చందు టెన్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి క్రికెట్ టోర్నమెంట్ *ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 18,* మహాశివరాత్రి సందర్భంగా చందు టెన్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో గొర్రెపాటి విజయ్ చంద్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు.నాలుగు రోజులుగా సాగిన ఈ టోర్నమెంట్ కి దాతలు ట్రుజోన్ సోలార్,మికాస ప్లేవుడ్ మరియు వీణా డిజైనర్స్ బోటిక్స్ సహకారంతో రాత్రి సమయంలో క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఐపిఎల్ తరహాలో క్రీడాకారులను కొనుక్కోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ టోర్నమెంట్ లో 8 టీమ్ లను ఎంచుకొని 80 మంది క్రీడాకారులతో 15 మ్యాచ్ లను నిర్వహించారు.ఫైనల్ మ్యాచ్ లో సాగర్ లెవెన్ పై ఎన్ పి ఎల్ టైగర్స్ టీమ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఈ సందర్భంగా ట్రుజెన్ సోలార్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్,మికాస ప్లేవుడ్ రీజనల్ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ శివరాత్రి రోజున ఇలాంటి క్రీడలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని మీడియా కి వ్యక్తపరిచారు.ఇదేవిధంగా ప్రతి సంవత్సరం దాతల సహకారంతో,క్రీడాకారుల ప్రోత్సాహంతో నిర్వహిస్తామని నిర్వాహకులు గొర్రెపాటి విజయ్ చంద్ తెలిపారు.

- తుమ్మలపాలెం వద్ద ప్రమాదం.. ట్రాఫిక్ కు అంతరాయం *ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 18,* బుధవారం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన భారీకేడ్ల వద్ద ఒక కారును లారీ ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు.1
- గుంటూరు జిల్లా:కొల్లిపర మండలంలోని గుదిబండి వారి పాలెంలో జరుగుతున్న ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం రెండో రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గణపతి, నవగ్రహ, దుర్గాదేవి హోమాలతో పాటు కనకదుర్గాదేవికి కలశ పూజ, కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.1
- విశాఖ తీరంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో, నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి. ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం.1
- మచిలీపట్నం పట్టణంలో ఆయుర్వేద వైద్య సేవలకు విశేష స్పందన లభిస్తోందని శుభకర ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు రంగనాధ్ తెలిపారు. గత 18 సంవత్సరాలుగా నిరంతరంగా ప్రజలకు సేవలందించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రాచీన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని ఆధునిక చికిత్సా సదుపాయాలతో కలిపి ప్రజలకు చేరువ చేయడం తమ లక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా కేరళ తరహా పంచకర్మ చికిత్సలు, క్షారసూత్ర విధానం ద్వారా మూలవ్యాధి నివారణ, జలూక చికిత్స ద్వారా రక్తశుద్ధి, శిరోధార ద్వారా మానసిక ఒత్తిడి తగ్గింపు వంటి ప్రత్యేక చికిత్సలను అందిస్తున్నామని వివరించారు. దీర్ఘకాలిక నొప్పులు, సంధివాతం, చర్మవ్యాధులు, జీర్ణ సంబంధ సమస్యలకు సహజసిద్ధమైన మందులతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. అవసరమైన అన్ని ఆయుర్వేద ఔషధాలను స్థానికంగానే అందుబాటులో ఉంచి, తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందించడం తమ ప్రత్యేకతగా పేర్కొన్నారు. ఇకపై కూడా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు.1
- నల్లజర్ల మండలం పోతవరంలో పొగాకు పనుల కోసం నందిగామ నుంచి వలస వచ్చిన ఎస్సీ కూలీల తాత్కాలిక పాకలను స్థానికుడు కరుటూరి సత్యనారాయణ, అతని కుమారుడు ధ్వంసం చేశారని కూలీలు వాపోయారు. వారి సామాగ్రిని, ఆహారాన్ని చిందరవందర చేయడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కూలీల ఆవాసాలను పడగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.1
- ఆడపిల్ల గా పుట్టడం ఆ చిట్టి తల్లి చేసుకున్న కర్మ అని అందమా?.... సిగ్గుపడాలి ఈ సమాజం మన కంటే అడవిలో వుండే మృగాలు వంద రెట్లు బెటర్ గా వున్నాయి... తల్లి నీ మరణానికి కారణం ఈ సమాజమే ప్రతి ఒక్కరు బాద్యులే1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస బంజర కాలనీ వద్ద బుధవారం ఉదయం మహిళను ఢీకొన్న కారు. ములకలపల్లి నుండి పాల్వంచ వస్తున్న కారు అదుపుతప్పి ఆదిలక్ష్మి అనే మహిళను ఢీకొంది. ప్రమాదంలో ఆదిలక్ష్మికి గాయాలు కావటంతో స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మూడు తోపుడు బండ్లు ధ్వంసం కాగా కారు ముందు భాగం ధ్వంసం అయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను స్థానికులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.4
- గుంటూరు జిల్లా ః *అంబటి రాంబాబు కు బెయిల్ మంజూరు* సత్తెనపల్లి లక్కీ డ్రా కేసులో అరెస్టు అయిన అంబటి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్ ఖైదీ గా ఉన్న అంబటి. అంబటి కు కస్టడి పిటిషన్ డిస్మిస్ చేసిన జడ్జి1