ప్యాపిలి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జిల్లా బెస్త సేవా సంఘం ఉపాధ్యక్షులు బెస్త కోట వెంకటేశ్వర్లు బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో సంతాప సభ! -------------------------- ప్యాపిలి వద్ద రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన బెస్త సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు,ప్యాపిలి వద్ద ఆటో ప్రమాదంలో అకాల మరణం చెందిన గుత్తి పట్టణానికి చెందిన, బెస్త కోట వెంకటేష్ ఆత్మకు శాంతి చేకూరాలన మంగళవారం ఉదయం 11 గంటలకు బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించి,ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అతని ఆత్మ శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.తర్వాత జోహార్ వెంకటేష్ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బెస్త సేవా సంఘం నాయకులు మాట్లాడుతూ వెంకటేష్ గారు బెస్త సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా సంఘానికి ఎనలేని సేవలు అందించిన క్రమశిక్షణ కలిగిన కార్యకర్త అని,అతని మరణం సంఘానికి,బెస్త జాతికి తీరిన లోటని కొనియాడారు.చిన్న వయసులోనే మరణించడం వల్ల వారి కుటుంబ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని,అందుకు బెస్త సేవా సంఘం అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బెస్త సేవా సంఘం అధ్యక్షులు చేపల హరి, గౌరవాధ్యక్షులు కెవి రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ హరినాథ్,గంగమ్మ& పోలేరమ్మ దేవాలయం కమిటీ చైర్మన్ రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు గంగప్ప,శ్రీనివాసులు,నాగేంద్ర,శ్రీరాములు పాల్గొని అతని చిత్రపటానికి పూలమాల సమర్పించి, పూలతో నివాళులు అర్పిం

- నల్ల చెరువు పల్లి లో వినాయక లడ్డును వేలం పాటలో 27, 500వేల రూపాయలుకు దక్కించుకున్న మెరుగు శివ శంకర్ ఓడి చెఱువు సెప్టెంబర్ 15: మండలంలోని నల్లచెరువు పల్లి గ్రామంలోగ్రామస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ,వచ్చిన భక్తులకు తీర్థప్రసాదలు అంద జేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట లో శ్రీ వినాయక లడ్డు ను మెరుగు శివ శంకర్ 27,500 రూపాయలు కు దక్కించుకున్నారు.1
- కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలో చిరుత సంచారం కలకలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ముదిగల్లు శివారులోని కొండపై చిరుత సంచారం కలకలం రేపింది. గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ విషయాన్ని స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా గ్రామ శివారులోని కొండ గుట్టలో చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానిక ప్రజలు చెప్పారు. చిరుతల సంచారంతో రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతల నుంచి రక్షించాలని రైతులు కోరుతున్నారు.1
- పులివెందుల లోని మైత్రి లే ఔట్ వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ కడప జిల్లా..... పులివెందుల..... పులివెందుల లోని మైత్రి లే ఔట్ వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ....... టిడిపికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య ఘర్షణ..... గాలి లోకి ఒక రౌండ్ కాల్పులు చేసిన హజ్ కమిటీ డైరెక్టర్ మాహబూబ్ భాష గన్మెన్.... టిడిపి పార్టీ కి చెందిన పుష్ప నాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి ల మధ్య ఘర్షణ...... విజయ్ కుమార్ ఇంటి వద్ద ఉన్న 3 వాహనాలు ధ్వంసం.....1
- రాయదుర్గంలో అందర్నీ ఆకట్టుకున్న స్కూలుకు వెళ్తున్న గణనాథుడి ప్రతిమ రాయదుర్గం పట్టణంలో నిన్నటి దినం వివిధ ఆకృతులలో గణనాథులు కొలువు తీరాయి. అందులో భాగంగానే రైల్వే స్టేషన్ సమీపాన వరసిద్ధి వినాయక గ్రూప్ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక గణనాథుడు అందరినీ ఆకట్టుకున్నాడు. వీపుకి బ్యాగు తగిలించుకొని, యూనిఫామ్ దుస్తులు ధరించి చేతిలో వాటర్ బాటిల్ ధరించిన గణనాథుడు అందరిని ఆకట్టుకున్నారు. ప్రతి ఏటా ఏదో ఒక ప్రత్యేక విధానంలో గణనాథులను వరసిద్ధి వినాయక సంఘం సభ్యులు గణనాధులను కొలువు తీరుస్తున్నారు.1
- వెలుగోడు నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలుగు గంగ SR1, SR2 లను నింపాలి - రైతు సేవా సమితి డిమాండ్ కడప జిల్లాలో నీరు లేకుండా అడుగంటిపోయిన తెలుగు గంగ SR1, SR2 ప్రాజెక్టులకు వెలుగోడు నుండి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, కడప జిల్లా ప్రజలకు, రైతులకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని రైతు సేవా సమితి కడప జిల్లా సమితి డిమాండ్ చేసింది. రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి కడప జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న "రైతు గ్రామబాట" కార్యక్రమం ఈరోజు 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఈరోజు మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేసి, ఎమ్మార్వో గారు లేకపోవడంతో డిప్యూటీ ఎమ్మార్వో నరసింహ గారికి వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఏలినో ప్రభావంతో జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేలు సహాయం అందించాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజోలి, జొలదరాశి, తెలుగు గంగ తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడి శెట్టి సహదేవుడు, మైదుకూరు పట్టణ, మండల నాయకులు, రైతులు దాశ రెడ్డి గారి సుబ్బరాయుడు, రాజా, మూలే రామచంద్రారెడ్డి, కోటయ్య గారి గుర్రప్ప, రాజాల రామచంద్రుడు, పసల పుల్లయ్య, అంకిరెడ్డిపల్లి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.1
- గణేశులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ, కమలమ్మ గణేశులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ, కమలమ్మ గుంతకల్లు, సెప్టెంబర్ 15: వినాయక చవితి సందర్భంగా అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ విగ్రహాలను ఆలూరు నియోజకవర్గ బీజేపీ బీఎల్‌ఓ-1 గుమ్మనూరు నారాయణ, గుమ్మనూరు కమలమ్మ మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. గుంతకల్లు పట్టణానికి చెందిన ప్రదీప్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన ఏర్పాటు చేసిన గణేశ మండపాన్ని సందర్శించిన గుమ్మనూరు నారాయణ, కమలమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి హారతి ఇచ్చారు. అనంతరం నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రదీప్ ఏర్పాటు చేసిన గణేశ విగ్రహానికి గుమ్మనూరు నారాయణ రూ.50,000 విరాళాన్ని అందజేశారు. మరో గణేశ విగ్రహం నిర్వాహకులకు రూ.5,000 విరాళం అందించారు. వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు పట్టణ యువత, గుమ్మనూరు నారాయణ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.2
- వేపచీరల తో మొక్కులు తీర్చుకున్న భక్తులు..ఘనంగా ప్రారంభం అయిన వేడుకలు రాయదుర్గం పట్టణం మధు సినిమా థియేటర్ సమీపాన వెలసిన మహిమాన్విత దుగ్గిలమ్మ జాతర వేడుకలు వైభవంగా ప్రారంభం అయ్యాయి.ఉదయం నాలుగు గంటల నుండే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు.వేపాచీరలతో భక్తులు పెద్ద ఎత్తున వారి వారి మొక్కులను తీర్చుకున్నారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అర్బన్ సీఐ దేవానంద్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చింది.1
- పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల ఘర్షణ సీసీ ఫుటేజ్ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ నాయకుడి ఇంటి వద్దకు జనాలు గుంపుగా వెళ్లి కర్రలతో వాహనాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో చూడవచ్చు. విషయం తెలుసుకున్న పోలీసులు మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చల్లాచెదురు చేశారు.1