పిఠాపురం లోక్ అదాలత్‌లో 847 కేసుల పరిష్కారం •రూపాయలు 2.99 కోట్ల సెటిల్‌మెంట్ - ప్రమాద బాధితుడికి రూ. 75 లక్షల బీమా మంజూరు - మధ్యవర్తిత్వంతోనే సత్వర న్యాయం పిఠాపురం, మార్చి 14: పిఠాపురం కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైంది. 12 వ అదనపు జిల్లా జడ్జి ఎం. శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 847 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి. దీని ద్వారా సుమారు రూ. 2,98,89,938 మేర ఆర్థిక లావాదేవీలు సెటిల్ అయినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. *75 లక్షల భారీ పరిహారం* ఈ అదాలత్‌లో ఒక కీలక రోడ్డు ప్రమాద బీమా కేసు పరిష్కారమైంది. గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరానికి చెందిన పాలపర్తి సుబ్బారావు, 2020లో జరిగిన ప్రమాదంలో తండ్రిని కోల్పోవడమే కాకుండా, తను కూడా తీవ్ర గాయాలపాలై మంచానికే పరిమితమయ్యారు. జడ్జి శ్రీహరి చొరవతో ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చి, గో డిజిటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి బాధితుడికి రూ. 75 లక్షల బీమా మొత్తాన్ని మంజూరు చేయించారు. బాధితుని తరపున న్యాయవాది కొశిరెడ్డి పేర్రాజు వాదించారు. అంతకుముందు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మేరుగ రాజారావు అధ్యక్షతన జరిగిన సదస్సులో జడ్జి ఎం. శ్రీహరి మాట్లాడుతూ.. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఎంతో అవసరమని, దీనివల్ల కాలం, శ్రమ ఆదా అవుతాయని పేర్కొన్నారు. లోక్ అదాలత్ ఇచ్చే తీర్పే తుది తీర్పు అని ఆయన స్పష్టం చేశారు. కేసుల వివరాలు: పరిష్కారమైన 847 కేసుల్లో ఎం.వి.ఓ.పి (21), సివిల్ (39), క్రిమినల్ (40), ఎన్.ఐ. యాక్ట్ (8), ఎక్సైజ్ (13), ఇతర అడ్మిషన్ కేసులు (726) ఉన్నాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఎం. బాబు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం. విజయరామేశ్వరి, ఏపీపీ బత్తిన లక్ష్మణ దొర, పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
పిఠాపురం లోక్ అదాలత్‌లో 847 కేసుల పరిష్కారం •రూపాయలు 2.99 కోట్ల సెటిల్‌మెంట్ - ప్రమాద బాధితుడికి రూ. 75 లక్షల బీమా మంజూరు - మధ్యవర్తిత్వంతోనే సత్వర న్యాయం పిఠాపురం, మార్చి 14: పిఠాపురం కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైంది. 12 వ అదనపు జిల్లా జడ్జి ఎం. శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 847 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి. దీని
ద్వారా సుమారు రూ. 2,98,89,938 మేర ఆర్థిక లావాదేవీలు సెటిల్ అయినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. *75 లక్షల భారీ పరిహారం* ఈ అదాలత్‌లో ఒక కీలక రోడ్డు ప్రమాద బీమా కేసు పరిష్కారమైంది. గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరానికి చెందిన పాలపర్తి సుబ్బారావు, 2020లో జరిగిన ప్రమాదంలో తండ్రిని కోల్పోవడమే కాకుండా, తను కూడా తీవ్ర గాయాలపాలై మంచానికే పరిమితమయ్యారు. జడ్జి శ్రీహరి చొరవతో ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చి,
గో డిజిటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి బాధితుడికి రూ. 75 లక్షల బీమా మొత్తాన్ని మంజూరు చేయించారు. బాధితుని తరపున న్యాయవాది కొశిరెడ్డి పేర్రాజు వాదించారు. అంతకుముందు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మేరుగ రాజారావు అధ్యక్షతన జరిగిన సదస్సులో జడ్జి ఎం. శ్రీహరి మాట్లాడుతూ.. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఎంతో అవసరమని, దీనివల్ల కాలం, శ్రమ ఆదా అవుతాయని పేర్కొన్నారు. లోక్ అదాలత్ ఇచ్చే తీర్పే
తుది తీర్పు అని ఆయన స్పష్టం చేశారు. కేసుల వివరాలు: పరిష్కారమైన 847 కేసుల్లో ఎం.వి.ఓ.పి (21), సివిల్ (39), క్రిమినల్ (40), ఎన్.ఐ. యాక్ట్ (8), ఎక్సైజ్ (13), ఇతర అడ్మిషన్ కేసులు (726) ఉన్నాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఎం. బాబు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం. విజయరామేశ్వరి, ఏపీపీ బత్తిన లక్ష్మణ దొర, పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
- User3787Pithapuram, Kakinada👏on 16 March
- పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణ కు పైరాలసిస్ (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిందనీ విషయం తెలుసుకుని అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ బాధితుడిని పరామర్శించి మనో ధైర్యం చెప్పి రామకృష్ణ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నట్టు గమనించి అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ ముదర సోమరాజు వారికి మన ఊరు మనందరి బాధ్యత సభ్యుల సహాయ సహకారాలతో 26 కేజీల బియ్యం , నెలకు సరిపడ నిత్యావసర సరుకులు మరియు పండ్లను వారికి అందజేయటం జరిగింది. బాధితుడికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అక్షయ్ ఫౌండేషన్ అండగా ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పీతల సత్యనారయణ, విఆర్ఓ పార్వతి,పీతల అశోక్, మెకానిక్ వీరబాబు సంస్థ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసబోయిన అర్జునరావు,మాకా శ్రీను,బళ్ల సురేష్, పులుగు కుమార్,నున్న వసంతరావు తదితరులు పాల్గొన్నారు.2
- రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జేసీ బచ్చు స్మరణ్ రాజ్ అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. కేవలం రూ.5లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తెచ్చారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.2
- Post by SS NEWS1
- 18 मार्च 2026 तक, अमेरिका का कुल राष्ट्रीय कर्ज (National Debt) पहली बार $39 ट्रिलियन (लगभग ₹3200 लाख करोड़) के ऐतिहासिक आंकड़े को पार कर गया है। यह दुनिया में सबसे बड़ा राष्ट्रीय ऋण है, जो लगातार बढ़ रहा है। इस कर्ज का मतलब है कि अमेरिका की सरकार पर ट्रेजरी बॉन्ड के रूप में भारी बोझ है।1
- Post by Kundoori Prakash1
- Post by Sageni gangadhar1
- Post by Shyam1
- పాడేరు, ఏప్రిల్ 15: రాష్ట్ర గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాలను ఈ ఏడాది మే 17, 18, 19 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్‌లో పోలీస్, రెవిన్యూ, ఆలయ, ఉత్సవ కమిటీలు సహా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రకటించిన మే 10, 11, 12 తేదీల్లో జాతర నిర్వహణను పోలీస్ భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేసినట్లు వెల్లడించారు. కొత్త తేదీల ప్రకారం ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.1