logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కొత్తపల్లి: అధికారులు వీధి దీపం వెలిగేలా చర్యలు తీసుకోండి NLG: నల్గొండ మండలం కొత్తపల్లి నాలుగో వార్డులో గత 20 రోజులుగా వీధి దీపం వెలగడం లేదని స్థానికులు చెబుతున్నారు. వార్డులో వీధి దీపం వెలగక పోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే చిమ్మ చీకటిగా ఉండటంతో పాటు కుక్కలు, పాముల బెడద ఎక్కువగా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, వీధి దీపం వెలిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

on 11 March
user_జిల్లపల్లి ఇంద్ర
జిల్లపల్లి ఇంద్ర
జర్నలిస్ట్ Nalgonda, Telangana•
on 11 March

కొత్తపల్లి: అధికారులు వీధి దీపం వెలిగేలా చర్యలు తీసుకోండి NLG: నల్గొండ మండలం కొత్తపల్లి నాలుగో వార్డులో గత 20 రోజులుగా వీధి దీపం వెలగడం లేదని స్థానికులు చెబుతున్నారు. వార్డులో వీధి దీపం వెలగక పోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే చిమ్మ చీకటిగా ఉండటంతో పాటు కుక్కలు, పాముల బెడద ఎక్కువగా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, వీధి దీపం వెలిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ప్రత్యేకంగా యంబ నరసింహులు గారు తన కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు తీసుకుని, సర్వలోక క్షేమం కోరుతూ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొని భక్తి భావంతో సేవలు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    4
    మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ప్రత్యేకంగా యంబ నరసింహులు గారు తన కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు తీసుకుని, సర్వలోక క్షేమం కోరుతూ ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొని భక్తి భావంతో సేవలు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • వరంగల్ జిల్లా:వర్ధన్నపేట: మండలం ల్యాబర్తి గ్రామంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ZPHS, MPPS పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామ వీధుల గుండా నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు. అనంతరం జంక్షన్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి గ్రామస్తులతో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ రోడ్డు నియమాలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, సీటు బెల్ట్ వినియోగం, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగం ప్రమాదకరమని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    వరంగల్ జిల్లా:వర్ధన్నపేట: మండలం ల్యాబర్తి గ్రామంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ZPHS, MPPS పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామ వీధుల గుండా నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు. అనంతరం జంక్షన్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి గ్రామస్తులతో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ రోడ్డు నియమాలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, సీటు బెల్ట్ వినియోగం, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగం ప్రమాదకరమని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.
    1
    కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.
    user_డాక్టర్ బాబు 7036445113
    డాక్టర్ బాబు 7036445113
    Doctor కారంపూడి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం (14-04-2026) ఉదయం 9:30 గంటలకు పులిహోర పంపిణీ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ సేవా కార్యక్రమానికి ఈ వారం దాతలుగా శ్రీమతి & శ్రీ మురికి శ్వేత విజయ్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీ రామదూత పూజ జనరల్ స్టోర్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సక్రమంగా జరిగింది.ఈ సందర్భంగా భక్తులకు పులిహోరను పంపిణీ చేసి, సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, మల్యాల భైరయ్య, నేతి శ్రీనివాస్, దూబకుంట లచ్చల్, కైలాస ప్రశాంత్, గందె సంతోష్, నోముల సంతోష్, పోగుల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం భక్తి, సేవా భావం కలగలిపిన మంచి ఉదాహరణగా నిలిచింది.
    4
    సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం (14-04-2026) ఉదయం 9:30 గంటలకు పులిహోర పంపిణీ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ప్రతి మంగళవారం నిర్వహించే ఈ సేవా కార్యక్రమానికి ఈ వారం దాతలుగా శ్రీమతి & శ్రీ మురికి శ్వేత విజయ్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీ రామదూత పూజ జనరల్ స్టోర్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సక్రమంగా జరిగింది.ఈ సందర్భంగా భక్తులకు పులిహోరను పంపిణీ చేసి, సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, మల్యాల భైరయ్య, నేతి శ్రీనివాస్, దూబకుంట లచ్చల్, కైలాస ప్రశాంత్, గందె సంతోష్, నోముల సంతోష్, పోగుల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం భక్తి, సేవా భావం కలగలిపిన మంచి ఉదాహరణగా నిలిచింది.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    18 hrs ago
  • పెద్దపల్లి టాస్క్ సెంటర్లో ఏప్రిల్ 17న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు..
    1
    పెద్దపల్లి టాస్క్ సెంటర్లో ఏప్రిల్ 17న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు..
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    1 hr ago
  • నర్సంపేట: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా నిలబడి ప్రయాణికులకు జాగ్రత్తలు సూచించారు. రోడ్డు భద్రతకు సంబంధించిన నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలని సూచించగా, కారులో ప్రయాణించే డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీటు బెల్ట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు ప్రజలను ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
    2
    నర్సంపేట: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా నిలబడి ప్రయాణికులకు జాగ్రత్తలు సూచించారు.
రోడ్డు భద్రతకు సంబంధించిన నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలని సూచించగా, కారులో ప్రయాణించే డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీటు బెల్ట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు ప్రజలను ఆలోచింపజేశాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమ పై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపి వేసి వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచుమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పైన ఓనర్లు రాళ్ళతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రావాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేట్ బస్ ఓనర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
    1
    సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమ పై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపి వేసి వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచుమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పైన ఓనర్లు రాళ్ళతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రావాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేట్ బస్ ఓనర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    7 hrs ago
  • వరంగల్: దేశాయిపేటకు చెందిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన భర్తను 12 రోజుల క్రితం తీసుకెళ్లినప్పటి నుంచి ఆచూకీ తెలియజేయలేదని ఆరోపిస్తూ సూసైడ్ నోట్ రాసింది. మామునూరు ఏసీపీ, ఎనుమాముల సీఐ, ఎస్సై తన ఆత్మహత్యాయత్నానికి కారణమని నోట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనను, తన బిడ్డను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అలాగే భర్తపై కేసు నమోదు చేయడం, తన కుటుంబంపై కేసులు పెట్టడం వెనుక మార్కెట్ వ్యాపారుల పాత్ర ఉందని బాధిత మహిళ ఆరోపించింది.
    1
    వరంగల్: దేశాయిపేటకు చెందిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన భర్తను 12 రోజుల క్రితం తీసుకెళ్లినప్పటి నుంచి ఆచూకీ తెలియజేయలేదని ఆరోపిస్తూ సూసైడ్ నోట్ రాసింది. మామునూరు ఏసీపీ, ఎనుమాముల సీఐ, ఎస్సై తన ఆత్మహత్యాయత్నానికి కారణమని నోట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనను, తన బిడ్డను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అలాగే భర్తపై కేసు నమోదు చేయడం, తన కుటుంబంపై కేసులు పెట్టడం వెనుక మార్కెట్ వ్యాపారుల పాత్ర ఉందని బాధిత మహిళ ఆరోపించింది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.