logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పట్టా భూమిని గ్రామకంఠంగా మార్చే ప్రయత్నం… కుటుంబసభ్యుల ఆవేదన అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం వంట్లమామిడి గ్రామంలో పట్టాదారు భూమిపై వివాదం చెలరేగింది. గ్రామానికి చెందిన డేగల అప్పారావు పేరుమీద ఉన్న సర్వే నెంబర్ 28-2లో ఎకరం 20 సెంట్ల సొంత పట్టా భూమిని రెవెన్యూ అధికారులు రాజ్యాంగానికి విరుద్ధంగా గ్రామకంఠం భూమిగా సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామకంఠానికి సంబంధించి సర్వే నెంబర్ 28-1లో ఇప్పటికే భూమి ఉండగా, అప్పారావు పట్టా భూమిని బలవంతంగా గ్రామకంఠంగా చూపించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని గ్రామస్తులు చెబుతున్నారు. దీనివెనుక ప్రభావశీలులైన కొందరు పెద్దల రాజకీయ హస్తం ఉందేమో అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సంబంధిత రెవెన్యూ అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మరియు కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

1 day ago
user_Rc Tv Telugu
Rc Tv Telugu
Paderu, Alluri Sitharama Raju•
1 day ago

పట్టా భూమిని గ్రామకంఠంగా మార్చే ప్రయత్నం… కుటుంబసభ్యుల ఆవేదన అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం వంట్లమామిడి గ్రామంలో పట్టాదారు భూమిపై వివాదం చెలరేగింది. గ్రామానికి చెందిన డేగల అప్పారావు పేరుమీద ఉన్న సర్వే నెంబర్ 28-2లో ఎకరం 20 సెంట్ల సొంత పట్టా భూమిని రెవెన్యూ అధికారులు రాజ్యాంగానికి విరుద్ధంగా గ్రామకంఠం భూమిగా సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామకంఠానికి సంబంధించి సర్వే నెంబర్ 28-1లో ఇప్పటికే భూమి ఉండగా, అప్పారావు పట్టా భూమిని బలవంతంగా గ్రామకంఠంగా చూపించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని గ్రామస్తులు చెబుతున్నారు. దీనివెనుక ప్రభావశీలులైన కొందరు పెద్దల రాజకీయ హస్తం ఉందేమో అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సంబంధిత రెవెన్యూ అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మరియు కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • డుంబ్రిగూడ మండలంలోని అరకు ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహనాల ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, లైవ్ యాక్సిడెంట్ వీడియోలు బయటకు వచ్చాయి. ఘటన క్షణాలు స్పష్టంగా రికార్డ్ కావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
    1
    డుంబ్రిగూడ మండలంలోని అరకు ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహనాల ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, లైవ్ యాక్సిడెంట్ వీడియోలు బయటకు వచ్చాయి. ఘటన క్షణాలు స్పష్టంగా రికార్డ్ కావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలి
    1
    పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలి
    user_B.RAJESH
    B.RAJESH
    Local Politician బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఏపీడబ్ల్యూజేఎఫ్ మృతి చెందిన జర్నలిస్టు డేగల చినబాబు కుటుంబానికి ఆర్థిక సహాయం చెక్కు అందజేత ఇటీవల మృతి చెందిన ఏబీఎన్ అన్నవరం రిపోర్టర్ డేగల చినబాబు కుటుంబానికి జర్నలిస్టుల ఫెడరేషన్ అండగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో చినబాబు కుటుంబ సభ్యులకు సోమవారం ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు చినబాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చినబాబు మరణం జర్నలిస్టు సమాజానికి తీరని లోటని వారు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ కష్టకాలంలో జర్నలిస్టుల ఫెడరేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాతాడ నవీన్ రాజ్, ముమ్మిడి లక్ష్మణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అధికార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చినబాబు జర్నలిజం రంగంలో ఎంతో అంకితభావంతో పనిచేసిన వ్యక్తి అని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఆయన ఎప్పుడూ ముందుండేవారని గుర్తుచేశారు. నిజాయితీ, నిబద్ధతతో వార్తలను అందించడంలో ఆయన చూపిన కృషి ఇతర జర్నలిస్టులకు ఆదర్శమని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తోందని, జర్నలిస్టులు లేదా వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటామని నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చినబాబు కుటుంబానికి సంఘం తరఫున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. నిరంతరం పని ఒత్తిడితో జర్నలిజం వృత్తిని చేస్తున్న పలువురు అకస్మాత్తుగా మరణిస్తుండడంతో వారి కుటుంబాలు వీధిని పడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఈ సందర్భంగా చినబాబు కుటుంబ సభ్యులు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సమయంలో జర్నలిస్టుల సంఘం అండగా నిలవడం తమకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు పుర్రె త్రినాథ్, కే.వి.సత్యనారాయణ, శ్రీధర్, ఎస్ కే ఇమ్రాన్, దుర్గా శ్రీనివాస్, స్థానిక జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు రమణ, వెంకట్, ప్రసాద్, హరగోపాల్, ప్రవీణ్, లోవరాజు పడాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
    6
    జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఏపీడబ్ల్యూజేఎఫ్ 
మృతి చెందిన జర్నలిస్టు డేగల చినబాబు కుటుంబానికి ఆర్థిక సహాయం చెక్కు అందజేత
ఇటీవల మృతి చెందిన ఏబీఎన్ అన్నవరం రిపోర్టర్ డేగల చినబాబు కుటుంబానికి జర్నలిస్టుల ఫెడరేషన్ అండగా నిలిచింది. 
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో చినబాబు కుటుంబ సభ్యులకు సోమవారం ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు చినబాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చినబాబు మరణం జర్నలిస్టు సమాజానికి తీరని లోటని వారు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ కష్టకాలంలో జర్నలిస్టుల ఫెడరేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాతాడ నవీన్ రాజ్, ముమ్మిడి లక్ష్మణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అధికార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చినబాబు జర్నలిజం రంగంలో ఎంతో అంకితభావంతో పనిచేసిన వ్యక్తి అని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఆయన ఎప్పుడూ ముందుండేవారని గుర్తుచేశారు. నిజాయితీ, నిబద్ధతతో వార్తలను అందించడంలో ఆయన చూపిన కృషి ఇతర జర్నలిస్టులకు ఆదర్శమని తెలిపారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తోందని, జర్నలిస్టులు లేదా వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటామని నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చినబాబు కుటుంబానికి సంఘం తరఫున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. నిరంతరం పని ఒత్తిడితో జర్నలిజం వృత్తిని చేస్తున్న పలువురు అకస్మాత్తుగా మరణిస్తుండడంతో వారి కుటుంబాలు వీధిని పడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఈ సందర్భంగా చినబాబు కుటుంబ సభ్యులు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సమయంలో జర్నలిస్టుల సంఘం అండగా నిలవడం తమకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు పుర్రె త్రినాథ్, కే.వి.సత్యనారాయణ, శ్రీధర్, ఎస్ కే ఇమ్రాన్, దుర్గా శ్రీనివాస్, స్థానిక జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు రమణ, వెంకట్, ప్రసాద్, హరగోపాల్, ప్రవీణ్, లోవరాజు పడాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
    user_AP NEWS
    AP NEWS
    జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • ఎచ్చెర్ల మండలం జరజం గ్రామ పరిధిలోని NH16పై అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టిన కారు ఆటోలోని ప్యాసింజర్లు ఎగిరిపడగా, ఒకరు మృతిచెందినట్లు, మరో 12 మంది గాయాలపాలైనట్లు సమాచారం.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    1
    ఎచ్చెర్ల మండలం జరజం గ్రామ పరిధిలోని NH16పై అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టిన కారు
ఆటోలోని ప్యాసింజర్లు ఎగిరిపడగా, ఒకరు మృతిచెందినట్లు, మరో 12 మంది గాయాలపాలైనట్లు సమాచారం.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం సూరన్న గొంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల యేలకాలం నుండి శిధిలమైన పాఠశాలలోనే పిల్లల చదువులు కొనసాగుతున్న దీన పరిస్థితి అధికారులు వచ్చిన చూసి చూడనట్లు వ్యవహరించి వెళ్లడం తప్ప గ్రామస్తులు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ స్పందించని అధికారులు గిరిజన అభివృద్ధి సంస్థ ఎంతో దూరం కాదు కేవలం 14 కిలోమీటర్ల దూరం మాత్రమే పిల్లలు వర్షం వస్తే ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి అయినా సరే టర్పాన్స్ వేసో ఎలాగో అలాగా పాఠశాల ఉపాధ్యాయులు సొర్వతీసుకొని పాఠశాలను నడిపించడం జరుగుతుంది దీనమైన పాఠశాలను ప్రజాప్రతినిధులు ఆసక్తి సూపి తక్షణమే నూతన పాఠశాల భవనాన్ని మంజూరు చేయాలని గ్రామస్తులు విన్నవించుకోవడం జరుగుతుంది.
    2
    ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం సూరన్న గొంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల యేలకాలం నుండి శిధిలమైన పాఠశాలలోనే పిల్లల చదువులు కొనసాగుతున్న దీన పరిస్థితి అధికారులు వచ్చిన చూసి చూడనట్లు వ్యవహరించి వెళ్లడం తప్ప గ్రామస్తులు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ స్పందించని అధికారులు గిరిజన అభివృద్ధి సంస్థ ఎంతో దూరం కాదు కేవలం 14 కిలోమీటర్ల దూరం మాత్రమే పిల్లలు వర్షం వస్తే ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి అయినా సరే టర్పాన్స్ వేసో ఎలాగో అలాగా పాఠశాల ఉపాధ్యాయులు సొర్వతీసుకొని పాఠశాలను నడిపించడం జరుగుతుంది దీనమైన పాఠశాలను ప్రజాప్రతినిధులు ఆసక్తి సూపి తక్షణమే నూతన పాఠశాల భవనాన్ని మంజూరు చేయాలని గ్రామస్తులు విన్నవించుకోవడం జరుగుతుంది.
    user_Sode Prasad
    Sode Prasad
    Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • అరసవెల్లి దేవస్థానం,రొట్టవలసగ్రామ పురోహితులు,వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మవుడూరు సుబ్రహ్మణ్యశర్మ గారు లిఖించినశ్రీ పరభావ నామ సంవత్సర గంటలపంచాంగం శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్ , అరసవెళ్లి స్వామి వారి దేవస్థానం అధికారులు, ప్రదాన అర్చుకులు ఇప్పిలి శంకర శర్మ మరియు ఇతర ప్రముఖులు సమక్షంలో ఘనంగా పంచాంగం మంగళవారంఉదయం ఆవిష్కరించారు.
    4
    అరసవెల్లి దేవస్థానం,రొట్టవలసగ్రామ పురోహితులు,వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంప్రధాన అర్చకులు
బ్రహ్మశ్రీ మవుడూరు సుబ్రహ్మణ్యశర్మ గారు లిఖించినశ్రీ పరభావ నామ సంవత్సర గంటలపంచాంగం శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్ , అరసవెళ్లి స్వామి వారి దేవస్థానం అధికారులు, ప్రదాన అర్చుకులు
ఇప్పిలి శంకర శర్మ మరియు ఇతర ప్రముఖులు సమక్షంలో ఘనంగా పంచాంగం మంగళవారంఉదయం ఆవిష్కరించారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    44 min ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.