మేయర్ నోటిఫికేషన్ వెంటనే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వేయాలి- కాంగ్రెస్ నెల్లూరు: గత 16 రోజులుగా గిరిజన నాయకులు మున్సిపల్ మేయర్ నోటిఫికేషన్ వేయా లని చేస్తున్న దీక్షకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు, గిరిజన సంఘాల నేతలు జయ వర్ధన్ రాష్ట్ర గిరిజన నాయకులు కలెక్టరేట్ వద్ద తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష మొదటి రోజు కు సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధంగా 243 జెడ్ఏ లో పేర్కొన్న విధంగా 30 రోజుల్లో ఖాళీ అయిన మేయర్ స్థానానికి నోటిఫికేషన్ వేయవలసిన బాధ్యత రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ పై ఉందని, స్వయంగా కలిసి ఆమెకు విజ్ఞప్తి చేసిన ఫలితం లేకుండా పోయిందని అన్నారు, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 243 ఆర్టికల్ ప్రకారము అనేక దశాబ్దాల తర్వాత గతంలో యానాది మహిళకు మేయర్ పదవి వస్తే, ఎన్నో అవమానాలు, వివక్ష ఎదుర్కొన్నారని సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పిస్తూ చర్యలు తీసుకుంటే, కూటమి ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, కాంట్రాక్టర్లు, పెత్తందార్ల చెప్పు చేతల్లో ఉండి ప్రజల హక్కులను కాలరాస్తున్నారు అని అన్నారు. ఓట్ల సమయంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిసి మహిళల వద్ద దొంగ ఏడుపులు ఏడ్చి ఓట్లు దండుకొని, గద్దెనెక్కిన తర్వాత ప్రజలను పీల్చుకు తింటున్నారని లీగల్ సెల్ చైర్మన్ సుధీర్ అన్నారు

- Post by Anji Raju1
- జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యకర్తలకు నాయకులకు వీర మహిళలకు అభిమానులకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను..1
- కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గత రెండు రోజులుగా వివాదాస్పదంగా మారిన జనసేన పార్టీ జెండా అంశం ఉత్కంఠభరితంగా ముగిసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య బందరు పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, జనసేన నాయకుడు బండి రామకృష్ణతో కలిసి జెండాను ఎగురవేశారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి సమీపంలో జెండా ఏర్పాటు చేయడంపై రాజకీయంగా ఉద్రిక్తత నెలకొంది. జనసేన, వైఎస్ఆర్సిపి నేతల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోగా, రెండు పార్టీల కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ, “జనసేన జెండాపై ఎవరైనా చెయ్యేస్తే జనసైనికులు, వీర మహిళలు చూస్తూ ఊరుకోరు” అని హెచ్చరించారు. గత ఎన్నికల్లో జనసేన తన బలం చూపిందని, పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. మచిలీపట్నంలో జరిగిన ఈ పరిణామాలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.4
- చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్ కుప్పం డీఎస్పీ పార్థసారథి , సిఐ కుప్పం రూరల్ మల్లేష్ యాదవ్ , రాళ్ళబుదుగూరు ఎస్‌ఐ నరేష్ రామకుప్పం ఎస్‌ఐ వెంకట మోహన్ మరియు పోలీసు సిబ్బందితో కలిసి ఆపరేషన్ *“వజ్రపహర్”* కార్యక్రమంలో భాగంగా పిఇఎస్ కళాశాల ఎదురుగా ఉన్న పీజీ హాస్టల్స్ ను తనిఖీ చేయడం జరిగింది. పీజీ హాస్టల్స్ లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు గాంజా / డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. • యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని సూచించడం జరిగింది. • హాస్టల్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత యాజమాన్యాలకు సూచించడం జరిగింది. • అగ్నిప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించడం జరిగింది. • హాస్టల్స్ వద్ద తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని యాజమాన్యాలకు తెలియజేయడం జరిగింది.1
- లేపాక్షి మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. మండల సీనియర్ నాయకుడు లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధి, ప్రజా సేవలో ముందుకు సాగాలని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.1
- కారు నడుపుతూ ప్రమాదవశాత్తు ఇద్దరికి గాయపరిచిన యువకుడు భయపడి ఆత్మహత్య.. కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కొట్ర రెవెన్యూ శివారులో రహదారి పక్కన ఉన్న ఓ చెట్టు కు తెల్లజామున ఉరివేసుకొని విగత జీవిగా కనిపించగా గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే వెల్దండ ఎస్సై కురుమూర్తికి సమాచారం అందించారు. ఎస్ఐ అక్కడికి చేరుకొని ద్విచక్ర వాహనం నెంబరు ఆధారంగా మృతుడి వివరాలు సేకరించి ఆదిపట్ల ఎస్సై రవికుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా వారు అక్కడి చేరుకున్నారు పోస్ట్ మాస్టo అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులను అప్పగించారు మృతుడి కి భార్య శ్రావణి తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.1
- నాలుగేళ్లు ఇస్తానని చెప్పి ఐదేళ్లు రైతు భరోసా అందించారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. పీఎం కిసాన్ కాకుండా 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ ఇస్తానని చెప్పి తొలి ఏడాది ఎగ్గొట్టాడు చంద్రబాబు. ఎవరు మోసం చేస్తున్నారో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. -ఎంవీఎస్ నాగిరెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ జనరల్ సెక్రటరీ (అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్)1
- లక్కిరెడ్డిపల్లి మండలం మర్రిచెట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఇన్నోవా కారు టైరు పగిలి అదుపుతప్పి, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారులో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో అందులోని ముగ్గురు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. స్థానికులు క్షతగాత్రులను రాయచోటి ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం వైద్యులు వారిని కడపకు రిఫర్ చేశారు. లక్కిరెడ్డిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- అంబేద్కర్ కోనసీమ జిల్లా, మల్కిపురం లక్కవరం గ్రామంలో మూడవ తరగతి చదువుతున్న శృతి అనే 8 ఏళ్ళ బాలికపై అదే గ్రామానికి చెందిన 44 ఏళ్ల మేడిది నాగబాబు అత్యాచార ప్రయత్నం చేశారు. బాలికను ఇంటి పక్క ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్ళి1