logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

విశ్వవిద్యాలయ క్రీడా రంగాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లే లక్ష్యంతో కరీంనగర్ లోని శాతవాహన క్రీడా మైదానంలో సుమారు రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించ తలపెట్టిన 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఉపకులపతి ఆచార్య ఉమేశ్ కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ ఈరోజు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడా మైదానాన్ని జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది, గ్రామీణ మరియు పట్టణ ప్రాంత విద్యార్థులలోని క్రీడా ప్రతిభను పెంచేందుకు జాతీయ పోటీలకు సమానమైన ఈ ట్రాక్‌పై ప్రాక్టీస్ చేసే అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసి, వారికి జాతీయ స్థాయి శిక్షణ అందించేందుకు ఈ అధునాతన సింథటిక్ ట్రాక్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడా మౌలిక వసతులను బలోపేతం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన, బలమైన యువతను దేశానికి అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణా సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా ఈ ప్రతిష్టాత్మక ప్రణాళికను చేపట్టినట్లు రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ తెలిపారు. క్రీడాకారుల శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి మరియు వారిని ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయం ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ విసి ఓ ఎస్ డి డా. హరికాంత్, పరీక్షల నియంత్రణ అధికారి డా. సురేష్ కుమార్, ఆర్ట్స్ మరియు న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డా. పద్మావతి, విశ్వవిద్యాలయ ఇంజనీర్ ప్రకాష్ రావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిషోర్, క్రీడా శాఖ సెక్రెటరీ డా. నజీముద్దీన్ మున్వర్ తో పాటు వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, క్రీడా విభాగం అధికారులు పాల్గొన్నారు.

3 hrs ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
3 hrs ago
626e80b3-0863-44fd-818f-c5fe9fd5a92a

విశ్వవిద్యాలయ క్రీడా రంగాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లే లక్ష్యంతో కరీంనగర్ లోని శాతవాహన క్రీడా మైదానంలో సుమారు రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించ తలపెట్టిన 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఉపకులపతి ఆచార్య ఉమేశ్ కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ ఈరోజు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడా మైదానాన్ని జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది, గ్రామీణ మరియు పట్టణ ప్రాంత విద్యార్థులలోని క్రీడా ప్రతిభను పెంచేందుకు జాతీయ పోటీలకు సమానమైన ఈ

369fa7c7-8565-431a-ad8a-e0074a63e06c

ట్రాక్‌పై ప్రాక్టీస్ చేసే అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసి, వారికి జాతీయ స్థాయి శిక్షణ అందించేందుకు ఈ అధునాతన సింథటిక్ ట్రాక్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడా మౌలిక వసతులను బలోపేతం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన, బలమైన యువతను దేశానికి అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణా సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా ఈ ప్రతిష్టాత్మక ప్రణాళికను చేపట్టినట్లు రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ తెలిపారు. క్రీడాకారుల

35b7518a-956e-40ea-af49-97d1a418a127

శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి మరియు వారిని ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయం ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ విసి ఓ ఎస్ డి డా. హరికాంత్, పరీక్షల నియంత్రణ అధికారి డా. సురేష్ కుమార్, ఆర్ట్స్ మరియు న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డా. పద్మావతి, విశ్వవిద్యాలయ ఇంజనీర్ ప్రకాష్ రావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిషోర్, క్రీడా శాఖ సెక్రెటరీ డా. నజీముద్దీన్ మున్వర్ తో పాటు వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, క్రీడా విభాగం అధికారులు పాల్గొన్నారు.

More news from Karimnagar and nearby areas
  • కరీంనగర్ ఆరేపల్లిలోని రాజరాజేశ్వర కాలనీలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి 55వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎస్సీ మోర్చా నాయకులు ఫుడ్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాపాక ప్రవీణ్, నార్త్ జోన్ అధ్యక్షులు పాదం శివరాజ్, నాయకులు గుర్రం వెంకటేష్, మడ్డి రాకేష్, కొండ్ర వరప్రసాద్, బండారి హరీష్, నిఖిల్ మరియు అశ్లీత్ పాల్గొన్నారు.
    1
    కరీంనగర్ ఆరేపల్లిలోని రాజరాజేశ్వర కాలనీలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి 55వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎస్సీ మోర్చా నాయకులు ఫుడ్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాపాక ప్రవీణ్, నార్త్ జోన్ అధ్యక్షులు పాదం శివరాజ్, నాయకులు గుర్రం వెంకటేష్, మడ్డి రాకేష్, కొండ్ర వరప్రసాద్, బండారి హరీష్, నిఖిల్ మరియు అశ్లీత్ పాల్గొన్నారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    2 hrs ago
  • ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని మరియు ప్రైవేట్ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శనివారం మార్కెట్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు మార్కెట్లోని చిరు వ్యాపారస్తులను, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రైవేటు విద్యా వ్యవస్థ చేస్తున్న దోపిడీని వివరించారు. ఈ సందర్భంగా కనకం కుమారస్వామి మాట్లాడుతూ, ప్రైవేట్ విద్య పేద, మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను చదివించడం కోసం తల్లిదండ్రులు తమ ఆస్తులను సైతం అమ్ముకోవాల్సి వస్తోందని ఆరోపించారు. చదువును వ్యాపారంగా మార్చుకుని ప్రైవేటు విద్యాసంస్థలు పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నాయని మండిపడ్డారు. కరీంనగర్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని, ప్రైవేటు విద్యా విధానం సామాన్యులకు అందుబాటులోకి వచ్చేవరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వచ్చే ఆగస్టు 10వ తేదీన నిర్వహించ తలపెట్టిన ప్రైవేటు విద్యా బాధితుల భారీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడిగల రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గరిగే కోటేశ్వర్, చొప్పరి సుధాకర్, కనపర్తి శ్రీనివాస్, గాలి రమేష్, బూడిద వినోద్ కుమార్, కుడిది శ్రీనివాస్, పల్లపు చిన్నారెడ్డి, మహిళా ప్రతినిధులు మేకల మాధవి, కారుపాకల మున్న, గర్షకుర్తి ఉమారాణి, అంజలి దేవేంద్రతో పాటు పలువురు ప్రతినిధులు, విద్యా విధాన బాధితులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
    1
    ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని మరియు ప్రైవేట్ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శనివారం మార్కెట్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు మార్కెట్లోని చిరు వ్యాపారస్తులను, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రైవేటు విద్యా వ్యవస్థ చేస్తున్న దోపిడీని వివరించారు.

ఈ సందర్భంగా కనకం కుమారస్వామి మాట్లాడుతూ, ప్రైవేట్ విద్య పేద, మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను చదివించడం కోసం తల్లిదండ్రులు తమ ఆస్తులను సైతం అమ్ముకోవాల్సి వస్తోందని ఆరోపించారు. చదువును వ్యాపారంగా మార్చుకుని ప్రైవేటు విద్యాసంస్థలు పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నాయని మండిపడ్డారు. కరీంనగర్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని, ప్రైవేటు విద్యా విధానం సామాన్యులకు అందుబాటులోకి వచ్చేవరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

వచ్చే ఆగస్టు 10వ తేదీన నిర్వహించ తలపెట్టిన ప్రైవేటు విద్యా బాధితుల భారీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడిగల రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గరిగే కోటేశ్వర్, చొప్పరి సుధాకర్, కనపర్తి శ్రీనివాస్, గాలి రమేష్, బూడిద వినోద్ కుమార్, కుడిది శ్రీనివాస్, పల్లపు చిన్నారెడ్డి, మహిళా ప్రతినిధులు మేకల మాధవి, కారుపాకల మున్న, గర్షకుర్తి ఉమారాణి, అంజలి దేవేంద్రతో పాటు పలువురు ప్రతినిధులు, విద్యా విధాన బాధితులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీఇంబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పిలుపునిచ్చింది. శనివారం కరీంనగర్‌లోని ఏబీవీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 11 వేల కోట్ల మేర విద్యార్థుల బకాయిలను పెండింగ్‌లో పెట్టడం వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను విస్మరించి విద్యార్థులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలను పరిష్కరించాలని, మంగళవారం నాటి బంద్‌ను విద్యార్థులంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
    2
    పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీఇంబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పిలుపునిచ్చింది. శనివారం కరీంనగర్‌లోని ఏబీవీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 11 వేల కోట్ల మేర విద్యార్థుల బకాయిలను పెండింగ్‌లో పెట్టడం వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను విస్మరించి విద్యార్థులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలను పరిష్కరించాలని, మంగళవారం నాటి బంద్‌ను విద్యార్థులంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    5 hrs ago
  • కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట, నాగసముద్రం గ్రామాలకు చెందిన 40 మంది భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసి అంజన్న ఆశీస్సులు పొందారు. తాము గత 116 వారాలుగా నిరంతరాయంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించామని, అది విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగానే కొండగట్టు క్షేత్ర దర్శనానికి వచ్చినట్లు భక్తులు వెల్లడించారు. అంజన్న అనుగ్రహంతోనే తమ కుటుంబాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతున్నాయని వారు హర్షం వ్యక్తం చేశారు. అయితే, కొండగట్టు క్షేత్రానికి వేలాది మంది భక్తులు తరలివస్తున్నప్పటికీ అక్కడ కనీస మౌలిక వసతులు, మరుగుదొడ్లు, మూత్రశాలల కొరత తీవ్రంగా వేధిస్తోందని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ పరిసరాల్లో పూజా సామగ్రి, కొబ్బరికాయలు తదితర వస్తువులను ఇష్టారాజ్యంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని ఈ ధరలను నియంత్రించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. కొండగట్టు క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం, దేవాదాయ శాఖ ప్రత్యేక శ్రద్ధ వహించి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని భక్తులు విజ్ఞప్తి చేశారు.
    3
    కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట, నాగసముద్రం గ్రామాలకు చెందిన 40 మంది భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసి అంజన్న ఆశీస్సులు పొందారు. తాము గత 116 వారాలుగా నిరంతరాయంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించామని, అది విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగానే కొండగట్టు క్షేత్ర దర్శనానికి వచ్చినట్లు భక్తులు వెల్లడించారు. అంజన్న అనుగ్రహంతోనే తమ కుటుంబాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతున్నాయని వారు హర్షం వ్యక్తం చేశారు.

అయితే, కొండగట్టు క్షేత్రానికి వేలాది మంది భక్తులు తరలివస్తున్నప్పటికీ అక్కడ కనీస మౌలిక వసతులు, మరుగుదొడ్లు, మూత్రశాలల కొరత తీవ్రంగా వేధిస్తోందని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ పరిసరాల్లో పూజా సామగ్రి, కొబ్బరికాయలు తదితర వస్తువులను ఇష్టారాజ్యంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని ఈ ధరలను నియంత్రించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. కొండగట్టు క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం, దేవాదాయ శాఖ ప్రత్యేక శ్రద్ధ వహించి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని భక్తులు విజ్ఞప్తి చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    29 min ago
  • సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు కొలీపాక రాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో బండి సంజయ్ ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తున్నారని ప్రశంసించారు. కేంద్ర మంత్రిగా తెలంగాణ అభివృద్ధికి ఆయన విశేష కృషి చేస్తున్నారని పేర్కొంటూ, ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా ఉండి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, సొల్లు అజయ్ వర్మ, బుర్ర మల్లేశం, బండిపల్లి సునీతతో పాటు బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బండి సంజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
    4
    సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు కొలీపాక రాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో బండి సంజయ్ ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తున్నారని ప్రశంసించారు. కేంద్ర మంత్రిగా తెలంగాణ అభివృద్ధికి ఆయన విశేష కృషి చేస్తున్నారని పేర్కొంటూ, ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా ఉండి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, సొల్లు అజయ్ వర్మ, బుర్ర మల్లేశం, బండిపల్లి సునీతతో పాటు బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బండి సంజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    7 hrs ago
  • హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయ శ్రీ బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శివ మరియు బీజేపీ నాయకులతో కలిసి రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ, బండి సంజయ్ కుమార్ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదగడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శులు గాదాసు రాంప్రసాద్, పోలోజు రాజేందర్ చారీ, కార్యదర్శులు వడ్డెపల్లె లక్ష్మయ్య, బొప్పిశెట్టి సాయిరామ్, అకోజు అరుణ్ కుమార్, కోశాధికారి బుర్ర రాజు, శక్తి కేంద్ర ఇంచార్జీ నారోజు నరేష్, సీనియర్ నాయకులు కాయిత అరుణ్ రెడ్డి, ఆశాడపు శ్రీనివాస్, అబ్బిడి లింగారెడ్డి, బూత్ అధ్యక్షులు పోగుల శేఖర్, బొనగిరి రాజేష్, వరికోలు నాగరాజు, మొలుగూరి గణేష్, నాయకులు ఎల్కపల్లి నవీన్, రమేష్, శ్రీనుతో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
    1
    హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయ శ్రీ బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శివ మరియు బీజేపీ నాయకులతో కలిసి రోగులకు పండ్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ, బండి సంజయ్ కుమార్ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదగడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శులు గాదాసు రాంప్రసాద్, పోలోజు రాజేందర్ చారీ, కార్యదర్శులు వడ్డెపల్లె లక్ష్మయ్య, బొప్పిశెట్టి సాయిరామ్, అకోజు అరుణ్ కుమార్, కోశాధికారి బుర్ర రాజు, శక్తి కేంద్ర ఇంచార్జీ నారోజు నరేష్, సీనియర్ నాయకులు కాయిత అరుణ్ రెడ్డి, ఆశాడపు శ్రీనివాస్, అబ్బిడి లింగారెడ్డి, బూత్ అధ్యక్షులు పోగుల శేఖర్, బొనగిరి రాజేష్, వరికోలు నాగరాజు, మొలుగూరి గణేష్, నాయకులు ఎల్కపల్లి నవీన్, రమేష్, శ్రీనుతో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
    user_Mahesh Chary
    Mahesh Chary
    Photographer Husnabad, Siddipet•
    1 hr ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర సహాయ హోం శాఖ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలను బిజెపి శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ వేడుకల్లో భాగంగా ముందుగా బిజెపి సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. అనంతరం బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొని రక్తదానం చేశారు. సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ఆర్యవైశ్య భవన్ ముందు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఆ తర్వాత అక్కడ మహా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డి బోయిన గోపి మాట్లాడుతూ, పేద మరియు బలహీనవర్గాల ప్రతినిధిగా రానున్న రోజుల్లో బండి సంజయ్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారాలని ఆకాంక్షించారు. తమలాంటి బలహీనవర్గాలకు చెందిన నాయకులకు ఆయన ఒక మార్గదర్శకుడిగా నిలబడాలని కోరారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర సహాయ హోం శాఖ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలను బిజెపి శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ వేడుకల్లో భాగంగా ముందుగా బిజెపి సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. అనంతరం బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొని రక్తదానం చేశారు.

సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ఆర్యవైశ్య భవన్ ముందు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఆ తర్వాత అక్కడ మహా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డి బోయిన గోపి మాట్లాడుతూ, పేద మరియు బలహీనవర్గాల ప్రతినిధిగా రానున్న రోజుల్లో బండి సంజయ్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారాలని ఆకాంక్షించారు. తమలాంటి బలహీనవర్గాలకు చెందిన నాయకులకు ఆయన ఒక మార్గదర్శకుడిగా నిలబడాలని కోరారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృషితో అభివృద్ధి మాటల్లో కాకుండా చేతల్లో కనిపిస్తోంది. ఆయన ప్రత్యేక చొరవతో వేములవాడ పట్టణ మూడవ బ్రిడ్జి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నిర్మాణంలో అత్యంత కీలకమైన చివరి స్లాబ్ పనులు నేడు వేగంగా కొనసాగుతున్నాయి. వేములవాడ పట్టణంలోని ఈ తిప్పపూర్ మూడవ బ్రిడ్జి అందుబాటులోకి రానుండటంతో స్థానిక ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. ఈ బ్రిడ్జి ప్రజల రాకపోకలకు మరింత సౌలభ్యం చేకూర్చడమే కాకుండా, వేములవాడ ప్రాంత సమగ్ర అభివృద్ధికి మరో బలమైన వారధిగా నిలవనుంది.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృషితో అభివృద్ధి మాటల్లో కాకుండా చేతల్లో కనిపిస్తోంది. ఆయన ప్రత్యేక చొరవతో వేములవాడ పట్టణ మూడవ బ్రిడ్జి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నిర్మాణంలో అత్యంత కీలకమైన చివరి స్లాబ్ పనులు నేడు వేగంగా కొనసాగుతున్నాయి.

వేములవాడ పట్టణంలోని ఈ తిప్పపూర్ మూడవ బ్రిడ్జి అందుబాటులోకి రానుండటంతో స్థానిక ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. ఈ బ్రిడ్జి ప్రజల రాకపోకలకు మరింత సౌలభ్యం చేకూర్చడమే కాకుండా, వేములవాడ ప్రాంత సమగ్ర అభివృద్ధికి మరో బలమైన వారధిగా నిలవనుంది.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.