిశీలన SIR-2026 ప్రక్రియలో భాగంగా ధర్మారెడ్డి గ్రామంలో ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలన, సవరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లక్ష్మి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి, గ్రామంలోని అర్హులైన ఓటర్ల పేర్లు, వివరాలను జాబితా నుంచి చదివి వినిపించారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడం, పేర్లు లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉండటం, మార్పులు, చేర్పులు, అనర్హుల పేర్ల తొలగింపు వంటి అంశాలపై గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా పరిశీలించుకోవాలని సూచించారు. గ్రామస్తులు తమ వివరాలను స్వయంగా పరిశీలించుకుని, ఏవైనా తప్పులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి సవరణలు చేయించుకోవాలని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించడంతో పాటు, ఓటర్ల జాబితా సక్రమంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో GPO గంగాధర్, పంచాయతీ కార్యదర్శి రమేష్, ఉప సర్పంచ్ జయరాజ్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ధర్మారెడ్డిలో ముసాయిదా ఓటర్ల జాబితాపై గ్రామసభ – అర్హులైన ఓటర్ల వివరాల పరిశీలన SIR-2026 ప్రక్రియలో భాగంగా ధర్మారెడ్డి గ్రామంలో ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలన, సవరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లక్ష్మి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి, గ్రామంలోని అర్హులైన ఓటర్ల పేర్లు, వివరాలను జాబితా నుంచి చదివి వినిపించారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడం, పేర్లు లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉండటం, మార్పులు, చేర్పులు, అనర్హుల పేర్ల తొలగింపు వంటి అంశాలపై గ్రామస్తులకు అధికారులు
అవగాహన కల్పించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా పరిశీలించుకోవాలని సూచించారు. గ్రామస్తులు తమ వివరాలను స్వయంగా పరిశీలించుకుని, ఏవైనా తప్పులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి సవరణలు చేయించుకోవాలని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించడంతో పాటు, ఓటర్ల జాబితా సక్రమంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో GPO గంగాధర్, పంచాయతీ కార్యదర్శి రమేష్, ఉప సర్పంచ్ జయరాజ్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలు.... కామారెడ్డి పట్టణంలోని రాజా నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు రాజయ్య, రాఖీ పౌర్ణమి విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులు సోదర భావంతో ఉండాలని ఉద్దేశంతో రాఖీ పౌర్ణమి ఉత్సవాలను నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీచర్ జ్యోతి, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు1
- గుంతల రోడ్డుపై.. నిరసన బాట! డాంబర్ రోడ్డు కోసం 29న పాదయాత్ర.. సన్నాహక సమావేశంలో పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్ జిల్లా, నిజాంపేట: మూడేళ్లుగా అధ్వానంగా ఉన్న చల్మెడ కమాన్–నందగోకుల్ రహదారికి డాంబర్ వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని ఫంక్షన్‌హాల్‌లో ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న పాదయాత్రకు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సుధాకర్‌రెడ్డి, భాస్కర్‌రావు, బాల్‌రెడ్డి, రంజిత్‌గౌడ్, దయాకర్, శ్రీకాంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.2
- “ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపణ యూరియా కోసం వెళ్లిన రైతులకు అదనపు ఎరువుల భారం తప్పడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుక్ చేసుకున్న యూరియాతో పాటు మరో ఎరువును తప్పనిసరిగా కొనుగోలు చేయాలని డీలర్లు ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిప్పలతుర్తిలో ఓ దుకాణదారుడు రైతులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలిపారు. అంతేకాకుండా, “ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. రైతుల ఫిర్యాదులపై వ్యవసాయ శాఖ డీఏ, ఎంఓలు స్పందించారు. యూరియాతో పాటు ఇతర ఎరువులను బలవంతంగా అంటగట్టడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- నిజామాబాద్ జిల్లా, చందూర్ మండలం, కారెగాం తండాలో పట్టపగలే చోరీ... నిజామాబాద్ జిల్లా, చందూర్ మండలం, కారెగాం తండాలో పట్టపగలే చోరీ జరిగింది. ఇంటి యజమాని అనిత గొళ్ళెం వేసి పక్కింటి కి వెళ్ళి వచ్చి చూసే వరకు ఇంట్లో బీరువా తాళం పగిలి, దుస్తులు చిందర వందరగా ఉండడం చూసి చోరీ జరిగిందని భావించి బీరువాలో ఉన్న 2.5 తులాల బంగారం, 28 తులాల వెండి ఆభరణాలు, లక్ష రూపాయల వరకు నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అనంతరం సీ.సీ. ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలిసులు1
- వీధి కుక్కల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు మరోసారి ఫిర్యాదు – తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ బోధన్: బోధన్ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు జునైద్ అహ్మద్ ఖలీల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈరోజు జునైద్ అహ్మద్ ఖలీల్ ఆధ్వర్యంలో రాకాసిపేట్‌లోని వివిధ వార్డులకు చెందిన బాధ్యత వహిస్తున్న కుటుంబ సభ్యులు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి మరోసారి లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. వీధి కుక్కల సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు మున్సిపల్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా జునైద్ అహ్మద్ ఖలీల్ మీడియాతో మాట్లాడుతూ.. బోధన్‌లోని 38 మంది కౌన్సిలర్లను ప్రజలు ఓటు వేసి గెలిపించారని, అయితే వార్డుల్లోని ప్రజలు వీధి కుక్కల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రత్యేకంగా చిన్నారులు, వృద్ధులు వీధి కుక్కల కారణంగా భయాందోళనలకు గురవుతున్నారని, ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీధి కుక్కలపై చర్యలు తీసుకోకపోతే బోధన్‌లోని వీధి కుక్కలను పట్టుకుని బోధన్ మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చి వదిలిపెట్టాల్సి వస్తుందని జునైద్ అహ్మద్ ఖలీల్ హెచ్చరించారు. అలాగే బోధన్ ప్రజలు, ముఖ్యంగా చిన్నారుల భద్రత కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా స్పందించాలని జునైద్ అహ్మద్ ఖలీల్ మీడియా ద్వారా కోరారు. ప్రజలు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించారని, ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు. వీధి కుక్కల సమస్యపై వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.1
- అక్రమ కట్టడాలపై చర్యలు తిసుకోవాలని పిర్యాదు........... బిక్కనూర్ మండలంలోని అంతంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 44వ జాతీయ రహదారి పక్కన మాల్గుడి హోటల్, రిలయన్స్ పెట్రోల్ బంక్, పరివార్ హోటల్ లను ప్రభుత్వ స్థలంలో ఇప్పటి ప్రభుత్వాలు నిర్మించుకునేందుకు అవకాశాలు కల్పించాయని, ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించిన హోటళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం సిపిఎం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు గ్రామ సర్పంచ్ కు వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ భూములలో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు.1
- మెదక్ : రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేవైఎం నాయకులు ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్లు పెండింగ్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారన్నారు. యాజమాన్యాల సర్టిఫికెట్లను తీసుకోలేని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న 1500 కోట్ల రూపాయలు వెంటనే వీడియోలు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారి డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే బిజెపి, బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, రాజు యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాబ్లు, బిజెపి బీజేవైఎం నాయకులు సన్నీ, సాయి, సాయి బాబా, ప్రవీణ్, నర్సింగ్, నవీన్, సాయి జగదీష్ సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు1
- యూరియా యాప్ రద్దు చేయాలి. ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదంతో రోడ్డెక్కిన రైతులు మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం జాతీయ రహదారి నేషనల్ 44 హైవే యూరియా కొత్తవాళ్లను చుట్టుపక్కల గ్రామాల రైతులు గత 20 రోజుల నుండి యూరియా దొరకకపోవడంతో ఆగ్రహంతో గిరిజనులు రైతులు ఇతర గ్రామాల రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు ఇదే మీ ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదాలతో ఒరే ఎత్తించారు దాదాపు సుమారు 400 మంది రైతులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో పోలీసులు చేతులెత్తేశారు యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలని డౌన్ డౌన్ అంటూ వ్యవసాయ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని మాకు వద్దు ఈ అధికారి అని డిమాండ్ చేశారు ఏ మండలానికి ఆ మండలానికి రైతులు యూరియా తీసుకోవాలని అందరిని కలపవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు4