Shuru
Apke Nagar Ki App…
మహమ్మదాబాద్:108 సిబ్బంది సమయస్ఫూర్తి.. అంబులెన్స్‌లో పండంటి బిడ్డ మహమ్మదాబాద్: అత్యవసర సమయంలో 108 సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో గర్భిణికి అంబులెన్స్‌లోనే సురక్షిత ప్రసవం జరిగింది. చౌదర్పల్లి గ్రామానికి చెందిన పద్మ (27)కు పురిటి నొప్పులు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. ఈఎంటీ స్వాతి, పైలట్ అక్బర్ వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా కొమరెడ్డిపల్లి సమీపంలో నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. పరిస్థితిని గమనించిన ఈఎంటీ స్వాతి అంబులెన్స్‌లోనే ప్రసవం చేయగా పద్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను గండీడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
J.rr
మహమ్మదాబాద్:108 సిబ్బంది సమయస్ఫూర్తి.. అంబులెన్స్‌లో పండంటి బిడ్డ మహమ్మదాబాద్: అత్యవసర సమయంలో 108 సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో గర్భిణికి అంబులెన్స్‌లోనే సురక్షిత ప్రసవం జరిగింది. చౌదర్పల్లి గ్రామానికి చెందిన పద్మ (27)కు పురిటి నొప్పులు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. ఈఎంటీ స్వాతి, పైలట్ అక్బర్ వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా కొమరెడ్డిపల్లి సమీపంలో నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. పరిస్థితిని గమనించిన ఈఎంటీ స్వాతి అంబులెన్స్‌లోనే ప్రసవం చేయగా పద్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను గండీడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- సీఎం రేవంత్ రెడ్డి పై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు మార్పు అంటే ఇదేనా రేవంతూ.. తూ.. ఒక్క కల్వకుర్తి నియోజకవర్గం లొనే 308 ఎకరాలు అంటే .. రాష్ట్రo.. పక్క రాష్ట్రo లో ఎంత ఉందొ మొత్తం లెక్కలు వొస్తాయి.. ఎలా సంపాదించావు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసిందన్నారు. ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం అన్నారు.1
- ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలలో న్యాయం చేయాలి. కమిషన్ చైర్మన్ వెంకటయ్య ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలలో తగు న్యాయం చేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సంబంధిత శాఖ అధికారులతో ఎస్సీ ఎస్టీలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు కేసుల పరిశీలన పై అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీల కేసులను వేగవంతంగా పరిష్కరించి న్యాయం చేయాలని భక్కి వెంకటయ్య సూచించారు.1
- అమృతం కోసం దేవతలు రాక్షసుల క్షీరసాగర మథనంలో ఘననాధుడు శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం (పద్మశాలి) ఆధ్వర్యంలో గద్వాల వినాయక మండపాలను 53 ఏళ్లుగా వినూత్న అలంకరణల్లో పురాణ ఘాతల్లో ఘననాతుని దర్శనం. పురాణ ఘట్టాలతో ఆకట్టుకుంటున్న ఘననాధుడు. జోగులాంబ గద్వాల పట్టణం వేదనగర్ లోని శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం(పద్మశాలి) ఆధ్వర్యంలో 53 ఏళ్లుగా వినాయక చవితి నవరాత్రి బ్రహ్మోస్థవాలు వినూత్న రీతిలో వినాయక మండపాలను అలంకరిస్తున్నారు. 1971లో గద్వాల మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు పాగా పుల్లారెడ్డి ఆధ్వర్యంలో గద్వాలపట్టణంలో తొలిసారిగా వినాయక చవితి వేడుకలు ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. 1973 నుంచి శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది విభిన్న రీతులలో పురాణ ఘట్టాలను వివిధ ఆకృతులలో అలంకరణలు చేస్తూ భక్తులకు పురాణాల్లోని ముఖ్యమైన ఘట్టాలను కళ్లకు కట్టినట్లు మండపాల్లో మహాభారతం, భాగవతం వంటి ఇతిహాస, ఘాతలను పలురకాలుగా కనువిందు చేసేలా ఏర్పాటు చేస్తూ చిన్నారులకు , యువతకు , ప్రజలకు పురాణాల సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేలా అలంకరణలు చేస్తున్నారు. ఈ సన్నివేశాలను చూసే వారికి అప్పటి పురాణ కథలు సులభంగా అర్థమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ఈ సంవత్సరం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ ఆధ్వర్యంలో అమృత భాండం కోసం దేవతలు–దానవులు క్షీరసాగర మథనం ఘట్టాన్ని వినూత్నంగా రూపొందించారు. ఈ అలంకరణను గద్వాల పట్టణ ప్రజలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను స్వకులశాలి సమాజం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వకులసాలి యువజన సంఘం ఉపాధ్యక్షుడు దేవుజి రాఘవేందర్, కార్యదర్శి సాక్రె శ్రీనివాస్, దోత్రే సురేంద్రబాబు, కార్యవర్గ సభ్యులు గణప నరేందర్, కాంబ్లే ప్రవీణ్, గచ్చి వీరన్న, దోత్రే ప్రమోద్, సఫారీ అజయ్, సఫారీ సురేష్, జిందే కార్తీక్ తదితరులు కుల బాంధవులు మాజీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.2
- రేవంత్ రెడ్డి కుటుంబానికి 38 భూమి ఉంది: హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చింది రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసింది ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- రైతులకు శుభవార్త తెలంగాణలో సెప్టెంబర్ 19న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది1
- మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే *బైపాస్ రోడ్డు ప్రయాణంలో ప్రజలు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో ప్రయాణికులకు ప్రజలకు తెలుసు* .. *మా ఎమ్మెల్యే ఆరాటం HMDA నాన్స్ ప్రకారం బైపాస్ రోడ్డు విస్తీరణ ఉండాలి* ... *కూల్చాడు గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడితే విడ్డూరంగా ఉంది...* *50 ఫీట్ల రోడ్డుతో ఎవ్వరికి ఉపయోగం...* *మాటలు నరకడం ఆపి రోడ్డు గుంతలను పూడ్చాలి...* *మీ ప్రయోజనాలకోసం ప్రజలను ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు* .. *ముగ్గురు సీఎం లు మారిన రాజీవ్ పార్క్ ఎందుకు బాగు చేయలేదు... ?* సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అసలు ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నంలా కనిపిస్తున్నాయి అని మాజీ సిడిసి చైర్మన్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి అన్నారు. బైపాస్ రోడ్డు విషయంలో మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే పై చేసిన వ్యాఖ్యలను బిఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి, రామప్ప, కౌన్సిలర్ లు పొన్న రాజేందర్ రెడ్డి, శ్రీకాంత్ మీడియా తో మాట్లాడారు.. వ్యక్తిగత విమర్శలు, అనవసర ఆరోపణలు కాకుండా సంగారెడ్డి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడితే ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. సంగారెడ్డి బైపాస్ రోడ్డుపై ప్రతిరోజూ ప్రజలు పడుతున్న ఇబ్బందులు మాజీ ఎమ్మెల్యేకు తెలియవా? గుంతలు, ట్రాఫిక్ సమస్యలు, నెమ్మదిగా సాగుతున్న పనులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బైపాస్ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలన్నదే ఎమ్మెల్యే చింత ప్రభాకర్ డిమాండ్. 50 అడుగుల రోడ్డుతో సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందా? లేక భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 80 అడుగుల ఉన్న చోట 80. అడుగులు 60 అడుగులు ఉన్న చోట 60 అడుగుల రోడ్డును నిర్మించి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలా? అనేది ప్రజలే ఆలోచించాలి. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్పష్టంగా చెబుతున్నది ఒక్కటే ప్రజలకు ఉపయోగపడే విధంగా రోడ్డు నిర్మాణం జరగాలి. భవిష్యత్‌లో మళ్లీ రోడ్డు విస్తరణ అవసరం రాకుండా ఇప్పుడే సరైన ప్రణాళికతో పని పూర్తి చేయాలి. ఇక రోడ్డు పనుల నాణ్యతపై, పనులు ఎందుకు నెమ్మదిగా జరుగుతున్నాయి? గడువులోగా ఎందుకు పూర్తి చేయడం లేదు? ప్రజలకు వివరించాలి... మొన్న సీఎం వచ్చినపుడు ఐబీ ఆవరణలో రోడ్డు పనుల కోసం గోడలు కూల్చినప్పుడు, ఆగమేఘాల మీద పనులు చేపట్టినప్పుడు ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించలేదా? ఇప్పుడు అభివృద్ధి పనుల విషయంలో మాత్రమే విమర్శలు చేయడం ఎందుకు? అభివృద్ధి కోసం అవసరమైన చోట రోడ్డు విస్తరణ, ప్రభుత్వ ఆస్తుల మార్పులు, నిర్మాణ పనులు చేపట్టాల్సి వస్తే వాటిని నిబంధనల ప్రకారం పూర్తి చేయడం ముఖ్యం. ఎన్నికల సమయంలో సంగారెడ్డి పట్టణంలోని ప్రతి వార్డుకు 8.కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ఇస్తామని ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి? ఇటీవల ముఖ్యమంత్రి సంగారెడ్డికి వచ్చిన సమయంలో పట్టణానికి కొత్తగా ఎంత నిధులు మంజూరు చేశారు? ప్రజలకు ముందుగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రాజీవ్ పార్క్ అభివృద్ధి విషయంలో కూడా సంవత్సరాలుగా ముగ్గురు సీఎం లు మారిన ఒక పార్కును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ఇంత కాలం ఎందుకు పడుతోంది? గతంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కృషితో పట్టణ అభివృద్ధికి 50కోట్ల నిధులు తీసుకువచ్చి పార్టీలకు అతీతంగా వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. సంగారెడ్డి ప్రజలకు కావాల్సింది రాజకీయ విమర్శలు కాదు — అభివృద్ధి. మాటలు కాదు — పనులు. హామీలు కాదు — నిధులు. ప్రచారం కాదు — నాణ్యమైన రోడ్లు. రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలి. నాణ్యత ప్రమాణాలు పాటించాలి. ప్రస్తుతం ఉన్న గుంతలను వెంటనే పూడ్చాలి. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 80 అడుగుల రోడ్డు ఉన్న చోట 80 అడుగులు 60 అడుగులు ఉన్న చోట 60 అడుగుల రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు కాదు… ప్రజలకు ఉపయోగపడే పనులపై చర్చ జరగాలి. అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పై అనవసర ఆరోపణలు చేయడం మానుకుని, ప్రజల అసలు సమస్యలపై దృష్టి పెట్టాలి. సంగారెడ్డి ప్రజలు అమాయకులు కాదు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి హయాంలో ఏ పని జరిగింది అన్నది ప్రజలకు తెలుసు. కార్యక్రమంలో మాజీ CDC చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, కౌన్సిలర్ లు ,లాడే మల్లేశం, నవీన్, సురేష్, కసిని శ్రీకాంత్, విఠల్, వజిత్ తదితరులు ఉన్నారు.4
- బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్ / హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ శాసనమండలి చైర్మన్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన పలు అంశాలపై మేధావులు, నాయకులు చర్చించారు.1
- బాధిత కుటుంబానికి అండగా ఉంటా: టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలంగాణలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన ఇన్ ఛార్జీ డాక్టర్ రఘు ని, వారి కుటుంబ సభ్యులను TRS పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. డాక్టర్ రఘు తల్లి పుస్పలత ఇటీవల మృతి చెందగా జగిత్యాల జిల్లా మెట్ పల్లిలోని నివాసానికి వెళ్లి పుస్పలత చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జీ పునుగోటి పవన్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి, ఇస్మాయిల్, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.1