Shuru
Apke Nagar Ki App…
తృటిలో తప్పిపోయిన మేయర్ పీఠం... ప్రజా సేవకై ఇండిపెండెంట్ గా ఉంటానని స్పష్టం చేసిన కార్పొరేటర్ సౌగాని కొమురయ్య... కరీంనగర్ లో నాటకీయ పరిణామాల నేపథ్యంలో తృటిలో మేయర్ పదవికి దూరమైన పదో డివిజన్ కార్పొరేటర్ సౌగాని కొమరయ్య, ఏ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. ప్రజా సేవ చేయడానికి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశానని తెలిపారు. పదో డివిజన్ ప్రజలు ఆదరించి ఇండిపెండెంట్ గా గెలిపించారని కార్పోరేషన్ లో ఇండిపెండెంట్ కార్పోరేటర్ గా కొనసాగుతానని తెలిపారు. సేవ చేయాలని రాజకీయాలలొకి వచ్చానని చెప్పిన కొమురయ్య, అన్ని పార్టీల సహకారంతో డివిజన్ లో నెలకొన్న సమస్యలు పరిష్కరించి డివిజన్ అభివృద్ధికి పాటు పాటుపడుతానని చెప్పారు. మేయర్ అభ్యర్థిగా ప్రచారం సాగిందని, పరిస్థితులు అనుకూలించక తృటిలో తప్పిపోయిందని చెప్పారు. గెలిపించిన డివిజన్ ప్రజలకి ఎప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు.
K.V.REDDY
తృటిలో తప్పిపోయిన మేయర్ పీఠం... ప్రజా సేవకై ఇండిపెండెంట్ గా ఉంటానని స్పష్టం చేసిన కార్పొరేటర్ సౌగాని కొమురయ్య... కరీంనగర్ లో నాటకీయ పరిణామాల నేపథ్యంలో తృటిలో మేయర్ పదవికి దూరమైన పదో డివిజన్ కార్పొరేటర్ సౌగాని కొమరయ్య, ఏ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. ప్రజా సేవ చేయడానికి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశానని తెలిపారు. పదో డివిజన్ ప్రజలు ఆదరించి ఇండిపెండెంట్ గా గెలిపించారని కార్పోరేషన్ లో ఇండిపెండెంట్ కార్పోరేటర్ గా కొనసాగుతానని తెలిపారు. సేవ చేయాలని రాజకీయాలలొకి వచ్చానని చెప్పిన కొమురయ్య, అన్ని పార్టీల సహకారంతో డివిజన్ లో నెలకొన్న సమస్యలు పరిష్కరించి డివిజన్ అభివృద్ధికి పాటు పాటుపడుతానని చెప్పారు. మేయర్ అభ్యర్థిగా ప్రచారం సాగిందని, పరిస్థితులు అనుకూలించక తృటిలో తప్పిపోయిందని చెప్పారు. గెలిపించిన డివిజన్ ప్రజలకి ఎప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కారణజన్ముడు సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏండ్లలోనే దేశానికి ఆదర్శంగా నిలిపిన దార్శనికుడు BRS Party అధినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు KCR పుట్టినరోజు సందర్భంగా మెట్టుగుట్ట శ్రీ స్వయంభు మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్.1
- పోలీసు దాడిలో బాధితుడికి రెండు కళ్ళపై దాడి - కంటి చూపులకు దెబ్బ కంటి చూపు కనిపించని దారుణ వైనం *పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు బాధిత కుటుంబ సభ్యుల వెల్లడి* మా వైపు ఏం చూస్తున్నావురా ఎవడ్రా నువ్వు.. నా కొడకా అంటూ ఇద్దరు పెట్రోలింగ్ లో ఉన్న కానిస్టేబుల్స్ అమాయకుడిపై రెచ్చిపోయారు. చెంపలపై నిర్దాక్షిణ్యంగా కొడుతూ అంతటితో ఆగకుండా అతని పోలీసు వాహనంలో బలవంతంగా వేసుకొని ఊరి బయటకు తీసుకెళ్లి ఇష్టారాజ్యంగా అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడి రెండు కళ్ళు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కంటిచూపు కనిపించడం లేదు. పోలీసు శాఖకి మచ్చని తెచ్చే ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిన్న రాత్రి పరిగి రోడ్డులో శక్తి వైన్స్ వద్ద జరిగిన సంఘటన ఇది. పట్టణంలో బోరు మెకానిక్ గా పనిచేసుకుంటున్న కుమ్మరి వెంకటేష్ (ఇప్పలపల్లి) సాయంత్రం వేళ శక్తి వైన్ సోదరులకు వెళ్లి తనకోసం మందు తెచ్చుకున్నాడు. ఇదే సమయంలో షాపు యజమాని అక్కడికి వచ్చి ఆగిన పోలీస్ పెట్రోల్ వాహనంలో ఉన్న కానిస్టేబుల్స్ కు ఒక కవర్ అందజేశారు. అయితే అతను మందు తీసుకొని వెళ్ళేటప్పుడు కుమ్మరి వెంకటేశ్ పోలీసులను చూశాడు. దీంతో కానిస్టేబుల్స్ ఏమనుకున్నారో తెలియదు కానీ మా వైపు ఏం చూస్తున్నావు రా..? ఎవడ్రా నువ్వు నా కొడకా అంటూ తమదైన స్టైల్ లో అమాయకుడి పై రెచ్చిపోయారు. కుమ్మరి వెంకటేష్ చెంపలను అక్కడే ఫటాఫట్ లాడించారు. అంతటితో ఆగకుండా అతడిని పోలీసు వాహనం ఎక్కించుకొని పరిగి రోడ్డులో హాజిపల్లి రోడ్డు వద్దకు నిర్మానుష ప్రాంతాల్లో తీసుకెళ్లి అతని చితకబాదారు. పోలీసు దాడిలో కుమ్మరి వెంకటేష్ కళ్ళపై దాడి జరగడంతో రెండు కళ్ళు ఎర్రటి రక్తం పేరుకొని కంటిచూపు పూర్తిగా మందగించిపోయింది. నిర్దాక్షిణ్యంగా కొట్టిన తర్వాత అతన్ని అక్కడే పరిగి రోడ్డులో వదిలేసి కనీసం మానవత్వం లేకుండా ఒక క్రూరత్వంతో అతన్ని విడిచి వచ్చేశారు. ఏం నేరం చేసింది లేదు.. పోలీసుల వైపు చూసిన పాపానికి కళ్ళు కనిపించకుండా దిగజారి కొట్టిన ఇద్దరు కానిస్టేబుల్స్ వ్యవహారంపై బాధితుడు కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అయితే బాధితుడు కుమ్మరి వెంకటేష్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కంటి వైద్యులకు చూపించారు. అమాయకుడి పై దాడికి పాల్పడ్డ ఇద్దరు కానిస్టేబుల్ లపై కేసు నమోదు చేసి వెంటనే శాఖపరమైన చర్య తీసుకోవాలని బాధితుడి కుమారుడు పోలీసు ఉన్నత అధికారులను వేడుకుంటున్నారు. నిన్న జరిగిన ఈత సంఘం ఆలస్యంగా వెలుగు చూడడంతో సంఘటనను స్థానిక మీడియా దృష్టికి బాధితులు తీసుకొచ్చారు..1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగిరిందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ స్పష్టం చేశారు. 12 వార్డులకు గాను తాము ఆరు వార్డులు గెలిచామని, కాంగ్రెస్ నాలుగు మాత్రమే గెలిచిందన్నారు. మరో ఒక వార్డును తాము గెలిచినా తారుమారు చేశారని ఆరోపించారు. నైతిక విజయం తమదేనని పేర్కొంటూ, ప్రస్తుత చైర్మన్ సారంగపాణి తమ వద్ద పని చేసిన పాత కార్యకర్తేనని చమత్కరించారు.1
- శ్రీదుబ్బరాజేశ్వర స్వామివారి రథోత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా హర హర మహాదేవ అంటూ వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీదుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గత మూడు రోజుల నుండి అంగరంగ వైభవంగా పూజలందుకుంటున్నడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం పదకోండు గంటలకు శ్రీదుబ్బరాజేశ్వరస్వామి వారి రథోత్సవాన్ని పలు పుష్పాలతో చక్కగా అలంకరించి స్వామి అమ్మవార్లను ఆసీనులు చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఈ రథోత్సవాన్ని పురవీధుల గుండా స్వామివారి రథాన్ని పెద్ద ఎత్తున భక్తులు తడుతో లాగుతూ హర హర మహాదేవ ఓం నమశ్శివాయ అంటూ స్వామివారి శోభాయాత్ర కొనసాగింది. ఈ శోభాయాత్రకు చుట్టుపక్కల గ్రామాలు వివిధ జిల్లాల నుండి కుటుంబ సమేతంగా వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లను చేశారు.1
- శివ స్వాములు దీక్ష విరమణ శివరాత్రి సందర్భంగా 8 రోజులు కాలినడకన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రం నుంచి ఈనెల ఏడో తారీఖున శ్రీశైలం కాలి నడకన బయల్దేరారు. స్వాములు చందాపూర్ బసవన్న గడ్డ దగ్గరికి వెళ్ళగానే వీరిని ఒక కుక్క వెంబడించడం జరిగింది. తన కుక్కపిల్లలను కూడా వదిలి ఆ శివ స్వాముల వెంబడి శ్రీశైలం వరకు అంటే స్నానం చేసే తను స్నానం చేస్తుంది ఇలా చివరికి వారితో పాటు ఆ శునకం శ్రీశైల దర్శనం చేసుకుంది. తిరిగి ప్రయాణంలో కూడా వారి వెంటే వాహనం తీసుకొని దానిని చందాపూర్ లో వదిలేయడం జరిగింది.ఇది తెలిసిన వారందరూ అది ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి యొక్క మహిమ అని ఆశ్చర్యానికి,ఆనందానికి గురవుతున్నారు.4
- Post by Ravi Poreddy1
- IIT-JEE మేయిన్స్ మొదటి విడత పరీక్ష ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో అత్యుత్తమ పర్సంటైల్ సాధించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆల్పోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అభినందించారు. రెండో విడత లో ఆల్పోర్స్ విద్యార్థులు అఖండ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆల్పోర్స్ కు చెందిన సిహెచ్.లక్ష్మీ హాసిని 99.94 పర్సంటైల్ తో అగ్రస్థానంలో నిలువగా వి.శ్రేయాస్ రెడ్డి 99.83, కె.ధనుష్ 99.82, పటేల్ అక్షయ 99.74, బి.లిఖిత్ సాయి 99.6, ఏ. సత్య వర్ధన్ 99.6. జి.ఆశిష్ రెడ్డి 99.53, ఎన్. రత్న ప్రకాష్ 99.38, బి.శ్రీహాన్ 99.27 యు.అభినవ్ చౌదరి 99.25, ఎల్.ప్రణయ్నీ రెడ్డి 99.13, వి.సుహాని 99.111 సాధించారు. 99 పర్సం టైల్ మరియు ఆపై 12 మంది విద్యార్థులు సాధించారని నరేందర్ రెడ్డి తెలిపారు. 90 పర్సం టైల్ ఆపై 113 మంది విద్యార్థులు సాధించడం విశేషం. పటిష్ట ప్రణాళికతో విద్యాభోధన, పర్యవేక్షణ, విద్యార్థుల నిరంతర కృషి వల్ల ఇంతటి ఘనవిజయం సాధించడం జరిగిందని తెలిపారు. రాబోయే IIT (Adv), NEET మరియు EAMCET లో కూడ మా అల్ఫోర్స్ చిన్నారులు అధ్బుత ర్యాంకులు సాధిస్తారని విశ్వసిస్తున్నామని చెప్పారు. IIT-JEE (MAIN) ఫలితాలలో అద్భుత పర్సంటైల్ సాధించిన అల్ఫోర్స్ ఆణిముత్యాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు.3
- నేటి నుండి ప్రారంభంగానున్న నాలుగోవ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ డ్యూటీ మీట్ లో వరంగల్ కమిషనరేట్ పోలీసులు బంగారు పతకంతో బోణి కొట్టారు. ఈ క్రీడల్లో మొదటగా నిర్వహించిన పది కిలోమీటర్ల పరుగు పందెంలో వరంగల్ రిజర్వ్ విభాగానికి చెందిన గూగులోత్ మౌనిక 10 కిలో మీటర్ల పరుగులో గోల్డ్ మెడల్ సాధించడంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పతకాల ఖాతా ప్రారంభించింది. ఈ మెడల్ సాధించిన మౌనికను పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందనలు తెలిపారు4
- వరంగల్: వర్ధన్నపేట పట్టణంలో మాదిగలను కించపరిచే విధంగా మాల మహానాడు వేదికగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ నాయకులు కూడా తనను సంప్రదించారని తెలిపారు. గతంలో తెలియక మాట్లాడానని చెప్పి బదులిచ్చినట్లు పేర్కొన్న ఆయన, సహనం కోల్పోతూ రోజురోజుకు మాటలు జారుతున్నాయని విమర్శించారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించారు.1