Shuru
Apke Nagar Ki App…
కరీంనగర్‌లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసులో అరెస్ట్ ఎందుకు జరగలేదని నిలదీశారు. సాధారణ పౌరులకు లేని ప్రత్యేక రక్షణ బండి సంజయ్ కుమారుడికి ఎందుకని ప్రశ్నిస్తూ, ఇంటెలిజెన్స్ వైఫల్యంపై మండిపడ్డారు. బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సమాచారం దాచిపెట్టిన బండి సంజయ్, ఆయన పీఆర్వోపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శాతవాహన కరీంనగర్
కరీంనగర్‌లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసులో అరెస్ట్ ఎందుకు జరగలేదని నిలదీశారు. సాధారణ పౌరులకు లేని ప్రత్యేక రక్షణ బండి సంజయ్ కుమారుడికి ఎందుకని ప్రశ్నిస్తూ, ఇంటెలిజెన్స్ వైఫల్యంపై మండిపడ్డారు. బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సమాచారం దాచిపెట్టిన బండి సంజయ్, ఆయన పీఆర్వోపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- కరీంనగర్ జిల్లా మైలారం గ్రామంలోని వీరధ్యాన ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక ఆరాధనలు జరపగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.1
- కొడుకు తప్పు చేయలేదు... అయినా కొడుకును సమర్థించడం లేదు...కోర్టు నిర్ణయానికి శిరసావహిస్తాం... తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే - కేంద్ర మంత్రి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కొడుకు బండి సాయిభగీరథ పై వస్తున్న ఆరోపణలు విమర్శలపై స్పందించారు. తన కొడుకు తప్పు చేయలేదని కొందరు క్రిమినల్ గా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కొడుకును సమర్థించకుండా చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తామని, కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తామన్నారు. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. కరీంనగర్ లో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రను హంపి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారత స్వామి సమక్షంలో సంజయ్ ప్రారంభించి యాత్ర ఉద్దేశాన్ని వివరిస్తూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కొడుకుపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. నా టైమంతా సమాజానికే ఇచ్చానని, నా కొడుకుకు టైమియ్యలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకును క్రిమినల్ గా చూపే ప్రయత్నం చేస్తున్నారని, ఏ తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడని తెలిపారు. అయినా నా కొడుకును సమర్ధించకుండా విచారణకు సహకరిస్తున్నామని తెలిపారు. నా కొడుకుకు టైమివ్వకుండా నేను తప్పు చేశానని, తప్పు నాదే, నన్ను క్షమించండని కోరారు. తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు... నిరూపించుకోవాలని చెప్పినానని తెలిపారు. నా చివరి శ్వాస వరకు హిందూ ధర్మం కోసమే పనిచేస్తానని, తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టం ముందు సమానమేనని స్పష్టం చేశారు. తన కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనని చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు. సమాజంలో చట్టం అందరికీ సమానమేనని తెలిపారు. నేను ఏ దారిలో వెళ్తే అదే దారిలో నా భార్య నడుస్తుందని, కొందరు చేసే ఆరోపణ విమర్శలతో ఒక తల్లిగా తన భార్య ఎంత బాధ పడుతుందో తెలుసా? అని ప్రశ్నించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కొందరు చేసే మాటల దాడితో తన కుటుంబం డిప్రెషన్ గురవుతుందన్నారు. గత పాలకుల వైఖరితో 29 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయారు, అప్పుడు ఆ తల్లుల బాద నేడు విమర్శించే వారికి కనబడలేదా వినబడలేదా అని ప్రశ్నించారు. వారందరిని సమకూర్చుతా, విమర్శలు చేసే వారి సంగతేంటో తేలుస్తానని హెచ్చరించారు. శ్రీరామచంద్రుడికే కష్టాలు తప్పలేదు ప్రస్తుతం తనకు ఎదురవుతున్న ఇబ్బందులు ఎంత? అన్నారు. కుట్రలు కుతంత్రాలతో తన కుటుంబాన్ని బజారుకీడ్చిన ఏ ఒక్కరిని వదిలిపెట్టనని చెప్పారు. బండి సంజయ్ బాధపడడం కొత్తేమి కాదన్నారు. దుష్ప్రచారాన్ని నమ్మకండని కోరారు. భయపడేవాడు బాధపడే వాడు హిందువే కాదన్నారు. రాజకీయం కోసమో ఓట్ల కోసమో వ్యక్తుల కోసమో హిందూ ఏక్తా యాత్ర నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. దేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. కులాల పేరుతో వర్గాల పేరుతో హిందూ సమాజాన్ని చీల్చుతున్నారని, మెజార్టీగా ఉన్న హిందువులు మైనార్టీలుగా మారే ప్రమాదం ఉందన్నారు. హిందువులను జాగృతం చేసేందుకే హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.4
- వరంగల్ జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో 'జై శ్రీరామ్' నామస్మరణ మారుమోగుతూ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.1
- నా కొడుకైనా శిక్ష పడాల్సిందే: చట్టంపై బండి సంజయ్ క్లారిటీ! తన కుమారుడిని క్రిమినల్‌గా చిత్రీకరించడంపై బండి సంజయ్ స్పందించారు. "నా కుమారుడు ఏ తప్పూ చేయలేదని చెబుతున్నాడు. ఒకవేళ తప్పు చేసినట్లు తేలితే నా కొడుకైనా సరే శిక్ష పడాల్సిందే. చట్టం ముందు అందరూ సమానమే, ఎవరికీ మినహాయింపు ఉండదు" అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా చట్టం తన పని తాను చేసుకుపోవాలని ఆయన పేర్కొన్నారు.1
- మంచేర్యాల జిల్లా జన్నారం మండలం తపాలాపూర్ వద్ద నూతన డిజిటల్ టోల్‌గేట్ ప్రారంభమైంది. జన్నారం, దండేపల్లి పరిసర మండలాల ప్రజలకు ఈ టోల్ నుండి మినహాయింపు లభించింది. ఆధార్, వాహన ఆర్సీ జిరాక్స్‌తో వివరాలు నమోదు చేసుకుని ఉచితంగా ప్రయాణించవచ్చు.1
- హనుమాన్ జయంతిని పురస్కరించుకొని లక్షెట్టిపేట మండలం గ్రామాల్లోని హనుమాన్ దేవాలయాల్లో శ్రీరామ యజ్ఞాలు జరుగుతున్నాయి. వెంకట్రావుపేట గ్రామంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, పలు దేవాలయాల్లో భక్తులు యజ్ఞాల్లో పాల్గొంటున్నారు. దీంతో మండలంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.1
- కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ వద్ద ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా సంఘాలు బండి భగీరథ్ అరెస్టు, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టాయి. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో బండి సంజయ్ తనయుడిని ప్రభుత్వం కాపాడుతోందని, చట్టాలను ఉల్లంఘిస్తోందని వారు ఆరోపించారు. బాధితురాలికి న్యాయం చేయకుంటే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.1
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తడంతో పరిసరాలు కాషాయ వర్ణంతో నిండిపోయాయి. సాయంత్రం కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో భారీ హిందూ ఏక్తా యాత్రకు ఏర్పాట్లు చేశారు.2
- నర్సంపేట పట్టణంలోని క్రిస్టియన్ కాలనీలో ఇంటిముందు కూర్చున్న అడ్వకేట్ మెడలో నుండి బైక్‌పై వచ్చిన దుండగులు రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. పట్టపగలే జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.1