logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

130 kv రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం... అధికారులతో మాట్లాడిన టీడీపీ నాయకులు ముదిగుబ్బ, ప్రజాశక్తి: మలకవేముల పంచాయతీ పరిధిలోని ఇనుములవారిపల్లి గ్రామ రైతుల భూముల మీదుగా వెళ్తున్న 130 కేవీ విద్యుత్ హైటెన్షన్ లైన్‌కు సంబంధించిన నష్టపరిహారం సమస్యపై టీడీపీ నాయకులు అధికారులతో చర్చించారు. రైతులకు తక్కువ నష్టపరిహారం చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నారని, భూముల వాస్తవ విలువను పరిగణనలోకి తీసుకుని న్యాయమైన పరిహారం అందించాలని నాయకులు కోరారు. ఈ సమస్యపై గతంలో రైతులు నిర్వహించిన ఆందోళనకు ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ హాజరై రైతులకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలిసి రైతుల నష్టపరిహారం అంశంపై చర్చించారు. సరైన నష్టపరిహారం నిర్ణయించే వరకు విద్యుత్ టవర్ల నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లకూడదని కోరారు. రైతులకు సాధ్యమైనంత మేర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా ముదిగుబ్బ రెవెన్యూ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉన్నందున అదనపు సిబ్బందిని నియమించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి, క్లస్టర్–3 ఇన్‌చార్జి చినగాని నరసింహ యాదవ్, మలకవేముల పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు బండి మల్లికార్జున, మాదాసు గంగాధర్, రవీంద్ర నాయక్, విద్యుత్ శాఖ అధికారులు, ఇనుములవారిపల్లి రైతులు తదితరులు పాల్గొన్నారు.

1 day ago
user_G Ramakrishna Reddy
G Ramakrishna Reddy
Local News Reporter ముదిగుబ్బ, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
1 day ago
03611265-e2cd-4bb4-89bc-88ebadba4c30

130 kv రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం... అధికారులతో మాట్లాడిన టీడీపీ నాయకులు ముదిగుబ్బ, ప్రజాశక్తి: మలకవేముల పంచాయతీ పరిధిలోని ఇనుములవారిపల్లి గ్రామ రైతుల భూముల మీదుగా వెళ్తున్న 130 కేవీ విద్యుత్ హైటెన్షన్ లైన్‌కు సంబంధించిన నష్టపరిహారం సమస్యపై టీడీపీ నాయకులు అధికారులతో చర్చించారు. రైతులకు తక్కువ నష్టపరిహారం చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నారని, భూముల వాస్తవ విలువను పరిగణనలోకి తీసుకుని న్యాయమైన పరిహారం అందించాలని నాయకులు కోరారు. ఈ సమస్యపై గతంలో రైతులు నిర్వహించిన ఆందోళనకు ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ హాజరై రైతులకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలిసి రైతుల నష్టపరిహారం అంశంపై చర్చించారు. సరైన నష్టపరిహారం నిర్ణయించే వరకు విద్యుత్ టవర్ల నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లకూడదని కోరారు. రైతులకు సాధ్యమైనంత మేర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా ముదిగుబ్బ రెవెన్యూ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉన్నందున అదనపు సిబ్బందిని నియమించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి, క్లస్టర్–3 ఇన్‌చార్జి చినగాని నరసింహ యాదవ్, మలకవేముల పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు బండి మల్లికార్జున, మాదాసు గంగాధర్, రవీంద్ర నాయక్, విద్యుత్ శాఖ అధికారులు, ఇనుములవారిపల్లి రైతులు తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్లో జబర్దస్త్ కళాకారుల సందడి వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్ పట్టణానికి ప్రముఖ జబర్దస్త్ కళాకారుల బృందం విచ్చేసింది. పట్టణంలోని శేఖర్ రాయల్ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించిన కళాకారులు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక భక్తులు, అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ హాస్య ప్రదర్శనలతో అలరించారు. శేఖర్ రాయల్ కుటుంబసభ్యులు జబర్దస్త్ బృందాన్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
    1
    వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్లో జబర్దస్త్ కళాకారుల సందడి
వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్ పట్టణానికి ప్రముఖ జబర్దస్త్ కళాకారుల బృందం విచ్చేసింది. పట్టణంలోని శేఖర్ రాయల్ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని
సందర్శించిన కళాకారులు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక భక్తులు, అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ హాస్య ప్రదర్శనలతో అలరించారు. శేఖర్ రాయల్ కుటుంబసభ్యులు జబర్దస్త్ బృందాన్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • నల్ల చెరువు పల్లి లో వినాయక లడ్డును వేలం పాటలో 27, 500వేల రూపాయలుకు దక్కించుకున్న మెరుగు శివ శంకర్ ఓడి చెఱువు సెప్టెంబర్ 15: మండలంలోని నల్లచెరువు పల్లి గ్రామంలోగ్రామస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ,వచ్చిన భక్తులకు తీర్థప్రసాదలు అంద జేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట లో శ్రీ వినాయక లడ్డు ను మెరుగు శివ శంకర్ 27,500 రూపాయలు కు దక్కించుకున్నారు.
    1
    నల్ల చెరువు పల్లి లో వినాయక లడ్డును వేలం పాటలో 27, 500వేల రూపాయలుకు దక్కించుకున్న మెరుగు శివ శంకర్
ఓడి చెఱువు  సెప్టెంబర్ 15: మండలంలోని నల్లచెరువు పల్లి గ్రామంలోగ్రామస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ,వచ్చిన భక్తులకు తీర్థప్రసాదలు అంద జేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట లో శ్రీ వినాయక లడ్డు ను మెరుగు శివ శంకర్ 27,500 రూపాయలు కు దక్కించుకున్నారు.
    user_మల్లెల రమేష్
    మల్లెల రమేష్
    ఓబులదేవరచెరువు, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • సికేపల్లి మండలంలో బుధవారం గణనాథులు నిమజ్జనానికి తరలి వెళ్లారు రాప్తాడు నియోజకవర్గం సికె పల్లి మండలం లోని పలు గ్రామాలలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథులను నిమజ్జనానికి తరలించారు మూడు రోజులకు భక్తిశ్రద్ధలతో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వాముల వారి మండపాలలో సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు కోలాటం తదితర కార్యక్రమాలు చేపట్టారు మూడు రోజులు భోజనాలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి బుధవారం సాయంత్రం మూడు గంటల నుండి స్వాములవారు వివిధ వాహనాలలో ఏర్పాటు చేసుకుని భక్తులకు ప్రసాదాలు అందజేస్తూ డప్పు వాయిద్యాలతో ఊరేగింపుతో చెరువులు కుంటలు వంకలు తదితర నీటి వనరులు కల ప్రాంతాలలో వినాయకులను నిమజ్జనం గా వించారు ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు
    1
    సికేపల్లి మండలంలో బుధవారం గణనాథులు నిమజ్జనానికి తరలి వెళ్లారు 
రాప్తాడు నియోజకవర్గం సికె పల్లి మండలం లోని పలు గ్రామాలలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథులను నిమజ్జనానికి తరలించారు మూడు రోజులకు భక్తిశ్రద్ధలతో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వాముల వారి మండపాలలో సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు కోలాటం తదితర కార్యక్రమాలు చేపట్టారు మూడు రోజులు భోజనాలు అన్న ప్రసాద వితరణ  కార్యక్రమాలు జరిగాయి బుధవారం సాయంత్రం మూడు గంటల నుండి స్వాములవారు వివిధ వాహనాలలో ఏర్పాటు చేసుకుని భక్తులకు ప్రసాదాలు అందజేస్తూ  డప్పు వాయిద్యాలతో ఊరేగింపుతో చెరువులు కుంటలు వంకలు తదితర నీటి వనరులు కల ప్రాంతాలలో వినాయకులను నిమజ్జనం గా వించారు ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు
    user_పుట్టపర్తి మల్లికార్జున
    పుట్టపర్తి మల్లికార్జున
    చెన్నెకొత్తపల్లె, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • పెద్దపప్పూరు మండల ఎమ్మార్వో ఆర్ ఐ లను సస్పెండ్ చేయాలని యాదవ సంఘం నాయకులు డిమాండ్ పెద్దపప్పూరు మండలంలో సింగనగుట్ట పల్లి గ్రామంలో రైతుకు సంబంధించిన రస్తా విషయంలో రెవెన్యూ అధికారులు యాదవుల మధ్య చిచ్చులు పెడుతున్నారని యాదవ సంఘం నాయకులు మండిపడ్డారు. యాదవ సంఘం యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆర్ఐ లను సస్పెండ్ చేసేలా జిల్లా కలెక్టర్ ను కలుస్తామని, ఇప్పటికైనా అధికారులు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు
    1
    పెద్దపప్పూరు మండల ఎమ్మార్వో ఆర్ ఐ లను సస్పెండ్ చేయాలని యాదవ సంఘం నాయకులు డిమాండ్ 
పెద్దపప్పూరు మండలంలో సింగనగుట్ట పల్లి గ్రామంలో రైతుకు సంబంధించిన రస్తా విషయంలో రెవెన్యూ అధికారులు యాదవుల మధ్య చిచ్చులు పెడుతున్నారని యాదవ సంఘం నాయకులు మండిపడ్డారు. యాదవ సంఘం యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆర్ఐ లను సస్పెండ్ చేసేలా జిల్లా కలెక్టర్ ను కలుస్తామని, ఇప్పటికైనా అధికారులు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు
    user_Mahesh
    Mahesh
    అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు 📱9492887116 శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు 📱9492887116
    1
    శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు                📱9492887116
శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు                📱9492887116
    user_Narasimharaju
    Narasimharaju
    Astrologer అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • మైదుకూరు-కడప రోడ్డులో ప్రమాదం అంచున ట్రాన్స్‌ఫార్మర్ - పట్టించుకోని అధికారులు మైదుకూరు, సెప్టెంబర్ 16: మైదుకూరు - కడప ప్రధాన రహదారిలో మసీదు ఎదురుగా ఉన్న ట్రాన్స్‌ ఫార్మర్ ప్రమాదం పొంచి ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాలు తుప్పుపట్టి, వైర్లు వేలాడుతూ ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ రహదారి గుండా రోజూ వందలాది వాహనాలు, పాదచారులు, చిన్నారులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదం జరిగితే పెను ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిల ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    1
    మైదుకూరు-కడప రోడ్డులో ప్రమాదం అంచున ట్రాన్స్‌ఫార్మర్ - పట్టించుకోని అధికారులు

మైదుకూరు, సెప్టెంబర్ 16:
మైదుకూరు - కడప ప్రధాన రహదారిలో మసీదు ఎదురుగా ఉన్న ట్రాన్స్‌ ఫార్మర్ ప్రమాదం పొంచి ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాలు తుప్పుపట్టి, వైర్లు వేలాడుతూ ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
ఈ రహదారి గుండా రోజూ వందలాది వాహనాలు, పాదచారులు, చిన్నారులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదం జరిగితే పెను ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిల ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • కళ్యాణదుర్గం పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి టీ సర్కిల్ వినాయకుడు మూడు సింహాలతో ఆకట్టుకునేలా గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు కళ్యాణదుర్గం పట్టణంలో గణనాధులను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు
    1
    కళ్యాణదుర్గం పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా 
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి 
టీ సర్కిల్ వినాయకుడు మూడు సింహాలతో ఆకట్టుకునేలా గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు కళ్యాణదుర్గం పట్టణంలో గణనాధులను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి - బీసీ చైతన్య సమితి నేత రామ్మోహన్ మైదుకూరు: బీసీ మంత్రి సవిత ప్రకటించిన బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేస్తామన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, 34% రిజర్వేషన్ అమలు చేయడం సంతోషదాయకమని మైదుకూరు జాతీయ బీసీ చైతన్య సమితి నియోజకవర్గ అధ్యక్షులు కానగూడూరు రామ్మోహన్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.బీసీల సంక్షేమం కోసం బీసీ రక్షణ చట్టాన్ని కూడా వెంటనే అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
    1
    బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి - బీసీ చైతన్య సమితి నేత రామ్మోహన్ 
మైదుకూరు: బీసీ మంత్రి సవిత ప్రకటించిన బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేస్తామన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, 34% రిజర్వేషన్ అమలు చేయడం సంతోషదాయకమని మైదుకూరు జాతీయ బీసీ చైతన్య సమితి నియోజకవర్గ అధ్యక్షులు కానగూడూరు రామ్మోహన్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.బీసీల సంక్షేమం కోసం బీసీ రక్షణ చట్టాన్ని కూడా వెంటనే అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.