Shuru
Apke Nagar Ki App…
వంగర మండలం మెట్ట మగ్గురు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం గురువారం ఉదయం 11 గంటలు దాటినా తెరుచుకోలేదు. అధికారుల పర్యవేక్షణ లోపంతో కేంద్రం చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి దయనీయంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ దీనిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
HARIBABU TALADA
వంగర మండలం మెట్ట మగ్గురు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం గురువారం ఉదయం 11 గంటలు దాటినా తెరుచుకోలేదు. అధికారుల పర్యవేక్షణ లోపంతో కేంద్రం చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి దయనీయంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ దీనిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
More news from Kakinada and nearby areas
- దుర్గాడ గ్రామంలో ఉపాధి హామీ పనుల నుంచి మేట్ల తొలగింపు దుర్గాడలో ఉపాధి మేట్ల తొలగింపుపై వివాదం. - రాజకీయ వివక్షే కారణమా? - అధికారుల తీరుపై బాధితుల ఆవేదన పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో దళిత ఉపాధి హామీ మేట్ల పట్ల స్థానిక అధికారులు వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత ప్రభుత్వ హయాంలో మేట్లుగా పనిచేసిన వారిని విధుల్లోంచి తొలగించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గత రెండు వారాలుగా ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలని ఐదుగురు మేట్లు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటి వీరబాబు వారి విన్నపాలను తిరస్కరించడమే కాకుండా, రాజకీయ ఒత్తిడి ఉన్నట్లుగా చెబుతున్నారు. బాధిత మేట్లు మాట్లాడుతూ... మేము గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మేట్లుగా పనిచేశామన్న ఏకైక కారణంతో మమ్మల్ని ఉపాధి హామీ విధులకు దూరం చేస్తున్నారని, మాపై ఉన్న రాజకీయ ఒత్తిడి కారణంగా మీకు పనులు ఇవ్వలేమని ఫీల్డ్ అసిస్టెంట్ కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పని కోల్పోయిన వారిలో జీలకర్ర సురేష్, సామిరెడ్డి తమ్మాజీ, గోరింటా బాల సంజీవరావు, చిత్తరుపు దాసు, విప్పర్తి విజయ్ కుమార్ ఉన్నారని, మేట్లను విధుల్లోంచి తొలగించడం వల్ల ఉపాధి హామీ పథకంపై ఆధారపడి జీవించే సాధారణ కూలీలకు కూడా పని దొరకక ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కారణాలతో పేద దళితుల ఉపాధిని దెబ్బతీయడం దారుణమని, వెంటనే అధికారులు స్పందించి వారికి తిరిగి పని కల్పించాలని బాధితులు కోరుతున్నారు.1
- కాకినాడ జిల్లా దుర్గాడలో, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఐదుగురు దళిత మేట్లకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉపాధి పనులు నిరాకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పని ఇవ్వలేదని ఫీల్డ్ ఆఫీసర్ చెప్పినట్లు బాధితులు పేర్కొంటున్నారు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమకు న్యాయం చేయాలని, వివక్ష చూపుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.3
- అనపర్తి మండలం కుతుకులూరులో 'బడి పిలుస్తుంది' కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అధ్యాపకులు, కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి, ప్రభుత్వ పాఠశాలల ప్రయోజనాలను వివరించి, పిల్లలను చేర్చాలని తల్లిదండ్రులను కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్య వ్యవస్థ ప్రగతి పథంలో ముందుకు వెళ్తుందని ఆయన హామీ ఇచ్చారు.1
- ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాగమయి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకొని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.1
- తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ప్రజా దర్బార్ నిర్వహించగా, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేదల సమస్యలు విని, ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి ఎదుట ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. సమన్వయంతో పనిచేసి ప్రజలకు న్యాయం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.1
- *తేదీ :- 21-05-2026* *నర్సంపేట మున్సిపాలిటీ, వరంగల్ జిల్లా.* *ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా బయో కవర్లు ఏర్పాట్లు..* *- మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్..* ASR స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని మల్లంపల్లి రోడ్ లోని విమల టిఫిన్ సెంటర్ లో ఆరోగ్యానికి హాని చేయని బయో కవర్ల ను మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ గారు మరియు కమిషనర్ కాటం భాస్కర్ గారు వారికి అందించారు... *ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ..* పట్టణ ప్రజల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై ప్రజల్లో అవగాహన కల్పించడంతో ఆ తర్వాత ప్రజల్లో కొంత మార్పు మొదలైందని,ప్లాస్టిక్ కవర్లకు బదులు బయోడిగ్రేడబుల్ కవర్ల ను వాడుతూ ప్రజలు తమ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన అన్నారు..ప్లాస్టిక్ రహిత నర్సంపేటగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని అన్నారు.. *అనంతరం మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడుతూ..* ప్రజలు ప్లాస్టిక్ ప్లేట్స్ ,కవర్లలో వేడివేడి ఆహారం తినవద్దని,అనారోగ్య సమస్యల తో పాటు క్యాన్సర్ బారిన పడవద్దని అన్నారు.. ఏర్పాటు చేసిన బయో ఆరోగ్య కవర్లు వాడుతూ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నారు.. *కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్,ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ నవీన్,కౌన్సిలర్ పొన్నాల మనీషా ప్రకాష్,మరియు జాతీయ గుర్తింపు గల ఉప్పలయ్య హోటల్ యజమాని శ్రీనివాస్,కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు..*1
- శ్రీకాకుళం జిల్లాలో మాతా శిశు మరణాల రేటును పూర్తిగా తగ్గించాలని, భ్రూణహత్యలపై ఉక్కుపాదం మోపాలని ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. గత ఏడాది నమోదైన మరణాలపై లోతైన విచారణ జరిపిన ఆయన, లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరిగేలా చూడాలని, గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.2
- ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన ప్రజా దర్బార్‌లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నాలుగు విడతల్లో మంజూరు చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ధరణి సమస్యలు, ఇసుక లభ్యతపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.1
- ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రెవెన్యూ, గృహనిర్మాణం, అటవీ అంశాలపై ప్రజలు తమ సమస్యలను మంత్రికి వివరించారు. ఈ దర్బార్ ద్వారా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.1