సైదాపూర్ మండలం రాయికల్ లో మహనీయుల విగ్రహాల ప్రతిష్టాపన కోసం భూమి పూజ కార్యక్రమం సైదాపూర్ మండలం రాయికల్ గ్రామంలో మహనీయులు మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, విగ్రహాల ప్రతిష్టాపన కోసం భూమి పూజకార్యక్రమం చేపట్టడం జరిగింది. గ్రామ సర్పంచ్ చాడ అఖిల్ కొబ్బరికాయ కొట్టి భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో మహాత్మ జ్యోతిరావు పూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ కమిటీ చైర్మన్ చాడ ప్రకాష్, డాక్టర్ గడప నాగయ్య అఖిలభారత అధ్యక్షులు జాతీయ సామాజిక న్యాయ ఫోరం, తెలంగాణ రాష్ట్ర కో - కన్వీనర్ గడప రాజు స్వేరో, గురాల శ్రీనివాస్ రెడ్డి, ఈగ లక్ష్మీనారాయణ, బత్తిని రాజయ్య, కోలకాని మైసయ్య, అంబేద్కర్ యువజన సంఘం రాయికల్ వారి సౌజన్యంతో ముందుకు సాగిన ఈ కార్యక్రమం లో జి శ్రీనివాస్, కే బాలరాజు, జి లచ్చయ్య,బి రవీందర్, యం రాజయ్య, ఎస్ అశోక్, బి ప్రవీన్, బి అనిల్, జి లక్ష్మణ్, రావుల రాజిరెడ్డి, కొమురయ్య, గ్రామ పెద్దలు, జి దేవయ్య, జి దుర్గయ్య, జె బాబు, జె స్వామి, యువకులు, మహిళలు, కొబ్బరికాయలు కొట్టారు,
సైదాపూర్ మండలం రాయికల్ లో మహనీయుల విగ్రహాల ప్రతిష్టాపన కోసం భూమి పూజ కార్యక్రమం సైదాపూర్ మండలం రాయికల్ గ్రామంలో మహనీయులు మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, విగ్రహాల ప్రతిష్టాపన కోసం భూమి పూజకార్యక్రమం చేపట్టడం జరిగింది. గ్రామ సర్పంచ్ చాడ అఖిల్ కొబ్బరికాయ కొట్టి భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో మహాత్మ జ్యోతిరావు పూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ కమిటీ చైర్మన్ చాడ ప్రకాష్, డాక్టర్ గడప నాగయ్య అఖిలభారత అధ్యక్షులు జాతీయ సామాజిక న్యాయ ఫోరం, తెలంగాణ రాష్ట్ర కో - కన్వీనర్ గడప రాజు స్వేరో, గురాల శ్రీనివాస్ రెడ్డి, ఈగ లక్ష్మీనారాయణ, బత్తిని రాజయ్య, కోలకాని మైసయ్య, అంబేద్కర్ యువజన సంఘం రాయికల్ వారి సౌజన్యంతో ముందుకు సాగిన ఈ కార్యక్రమం లో జి శ్రీనివాస్, కే బాలరాజు, జి లచ్చయ్య,బి రవీందర్, యం రాజయ్య, ఎస్ అశోక్, బి ప్రవీన్, బి అనిల్, జి లక్ష్మణ్, రావుల రాజిరెడ్డి, కొమురయ్య, గ్రామ పెద్దలు, జి దేవయ్య, జి దుర్గయ్య, జె బాబు, జె స్వామి, యువకులు, మహిళలు, కొబ్బరికాయలు కొట్టారు,
- జమ్మికుంటలో మందుబాబు వీరంగం...ఈడ్చుకెళ్ళి తగిన శాస్త్రి చేసిన పోలీసులు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మద్యం మత్తులో వీణవంక మండలం హిమ్మత్ నగర్ కు చెందిన రాజు వీరంగం సృష్టించారు. తాగిన మైకంలో స్వీట్ హౌస్ నిర్వాహకులతో ధర విషయంలో గొడవ పడ్డారు. స్వీట్ హౌస్ నిర్వాహకుడు డయల్ 111 కాల్ చేయడంతో మత్తులో ఉన్న వ్యక్తిని స్టేషన్ కు తరలించి సముదాయించి పంపించేశారు పోలీసులు. మద్యం మత్తులో ఉన్న రాజు గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని ఆందోళన దిగారు. పోలీసులు తీరు స్వీట్ హౌస్ నిర్వాహకులపై ఆందోళన వ్యక్తం చేశారు. న్యూసెన్స్ సృష్టించడంతో మందుబాబుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మందు బాబుపై చేయ్ వేసుకుని స్టేషన్ గొరగొర కొంతదూరం ఈడ్చుకెళ్ళారు. అనంతరం నలుగురు అతన్ని అమాంతం లేపి స్టేషన్ కు లాక్కెళ్లారు. మందు బాబు వీరంగం, పోలీసుల అసహనం స్థానికంగాళకలకలం సృష్టించింది.2
- ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు పరచాలని డిమాండ్ చేస్తూ నిరసన రాష్ట్రంలో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు నాయకులు నిరసన తెలిపారు. ఈనెల 31న మాలమహానాడు ఆధ్వర్యంలో తలపెట్టిన చలో సెక్రటేరియట్ వాల్ పోస్టర్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. గతంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసిన పార్ట్ 1, 2, 3, 4 విధానంతో మాలలకు తీవ్ర నష్టం జరుగుతోందని మాల మహానాడు నాయకులు ఆరోపించారు. 46% రోస్టర్ విధానంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోస్టర్ విధానాన్ని రద్దుచేసి వాళ్లకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 31న లక్షలాదిమంది మాలలు మాల మహానాడు ఆధ్వర్యంలో హైదరాబాద్ ను దిగ్బంధనం చేసి సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.2
- నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. దాహంగా ఉందని నీళ్లు అడిగిన బాధితుడిపై ఎస్సై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపించాడు. ఈ ఘటనపై బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డికి డీఎస్పీ ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు.1
- మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహణ : సహకరించినందుకు వారికి ధన్యవాదాలు సిపి గౌస్ ఆలం కరీంనగర్‌లో మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఊరేగింపు ప్రశాంతంగా, వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. సీపీ గౌష్ ఆలం స్థానిక పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు. నాఖా చౌరస్తా, తెలంగాణ చౌక్ వద్ద ముస్లిం మత పెద్దలను పూలమాలలతో సత్కరించి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపును ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ శాంతిభద్రతలు, పరమత సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, నగరంలోని గంగా–జమునా తెహజీబ్‌కు ఈ వేడుకలు నిదర్శనమని సీపీ పేర్కొన్నారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.1
- కరీంనగర్ లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన పురస్కరించుకుని మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఘనంగా శోభాయాత్ర మిలాద్-ఉన్-నబీ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో భారీ శోభాయాత్ర చేపట్టారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో శాంతి, సోదరభావ సందేశాలను చాటారు. యువకులు పవిత్ర పతాకాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించగా, ప్రజాప్రతినిధులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.3
- గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనాలు 26 వేల రూపాయలు అందించి ఉద్యోగ భద్రత కల్పించాలని , మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని , హెల్త్ కార్డులు అందించి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని , ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ప్రతి నెల ఒకటో తేదీన కార్మికుల బ్యాంకు ఖాతాలలో జీతాలు జమ చేయాలని , 60 సంవత్సరాలు పైబడిన మరియు చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోవాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు CITU - తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి సమస్యలపై అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ , యూనియన్ జిల్లా అధ్యక్షులు బూర శ్రీనివాస్ లు మాట్లాడుతూ గ్రామాలను పచ్చదనం , పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా ఎండనక , వాననక , చలనక అహర్నిశలు కష్టపడి పని చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జిల్లాలో కూడా స్థానిక అధికారులు , పాలకవర్గాలు కార్మికులను తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని బడ్జెట్ లేదని సాకుతో కొన్ని గ్రామాలలో నెలల తరబడి కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని స్థానిక సమస్యలపై జిల్లా అధికారులను కలిసిన సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై సంబంధిత అధికారులు , జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకుంటే కార్మికులందరూ నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి సిఐటియు జిల్లా కోశాధికారి అన్నల్దాస్ గణేష్ , యూనియన్ జిల్లా కార్యదర్శి మల్యాల నర్సయ్య యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు లోకిని శ్రీనివాస్ , కంసాని రవీందర్ , నారపురం నర్సయ్య , మహేష్ , శేఖర్ , అనిల్ , కాంతయ్య , లక్ష్మి , పద్మ గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు3
- కమలాపూర్‌లో కొండచిలువ కలకలం.. సురక్షితంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో వ్యవసాయ పొలంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై కలకలం రేపింది. పొలంలో కొండచిలువ సంచరిస్తుండటాన్ని గమనించిన రైతులు భయాందోళనకు గురై వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువను పట్టుకునేందుకు జాగ్రత్తగా చర్యలు చేపట్టి, ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం కొండచిలువను జూ పార్క్‌కు తరలించారు. వ్యవసాయ పొలాల్లో కొండచిలువ కనిపించడంతో రైతులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అటవీశాఖ అధికారులు సకాలంలో స్పందించి కొండచిలువను పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ప్రమాదం జరగలేదు.2
- ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మీలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మీలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. జామే మజీద్ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అంబేడ్కర్ చౌరస్తా మీదుగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. పెద్ద సంఖ్యలో యువత ర్యాలీలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టి, ప్రధాన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. అనంతరం జామే మజీద్ నుంచి దర్గా వరకు ముస్లిం సోదరులు పాదయాత్ర నిర్వహించారు. ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద నిర్వహించిన ఖీర్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు శాంతి, సోదరభావం, దయ, మానవత్వం, సేవాభావం వంటి విలువలను చాటుతూ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ సమీ, మాజీ అధ్యక్షులు, యూసుఫ్, ముస్తఫా, సత్తార్, సయ్యద్ సమద్, రఫిక్, మునీర్, సయ్యద్ సోహెల్, సయ్యద్ అక్రమ్, రైస్, మహమూద్, షాదాబ్, అంజద్, చాంద్, మత పెద్దలు పాల్గొన్నారు.2